NaReN

NaReN

Saturday, April 2, 2022

ఆ నలుగురు...

 ఆ నలుగురు....

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 

నలుగురు స్నేహితులు SSC పరీక్షలయ్యాక విజేత హోటల్ కి వెళ్లి టీ, బ్రేక్ ఫాస్ట్ చేద్దాం అని నిర్ణయించుకున్నారు..



అది ఆదివారం, సైకిల్ మీద హోటల్ చేరుకున్నారు.


  *టీ, అల్పాహారం చేస్తూ సంతోష్, చాంద్ పాషా, వంశీ, సురేష్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు..*


 యాభై ఏళ్ల తర్వాత మళ్లీ  ఇదే తేదీన ఏప్రిల్ 01న ఈ హోటల్‌లో మళ్లీ కలుద్దామని నలుగురూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు..


 *అప్పటి వరకు మనమందరం చాలా కష్టపడాలి, మంచి స్థాయికి రావాలి*


  తనకు టీ, బ్రేక్‌ఫాస్ట్‌ అందించిన వెయిటర్‌ బాబు ఇదంతా వింటున్నాడు, 


సార్...

*నేను ఇక్కడే ఉంటే గనక మీ అందరి కోసం ఈ హోటల్‌లో వేచి ఉంటాను అన్నాడు*


  నలుగురూ తదుపరి విద్య కోసం విడిపోయారు..

     

  *రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి..*

  

   *యాభై ఏళ్లలో సూర్యాపేటలో సమూల మార్పులు వచ్చాయి,పట్టణ జనాభా పెరిగింది, రోడ్లు, ఫ్లై ఓవర్లు, మెట్రోలు నగర రూపురేఖలే మారిపోయాయి*

  

  ఇప్పుడు ఆ హోటల్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌గా మారిపోయింది, వెయిటర్‌ బాబు ఇప్పుడు ఆ హోటల్‌కే యజమాని అయ్యాడు..

      

  *యాభై ఏళ్ల తర్వాత, నిర్ణీత తేదీ ఏప్రిల్ 01 మధ్యాహ్నం, హోటల్ డోర్ వద్దకు విలాసవంతమైన కారు వచ్చింది..*


  సంతోష్ కారు దిగి వరండా వైపు నడవడం మొదలుపెట్టాడు, సంతోష్ కి ఇప్పుడు మూడు జ్యువెలరీ షోరూంలు ఉన్నాయి..

  *సురేష్ సార్ మీ కోసం ఒక నెల క్రితమే మీకోసం టేబుల్ బుక్ చేశారని బాబు  చెప్పాడు..*


  *ఒక గంటలో చాంద్ పాషా వచ్చాడు, చాంద్ పాషా నగరానికి పెద్ద బిల్డర్ అయ్యాడు..*


  *ఇప్పుడు ఇద్దరూ మాట్లాడుకుంటూ వేరే స్నేహితుల కోసం ఎదురుచూస్తుంటే, మూడో స్నేహితుడు వంశీ అరగంటలో వచ్చాడు..*


  అతనితో మాట్లాడిన తర్వాత వంశీ వ్యాపారవేత్త అయ్యాడని ఇద్దరికీ తెలిసింది.


  *స్నేహితులు ముగ్గురి కళ్ళు పదే పదే డోర్ వైపు వెళ్తున్నాయి, సురేష్ ఎప్పుడు వస్తాడా అని.?*


  ముగ్గురూ యాభై ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం ఆనందంగా ఉంది.


  *గంటల తరబడి జోక్స్ సాగినా సురేష్ రాలేదు..*


 బిల్లు అడిగిన వెంటనే ఆన్‌లైన్‌లో బిల్లు కట్టినట్లు ముగ్గురికి సమాధానం వచ్చింది..

       

  *సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో ఓ యువకుడు కారు దిగి,బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ముగ్గురు స్నేహితుల వద్దకు వెళ్లగా, ముగ్గురూ ఆ వ్యక్తిని చూస్తూ ఉండిపోయారు..*


  *యువకుడు నేను మీ స్నేహితుడి కొడుకు రాముని, మా నాన్న పేరు సురేష్* అని చెప్పడం మొదలుపెట్టాడు.


  *ఈ రోజు మీ రాక గురించి నాన్న చెప్పారు, ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను, కానీ గత నెలలో తీవ్ర అనారోగ్యంతో మా నాన్న గారు చనిపోయారు..*


  మా నాన్న ఇలా అన్నారు  నేను ఈ లోకంలో లేనని తెలిసినప్పుడు నా స్నేహితులు ఆనందంగా గడపలేరు  ఒకరినొకరు కలుసుకున్న ఆనందం కోల్పోతారు


  *అందుకే ఆలస్యంగా వెళ్ళమని ఆదేశించాడు..*

 

 తన తరపున నిన్ను కౌగిలించుకోమని కూడా అడిగాడు, రాము తన రెండు చేతులు చాచి..


 *చుట్టుపక్కల వారు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తున్నారు, ఈ యువకుడిని ఎక్కడో చూసినట్లు అనుకున్నారు*

    

  *మా నాన్న టీచర్‌ అయ్యారు, నన్ను మాత్రం కలెక్టరు చదివించడానికి ఎంతో కష్టపడ్డారు.. ఈరోజు నేను ఈ నగరానికి కలెక్టర్‌ని*..

అని రవి  చెపుతుంటే

*అందరూ ఆశ్చర్యపోయారు, కళ్ళవెంట వస్తున్న దుఃఖాన్ని  తనలోనే దిగమింగుతూ మంచి స్నేహితుడిని కోల్పోయామే అనే భాదతో వెనుదిరిగారు*..


   *అందుకే బంధువులతోను స్నేహితులతో కలుస్తూనే ఉండండి,  ఏళ్ల తరబడి వేచి ఉండకండి, ఎవరి వంతు ఎప్పుడు వస్తుందో తెలియదు*


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

  *మీ కుటుంబం మరియు  స్నేహితులలో కలసి మెలసి   ఉండండి, జీవించినంత కాలం ఆనందాన్ని అనుభవించండి..* 

    

*━꧁పసుపులేటి🧘🏻‍♂️నరేంద్రస్వామి꧂━*

1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE