NaReN

NaReN

Thursday, April 14, 2022

సీనియారిటీ


ఉపాధ్యాయుడి సీనియారిటీ జిల్లాలో ఏ విధంగా..? జోన్లో ఏ విధంగా..? మల్టీ జోన్ లో ఏ విధంగా..?

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


 సమాధానం:-2018 ఆగస్ట్ 31 నుండి నూతన జోన్ల వ్యవస్థ (p.o-2018)అమలులోకి వచ్చింది.. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 124 జీవో ను ఇవ్వడం నూతన జిల్లాల అమలు, జోనల్ వ్యవస్థ అమలు జరిగింది... 

➡️తర్వాత మరో రెండు నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తూ p.o-2018 సవరణ చేసి 33జిల్లాల తో 2021 ఏప్రిల్ లో 128 జీఓ ను ఇవ్వడం జరిగింది...

➡️ఆ తర్వాత 317 జీఓ ప్రకారం ఉద్యోగులను,ఉపాధ్యాయులను సీనియారిటీ ప్రాతిపదికన శాశ్వత కేటాయింపు చెయ్యడం జరిగింది

➡️ తర్వాత 21 జీఓ ప్రకారం reciprocal transfer అనగా పరస్పర బదిలీల ప్రక్రియ నిర్వహించింది

➡️ ఆ తర్వాత 402 జీఓ ప్రకారం పాత జిల్లా పరిధిలో పరస్పర బదిలీ చేసుకుంటున్న వారికి సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించడం జరిగింది

➡️ అయితే జీఓ 21 ప్రకారం ఒక జిల్లా నుండి మరోక జిల్లాకు మారిన వారికి (పరస్పర బదిలీ ద్వారా మారితే ) అంతకు ముందు వున్న సీనియారిటీ కోల్పుతూ మారిన జిల్లాలో చివరి స్థానమున చేరుతాడు... అయితే వారికి ప్రమోషన్ లో మాత్రం సీనియారిటీ కింది విధంగా వుంటుంది..

➡️ ఉదాహరణకు 2002 డిఎస్సీ కి చెందిన ఒక sgt ఉపాధ్యాయుడు మేడ్చల్ జిల్లాలో పనిచేస్తూ వికారాబాద్ జిల్లాకు వెళితే , వికారాబాద్ జిల్లాలో వున్న 2017 TRT చివరి ఉపాధ్యాయుడి క్రింది స్థానముకు చేరుతాడు.sgt పోస్ట్ జిల్లా పోస్టు, వారికి వచ్చే next ప్రమోషన్ SA .... కావున వికారాబాద్ జిల్లాలో SA ప్రమోషన్ పోస్టుకు కేవలం ఆ జిల్లాలో వుండే sgt లు మాత్రమే అదే జిల్లాలో సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్ పొందుతాడు.. కానీ

➡️SA ఉపాధ్యాయుడు మాత్రం తీసుకునే next ప్రమోషన్ GHM లేదా MEO లేదా JL ....*ఈ పోస్టులన్ని multizone పోస్టులు*... కాబట్టి

➡️SA ఉపాధ్యాయుడు పరస్పర బదిలీ ద్వారా మేడ్చల్ జిల్లా నుండి వికారాబాద్ జిల్లాకు వెళ్లిన వారు తీసుకునే promotion మల్టీ జోన్ పోస్టు...

➡️ఈ మల్టీ జోన్ పోస్టుకు ఆయా మల్టీ జోన్ లో వుండే అన్ని జిల్లాల ఉపాద్యాయులు అర్హులు

➡️  ఆ multizone పోస్టు కు, *ఆ మల్టీ జోన్ లో 14 జిల్లాల వారు ఎప్పటి నుండి SA cadre లో వున్నాడు అన్నదే ముఖ్యం*..

➡️ ఉదాహరణకు ఒక SA మాథ్స్ ఉపాధ్యాయుడు 2009లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో zphs తాండూరు కు ప్రమోషన్ లో వెళ్ళాడు...*2021 జిల్లాల అలోకేషన్ లో మేడ్చల్ కు కేటాయించబడ్డాడు*. ఆ తర్వాత పరస్పర బదిలీలలో వికారాబాద్ తన స్వంత జిల్లాకు వెళితే జీఓ 21 ప్రకారం అక్కడ వున్న SA మాథ్స్ చివరి స్థానంలో చేరితే ఆ జిల్లాకు జరిగే ప్రమోషన్ కు మాత్రం జూనియర్ అవుతాడు.కానీ తను తీసుకునే next ప్రమోషన్ ghm మల్టీజోన్ పోస్టు కావున....*ఆ మల్టీ జోన్ లో 2021 yr లో మేడ్చల్ జిల్లాలో వున్నాడు SA గా...అదే విధంగా వికారాబాద్ జిల్లాలో  SA గా బదిలీపై మాత్రమే వెళ్ళాడు... మల్టీజోన్ -2 లో 14 జిల్లా లో మేడ్చల్ వుంది వికారాబాద్ వుంది... జిల్లా అలోకేషన్ లో మేడ్చల్ కు 2021 లో వచ్చినపుడు SAగా 2009 సీనియారిటీ..వికారాబాద్ mutual పై వెళ్ళింది 2022 లో అనుకుందాం...2018 తర్వాత జోన్స్ అమలు అయిన తర్వాత GHM ప్రమోషన్ కు 14 జిల్లాలో ఎప్పుడు నియామకం అయ్యింది ముఖ్యం, కానీ వికారాబాద్ జిల్లాకు ఎప్పుడు వచ్చింది ముఖ్యం కాదు*... వికారాబాద్ లో జరిగే జిల్లా ప్రమోషన్ కు జూనియర్ ... కానీ SA కు జిల్లా ప్రమోషన్ లేదు.. మల్టీ జోన్ ప్రమోషన్ వుంది...జోన్స్ అమలు అయింది 2018 నుండి మొదలుపెడితే 2021 లో ఆల్రెడీ మేడ్చల్ లో వున్నాడు.ఆ మల్టీ జోన్ పోస్టుకు ఆ మల్టీ జోన్ లో SA cadre లో వున్నప్పటి నుండి లెక్క తీసుకోవాలి.. ఎందుకంటే ఆ 14 జిల్లాలు అన్ని కూడా మల్టీ జోన్ ప్రమోషన్ పోస్టుకు అర్హులు...

➡️ ఒకవేళ GHM పోస్టు ప్రమోషన్ లో *జిల్లా cadre గా వుండి వుంటే వికారాబాద్ జిల్లాలో జూనియర్ అవుతాడు...*GHM మల్టీ జోన్ పోస్టు కాబట్టి*, ఆ మల్టీ జోన్ లో ఎప్పుడు , ఎక్కడ ఉన్న కూడా *SA నియామకంమే ముఖ్యం*...

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE