NaReN

NaReN

Saturday, April 2, 2022

రంజాన్ మాసం ఆరంభం

*🥦నేటి నుంచి రంజాన్‌ ఉపవాసాలు*


 *🌲ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌ శనివారం ప్రారంభమైంది*


*♦️నెలవంక కనిపించడంతో ముస్లింలు ఉపవాస దీక్షలకు సిద్ధమయ్యారు. ఉపవాస దీక్షలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 486కు పైగా మసీదులు ఉన్నాయి. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల ఇఫ్తార్‌, నమాజ్‌లతో మసీదులు సందడిగా మారనున్నాయి. పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లాలోని మసీదులను ప్రార్థనలకు ముస్తాబు చేశారు. మసీదులకు రంగులతో పాటు ఉపవాస దీక్షలో ఉన్న వారికి సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వేసవిని దృష్టిలో పెట్లుకుని పలు మసీదుల్లో ఏసీలతో పాటు కూలర్లను ఏర్పాటు చేశారు. భువనగిరి పట్టణంలోని పలు మసీదులను దీపాలతో అలంకరించారు*


*♦️సహర్‌, ఇఫ్తార్‌ సమయాలతో రూపొందించిన సమయ పట్టిక కార్డు*


*🪴నిష్టతో..*


*🌲ప్రతి ముస్లిం రంజాన్‌ మాసాన్ని పవిత్రంగా భావిస్తారు. నెల రోజుల పాటు నిష్టగా పాటించే ఉపవాస దీక్ష చెడుపై ఖడ్గం లాంటిదని ముస్లింలు భావిస్తారు. రంజాన్‌ పండుగ వరకు ముస్లింలు రోజు ఐదు పర్యాయాలు నమాజ్‌తో పాటు, దివ్య ఖురాన్‌ పఠనం, రాత్రి తరావీ నమాజ్‌లను ఆచరిస్తారు. కొన్ని మసీదుల్లో పది రోజుల పాటు తరావీ నమాజ్‌లను ఏర్పాటు చేశారు. అత్యధిక మసీదుల్లో నెల రోజుల పాటు తరావీ నమాజ్‌ కొనసాగనుంది. ఈ నెలలో దివ్యఖురాన్‌ నిత్య పఠనంతో అధికంగా పుణ్యంతో పాటు విశిష్ట ఫలాలు దక్కుతాయన్నది ముస్లింల నమ్మకం. వేకువజామున లేచి సహర్‌తో ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. దీక్ష చేపట్టిన వారు తదుపరి ఎలాంటి ఆహారంతో పాటు నీళ్లను ముట్టరు. సూర్యాస్థమయం తదుపరి ఇఫ్తార్‌ సమయంలో ఖర్జూర పండ్లు, ఫలాలతో ఉపవాస దీక్షను విరమిస్తారు. రాత్రి ఇషా నమాజ్‌ తదుపరి తరావీ నమాజ్‌ను పూర్తిచేస్తారు. తరావీ నమాజ్‌లో దివ్య ఖురాన్‌లోని 30 పారాలను ఇమామ్‌ నమాజ్‌ రూపంలో చదివిస్తారు. ఉపవాస దీక్షలో ఉన్న ప్రతి ఒక్కరూ తరావీ నమాజ్‌ను ఆచరిస్తారు*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE