NaReN

NaReN

Saturday, April 16, 2022

హాస్పటల్

 ***హాస్పటల్****


వాక్సిన్ కోసం వెళ్తే ...

కరోనా తగులు కున్నట్టైంది !!!


నేను ఒక రోజు ...

హాస్పిటల్ కి వెళ్లాను !


ఒపి రాయించుకుని ..

బాగా రష్ గ ఉందని ..

హాస్పిటల్ లోనే ఉన్న కాంటీన్ కి వెళ్లి ..

రెండు సమోసాలు , ఒక  బిస్కుట్  పాకెట్ తీసుకుని , తింటున్నాను !!!


ఇంతలో ...ఎదురుగ్గా ఒక టేబుల్ దగ్గర ..

ఒక చిన్న పిల్లాడు , నాకేసి జాలిగా చూస్తూ కనిపించాడు !!!


ఎదవ మనసు నాది ...

యిట్టె కరిగి పోయింది !!


వెంఠనే , మరో బిస్కెట్ ప్యాకెట్ కొని ...

ఆ పిల్లాడి దగ్గరకు వెళ్లి ...

చేతిలో పెట్టాను !!


ఆవురావురు మంటూ తినేస్తున్నాడు !!


" హే , ప్రభూ , ఈ రోజు , ఒక  పిల్లవాడి ఆకలి తీర్చే అవకాశం యిచ్చావ్ ..ధన్యుడిని !" అనుకున్నాను !!!!


ఇంతలో ...


వాళ్ళ అమ్మ వచ్చింది !!!!!


పిల్లవాడు తన ఆఖరు బిస్కెట్ తింటుండగా !!!


హంతే ...

*ఒక్కసారిగా ...*

ఉరుము ఉరిమి నట్టయింది !!!

" ఎవడ్రా ఆ దొంగ* సచ్చినోళ్ళు ...*

150 రూ.లు క్యాబ్ కి ఖర్చుపెట్టి ...*

నానా తంటాలు పడి ...

20 కి మీ దూరం నుండి ...

పిల్లాడి ని ..

బ్రతిమలాడి ,బెదిరించి 

ఖాళీ కడుపుతో ..

టెస్ట్ ల కని  తీసుకొచ్చా ...

నేను ఓపీ రాయించుకుని వచ్చే లోపు ...

ఆడికి బిస్కెట్ పెట్టిన దొంగ సచ్చినోడు ఎవడ్రా "???

అంటూ గాండ్రించింది !!


చంటోడి కి ఇంకా మాటలు రావ్ కాబట్టి బతికిపోయా !!


ఓపీ పొతే పోయింది ...

బ్రతుకు జ్జీవుడా అనుకుంటూ ..

హాస్పిటల్ నుండి బయటకొచ్చి ...

కార్ లో ఇంటికి చేరేదాకా గుండె కొట్టుకుంటూనే వుంది , భయం తో !!!

😂😂😂😂😂

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE