NaReN

NaReN

Thursday, March 31, 2022

ఒక తండ్రికి కొడుకు నుండి కొన్ని సందేహలు

 🦚🦚🦚🦚♓♓♓🦚🦚🦚   

 ఒక తండ్రికి కొడుకు నుండి కొన్ని సందేహలు


1.మీ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు..

2.విమానాలు లేవు..

3.. ఇంటర్నెట్ లేదు..

4.. Tv లు లేవు..

5.. కంప్యూటర్ లు లేవు..

6.. ఏసీ లు లేవు..

7.. లగ్జరీ కార్ లు లేవు..

8.. మొబైల్ ఫోన్ లు లేవు... 

మీరెలా బతికారు...???            


 దానికి ఆ తరము తండ్రిగారు ఇచ్చిన జవాబు అందరూ చదవ వలసిందే...........  

మీ తరము ఈరోజు కాలంలో ఎలాగైతే 

1.. ప్రార్ధన లేకుండా..

2.. మర్యాద లేకుండా 

3.. ప్లానింగ్ లేకుండా 

4.. క్రమశిక్షణ లేకుండా..

5.. పెద్దల ఎడ గౌరవం లేకుండా..

6.. మన చరిత్ర పై అవగాహన లేకుండా..

7.. కుటుంబ విలువలపై ఏ మాత్రం పట్టింపులు లేకుండా..

8.. Morals లేకుండా... 

ఎలాగైతే హాయిగా రోజులు గడిపేస్తున్నారో... 

మేము వాటిని పాటిస్తూ ఆనందముగా జీవించాము...


మేము మీలాగా... 

1..వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు..

2.. పాఠశాల వేళలు అయినా తదుపరి చీకటి పడేదాకా ఆడుకున్నాము tv లు చూడలేదు...

3.. ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితుల తో గడిపాము..

4..దాహము వేస్తె కుళాయి నీరు తాగాము.. బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు..

5..ఒకేగ్లాస్ లో నలుగురం జ్యూస్ తాగినా మాకెప్పుడూ జబ్బులు రాలేదు..

6..మూడు పూటలా అన్నం తిన్నా మాకు ఊబకాయం రాలేదు...

7.. షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తినా మాకు కీళ్ళ నొప్పులు రాలేదు..

8..సొంత ఆట వస్తువులు తయారు చేసి ఆడుకున్నాము,, బంధువులతో కలసి మెలసి ఆనందముగా ఉన్నాము, పండుగలు కలిసి చేసుకున్నాము..

9.. పిలవకపోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్లి వారి తినుబండారాలు ఆరగించాము..

10.. మావి black and వైట్ ఫొటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు..... 

మాది జీవితాన్ని చదివిన తరము..


బహుశా మాతల్లి దండ్రులు చెప్పినది ఆచరించిన చివరితరం... 

మా వారసులు శాసించినది పాటించే మొదటి తరమూ మాదే కావచ్చు..... 

అయినప్పటికీ.. మీ యాంత్రిక జీవితానికి యధాశక్తి సహాయ పడుతున్న వాళ్ళము... 

మేము ఒక limitted ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళము..... 

అందుకే మా విన్నపము ఏమంటే..


మీ జీవితాలనుండి, ఈరోజు భూమి పైనుండి

మేము వెళ్ళిపోకముందే ఎంతో అంత మా నుండి మీరు నేర్చుకోండి.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE