NaReN

NaReN

Friday, April 8, 2022

ఆహ్వానం

 



బంగారు పూలు వర్షిస్తున్నట్టూ

వెలుగురవ్వలు...


సంతోషంతో జలతరంగిణి

వాయించే  సన్నని అలలు


శిఖరాల సితారల జలపాతాల

తీగలు మీటే మలయమారుతాలు


దాగిపోయే వీలు లేక

దాసోహమంటూ వెలుతురైన

తిమిరాలు.


రహస్యాలు  జగతికి

చేరవేసి కుశలమడిగే సమీరాలు


నింగి వాకిట సప్తవర్ణాల

సుందర  రంగవల్లికలు


ఉషోదయ శుభవేళ

స్వేచ్చాగానాల విపంచులు


చిగురించే ఆశలకు

చేయూత నిచ్చే ఉదయానికి .......

ఇదే నరేంద్రుని ఆహ్వానం

3 comments:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE