NaReN

NaReN

Thursday, April 14, 2022

జీవిత రహదారిలో

 జీవిత రహదారిలో

ఎన్నో గతుకులు....అతుకులు


ముళ్ళూ రాళ్ళూ..పూలు

తప్పులూ ఒప్పులూ

సర్దుబాట్లూ కుంగుబాట్లూ

సంతోషాలు..సంవేదనలూ

కోపాలూ.....పోట్లాటలు


వెనుకకు  తిరిగి చూస్తే

ఇవే.....అన్నీ


ఏదీ శాశ్వతం కాదు

నీ మనసే నీకు చెబుతుంది

ఎక్కడ ఎలా ఉండాలో...

కొంచెం వింటే చాలు..


జరిగిన విషయాలు 

మార్చలేవు

జరగబోయేది తెలియదు.

మరుక్షణం ఏమౌనో....

తెలియదు..

ఈ రోజే నీది ఈ క్షణమే నీది


ఆదే అఖరు అయితే

అందరినీ కలుపుకుపోవా?

అన్నిటినీ మర్చిపోవా?


అలా ప్రతిక్షణమూ

ప్రతిరోజూ ఉండగలిగితే

బ్రతుకు మాధుర్యం తెలియదా!


అన్నీ భగవంతుడికి

సమర్పించి.....

నీకిచ్చిన క్షణాన్ని అనుభవించు

ఆస్వాదించు.... ఆనందించు.


మనమే శాశ్వతం కానపుడు

మన కలతలు శాశ్వతమా?


ఏది ఎలా వస్తే అలా

అందుకుంటూ...

మనఃపూర్వకంగా స్వీకరిస్తూ

ముందుకు సాగిపోవడమే

మనం చేయాల్సింది.


దిశానిర్దేశం  చేసే దివ్యమూర్తికి

నమస్కరిస్తూ మరో ముందడుగు తో.....


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE