NaReN

NaReN

Thursday, April 7, 2022

నేను కేవలం గాడిద తాడు మాత్రమే విప్పాను

 *""నేను కేవలం గాడిద తాడు మాత్రమే విప్పాను""


*  ఒక సారి  ఈశ్వరుడు బయటికి వెళుతూ వుంటే పార్వతి ఇలా

అడుగుతుంది....""స్వామీ మానవుని కర్మ ఎలా నిర్మించ బడుతుంది""???.అని..


.దానికి ఈశ్వరుడు ""దేవి వుండు ,,,,,


అదిగో ఆ పచ్చగా వున్న చేను పక్కన గాడిద వుందే,,,, దాన్ని కట్టేశాడు దాని యజమాని 


...వాడు ఆ విషయాన్ని మర్చిపోయి

వూరెళ్ళి పోయాడు...నేను దాని తాడు విప్పి వస్తా అని వెళ్లి దాని తాడు విప్పాడు ఈశ్వరుడు...


అంతే ,,,,,,అది వెళ్లి ఆ పచ్చగా వున్న చేనులో పడి మేసి ,,,దాన్ని నాశనం చేసింది....ఆ చేను యజమాని వచ్చి ఆ గాడిద యజమాని రాగానే అతని కోపం కట్టలు తెంచుకుంది....అమాంతం వెళ్లి అతనితో

గొడవకు దిగాడు...ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది...భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి....ఆ చేను యజమాని ఆ గాడిద యజమానిని చంపేశాడు....


దానికి ఆ గాడిద యజమాని భార్య ఊరుకుంటుందా....? తను వెళ్లి

ఆ చేను యజమానితో బోరున గొడవకు దిగింది...భర్త చనిపోయాడు ఆన్న భావోద్వేగంలో వెళ్లి ఆ చేను యజమాని మీద అమాంతం పడి కొడవలితో నరికేసింది....దాన్ని చూసిన ఆ చేను యజమాని భార్య

మరియు అతని ఇద్దరు కొడుకులలో కోపం కట్టలు తెంచుకుంది...

వాళ్ళ నాన్న చనిపోయాడు ఆన్న భాధలో వెళ్లి ఆ గాడిద యజమాని భార్యను గొంతు కోసి చంపేశారు...దాన్ని చూసిన ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్లు విపరీతమైన కోపంతో,, వెళ్లి ఆ చేను యజమాని కొడుకులను ఇద్దరినీ చంపేశారు...దానిని చూసిన ఆ పిల్లల మేన మామ వచ్చి ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్లను ఇద్దరినీ గొడ్డలితో చంపేశాడు....


చివరగా ఆ మేన మామ అక్కడ పడి వున్న మొత్తం శవాలను చూసి

""ఈశ్వరా......? ఎంత పని చేశావయ్యా"""....అని ఆకాశం కేసి చూసి అంటాడు....దానికి ఆ ఈశ్వరుడు ప్రత్యక్షమై


 ""నేనేం చేశాను సామీ ,,,నేను కేవలం గాడిద తాడు మాత్రమే విప్పాను....కానీ మీరు మీలోని సైతానుకి తాళ్ళు విప్పుకున్నారు...మీలోపలి గుణాలకు తాళ్లు విప్పుకున్నారు

ఈ కర్మ అంతా మీరు మీలోని మాయకు తాళ్లు విప్పుకోడం వల్లా

జరిగింది...ఇక్కడ చచ్చి పడి వున్న వాళ్ళు అందరూ వాళ్ళు వాళ్ళలోని మాయకు రాక్షసునికి తాళ్ళు విప్పుకోవడం వల్లే జరిగింది....దానికి నాకూ  ఏ సంబంధం లేదు""....అని వెళ్లి పోయాడు..


 ఇదంతా గమనిస్తున్న పార్వతిని చూసి,,"",దేవి నీ ప్రశ్నకు సమాధానం దొరికింది గదా"" అంటాడు ఈశ్వరుడు....పార్వతి నెవ్వర పోతుంది..


*దేవుడు ఏ కర్మను తగిలించడు*


....ఎవనికి వాడు నిర్మించుకున్న

కర్మ చక్రంలోంచి వాడే బయట పడాలి.... నీలో ఉన్న రాక్షసుడు తాళ్ళు విప్పుతున్న0త  సేపూ,,,మాయకు తాళ్ళు విప్పుతున్న0త సేపూ

కర్మ నిర్మాణం జరుగుతూనే వుంటుంది....


*""అర్థం చేసుకున్న వాడికి చేసుకున్నంత మహా దేవ""..*


.🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE