NaReN

NaReN

Wednesday, April 20, 2022

☑️తెలుసుకుందాం✅

*☑️తెలుసుకుందాం✅*


*💅🏻టాటూస్‌ శరీరంపై వేసుకుంటే ఏ హానీ జరగదా❓🤔*


*💁🏻‍♂️జవాబు:* సహజ రూపమైన శరీరంమీద శాశ్వత ప్రాతిపదికన ఏ పచ్చ పొడిపించుకున్న, ఎలాంటి టాటూస్‌ వేయించుకున్నా ఎంతో కొంత ప్రమాదం ఉండకమానదు. అందుకే పెద్దలు అడుసు తొక్కనేల, కాలు కడుగనేల అన్నారు. కాసేపు పూసుకుని సాయంత్రానికో, మధ్యాహ్నానికో స్నానం చేస్తే శుభ్రమయ్యే విధంగా ఉన్న ప్రమాద రహిత వర్ణాల్ని చర్మం మీద ఎవరికి తోచిన విధంగా వారు బొమ్మల్ని గీయించుకొంటే పెద్దగా ప్రమాదం లేదు. కానీ టాటూస్‌ అలా కాదు. శాశ్వత ప్రాతిపదికన పచ్చబొట్టులాగా కొన్ని రంగుల్ని బొమ్మలుగా సూదుల సాయంతో చర్మంలోకి నింపుతారు. ఈ రంగు ద్రవ్యాలు చాలా మట్టుకు క్యాన్సర్‌ కారక ద్రవ్యాలు. కాబట్టి అక్కడ చర్మ క్యాన్సరు వచ్చే దురవకాశాలు లేకపోలేదు.


చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే వృక్ష సంబంధ కారకాలు ప్రమాద రహితమైనవనీ కేవలం కర్మాగారాల్లో తయారై కృత్రిమ, రసాయనాలు ప్రమాదకరమనీ అంటుంటారు. ఆపేరుతో విచ్చలవిడిగా ఈ మధ్య వృక్షోత్పత్తి (herbel products) మందులంటూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. వృక్షాల నుంచి తీసినా, కృత్రిమంగా చేసినా బెంజీన్‌ బెంజీనే. రసాయనిక పదార్థాల ధర్మాలు వాటి మాతృకను బట్టి మారవు. చాలా వృక్షసంబంధ రసాయనాలు కూడా ప్రమాదకరంగా ఉంటాయి.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE