డాడీ....
ఒకమ్మాయి నాన్నతో వరండా లో కూర్చుని వుండగా ఆమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఇంటికోచ్చాడు ....
అమ్మాయి : " ఓహ్ ! యండమూరి వ్రాసిన ' ఇంట్లో నాన్నున్నాడు ' పుస్తకం తీసుకోడానికి వచ్చావా?
బాయ్ ఫ్రెండ్ : " లేదు .... యుద్దనపూడి వ్రాసిన ' నీ కోసం .... నా నిరీక్షణ ఎక్కడ? ' అనే బుక్ కోసం వచ్చాను ?"
అమ్మాయి: " అలాగా ! ఆ బుక్ నాదగ్గరలేదు. గొల్లపూడివ్రాసిన " మామిడి చెట్టుక్రింద" వుంది. తీసుకెళ్లు "
బాయ్ ఫ్రెండ్: " సరే మధుబాబు వ్రాసిన 'అయిదు నిముషాల్లో ' బుక్ కాలేజ్ కి తేవటం మర్చిపోయాను"
అమ్మాయి: "పరవాలేదు నేనుకాలేజ్కి ముల్లపూడివ్రాసిన ' నీకోసం తప్పకుండా" బుక్ తీసుకొస్తాను"
బాయ్ ఫ్రెండ్ వెళ్లిపోయాక
డాడ్ :"అన్ని పుస్తకాలు చదవగలడా?"
అమ్మాయి :"చదవగలడు డాడీ అతను చాలా ఇంటెలిజెంట్ "
డాడీ :"అలాగా మంచిది గంగాధర్ వ్రాసిన
"పెద్దోళ్లు . వెధవలు కాదు"
అనే పుస్తకాన్ని మాత్రం ఇవ్వటం మర్చిపోకు "😬
Daddyy rocks👏👏👏😵ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలతో...
No comments:
Post a Comment