NaReN

NaReN

Friday, April 8, 2022

కొబ్బరికాయ ఆరోగ్యానికి మంచిది

 #కొబ్బరికాయ ఆరోగ్యానికి మంచిది:


 కొబ్బరి లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో గొప్పగా దోహాధం చేస్తుంది.  ప్రతిరోజు పురుషులకు 38 గ్రాముల పీచు మరియు మహిళలకు 25 గ్రాములు పీచు అవసరం అవుతుంది. .  ఎండిన కొబ్బరి  ద్వారా ఈ పీచు సమృద్ధిగా అందుతుంది.  గుండె సంబంధిత సమస్యలన్నింటినీ క్రమబద్దీకరించగల గుణాలు కొబ్బరిలో ఉన్న ఫైబర్ లో ఉన్నాయి.


మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది:

ఎండిన కొబ్బరి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని మరియు మెదడును చురుగ్గా ఉంచుతుంది.  ఆహారంలో ఎండు కొబ్బరి చేర్చడం ద్వారా అల్జీమర్స్ వంటి భయంకరమైన వ్యాధి యొక్క మొదటి దశలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. 


#రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

ఇందులో  సెలీనియంతో కూడిన పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి.  ఈ సెలీనియం అనేక వ్యాధులను తగ్గించడంలో సహాయపడితే సెలెనో ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో సమర్థవంతంగా పోషకాలు ఉంటే ఏ జబ్బులను అయినా ఎదుర్కొనే శక్తి సమకూరుతుంది.


#పురుషులలో వంధ్యత్వాన్ని నివారిస్తుంది:

ఎండిన కొబ్బరిలో ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి పురుషులలో వంధ్యత్వాన్ని నివారించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎండుకొబ్బరిని ఆహారంలో తీసుకున్నవారిలో ఈ వంధ్యత్వ లక్షణాలు చాలా తక్కువగా ఉండటం గమనించవచ్చు. ఎండు కొబ్బరి వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే సెలీనియం వంధ్యత్వాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 


#రక్తహీనతను తగ్గిస్తుంది:

ముఖ్యంగా ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత మహిళలు రక్తహీనత సమస్యకు గురవుతుంటారు.  ఇది ఐరన్ లోపం వల్ల వచ్చే సమస్య. దీనివల్ల మహిళల్లో అన్నిరకాల ఇతర సమస్యలు కూడా ఎదురవుతాయి.  ఐరన్ తో నిండిన ఎండిన కొబ్బరి రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.  ఆహారంలో వీలయిన పద్దతులలో ఎండు కొబ్బరి చేర్చడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. 


#క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

ఎండిన కొబ్బరికాయలో ఉండే అనేక పోషకాలు  క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి.  పెద్దప్రేగు క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్లను  ఎండిన కొబ్బరి వాడటం ద్వారా దూరంగా ఉంచవచ్చు.


#జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది:

ఎండు కొబ్బరి మలబద్ధకం, డ్యూడెనల్ అల్సర్ మరియు హేమోరాయిడ్స్ వంటి అనేక జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.  ఎండిన కొబ్బరికాయ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు, కాబట్టి దీనిని అన్ని వయసుల వారు నిరభ్యరంతంగా ఉపయోగించవచ్చు.


#ఆర్థరైటిస్‌ను నివారిస్తుంది:

బోలు ఎముకల వ్యాధి, ఇతర ఎముకలకు సంబందించిన సమస్యలను నివారించడంలో ఎండు కొబ్బరి ఉత్తమంగ పనిచేస్తుంది.    ఎండిన కొబ్బరికాయలో అనేక ఖనిజాలు ఉన్నాయి, ఇవి ఎముకలు దృడంగా ఉంచడానికి మరియు  కణజాలాలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE