NaReN

NaReN

Friday, April 15, 2022

E-Filing చేసుకొనుటకు సూచనలు

 🙋‍♂️E-Filing చేసుకొనుటకు సూచనలు


🌴Financial Year (FY) 2021-22 అనగా Assessment Year (AY) 2022-23(1.4.21 to 31.3.22) సంవత్సరానికి సంబంధించిన Income Tax Return E Filing ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యింది. అయితే మన

DDO లు TDS పూర్తి చేసిన తర్వాతనే  మనం E Filing చేసుకొవలసి ఉంటుంది.


🌴ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ కోసం గత సంవత్సరం జూన్ 7  నుంచి ప్రారంభమైన కొత్త సైట్ ప్రారంభమైంది.   వాస్తవానికి మనం ఈ ఫైలింగ్ ప్రతీ సంవత్సరం జులై 31 లోగా  సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పరిస్ధితులను బట్టి ప్రభుత్వం ఈ గడువు పెంచవచ్చు.


🌴గమనించవలసిన ముఖ్యవిషయం ఏమంటే ఇన్కమ్ టాక్స్ రిటర్న్ (ఈ - ఫైలింగ్) అనేది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేయాల్సిందే. 2,50,000  పైబడిఆదాయం  కలిగిన వారందరూ  *ఇన్కమ్ టాక్స్  పడనప్పటికీ*  తప్పనిసరిగా  ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి.


🌴75 సంవత్సరాల సూపర్ సీనియర్ సిటిజన్స్  వారి ఆదాయం 5 లక్షల లోపు అయితే ఐటీ రిటర్న్స్ సబ్మిట్  చేయడం నుండి మిన హాయింప బడ్డారు.


🌴ఇన్కమ్  టేక్స్ కడితేనే ఈ ఫైలింగ్ చేయాలి లేకపోతే అక్కరలేదు అనుకోవడం పొరపాటు. టేక్స్ తో సంభంధంలేకుండా రెండున్నర లక్షల వార్షికాదాయం దాటిన వారంతా ఈ ఫైలింగ్ చేయాలి.కారణం ఏదైనా ఎవరేని ఈ-ఫైలింగ్ చేయని వారికి రెండు మూడు సంవత్సరాల తరువాత కూడా ఐ టీ డిపార్టుమెంటు నుండి నోటీసులు  వచ్చే ప్రమాదం ఉంది.


🌴ఇన్కమ్ టాక్స్  సైట్ లో మనం ఈ ఫైలింగ్  ఎలా చేయాలో పరిశీలించుదాం.


www.incometax.gov.in.


🌴సైట్ లో ఇన్కమ్ టాక్స్ రిటరన్స్ ఈ ఫైలింగ్ ద్వారా  సబ్మిట్ చేయాలి. వ్యక్తులు, వ్యాపార సంస్థలు ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి , రిఫండ్ కోరడానికి, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ సైట్ ఉపయోగపడుతుంది.


🌴ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ కు పాన్ నెంబర్ గానీ ఆధార్ నెంబరు గానీ యూజర్ ఐడి గాఉపయోగించాలి. పాస్వర్డ్ సహాయంతో మనం ఈ ఫైలింగ్ పేజీలో ప్రవేశించ గలుగుతాం.


🌴పాస్ వర్డ్ మరచిపోయిన సందర్భంలో forget పాస్ వర్డు ఆప్షన్  ద్వారా  ఇ మెయిల్, ఫోన్ నెంబరు సహాయంతో దిగ్విజయంగా ఈ ఫైలింగ్  సైట్ లోకి ప్రవేశించవచ్చు. 


🌴ఐటీ రిటర్న్స్ ఈ ఫైలింగ్ చేయడానికి  మనం ముందుగా గమనించాల్సినవి.


🌴1.పాన్ మరియు ఆధార్ లింక్ అయి ఉండాలి. 


🌴2. ఆధార్ మన  మొబైల్ నెంబర్ కు లింక్ చేయబడి ఉండాలి. 


🌴3. మన బ్యాంకు ఖాతా కు మొబైల్ నెంబర్ లింక్ చేయబడి ఉండాలి.  


🌴(గమనిక- ఈ మూడు అంశాలు లో  ఏది లేకపోయినా ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయలేము.)


🌴4. మన జీతం/  పెన్షన్  వివరాలతో డి డి ఓ ఇచ్చిన ఫారం16 / పెన్షనర్లు ఫిబ్రవరి పేస్లిప్  దగ్గర ఉంచుకోవాలి.


🌴(గమనిక -టేక్స్ పే చేసిన పెన్షనర్లకు సంబంధిత ట్రెజరీలలో Form 16 ఏప్రియల్ నెలనుండి ఇస్తారు .టేక్స్ పడని పెన్షనర్లు పిబ్రవరి పేస్లిప్ లో ఉన్న Form 16 వివరాలతో ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు.)


🌴5.  లింక్ అయిన మొబైల్ దగ్గర ఉండాలి.


🌴ప్రస్తుతం  I T ఈ ఫైలింగ్ పేజీలో  పాన్ ,ఆధార్ లింక్ అవ్వడం ద్వారా మన వివరాలు ఉంటాయి.వాటిని  ఎడిట్ చేసుకోవడానికి, అప్డేట్ చేయడానికి అవకాశం ఉంది. మన ఫోటో కూడా ఆధార్ సైట్  నుండి కానీ  నేరుగా గాని  ఇక్కడ అప్డేట్ చేయ వచ్చు. 


🌴New users అయితే మనం  individual tax payer  దగ్గర క్లిక్ చేసి 1. బేసిక్ డీటెయిల్స్ లో పాన్ నెంబర్,  నేమ్, డేట్ అఫ్ బర్త్, జెండర్,  రెసిడెన్షియల్ స్టేటస్  ఫిల్ చేయడంకానీ ఉన్న వివరాలను అప్డేట్ చేయడం గానీ ఎడిట్ ఆప్షన్ ద్వారా చేసుకొనే అవకాశం ఉంది.


🌴2. కాంటాక్ట్ డీటెయిల్స్ లో సెల్ నెంబర్, అడ్రస్ వివరాలు  పూర్తి చేయాలి.  మన మొబైల్ ఓటీపీ ద్వారా వాలిడేట్ చేయాలి.


🌴3.  బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయాలి..


🌴గతంనుండి ఐటి ఫైల్ చేస్తున్న ఎక్సిస్టింగ్ యూసర్స్ వివరాలు ప్రీఫిల్ చేసిఉంటాయి .. సరిచూసుకోవడం అవసరమైతే ఎడిట్ చేయడం చేయవచ్చు.


🌴మనం ఇపుడు ఐటి రిటరన్ ఫిల్ చేయడం గురించి చూద్దాం!!


🌴లాగిన్ అయి  అసెసెమెంట్ ఇయర్ ఎంటర్ చేసి  Online filling  ఆప్షన్ ఎంపిక చేసి  Status లో individual  సెలక్ట్ చేసి మనకు వర్తించే ఐ టి ఆర్ ఫారం సెలక్ట్ చేయాలి. మనం ITR 1 ఎంచుకోవాలి. 


🌴ఇక్కడ మనం 3 steps follow కావాల్సి ఉంటుంది.

1 Validate Your returns

2Conform your return summery

3.Verify and submit  your return అనేవి.


🌴1. Validate your return లో 5 అంశాలు ఉంటాయి.

1. Personal information

2.Gross total Income

3.Total deductions

4 Taxes paid

5. Total Tax Liability లను ఒకటి పూర్తి చేసిన తరువాత మరొకటి క్లిక్ చేసి ఓపన్ చేసి ఫిల్ చేసుకోవాలి.

Personal information దగ్గర ఒక ముఖ్యమైన విషయం....

Are you opting for New Regime U/s 115BA


2 comments:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE