NaReN

NaReN

Thursday, April 7, 2022

అదీ సంగతి

 *అదీ సంగతి*


తిక్కస్వామి స్కూటర్ మీద వెళుతున్నాడు .

హఠాత్తుగ్గా స్కూటర్ కి ఇద్దరు అడ్డు రావడంతో తిక్కస్వామి సడన్ బ్రేక్ వేశాడు .

వాళ్ళల్లో ఒకడు చోరవగా తిక్కస్వామి జేబులో నుంచి పర్స్ లాగేశాడు.

అపరిచితులు దారికటకాయించి పర్స్ తీసుకోవడంతో తిక్కస్వామికి కోపం నషాళానికంటింది. కానీ, అంతలోనే ఒక విషయం తళుక్కున అతడి మెదడులో మెరిసింది. అదేమిటంటే.."ఈ మధ్య ఒక చానెల్ వాళ్ళు ప్రాంక్ వీడియో షూట్ కార్యక్రమాలు తెగ చేస్తూ పాపులరవడం టి.వి.లో చూస్తున్నాం కదా! అందులో భాగమే ఇది. ఇలాగే దారి మధ్యలో ఒకడు రోడ్డు మీద వెళుతున్న వాడిని నానా రకాలుగా విసిగిస్తూ, చిరాకు పెడుతుంటాడు. చివరకు ఆ బాధితుడు అమ్మ నా తిట్లు..తిడుతూ వెళ్లబోతుంటే అతడు నవ్వి దూరంగా కారు లో ఉన్నా కెమెరా చూపించి ప్రాంక్ ప్రోగ్రామని అదో టి. వి కార్యక్రమమని చెబుతాడు. అలాగే ఇది కూడా అయ్యుంటుంది. వెర్రిమొహాలు తనకి తెలియదనుకుంటున్నారు. ఇలాంటివి ఎన్ని చూడలేదు. తనని ఫూల్ని చెయ్యాలనుకుంటున్నారు .కానీ నేనే వాళ్ళని వెర్రివెంగళాయల్ని చేస్తాను. మనతో పెట్టుకొంటే అట్లుంటది మరి..అని మనసులో సినిమా డైలాగ్ కొట్టుకొని పైకి ఏమీ తెలేని వాడిలా నటించాడు మన తిక్కస్వామి. రేపు కార్యక్రమం టి.వి.లో ప్రసారమైతే  ప్రాంక్ తో పావులరై మా ఇంట్లో వాళ్ళు చూసి నా సమయస్ఫూర్తికి  పెళ్ళాంతో సహా అందరూ ఆశ్చర్యపోతారని  మనసులో అనుకొని అలాగే నిలబడ్డాడు తిక్కస్వామి..

జేబులోంచి పర్సు తీసినా.. ప్రతిఘటించకపోవడంతో ఆ దొంగలకి తెగ ఆశ్చర్యం కలిగింది. వాళ్లకి సహకరిస్తున్న తిక్కస్వామిని మెంటల్ కేసుగా జమేసుకుని మెడలోసి గొలుసు, వేళ్ళకున్న రెండు ఉంగరాలు, కుడి చేతికున్న బ్రాస్లెట్ శుభ్రంగా ఒలిచేసుకున్నారు. తాపీగా నడుచుకుంటూ బై చెప్పి మరీ వెళ్ళిపోయారు ఆ దొంగలిద్దరూ.  వాళ్ళు మళ్ళీ వస్తారని  అదిగో దూరంగా ఉన్న మా కెమెరాని చూసి ఒకసారి హాయి చెప్పండి అంటారని  అలాగే తెల్ల మొఖమేసుకుని స్కూటర్ మీద నీలుక్కుని కూర్చుని అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు తిక్కస్వామి .

ఆ దొంగల జీవితంలో ఇంత ఈజీగా చేసిన దొంగతనం ఇదే అని ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ  పలాయనం చిత్తగించారు. ప్రాంక్ వీడియోల  పుణ్యమాని ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో..తస్మాత్ జాగ్రత్త!

***

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE