NaReN

NaReN

Saturday, April 2, 2022

సూర్యాస్తమయం తరువాత దానం చేయకూడని వస్తువులు

 *సూర్యాస్తమయం తరువాత దానం చేయకూడని వస్తువులు*

            ➖➖➖



*సాధారణంగా మన హిందువులు ఎన్నో ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తారు.* 


*ఈ క్రమంలోనే మన హిందూ ఆచారాల ప్రకారం దానధర్మాలు చేయడం ఎంతో పుణ్య ఫలాన్నిస్తుందని భావిస్తారు.*


*జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా దానధర్మాలకు ఎంతో విశిష్టత ఉంది. ఎవరికైనా ఏదైనా వస్తువులను దానం చేయడం వల్ల పుణ్య ఫలం దక్కుతుందని భావిస్తారు.*


*అయితే దానధర్మాలను చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.*


*దానధర్మాలను ఎప్పుడు పడితే అప్పుడు చేయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు….*


*ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తరువాత కొన్ని వస్తువులను ఎలాంటి పరిస్థితులలో ఇతరులకు దానం చేయకూడదట. మరి సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడని వస్తువులు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం….*


*జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం జరిగిన తర్వాత ఎలాంటి పరిస్థితులలోనూ ఇరుగుపొరుగు వారికి పెరుగును దానం చేయకూడదట. పెరుగు శుక్రగ్రహానికి ప్రతీక. శుక్రుడు మనలో సంతోషాలను కలుగజేస్తాడు కనుక పెరుగును సూర్యాస్తమయం తర్వాత ఇతరులకు దానం చేయడం వల్ల మన ఇంట్లో సంతోషం కరువవుతుందిట.* 


*అదేవిధంగా సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంట్లో డబ్బులను ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదట.*


*సాధారణంగా మన చుట్టుపక్కల వారు నిత్యావసర వస్తువులలో ఒకటైన ఉల్లిపాయ, వెల్లుల్లిని అడగడం మనం చూస్తుంటాము. అయితే సూర్యాస్తమయం జరిగిన తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లిని దానం చేయడం వల్ల చెడు ఫలితాలు కలుగుతాయి.*


*అదేవిధంగా కొందరు పాలను దానం చేయడం ఎంతో శుభప్రదమని భావిస్తారు. అయితే సూర్యాస్తమయం తర్వాత పాలను ఎవరికీ దానం చేయకూడదు. పాలు సూర్యచంద్రులకు ప్రతీకగా సూర్యాస్తమయం తర్వాత పాలను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు.* 


*మన ఇంట్లో ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. అందుకోసమే సంధ్యాసమయంలో ఉప్పును ఎవరికీ దానం చేయకూడదు.*


*సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు.*

                      

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE