NaReN

NaReN

Sunday, April 24, 2022

సహజత్వం లేకపాయే ....

 సహజత్వం లేకపాయే ....


సహజత్వం లేని ప్లాస్టిక్ పువ్వుల నవ్వు

నేడు నా కళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది

ముక్కు కు పరిమళాలు చేరక 

మనసు బాధతో విచారిస్తూ కూర్చుంది...


ముఖ పద్మం మకరందము కోల్పోయే

విచ్చుకున్న కన్నుల రేఖల్లో దీనత్వం కనబడే

తెచ్చుకున్న చిరు నవ్వులో స్పష్టత దూరం

ఉంచుకున్న ఆనందం విషాదంలో మునిగిపోయే..


ప్రకృతికి వికృతి సృష్టించి వినోదం పొందుతూ

కృత్రిమ విశ్వం కోసం కుయుక్తులు పన్నుతూ

నేలనంతా కబంధ హస్తాలలో బంధించి

ఆదిమూలలు అణగదొక్కే అసహజత్వం పోకడలు..


మురికి బడ్డ భూమిని స్వచ్ఛమైన నదిలో ముంచక

కాలుష్యపు అలల తరంగాలు సృష్టించి

విషవాయువు నురుగు పూతలా పెరిగితే

అంతర్జాలంలో సప్తవర్ణపు రంగులు రుద్దుతున్నాం..


నింగిని నేలకు దించుకొని విద్యుత్ కాంతులతో

త్రిశంకు స్వర్గం తయారు చేసుకుంటున్నాం

రెక్కలు నరికిన పక్షి వివరించినట్లుఐగా

ఇంట్లోనే ఆకాశపు అందాలను ఆస్వాదిస్తున్నాం...


బయట కాలు పెట్టకుండా సమస్తం ఆహ్వానిస్తూ

సృజనాత్మకత జోడించి నూతన అంకురం వేస్తూ

విజ్ఞాన పునాదులు విశ్వ రహస్యాలను శోధిస్తూ

మానవత్వం మరిచి కృత్రిమ యంత్రం అయిపోయే..


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE