NaReN

NaReN

Wednesday, April 13, 2022

పోయాక ఫోటోలను కాదు బతికుండగానే మనుషులను ప్రేమిద్దాం

   పోయాక ఫోటోలను కాదు బతికుండగానే మనుషులను ప్రేమిద్దాం  


"నేనిక లేనని తెలిశాక  విషాదాశ్రులను 

వర్షిస్తాయి నీ కళ్ళు..

కానీ  మిత్రమా అదంతా నా కంట పడదు!

ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా! 


నీవు పంపించే పుష్పగుచ్ఛాలను 

నా పార్ధివదేహం 

ఎలా చూడగలదు?

అందుకే... అవేవో ఇప్పుడే పంప రాదా!


నా గురించి నాలుగు మంచి  మాటలు పలుకుతావ్ అప్పుడు

కానీ అవి నా చెవిన పడవు..

అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో !


నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు !

కానీ నాకా సంగతి తెలీదు..

అదేదో ఇపుడే క్షమించేయలేవా?!


నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది

కానీ అది నాకెలా తెలుస్తుంది?

అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !


నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది

అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా!


సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్.. నా మరణ వార్త విన్నాక! 

సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?


ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకుతాను, కాసేపైనా గడుపుతాను, హాయిగా నీతో మెలుగుతాను!"


( *ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే  బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం. కష్టసుఖాలు పంచుకొందాం. ఒకరికొకరమై మెలుగుదాం. ఉన్నన్నాళ్ళూ కలిసిమెలసి బతుకుదాం.ఈ రోజు కలిసిన ,మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో,మాట్లాడతాడో లేదో.ఏది శాశ్వతం? ఎవరు నిశ్చలం?* )

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE