NaReN

NaReN

Thursday, April 7, 2022

ఇవి తెలుసుకోండి

 ఇవి తెలుసుకోండి


*💁🏻‍♂️ 1) V ఆకారంలో పక్షులు ఎందుకు పయనిస్తాయి?*

〰〰〰〰〰〰〰〰

*ఆకాశంలో వెళ్లే పక్షుల గుంపును గమనిస్తే అవి V ఆకారంలోనే పయనిస్తుంటాయి. దీనికి గల కారణాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. గాలి వేగాన్ని నియంత్రించడానికి, శక్తిని ఆదా చేసుకోవడానికి పక్షులు ఈ పద్ధతిని అనుసరిస్తాయి. ముందు వరుసలో ఉండే పక్షి నాయకుడి స్థానాన్ని పొందుతుంది. పూర్తి ఆరోగ్యకరమైన పక్షి మాత్రమే ప్రధాన స్థానంలో ఉంటుంది. ముందున్న పక్షి అలసిపోతే.. దాని స్థానంలో మరొక పక్షి ముందుకు వెళుతుంది.*




*💁🏻‍♂️ 2) మానవ వంశవృక్షం లెక్కెంతో తెలుసా?*

〰〰〰〰〰〰〰〰

*మన వంశవృక్షమే మనలో చాలామందికి తెలియదు. కానీ మానవ జాతి వంశవృక్షాన్ని డెమోగ్రాఫర్లు తోషికో కనెడా, కార్ల్ హాబ్‌లు లెక్కించారు. మన అసలు సిసలు పూర్వీకుడైన హోమోసెపియన్ నివసించిన క్రీ.పూ. 19000ని బెంచ్‌మార్క్‌గా తీసుకుని లెక్కించగా ఈ భూమ్మీద మనకంటే ముందు 10,900 కోట్ల మంది జీవించినట్లు తేలింది. ప్రస్తుత 795 కోట్లను కలుపుకుంటే ఈ సంఖ్య 11,695 కోట్లు. 2050 నాటికి పుట్టే మరో 400 కోట్లను కలిపితే 12,100 కోట్లు.*




*💁🏻‍♂️ 3) సామెత: మొక్కై వంగనిది మ్రానై వంగునా*

〰〰〰〰〰〰〰〰

*ప్రారంభంలో మొక్కను ఎలా వంచుతే అలా వంగుతుంది. అదే మొక్క చెట్టుగా మారితే, వంచుదామన్నా వంగదు. విరిగిపోతుంది. అలాగే పిల్లలకు చిన్నప్పటినుంచే గౌరవ మర్యాదలు, విద్యాబుద్ధులు నేర్పాలి. పెద్దయ్యాక ఎంత నేర్పినా ప్రయోజనం ఉండదు అని చెప్పేందుకు ఈ సామెతను వాడుతారు.*




*💁🏻‍♂️ 4) వాన ఉంటే కరువు, పెనిమిటి ఉంటే పేదరికం ఉండదు*

〰〰〰〰〰〰〰〰

వర్షం కురిస్తే చెరువులు, కుంటలు నిండుతాయి. రైతులు ఏదో ఒక పంట పండిస్తారు. కావున కరువు అనేది రాదు. అదేవిధంగా భర్త ఉంటే ఏ విధంగానైనా కష్టపడి డబ్బులు సంపాదిస్తాడు. దీంతో ఆ ఇంట్లో పేదరికం ఉండదు. వర్షాలు కురవకపోయినా, భర్త చనిపోయి ఆ కుటుంబం ఇబ్బందులు పడుతుంటే ఈ సామెతను వాడుతారు.




*💁🏻‍♂️ 5) ఖమ్మం చరిత్ర తెలుసుకుందామా..?*

〰〰〰〰〰〰〰〰

*ఖమ్మం యొక్క నామం పట్టణంలో ఒక కొండ మీద నిర్మించిన ‘నరసింహద్రి’ ఆలయం నుండి ఉద్భవించిందని చెపుతారు. ఈ ఆలయాన్ని ‘స్తంబా సిఖరి’ మరియు తరువాత ‘స్తంభాద్రి’ అని పిలుస్తారు. నరసింహ స్వామి ఒక రాతి స్తంభము నుండి ఉద్భవించి తన భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడటానికి దుష్ట రాజు హిరణ్య కశ్యపుని చంపారని నమ్ముతారు. ఈ సంఘటన కృత యుగంలో జరిగినట్లు చెప్పబడింది. ఈ ఆలయం క్రింద ఉన్న నిలువు రాగిని ‘కంబా’ అని పిలుస్తారు మరియు కొండ అడుగుభాగంలో ఉన్న పట్టణాన్ని 'కంబమెట్ట' అని పిలిచేవారు. ఇది చివరికి ఖమ్మం గా మారింది.

ఖమ్మం పట్టణం అక్టోబరు 1, 1953 వరకూ పెద్ద వరంగల్ జిల్లాలో భాగంగా ఉంది. వరంగల్ జిల్లాలోని ఐదు తాలూకాలు, ఖమ్మం, మధిర, ఇల్లందు, బూర్గంపాడు మరియు పాల్వంచ (ప్రస్తుతం కొత్తగూడెం) లతో ఏర్పరచారు మరియు ఖమ్మం జిల్లాలో జిల్లా ప్రధానకార్యాలయంగా ఏర్పడింది. ఈమధ్య కాలంలో రెండు జిల్లాలుగా విడదీసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఏర్పరచారు.*

*జిల్లా వాటాలు ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం మరియు 5 అసెంబ్లీ నియోజకవర్గాలు.*

*ఖమ్మం, పాలేర్, మధిర, వైరా, సత్తుపల్లి*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE