NaReN

NaReN

Wednesday, April 13, 2022

నరేంద్రుడంటే అన్నావంటారు గానీ..

 నరేంద్రుడంటే  అన్నావంటారు గానీ... 


నరేంద్రుడంటే అన్నావంటారు గానీ..

కౌన్స్‌లర్లు ఎందుకు

సర్పంచులు ఎందుకు

గ్రామాలకు బాగుచేయడానికి....

గ్రామాలు బాగుపడ్డాయా....

*ఆ గ్రామాలకే తెలియాలి....!* 


నరేంద్రుడంటే అన్నావంటారు గానీ..

ఎంపిటిసి లు  ఎందుకు

ఎంపిపిలు ఎందుకు

మండలాలు బాగుచేయడానికి....

మండలాలు బాగుపడ్డాయా....

*ఆ మండలాలకే తెలియాలి....!* 


నరేంద్రుడంటే అన్నావంటారు గానీ..

జెడ్పిటిసి లు  ఎందుకు

జెడ్పి ఛైర్మన్లు ఎందుకు

జిల్లాలు బాగుచేయడానికి....

జిల్లాలు బాగుపడ్డాయా....

*ఆ జిల్లాలకే తెలియాలి....!* 


నరేంద్రుడంటే అన్నావంటారు గానీ..

ఎమ్మెల్యేలు ఎందుకు

నియోజకవర్గాలను అభివృద్ధి చేరడానికి...

నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయా...

*ఆ నియోజకవర్గాలకే తెలియాలి....!* 


నరేంద్రుడంటే అన్నావంటారు గానీ..

మంత్రులు ఎందుకు 

శాఖలతో సమాజాన్ని మెరుగుపరచడానికి

సమాజం మెరుగుపడిందా

*ఆ సమాజానికి తెలియాలి...!* 


నరేంద్రుడంటే అన్నావంటారు గానీ..

ముఖ్యమంత్రి ఎందుకు

రాష్ట్రాన్ని బాగుచేయడానికి

రాష్ట్రం బాగుపడిందా....

*ఆ రాష్ట్రానికే తెలియాలి....!* 


*ఓ మనిషి.. నరేంద్రుడంటే అన్నావంటారు గానీ.....*

*వంకర బుద్ది మార్చుకుని నితీ నిజాయితీలకు ఓటేసి,నీవు* *మంచిగా నడుచుకున్నప్పుడే*

*గ్రామం,మండలం,జిల్లా నియోజకవర్గం,రాష్ట్రం,సమాజం బాగుపడుతుంది....* 


*ఓ మనిషి దోషం నీలో పెట్టుకుని దొరని ద్వేషిస్తే ఏం వస్తోంది బూడిదా...*


అంటే అన్నావంటారు గానీ

నువ్వు.., నేను..,మనం..,అందరం.., మంచివైపే నిలబడలేని చేతకానీ దద్దమ్మలం...

కాస్త ఆశ చూపెడితే అటువైపు తిరిగి 

మిగిలిన సమాజాన్ని నిందించే తలకుమాసిన మనుషులం...

మన బుద్ధులు మారనంత వరకు రాష్ట్రం కాదు కదా...

మన బ్రతుకులు కూడా ఏడుస్తుంటాయి... 


అయినా నవ్వును నటించడం అలావాటుచేసుకున్నాం కదా...

ఇంకెంత కాలం ఈ నటనలోనే 

మునుగుతూ ఉంటామో...

ఏమో మనల్ని భరించే భూదేవికే తెలియాలి.... 

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE