NaReN

NaReN

Saturday, April 30, 2022

నున్న గుండు

 నున్న గుండు


అనగనగా ఒక పల్లెటూర్లో ఒకడుండేవాడు. వాడికి నెత్తిమీద ఒక్క వెంట్రుక కూడా ఉండేది కాదు. చక్కగా, బోర్లించిన రాగి చెంబులాగా ఉండేది. అందుకని వాణ్ణి ఊర్లో అందరూ నున్నగుండు అని పిలిచేవారు. వాడి అసలుపేరు ఆ ఊర్లో ఎవ్వడికీ గుర్తుకూడాలేదు. వాళ్ళకేమిటి, మన కథానాయకుడే మర్చిపోయాడనుకోండి...! పలకరింపుకీ, వెక్కిరింతకూ, పని చెప్పడానికి, మాట్లాడదానికీ కూడా వాణ్ణి అందరూ "నున్నగుండూ..! , నున్నగుండూ..!!" అని పిలుస్తూ ఉంటే వాడికి చాలా ఉక్రోషం గా ఉండేది. ఈ బాధపడలేక వాడు ఆ ఊరినుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొని, ఎవ్వరికీ చెప్పకుండా ఒకనాటి తెల్లవారు ఝామునే, ఇంకా చీకటి కూడా వదలకుండానే బయల్దేరిపోయి అలా చెట్లవెంటా పుట్టలవెంటా అడవుల్లోకి వెళ్ళిపోయాడు.


కొద్దిరోజులు అలా దొరికిందేదో తింటూ అరణ్యాలు పట్టి తిరుగుతూ ఉంటే వాడికి ఒక మునీశ్వరుడు కనిపించి, "నాయనా ఎవరునువ్వు..! ఎందుకీ నిర్జనారణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నావు..!? అడవి మృగాల కంట పడ్డావంటే అపాయంకదా..!" అని అడిగాడు.


నాకెవరూ లేరండీ..! నాకసలు బ్రతకాలనే లేదు..! అంటూ వలవలా ఏడుస్తూ ముని పాదాల చెంత కూలబడ్డాడు మన నున్నగుండు(చూశారా..! నేనూ వాణ్ణి అలాగే అనేశాను..! ప్చ్..!).


ఏమైంది నాయనా జీవితం మీద అంత విరక్తి చెందావు..!? అని ముని అడిగితే, మనవాడు మళ్ళీ ఏడుపు మొదలుపెట్టి వాడికథంతా చెప్పాడు.


"నా గుండుమీద ఎలాగైనా జుత్తు మొలిపించండి స్వామీ.. అంటూ కాళ్ళావేళ్ళా పడ్డాడు. అప్పుడా ముని "నీ బోడిగుండుమీద జుత్తు మొలిపించడం బ్రహ్మతరం కూడా కాదు నాయనా, దాని సంగతి మర్చిపో..! అని, "ఉండు, నిన్నింక ఎవరు నున్నగుండు అని పిలిచినా వాళ్ళకి తగిన శాస్తి జరిగేలా చేస్తా..!, ఏదీ నీ కుడి చెయ్యి ఇలా చూపించు" అని అడిగి వాడిచేతికి ఒక మంత్రం వేశాడు. ఇకనుంచి నిన్ను ఎవరైనా నున్నగుండూ అని పిలిస్తే వాడి నెత్తిమీద చెయ్యిపెట్టు, తక్షణం వాడి జుత్తు కూడా చక్కగా ఊడిపోయి నున్నగుండుగా మిగుల్తాడు" అని తనదారిన తాను వెళ్ళాడు.


మనవాడు సంతోషంగా తన ఊరి దారి పట్టాడు. ఊర్లోకి ఇంకా చేరకుండానే ఒకడు కనిపించి "ఓరి నున్నగుండూ, బాగున్నావా..!? ఇన్నిరోజులు చెప్పాపెట్టకుండా ఎక్కడికి పోయావు..!?" అని అడిగాడు. వెంటనే మనవాడు.. "నన్ను నున్నగుండు అంటావా, నువ్వు నున్నగుండైపోవ..!" అంటూ వాడి నెత్తిన చెయ్యి పెట్టాడు. వెంటనే అవతలవాడి జుత్తు సమస్తం మాయమై ఒక చక్కని బోర్లించిన కుండలాగా అయిపోయింది. అది చూసిన మన నున్నగుండు ఆనందానికి అవధుల్లేవు. గంతులేస్తూ ఊర్లోకి వెళ్ళాడు. ఊర్లో వీణ్ణి చూసిన అందరూ వీణ్ణి నున్నగుండూ అని పిలవడం, వీడు "నన్ను నున్నగుండు అంటావా, నువ్వు నున్నగుండైపోవ..!" అంటూ వాళ్ళ నెత్తిన చెయ్యిపెట్టడం..!


ఆ దెబ్బకి ఊర్లో మూడొంతులమంది, ఆడ, మగ, పెద్దా చిన్నా తేడా లేకుండా నున్నగుండులైపోయారు. వాళ్ళంతట వాళ్ళు ఈ మంత్రం సంగతి తెలియక మనవాడిని నున్నగుండు అని నున్నగుండై పోయినవాళ్ళు కొందరైతే, మరికొందరిని మనవాడే వెళ్ళి మరీ నున్నగుండు చేసి చక్కా వచ్చాడు. అందరూ నున్నగుండు అయిపోయాక ఎవరు అసలు నున్నగుండో తెలియకుండా పోయింది.


ఇదిలా ఉండగా ఒకరోజు మనవాడికి మంత్రం వేసిన మునీశ్వరుడు ఆ ఊరొచ్చారు. ఊళ్ళో ఇలా అందరూ నున్నని గుళ్ళతో ఉండడం చూసి ఆశ్చర్యపోయి, విషయం ఏమిటని ఆరా తీస్తే వాళ్ళు మన కథానాయకుడి సంగతి చెప్పారు. "అరె, నేనిచ్చిన మంత్రాన్ని ఇంతదారుణంగా ప్రయోగించాడా అని కోపంగా, ఎక్కడున్నాడు ఆ నున్నగుండు గాడు అన్నాడు..! ఆ జనంలోనే ఉన్న మన అసలు నున్నగుండు, "నువ్వుకూడా నన్ను నున్నగుండు అంటావా, నువ్వు నున్నగుండైపోవ..!" అంటూ ఆ ముని నెత్తిమీద చెయ్యిపెట్టేశాడు. దెబ్బకి ఆ మునికూడా నున్నగుండై కూర్చున్నాడు.


దాంతో వాళ్ళంతా తమ మొహాలు చూసుకోలేక, మమ్మల్నింకెవరు చూస్తారంటూ తెగ బాధపడుతూ ఉంటే మన మునీశ్వరుడి గురువుగారు ప్రత్యక్షమై బాధపడకండి నాయనా, భవిష్యత్తులో మీరంతా ప్రపంచ ప్రఖ్యాతి పొందుతారు, అందరూ మీ బొమ్మలు మాటకి ముందు మాట తరువాతా ఉపయోగిస్తారు, మీ ముఖాలు లేకుండా వాక్యాలు పూర్తవవు అని వరమిచ్చాడు.


😀😁😂😃😄😅😆😇😈😉😊😋😌😍


😎😏😐😑😒😓😔😕😖😗😘😙😚😛


😜😝😞😟😠😡😢😣😤😥😦😧😨😩


😪😫😬😭😮😯😰😱😲😳😴😵😶😷


అదిగో..! ఆ కథలో అలా వరంపొందిన నున్నగుండు గాడి బాధితులే ఇప్పుడు మనకి ఇమోజీలుగా దర్శనమిస్తూ, మన మెసేజ్ లలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి..!


వాళ్ళ తరువాత తరాలవాళ్ళు 

జుట్టుతో మామూలుగానే ఉన్నారు..


👶👱👦👧👨👩👪👫👬👭


👤👥 🙋🙅🙆🙇🙋🙍🙎💁


అదండి..! 

నున్నగుండు అలియాస్ ఇమోజీల కథా కమామిషూ..!!


 🙏🙏🙏

Tuesday, April 26, 2022

సైకిల్


ఎవరి ఆలోచననో గానీ దీన్ని జగతి కోసం పట్టుకొచ్చి మీ ముందు పెడుతున్నా... ఓ సారి సాంతం చదవండి!!

++++++++

సైకిల్ తొక్కడం అనేది ఏ దేశ ఆర్థిక వ్యవస్థ (GDP) కైనా అత్యంత హానికరం.


ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం ...


*సైక్లిస్ట్* దేశానికి పెద్ద విపత్తు, ఎందుకంటే అతను ...


కారు కొనడు.

అప్పు చేయడు.

కారుకు బీమా చేయడు.

పెట్రోల్ కొనడు.

కారును సర్వీసింగ్ చేయడు.

డబ్బు చెల్లించి కారును పార్క్ చేయడు.

ట్రాఫిక్ ఫైన్ కట్టడు.

అంతే కాకుండా ... అతను లావుగానూ అవ్వడు.


అవును ... అతను ఆరోగ్యవంతుడు అన్నది నిజం


కానీ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు, ఎందుకంటే ... అతను

మందులు కొనడు.

ఆసుపత్రికి మరియు వైద్యుని వద్దకు వెళ్ళడు

ఇది దేశ జిడిపికి అస్సలు తోడ్పడదు.


అదే దీనికి విరుద్ధంగా, ఒక ఫాస్ట్ ఫుడ్ దుకాణం తేరవడం వల్ల 30 ఉద్యోగాలు సృష్టించబడతాయి ...


10 గుండె వైద్యులు,

10 మంది దంతవైద్యులు,

10 మంది బరువు తగ్గించేవారు...!


కొసమెరుపు

*నడక* 

 దీని కంటే ఘోరం!, ఎందుకంటే పాదచారులు సైకిల్ కూడా కొనరు.

డాడీ....

 డాడీ....

ఒకమ్మాయి నాన్నతో వరండా లో  కూర్చుని వుండగా  ఆమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఇంటికోచ్చాడు ....


అమ్మాయి : " ఓహ్ ! యండమూరి వ్రాసిన ' ఇంట్లో నాన్నున్నాడు ' పుస్తకం తీసుకోడానికి వచ్చావా?


బాయ్ ఫ్రెండ్ : " లేదు .... యుద్దనపూడి వ్రాసిన  ' నీ కోసం .... నా నిరీక్షణ ఎక్కడ? ' అనే బుక్ కోసం వచ్చాను ?"


అమ్మాయి: " అలాగా !  ఆ బుక్ నాదగ్గరలేదు. గొల్లపూడివ్రాసిన " మామిడి చెట్టుక్రింద" వుంది. తీసుకెళ్లు "


బాయ్ ఫ్రెండ్: " సరే మధుబాబు వ్రాసిన 'అయిదు నిముషాల్లో ' బుక్ కాలేజ్ కి తేవటం మర్చిపోయాను"


అమ్మాయి: "పరవాలేదు నేనుకాలేజ్కి ముల్లపూడివ్రాసిన ' నీకోసం తప్పకుండా"  బుక్ తీసుకొస్తాను"

బాయ్ ఫ్రెండ్ వెళ్లిపోయాక


డాడ్ :"అన్ని పుస్తకాలు చదవగలడా?"


అమ్మాయి :"చదవగలడు డాడీ అతను చాలా ఇంటెలిజెంట్ "


డాడీ :"అలాగా మంచిది గంగాధర్ వ్రాసిన


 "పెద్దోళ్లు . వెధవలు కాదు" 


అనే పుస్తకాన్ని మాత్రం ఇవ్వటం మర్చిపోకు "😬


Daddyy rocks👏👏👏😵ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలతో...

కూసింత నవ్వుకోండి...

 కూసింత నవ్వుకోండి...


😆😆😆😆ఐ.టి. కంపెనీ ఉద్యోగైన 🕵 రాజేష్ ఆరోగ్యం బాలేదని🗣 పేరుగాంచిన అన్ని ప్రముఖ ఆసుపత్రుల 🏥 చుట్టూ తిరిగాడు! అయినా ఆరోగ్యం కుదుట పడక 😷చాల బాధ పడుతున్నాడు! అతని భార్య ఓ సలహా యిస్తూ


"ఎందుకైనా మంచిది మీరొకసారి పశువుల డాక్టర్ని సంప్రదించండి" అన్నది!  

రాజేష్ 😳షాకై "నీకేమైనా పిచ్చా నేను పశువుల డాక్టర్ని కలవడమేంటి?" అని అరిచాడు! 


భార్య సున్నితంగా "నాకేం పిచ్చికాదు మీకే ప్రాబ్లమ్!  తెల్లవారకముందే 🐓 కోడిలాగా లేచిపోవటం,

 కాకిలాగా 🐧సగం స్నానం చేసి, కోతిలాగా🐒 చేతికి దొరికిందేదో నోట్లో పెట్టుకుతిని,

పందెం 🐎గుర్రంలా ఆఫీస్ కి పరగులుతీసి, 

అక్కడ గాడిద 🐮 చాకిరీ అంతా చేస్తూ, జూనియర్ల పై ఎలుగుబంటిలా🐻 రంకెలేసి పని చేయించి, 

రాత్రికి ఇంటికి వచ్చి చికాకుతో కుక్కలా 🐕 మా అందరి పై అరుస్తూనే, ముసలిలా🐊 ఆబగా తినేసి, మంచమెక్కి గేదెలా 🐃 నిద్రపోతున్నారుగా! 

అందుకే పశువుల డాక్టర్ని కన్సల్ట్ చేయమంది!"

రాజేష్ ష్టన్నై ఆమెనే😖🙃 చూస్తూ కూర్చుండిపోయాడు!  

"ఏమిటీ  గుంటనక్కలా 🐺 నన్నే చూస్తున్నావ్?" అడిగింది భార్య!

Sunday, April 24, 2022

సహజత్వం లేకపాయే ....

 సహజత్వం లేకపాయే ....


సహజత్వం లేని ప్లాస్టిక్ పువ్వుల నవ్వు

నేడు నా కళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది

ముక్కు కు పరిమళాలు చేరక 

మనసు బాధతో విచారిస్తూ కూర్చుంది...


ముఖ పద్మం మకరందము కోల్పోయే

విచ్చుకున్న కన్నుల రేఖల్లో దీనత్వం కనబడే

తెచ్చుకున్న చిరు నవ్వులో స్పష్టత దూరం

ఉంచుకున్న ఆనందం విషాదంలో మునిగిపోయే..


ప్రకృతికి వికృతి సృష్టించి వినోదం పొందుతూ

కృత్రిమ విశ్వం కోసం కుయుక్తులు పన్నుతూ

నేలనంతా కబంధ హస్తాలలో బంధించి

ఆదిమూలలు అణగదొక్కే అసహజత్వం పోకడలు..


మురికి బడ్డ భూమిని స్వచ్ఛమైన నదిలో ముంచక

కాలుష్యపు అలల తరంగాలు సృష్టించి

విషవాయువు నురుగు పూతలా పెరిగితే

అంతర్జాలంలో సప్తవర్ణపు రంగులు రుద్దుతున్నాం..


నింగిని నేలకు దించుకొని విద్యుత్ కాంతులతో

త్రిశంకు స్వర్గం తయారు చేసుకుంటున్నాం

రెక్కలు నరికిన పక్షి వివరించినట్లుఐగా

ఇంట్లోనే ఆకాశపు అందాలను ఆస్వాదిస్తున్నాం...


బయట కాలు పెట్టకుండా సమస్తం ఆహ్వానిస్తూ

సృజనాత్మకత జోడించి నూతన అంకురం వేస్తూ

విజ్ఞాన పునాదులు విశ్వ రహస్యాలను శోధిస్తూ

మానవత్వం మరిచి కృత్రిమ యంత్రం అయిపోయే..


Friday, April 22, 2022

పలకరించుకుందాం

 *ఈ రోజు కలిసిన, మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో, మాట్లాడతాడో లేదో.*—ఏది శాశ్వతం ఎవరు నిశ్చలం???? 


*ఆప్యాయంగా పలకరించుకుందాం*—బ్రతికుండగానే....!!!


*కష్టసుఖాలు పంచుకొందాం. ఒకరికొకరమై మెలుగుదాం.*—ఉన్నన్నాళ్ళూ కలిసి మెలసి బతుకుదాం.


*ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత*


"నేనికలేనని తెలిశాక విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు..కానీ  మిత్రమా అదంతా నా కంట పడదు!ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా! 


నీవు పంపించే పుష్పగుచ్ఛాలను నా పార్ధివ దేహం ఎలా చూడగలదు?అందుకే... అవేవో ఇప్పుడే పంప రాదా!


నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావ్ అప్పుడు కానీ అవి నా చెవిన పడవు..అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో !


నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు కానీ నాకా సంగతి తెలీదు.. అదేదో ఇపుడే క్షమించేయలేవా?!


నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది. కానీ అది నాకెలా తెలుస్తుంది.అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా


నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీ కనిపిస్తుంది అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా!


సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్.. నా మరణ వార్త విన్నాక! సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?


ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకుతాను, కాసేపైనా గడుపుతాను, హాయిగా నీతో మెలుగుతాను!"..........    *అందుకే మసమంతా మన అనుకున్న వారితో హాయిగా స్నేహంగా, ప్రేమగా... మాట్లాడుదాం....మళ్లీ జన్మకు కూడా గుర్తుండేలా*.....❤️🌿

Wednesday, April 20, 2022

మా స్కూలు జీవితం

 మా స్కూలు జీవితం


ఒకప్పుడు...పరీక్ష రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలు..!

ముందు రోజు రాత్రి నిద్ర వుండేది కాదు.

నిద్రలోనూ భగవంతునికి మొక్కులే! 


ఫస్టు క్లాసు అక్కర్లేదు కానీ పేపర్లో నెంబరు వుండేలా చూడమని దేవుడికి పదే పదే అర్జీలు.


ఉదయాన్నే లేచి.. పేపరు కోసం సెంటర్లోకి పరుగు 

అప్పటికే కిల్లీ బడ్డీ దగ్గర అన్ సోల్డ్ పేపర్లు అన్నీ సోల్డ్ అయిపోతే..


వీధిలో ఎవరు పేపరు వేయించుకుంటారా అని వెదుకులాట.


ఎలాగోలా ఒక పేపరు సంపాధిస్తే.. పది మంది మిత్రులు పోటీ..!

కంగార్లో నెంబరు సరిగ్గా కనిపించకపోవడం..!


రెగ్యులర్ నెంబర్లు ఒకవైపు, కంపార్ట్ మెంట్ నెంబర్లు మరో వైపు

వాటిలో మళ్లీ, ఫస్టు, సెకండు, థర్డ్ క్లాస్ లు. 

ఫస్టు క్లాసులు అయితే..రెండుమూడు వరసలే! సెకండ్ మరికొంచెం..థర్డ్ క్లాసయితే... సగం పేజీ..   మొదట ఫస్ట్ క్లాస్ కాలమ్ లో వెదుకులాట.-ఆశ ..!


నెంబర్ లేకపోయే సరికి మనకు అంత సీను లేదులే అనుకుని

సెకండ్ క్లాస్ ఆపై థర్డ్ క్లాస్ కాలమ్స్ లో నెంబరు వెదుకులాట..


హమ్మయ్య నెంబరు వుంది అనుకోగానే వేయి ఏనుగుల బలం.. కొండంత ఆనందం.. పాస్ అయిన హాల్ టిక్కెట్ నెంబరు వున్న పేపరు భద్రంగా దాచుకోవడం.


ఆ తర్వాత, నా ముందు నెంబరు, తర్వాత నెంబరు వుందో లేదో చూడటం.. అదో ఆనందం..


ఇక అక్కడ నుంచి ఎవరెవరు పాసయ్యారు.. ఏ క్లాసులో పాసయ్యారు..

 

గోల గోల.. రిజల్ట్ చూడటానికి రానివాళ్ల ఇంటికి అంతా గుంపుగా వెళ్లి ఆనందం పంచుకోవడం..


ఫెయిల్ అయిన వాళ్ల ఇళ్లకు ఓదార్పు యాత్ర.


ఇక అక్కడ నుంచి మాస్టార్ల ఇళ్లకు వెళ్లి రిజల్ట్స్ చెప్పుకోవడం.. వాళ్లతో ఆనందం పంచుకోవడం..


ఈలోగా ఇంటి దగ్గర అమ్మ నాన్న, అన్న తమ్ముడు అంతా వీధిలో మీటింగు మావోడు పాసయ్యాడు అంటే పాసయ్యాడని..


స్వీట్లు..అదే అమ్మచేసిన లడ్డూల  పంపకం..


ఇక ఆ రోజంతా .. ఇంట్లో .. వీధిలో మనమే హీరో..!


కట్ చేస్తే..!


ఇప్పుడు..!

ఆ ఆనందం.. గర్వం.. సంతృప్తి.. ఏవీ..?? 


ఇప్పడు ....పరీక్ష పాసైన పిల్లల్లో అవేవీ కనిపించడం లేదు.. ప్రతి ఇంట్లోనూ పాసయినా... ఏడుపే!


అంతా నిర్లిప్తత..

పాసయ్యామా అని కాదు.. ఎన్ని మార్క్లులొచ్చాయ్.. ఇదీ ప్రశ్న


ఎన్ని మార్కులొచ్చినా.. ఇంకా వస్తే బావుండేది.. సంతృప్తి ఎక్కడా..?


ప్చ్..!


చిన్న చిన్న ఆనందాలకు పిల్లలు దూరం అవుతున్నారు..

కాదు మనం కూడా దూరం చేస్తున్నాం.


చదివే యంత్రాలవుతున్నారు..

ర్యాంకులను ఇచ్చే ప్రింటర్లు అవుతున్నారు..


విద్యార్థులు మాయం అవుతున్నారు..


మిషన్లులా మిగులుతున్నారు..  


ఈనాటి పరిస్థితులు తప్పక  మారాలి..!


ఒకసారి కాలం వెనక్కి వెళిపోతే ఎంత బాగుణ్ణు . చిన్న అత్యాశ 😍😍😍

🔥స్థైర్యమే నీదైతే - గెలుపు తీరం నీదే

 *🔥స్థైర్యమే నీదైతే - గెలుపు తీరం నీదే🌹*


   జీవితంలో వచ్చే ప్రతి *సమస్యని* ఒక *ఆటగా* తీసుకుని పరిష్కరించుకోవాలి ఆటలో *గెలిస్తే* ఆనందం వస్తుంది *ఓడితే* అనుభవం వస్తుంది గెలుపు *గర్వానికి* పునాది వేస్తే ఓటమి *తెలివికి* పునాది వేస్తుంది, 


        ప్రతి మనిషిలో *మంచి చెడు* రెండూ ఉంటాయి మనలో *మంచిని* చూసిన వాళ్ళు మనకు *ఆప్తులు* అవుతారు *చెడును* చూసిన వాళ్ళు *శత్రువులు* అవుతారు రెండింటిని *సమానంగా* చూసిన వాళ్ళు మనల్ని *ప్రేమించిన* వాళ్ళు అవుతారు, *గుర్తుకు* రావడం గొప్ప కాదు *మరవకపోవడం* గొప్ప ఎందుకంటే *గుర్తుకు* రావడం *మెదడు* చేసే పని. గుర్తుంచుకోవడం *హృదయం* చేసే *పని* మనం ఉండాల్సింది ఎదుటి వాళ్ళ *మెదడులో* కాదు ఉండాల్సింది వాళ్ళ *హృదయంలో*.


     నీ *గమ్యం* చేరే దారిలో *ఈర్ష్య* పడే కళ్లుంటాయి, *ఎత్తి* చూపేవేళ్లుంటాయి *వ్యంగంగా* మాట్లాడే వాళ్లు ఉంటారు *బెదిరావో* నీ గమ్యం చేరలేవు *సాగిపో* నిరంతరంగా పరిస్థితులు ఎప్పుడూ *స్థిరం* కాదు *కష్టం* ఎప్పుడు *వృధా* పోదు ఎవరన్నా మనకు *దూరంగా* ఉండాలి అనుకుంటే వాళ్ళని *దూరంగానే* ఉండనివ్వండి ఎందుకంటే *మనం* వాళ్ళకి దగ్గర *అవ్వాలి* అని *ప్రయత్నించే* కొద్ది వాళ్ళు మనల్ని ఇంకా *దూరం* చేస్తారు.


*రాసిన అక్షరం తప్పయితే సరిదిద్దుకోవచ్చు కానీ,  జీవితంలో తప్పు చేస్తే సరిదిద్దుకోవటం చాలా కష్టం.*

         *అందుకే జీవితంలో వేసే ప్రతి అడుగును ఆలోచించి వేయాలి.*


         

నయా మనిషి


నయా మనిషి


ఎయిర్‌ ఇండియా విమానం లాస్‌ ఏంజెలెస్‌ నుంచి బయల్దేరి 10 గంటలైంది. ఫ్లైట్‌లో వరుణ్ చాలా టెన్షన్‌గా ఉన్నాడు. హైదరాబాద్‌ చేరుకోడానికి మరో పన్నెండు గంటలు పట్టొచ్చు. మాటిమాటికీ వాచీ చూసుకుంటున్నాడు. ఫోన్‌ చెక్‌ చేసుకుంటున్నాడు.


‘ఏమండీ, ఆర్యన్‌కి యాక్సిడెంట్‌ అయింది. తలకు దెబ్బ తగిలింది, రక్తం చాలా పోయింది’ అంటూ భార్య అపర్ణ ఫోన్‌లో ఏడుస్తూ చెప్పిన దగ్గర్నుంచి విశ్వనాథ్‌ బుర్ర పని చేయడం మానేసింది. ఫ్లైట్‌ ఎక్కే వరకూ తానేం చేస్తున్నాడో తనకే తెలీదు. ఓ పెద్ద కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న వరుణ్ కి ఆర్యన్‌ ఒక్కగానొక్క సంతానం. బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈమధ్యే క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగం కూడా వచ్చింది. వారం కిందట తాను అమెరికా బయల్దేరినప్పుడు నవ్వుతూ వీడ్కోలు చెప్పాడు. ఆస్పత్రిలో అపర్ణ ఒక్కత్తే ఉండి ఉంటుంది, ఆమెకు సాయంగా ఎవరైనా ఉంటే బాగుణ్ణు... ఈ మాట ఎన్నిసార్లు అనుకున్నాడో లెక్కలేదు. నిజానికి వరుణ్ ఎవరూ లేని వాడు కాదు... అందర్నీ దూరం చేసుకున్నవాడు.

చిన్నప్పట్నుంచీ వరుణ్ లెక్కల మనిషి. తండ్రి నరేంద్ర కి కొడుక్కి పూర్తి విరుద్ధమైన పద్ధతి. కలో గంజో అయినా నలుగురితో కలిసి పంచుకోవాలనేది ఆయన తత్వం. కష్టాల్లో ఉన్నవారికి మాట సాయమే కాకుండా, అవసరమైతే పదో పరకో ఇచ్చి పంపించేవాడు. వరుణ్ కి తండ్రి నైజం అస్సలు నచ్చేది కాదు. పదో క్లాసు పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్‌ కోసం వంద కిలోమీటర్ల దూరంలో ఉండే పట్టణానికి బయల్దేరాడు. ‘నీ తమ్ముడి- చెల్లెలి బాగోగులు కూడా నేను చూసుకోవాలి, పక్క ఊళ్ళో ఉన్న కాలేజీలో చేరు’ అని తండ్రి చెబితే కుదరదని మొండికేశాడు. మంచి కాలేజీలో చేరితేనే చదువులు బాగుంటాయనీ మంచి ఉద్యోగం వస్తుందనీ తండ్రితో వాదించాడు. ‘ఊరందరికీ పంచి పెడుతున్నావు కదా... నాకు పెట్టడానికి డబ్బు లేదా?’ పదో తరగతి పాసైన కొడుకు నుంచి వచ్చిన ఈ ప్రశ్నకు ఆ తండ్రి దగ్గర సమాధానం లేకుండా పోయింది. తన స్థోమతకు మించినదే అయినా చివరకు నరేంద్ర వరుణ్ ని చదవడానికి పట్టణానికి పంపించాడు. ‘నువ్వు మంచి ఉద్యోగం చేసి, చెల్లినీ తమ్ముణ్ణీ బాగా చూసుకోవాలి’... పట్నం బస్సు ఎక్కించినప్పుడు తండ్రి అన్న మాటల్ని వరుణ్ విననట్లే నటించాడు.

ఇంటర్మీడియట్‌, ఆ తర్వాత ఇంజినీరింగ్‌ కూడా పట్నంలోనే చదివాడు. ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తన క్లాస్‌మేట్‌ అపర్ణను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆ అమ్మాయి బాగా ఆస్తిపరురాలు కావడం, తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడం వల్ల ప్రేమ అనే పదాన్ని ఇన్వెస్ట్‌ చేసి, రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోయాడు.

చదువుకున్నన్నాళ్ళూ ప్రతీ నెలా డబ్బుల కోసం తండ్రి వెంట పడిన వరుణ్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంటి ముఖం చూడటం మానేశాడు. తన పెళ్ళి నిశ్చయమైపోయిన తర్వాత తప్పదన్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు కూడా ఏదో బంధువుల పెళ్ళికి వెళ్ళినట్లే వెళ్ళి వచ్చేశారు. వరుణ్ చదువు కోసం ఉన్న రెండెకరాలూ అమ్ముకున్న నరేంద్ర తన చిన్న కొడుకు క్రితిక్ ను డిగ్రీ మాత్రమే చదివించగలిగాడు. ఊళ్ళో జూట్‌ మిల్లులో క్లర్క్‌గా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు క్రితిక్. ఇక ఒక్కగానొక్క చెల్లి పెళ్ళి విషయంలో కూడా వరుణ్ పెద్దగా జోక్యం చేసుకోలేదు. నామమాత్రానికి నాలుగు డబ్బులిచ్చి, అంతకంటే ఇవ్వలేనని తేల్చి చెప్పేశాడు.

అత్తింటి బంధువుల దగ్గరకు వెళ్దామని అపర్ణ అడిగినా, వరుణ్ పట్టించుకునేవాడు కాదు. తను పనిచేసే కంపెనీలో కూడా స్వార్థపరుడనే ముద్ర పడిపోయింది. తను ఎదగడం కోసం అందర్నీ నిచ్చెనలా వాడుకున్నాడు. ఇతరుల కష్టాన్ని కూడా తన ఖాతాలో వేసుకుని ప్రమోషన్లు సాధించుకున్నాడు. మేనేజర్‌ స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతన్ని గౌరవించినా, ఏ ఒక్కరికీ వరుణ్ మీద మంచి అభిప్రాయం లేదు.

తన స్వార్థానికి వరుణ్ పెట్టుకున్న పేరు లౌక్యం. తనలాగా లౌక్యం లేకే తండ్రి పేదరికంలో మిగిలిపోయాడని భార్యతో చెబుతూ ఉంటాడు. తనకంటే అర్హులున్నా తనకు ప్రమోషన్లు తొందరగా రావడానికి తన లౌక్యమే కారణమని వాదిస్తాడు.

ఒక్కగానొక్క కొడుకు ఆర్యన్‌ అంటే వరుణ్ కి ప్రాణం. వాడు అడిగినవన్నీ కాదూ లేదూ అనకుండా కొనిచ్చాడు. బీటెక్‌లో జాయినయ్యాక ఆర్యన్‌ నెలకోసారి టూరిజం అంటూ ఊళ్ళు తిరగడానికి వెళ్ళేవాడు. వరుణ్ కూడా కొడుకు అడిగినంత డబ్బు ఇచ్చి మరీ పంపించేవాడు. తను చిన్నతనంలో గడిపిన పేద జీవితం తన కొడుకు దరిదాపుల్లోకి కూడా రాకూడదనుకునేవాడు. అలాంటిది ఈ రోజు వాడు చావు బతుకుల్లో ఆస్పత్రిలో పడి ఉన్నాడు.

కొడుకు యాక్సిడెంట్‌ వార్త తెలియగానే తనే పరుగున రావాల్సి వచ్చింది. తనకు సాయం చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రారని తెలుసు. తనకు కరోనా వచ్చి, ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా తన స్టాఫ్‌ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా తన భార్యా, కొడుకూ ఒంటరిగానే ఉండి ఉంటారు. భార్యను తలుచుకుంటే అతనికి బాధేసింది.

ఫ్లైట్‌ దిగి, క్యాబ్‌లో సరాసరి ఆస్పత్రికి బయల్దేరాడు. భార్య నుంచి ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. టెన్షన్‌గా మెసేజ్‌ బాక్స్‌ ఓపెన్‌ చేసి చూశాడు. ‘ఆర్యన్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది. కంగారుపడకండి’ అని ఉంది. ‘థ్యాంక్‌ గాడ్‌’ అని ఊపిరి పీల్చుకున్నాడు. క్యాబ్‌ దిగి పరుగు పరుగున ఎమర్జెన్సీ వార్డుకు చేరుకున్నాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు.

తన తండ్రీ, తల్లీ, తమ్ముడూ, మరదలూ, చెల్లీ, బావా, వాళ్ళ పిల్లలూ... అందరూ ఉన్నారు. ఆర్యన్‌ స్నేహితులు కూడా ఓ పది మంది ఉన్నారు. భర్తను చూడగానే అపర్ణ పరుగున వచ్చి భర్తను పట్టుకుని బావురుమంది.

‘‘ఓ పెద్దావిడ రోడ్డు దాటుతూ ఎదురుగా వస్తున్న లారీని చూసుకోలేదు. ఆర్యన్‌ కాపాడటానికి ప్రయత్నించడంతో లారీ వీడిని ఢీకొట్టింది. అదిగో ఆ బామ్మగారినే మనవాడు కాపాడాడు. పక్కనున్నది వాళ్ళబ్బాయీ, కోడలు. నిన్నట్నుంచీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు’’ కాసేపయ్యాక చెప్పింది.

ముప్పయ్యేళ్ళ కిందట తాను తప్పించుకుని పారిపోయిన కుటుంబం తన కొడుకు కోసం వచ్చింది. ఆ గిల్టీ ఫీలింగ్‌తో వాళ్ళ ముఖాల్లోకి కూడా చూడలేకపోతున్నాడు. ఈలోగా నర్స్‌ వరుణ్ దగ్గరకు వచ్చింది. ‘‘సార్‌, మీ అబ్బాయికి బాగానే ఉంది కదా... అతని ఫ్రెండ్స్‌కి ఈ విషయం చెప్పండి. నిన్నట్నుంచీ వాళ్ళంతా ఆస్పత్రిలోనే ఉన్నారు. మిగిలిన రోగులకు ఇబ్బంది అవుతోంది’’ అందామె.

‘‘ఆంటీ, మేం వెళ్తాం. ఏదైనా అవసరం ఉంటే కాల్‌ చేయండి’’ అంటూ ఆ పది మందీ కదిలారు.

‘‘నువ్వు ఒంటరిగా ఉన్నావని భయపడ్డాను. కానీ ఇక్కడ నీకు తోడుగా ఇంతమంది ఉన్నారంటే నమ్మలేకపోతున్నా’’ మర్నాడు ఆస్పత్రిలో భార్యతో చెప్పాడు వరుణ్.

‘‘వాళ్ళంతా వాడి ప్రపంచం. మీ దృష్టిలో ‘మన’ అంటే... మనం ముగ్గురమే. కానీ ఆర్యన్‌ దృష్టిలో ‘మన’ అంటే... బంధువులూ స్నేహితులూ అందరూ. చివరకు ప్రాణాపాయంలో ఉన్న ఓ బామ్మగారు కూడా వాడి జీవితంలో భాగమే’’ కన్నీళ్ళు తుడుచుకుంటూ చెబుతోంది అపర్ణ.

‘‘వాడికి మనిషంటే ఇష్టం. పదిమందితో కలిసి ఉండటమంటే ఇష్టం. ఉన్నదాన్ని నలుగురికీ పంచడమంటే ఇష్టం. వాడు టూర్‌ అంటూ ప్రతీ నెలా ఎక్కడకు వెళ్తాడో తెలుసా... మీ నాన్నగారింటికి. ఆయన ఒళ్ళో పడుకుని నాన్నమ్మ చేతి గోరు ముద్దలు తినడానికి వాడు అక్కడకు వెళ్తాడు. మీ తమ్ముడి ఇద్దరు పిల్లల చదువుల గురించి ఆలోచిస్తాడు. ఫీజులు కడతాడు. పండక్కి బట్టలు తీసుకువెళ్తాడు. మీ చెల్లి ఇంటికి వెళ్తుంటాడు. మేనత్తకు కొండంత ప్రేమను పంచుతాడు. ప్రతీ నెలా వాడి అకౌంట్లో వేసే పాకెట్‌ మనీ, వాడి పేరు మీదున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ... ఇవన్నీ వాళ్ళ కోసం ఖర్చు చేస్తాడు. తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ ఊళ్ళో రెండెకరాల పొలం కొనిస్తానని మీ నాన్నకు మాటిచ్చాడట. పెద్ద కొడుకుగా మీరు చేయాల్సినవన్నీ ఆ ఇంటికి పెద్ద మనవడిగా వీడు చేస్తున్నాడు. మీ వాళ్ళ ప్రసక్తి తీసుకురావడం మీకు ఇష్టం ఉండదు, అందుకే మీ ఊరికి వెళ్తున్న విషయం వాడు మీకెప్పుడూ చెప్పలేదు.’’

‘‘కాలేజీలో కూడా ఆర్యన్‌ అందరి వాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తను ముందుకొస్తాడు. చేతనైన సాయం చేస్తాడు. వాడికి యాక్సిడెంట్‌ అయిందని తెలిసిన తర్వాత, ఆస్పత్రి అంతా వాడి ఫ్రెండ్స్‌తో నిండిపోయింది. వాళ్ళను కంట్రోల్‌ చేయడానికి స్టాఫ్‌ చాలా ఇబ్బంది పడ్డారు.’’

‘‘మొన్న సంక్రాంతికి ఓ నలుగురు ఫ్రెండ్స్‌ని తీసుకుని మీ ఊరెళ్ళాడు. వాడి రాక మీ వాళ్ళందరికీ పెద్ద పండగయింది. వాడి ఫోన్‌లో ఫొటోలు చూశాను. ఆ ఫొటోల్లో ఉన్న వాళ్ళకి మనంత డబ్బు లేకపోవచ్చు. కానీ ఆర్యన్‌ అంటే ఎంతో అభిమానం. ప్రాణమిచ్చేంత ప్రేమ. మన పెళ్ళయిన తర్వాత మీ వాళ్ళెవరూ మన ఇంటికి రాలేదు. వీడికి యాక్సిడెంట్‌ అయిన విషయం తెలిసిన వెంటనే పరుగు పరుగున వచ్చారు. వాళ్ళంతా ఇక్కడ లేకపోతే, ఆ టైమ్‌లో నేనేమైపోయేదానినో నాకే తెలీదు.’’

‘‘ ‘నాలా సక్సెస్‌ఫుల్‌ కావాలి, నా అంత స్థాయికి చేరాలి’ అని... మీరెప్పుడూ వాడితో అంటూ ఉంటారు. కానీ మీ గెలుపుని మీరు తప్ప వేరెవ్వరూ ఆనందించలేదు. విజయశిఖరంపైన మీరొక్కరే ఉండాలనుకుంటారు మీరు. అందరూ గెలవాలనీ, అందరితోనూ గెలుపును పంచుకోవాలనీ అనుకుంటాడు వాడు. ఇద్దరికీ ఉన్న తేడా అదే’’ చాలా రోజులుగా తన కడుపులో దాచుకున్న బాధను వెళ్ళగక్కిందామె.

‘‘వాడికి క్యాంపస్‌లో ఉద్యోగం వస్తే, మీ వాళ్ళంతా వాళ్ళకే ఉద్యోగం వచ్చినంత సంబరపడ్డారు. వాడికి ఉద్యోగం రావాలని మీ నాన్న వేంకటేశ్వరస్వామికి మొక్కుకున్నారట. ఆర్యన్‌ అందర్నీ తిరుపతికి తీసుకువెళ్తానన్నాడట. రిజర్వేషన్‌ కూడా చేయించాడట.’’

‘‘మీరెప్పుడూ అంటూ ఉంటారు... బతకడానికి లౌక్యం కావాలి అని. కానీ ‘నా’ అనుకునే నలుగురు మనుషులు ఉంటే చాలు, హాయిగా బతికేయవచ్చు- అని వాడు అనుకుంటాడు. వాడు బొత్తిగా లౌక్యం తెలియని మనిషి’’ కన్నీళ్ళు తుడుచుకుంటూ అందామె. ఆ చివరి వాక్యంలో వ్యంగ్యం వరుణ్ కి అర్థం అయింది.

భార్య మాటలన్నీ వింటూ తల దించుకుని మౌనంగా కూర్చున్నాడు. తాను ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాననుకున్నాడు కానీ, ఎవరికీ అక్కర్లేనంత ఎత్తుకు ఎదిగాడనే విషయం ఇప్పుడే బోధపడుతోంది. అతనిలో జరుగుతున్న అంతర్మథనం అపర్ణకు అర్థమైంది.

ఎమర్జెన్సీ వార్డు ముందు కూర్చున్న తండ్రి దగ్గరకు వెళ్ళాడు వరుణ్. పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని ముడతలు పడ్డ తండ్రి చేతుల్ని పట్టుకున్నాడు. ‘‘ఆర్యన్‌కి బాగైన తర్వాత అందరం కలిసి తిరుపతి వెళ్దాం నాన్నా’’ అన్నాడు. ఆ మాట అంటున్నప్పుడు వరుణ్ కు కన్నీరు ఆగలేదు. తండ్రి భుజం మీద తల ఉంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు- తను చేసిన తప్పులన్నీ ఆ కన్నీటిలో కరిగిపోయేలా..........


అందుకే నయా మనుషులందరికీ చెప్పేదొక్కటే మన అంటూ మనకు దగ్గరగా ఉండాలి లేకుంటే ఎంత సంపాదించినా వ్యర్థమే.


వైద్యుల వెతలు

 వైద్యుల వెతలు

‘ఎప్పుడూ చదువేనా?’ అనిపించి కాసేపలా బయటపడి సాయంకాలాల్లో సాగరకన్యతో సరసాలాడ్డానికి హాస్టల్ గదులు తెరుచుకునేవి. ఇద్దరుంటే మూడోవాడిని అవాయిడ్ చేసే ‘బాయిడ్’గాళ్లు చెప్పాపెట్టకుండా చెట్టపట్టాలేసుకుని జిల్లాపరిషత్ బజ్జీల బండి దగ్గరకెళిపోయేవారు. 


అట్నించి రాగానే వాళ్లిద్దరూ మాయాబజార్లో శర్మా శాస్త్రుల్లా వంకాయ బజ్జీ రుచిని వర్ణిస్తోంటే మాకు నోట్లోంచీ, కళ్లలోంచీ నీళ్లు కారిపోయేవి. నన్ను తీసుకెళ్లకుండా పోయిన ఆ ‘కన్నింగ్’హామ్‌గాళ్ల మీద కోపం మిర్చి బజ్జీలో కంటే ఎక్కువగా మండిపోయేది. వంకాయని చీరేసినట్టు నిలువునా చీరెయ్యాలనిపించేది. 


ఈలోగా నాలుగో నెంబరున్న ఎదుటిగది ‘గుడ్‌’మన్ గిల్‌మన్ ఒకడు వేడివేడి న్యూస్‌పేపర్ శంఖమొకటి నా చేతిలో పెట్టేవాడు. దాన్నిండా నోరు కాలేన్ని పకోడీలు, మనసు నిండిపోయేంత ప్రేమా ఉండేవి.


‘తిను వరుణ్, నాకూ ఉన్నాయిలే!’ అన్న మాటకి తినకుండానే కడుపు నిండిపోయేది. వేణువూదే అలవాటున్న ఆ సీనియరన్నయ్య ఇలాగే పాటతోను, మాటతోను మమ్మల్ని కట్టిపడేసేవాడు. 


అప్పుడప్పుడు చదువుతున్న గైటన్ మూసి టైటన్ వాచీలమ్మే నాగరాజ్ & కో మెట్ల దగ్గర ప్రత్యక్షమయ్యేవాళ్లం. మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి సైతం తీరికలేనంత ఉత్సాహం ఆ బండి దగ్గర. కమ్మగా సెనగపిండి వాసన ఆ చుట్టూతా! 


దేవుడి ప్రభల్లా నిలువుగా నిలబడివున్న వెడల్పాటి అరటికాయ చీలికలు చూస్తూ ఉండగానే వస్తాదుల్లా బయటపడి, అలా సెనగపిండిని ఒళ్లంతా పట్టించుకుని సెగలపొగల నూనెలోకి జారుకునేవి. 


వేసేదాకా కంగారు, తీసేదాకా కంగారు. ‘నాకంటే నా’కంటూ ఎగబడి ఎగరేసుకుపోయే బజ్జీలన్నీ ఉక్కపోతల్ని కాసేపలా మరపించేసేవి. ఉప్ఫూ ఉప్ఫూల్ని వినిపించేసేవి.


పదిమందీ కలిసి ఇంకా ఏ బాధ్యతలూ లేని భుజాలమీద చేతులేసుకుని నవ్వుకుంటూ కెజిహెచ్ డౌన్ దిగిపోయేవాళ్లం. 


దిగేకొద్దీ మీదకొచ్చేసేలా కనబడే సముద్రాన్ని చూస్తే కోపం వచ్చినప్పుడు అమ్మలా కనబడేది. ఏం చెయ్యదన్న నమ్మకం... అచ్చం అమ్మలానే! 


ఇంకా ఏ ఒక్కడిలోనూ బట్టతలల జీన్సవీ నిద్రలేవకపోవడాన ఎగురుతున్న జుట్టునలా వెనక్కి నెడుతూ ఎదురుగాలికి ఎదురేగేవాళ్లం. 


గాలిలో చెమ్మ, గుండెల్లో ధీమా సమతుల్యంగా ఉండడాన కబుర్లలో నిజాయితీ వినబడేది. కాలుష్యం అప్పుడప్పుడే నిద్రలేచి ఇంకా తన కోరల్ని కోల్గేట్‌తో క్లీన్ చేసుకుంటూ ఉన్న రోజులవి. 


సెల్సవీ రానందున శరీరంలో కణజాలమంతా స్నేహాలనే సైటోప్లాజాన్నీ, రూమ్మేట్లనే రైబోజోముల్నీ నింపుకుని ఉండేవి. కరెంటు పోతే బల్లల మీద దరువేస్తూ పాటలు పాడే సరదాల మైటోకాండ్రియాలే మాకు నిజమైన ఊపిరి. 


రాతికట్టడాల ఉమన్స్ కాలేజీ ముందునుంచి వెళుతూ రాతిగుండె అమ్మాయిల్ని దొంగచాటుగా చూడడం, తీరని సరదాలతో గుండె రాయిచేసుకు బతకడం కూడా అప్పుడే అలవాటయ్యాయి.


రామకృష్ణ మిషన్‌లో వివేకానందుడి పుస్తకాలు కొని చదివేసి, మర్నాటినుంచీ తెల్లారే నాలుక్కల్లా లేచేసి, కసరత్తులు చేసెయ్యాలని కఠోరమైన నిర్ణయం తీసేసుకునేవాణ్ణి. తీరా ఏడింటికి మావాడు లేపగా లేపగా స్నానమైనా చెయ్యకుండా పెసరత్తులు తిని కాలేజీకి బయల్దేరేవాణ్ణి. 


ఆ పరమహంస పటాన్ని చూసిన ప్రతిసారీ ఆయన మమ్మల్ని చూసే నవ్వుతున్నాడని అనిపించేది. కాళీమాత ఆలయంలో ఖాళీజాగా దొరికితే ప్రసాదం తింటూ ఎదురుగా కెరటాల్ని చూడటం ఒక దివ్యదర్శనం. 


ఒడ్డుని కోసేస్తున్న సముద్రం మమ్మల్ని మాత్రం ఏమీ అనేదికాదు. నాచుపట్టిన రాళ్లన్నీ మా పాదాల తాకిడికోసం ఎదురుచూస్తాయనిపించేది. అక్కడ చేరి చెప్పుకునే డిస్సెక్షన్ హాలు కబుర్లు, ఫిజియాలజీ లాబుల్లో ఎగిరిపడిన కప్పల తిప్పలు మాతోపాటు ఆ రాళ్లూ వినేవనిపిస్తుంది. ఎంతసేపూ చిప్పమొహాలన్నీ చేరి ‘నీకళ్లు ఆల్చిప్పల’నీ, ‘నీ పెదాలు దొండపళ్ల’నీ పొద్దుపోయేదాకా చెప్పుకునే అబద్ధాలు వినీవినీ విసుగెత్తి బండరాళ్లైపోయి ఉంటాయి. 


మళ్ళీ ఆ అసత్యాల నీడల జాడల్లోంచి వెలుగులోపడి, ఈ రాళ్లమీంచే దూకేసిన ఎన్నో అబల హృదయాల్ని చూసిన అలసట కూడా అయివుండాలి. 


సముద్రం చాలా కథలు చెప్తుంది. అలా నోరెట్టుకు పడిపోతుందిగానీ ఆ అలల గలగలల్ని ఎవరైనా డీకోడ్ చేస్తే ఎన్నో రహస్యాలు, ప్రమాణాలు, శుష్క వాగ్దానాలు, ఒప్పించడాలు, ఆనక నొప్పించడాలు... ఇవన్నీ బయటపెడుతుందనిపిస్తుంది.


చీకటడ్డాక రూములకి బయలుదేరే మెడి‘కోలకళ్ల’ చిన్నోళ్లంతా చెదిరిన క్రాపుల్నీ, ఇసకంటిన చొక్కాలనీ సర్దుకుంటూ దులుపుకుంటూ పిడతకింద పప్పు తింటూ కెజిహెచ్ అప్పెక్కేవారు. ఆయాసాలు, నీరసాలూ అంటని గుండెలవి. ఉద్వేగంతో ‘లవ్’ అనే తప్ప ‘డబ్బ’ని కొట్టుకోవడం ఎరగని గుండెలే అవింకా! 


ఏదైనా మా విశాఖ సాగరతీరం రూపు మార్చుకుంది. రాతికట్టడాలన్నీ కనుమరుగయ్యేలా ఐబాకోలు, ఐనాక్సులూ వచ్చి చేరాయి. పల్లీలు పంచుకున్న షేక్‌హాండ్ల స్నేహాలన్నీ థిక్ షేక్ ఫ్యాక్టరీల్లో మగ్గులు మగ్గులుగా కొవ్వెక్కిన బంధాలైపోతున్నాయి.


అన్నమయ్య విగ్రహం ఎదుట కచేరీలన్నీ ఆరింటికి సీరియళ్లుగా అనాధ్యాత్మికాలైపోయాయి. 


పొడవాటి తీరమంతా కుర్కురే కవర్లతో కర్కశంగా కనబడుతోంది. 


నన్ను దూరంనుంచి చూడండి. మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటానంటుంది బంగారమంటి బంగాళాఖాతం. కానీ అమ్మాయిల్నీ, అవనినీ అంగుళాల్లో కొలిచే మానవ నైజం ఇసకలోనూ ఇటుకల్ని పాతేస్తోంది. సముద్రానికి వీధరుగు లేకుండా చేసేస్తోంది. తన గోడంతా ఏ గోడకేసి తలబాదుకుని చెప్పాలో తెలియక రోదిస్తోంది. 


మా మెడికోలంతా ఇప్పుడు గుండెల్నీ, మెదళ్లనీ చీల్చేంత పెద్ద సర్జన్లైపోయారు. వారెవరికీ ఈ అనుభూతులు మరపురావు. అయితే నాలాంటి చాదస్తంగాడెవడో ఫోర్‌సెప్స్‌తో కెలకాలి. అప్పుడు ఫిజియాలజీ కప్పల్లా ఒకడొకడూ ఎగిరెగిరి బోలెడన్ని కబుర్లు చెబుతాడు. 


ఎంచేతంటే.. అవన్నీ సముద్రపు ఉప్పూ, బజ్జీల కారం శరీరాలే కాబట్టి!


☑️తెలుసుకుందాం✅

*☑️తెలుసుకుందాం✅*


*💅🏻టాటూస్‌ శరీరంపై వేసుకుంటే ఏ హానీ జరగదా❓🤔*


*💁🏻‍♂️జవాబు:* సహజ రూపమైన శరీరంమీద శాశ్వత ప్రాతిపదికన ఏ పచ్చ పొడిపించుకున్న, ఎలాంటి టాటూస్‌ వేయించుకున్నా ఎంతో కొంత ప్రమాదం ఉండకమానదు. అందుకే పెద్దలు అడుసు తొక్కనేల, కాలు కడుగనేల అన్నారు. కాసేపు పూసుకుని సాయంత్రానికో, మధ్యాహ్నానికో స్నానం చేస్తే శుభ్రమయ్యే విధంగా ఉన్న ప్రమాద రహిత వర్ణాల్ని చర్మం మీద ఎవరికి తోచిన విధంగా వారు బొమ్మల్ని గీయించుకొంటే పెద్దగా ప్రమాదం లేదు. కానీ టాటూస్‌ అలా కాదు. శాశ్వత ప్రాతిపదికన పచ్చబొట్టులాగా కొన్ని రంగుల్ని బొమ్మలుగా సూదుల సాయంతో చర్మంలోకి నింపుతారు. ఈ రంగు ద్రవ్యాలు చాలా మట్టుకు క్యాన్సర్‌ కారక ద్రవ్యాలు. కాబట్టి అక్కడ చర్మ క్యాన్సరు వచ్చే దురవకాశాలు లేకపోలేదు.


చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే వృక్ష సంబంధ కారకాలు ప్రమాద రహితమైనవనీ కేవలం కర్మాగారాల్లో తయారై కృత్రిమ, రసాయనాలు ప్రమాదకరమనీ అంటుంటారు. ఆపేరుతో విచ్చలవిడిగా ఈ మధ్య వృక్షోత్పత్తి (herbel products) మందులంటూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. వృక్షాల నుంచి తీసినా, కృత్రిమంగా చేసినా బెంజీన్‌ బెంజీనే. రసాయనిక పదార్థాల ధర్మాలు వాటి మాతృకను బట్టి మారవు. చాలా వృక్షసంబంధ రసాయనాలు కూడా ప్రమాదకరంగా ఉంటాయి.

జీవిత సత్యాలు

 🔥 జీవిత సత్యాలు 🔥


> ప్రజలు వ్యక్తిని కాకుండా డబ్బును గౌరవిస్తారు.

> పేదవాడికి స్నేహితులు తక్కువ.

> వ్యక్తుల ఆలోచనలను కాకుండా మంచి రూపాన్ని ఇష్టపడతారు.

>  మనతో అవసరం ఉన్నంత వరకే ఆత్మీయులుగా ప్రవర్తిస్తారు.

> నిజం చాలా సులభం కానీ దానిని వివరించడానికి ప్రయత్నించిన క్షణం కష్టంగా మారుతుంది.

> ఆకలి, అవసరం, వ్యసనం మనిషిని ఎంతకైనా తెగించేల ప్రేరేపిస్తాయి.

> కాలానికీ, కర్మకూ జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి, చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు.

> సంతోషంగా ఉన్నప్పుడు సంగీతాన్ని ఆస్వాదిస్తారు, కానీ  విచారంగా ఉన్నప్పుడు సాహిత్యాన్ని అర్థం చేసుకుంటారు.

> ఏ కారణం లేకుండా ఎవ్వరూ కోపంగా, కఠినంగా మారిపోరు.

> కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు కొన్ని అనుభవాలు అన్నీ కలిసి మనసును, మనిషిని కఠినంగా మారుస్తాయి.

> జీవితంలో రెండు విషయాలు: ఏమీ లేనప్పుడు  "సహనాన్ని" మరియు అన్నీ ఉన్నప్పుడు "వైఖరిని" నిర్వచిస్తాయి.

> మనం ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మనల్ని ఎక్కువగా బాధపెడతారు.


🌺🌹🌺   🔥🔥🔥   🌺🌹🌺

Tuesday, April 19, 2022

How_to_Maintain_Good_ Health

 How_to_Maintain_Good_ Health :


*ఈ రోజుల్లో ఆరోగ్యంగా జీవించడం అన్నది ఓ పెద్ద సవాల్. ఎన్నో అంశాలు మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తున్నాయి. అందువల్ల ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చెయ్యాలో తెలుసుకుందాం*


మన చుట్టూ పొల్యూషన్. తినే ఆహారంలో కల్తీ. తాగే నీటిలో క్రిములు. సాయంత్రం కాగానే దోమలు, బయటకు వెళ్తే చెడు వాసనలు వీటికి తోడు రకరకాల రోగాలు మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో మన లైఫ్ స్టైల్, మనం జీవించే విధానం, చేస్తున్న ఉద్యోగాలు అన్నీ మన ఆరోగ్యంపై చెడు ప్రభావమే చూపిస్తున్నాయి. అందువల్ల ఈ రోజుల్లో ఆరోగ్యంగా జీవించడం అన్నది ఓ సవాలవుతోంది. చాలా మందికి పాతికేళ్లకే అడ్డమైన వ్యాధులు వచ్చేస్తున్నాయి. 40 ఏళ్లకే ముసలి తనపు లక్షణాలు కనిపిస్తున్నాయి. 60 ఏళ్లు జీవించడమే కష్టమవుతోంది. కానీ... కొంతమంది మాత్రం ఈ రోజుల్లోనూ ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వందేళ్లకు పైగా ఎలాంటి రోగాలూ లేకుండా బతుకుతున్నారు. అలాంటి వాళ్ల ఆరోగ్య రహస్యాల్ని పరిశోధకులు తెలుసుకున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం. ఫాలో అయిపోదాం.


*మంచి ఆరోగ్యానికి 12 సూత్రాలు :*


*1.-జంక్ ఫుడ్‌కి చెక్ :* ఇది చాలా మందికి నచ్చని టిప్. ఎందుకంటే... ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్ల వంటివి తినడం కామనైపోతోంది. ఇంట్లో వండుకునే వీలు లేక చాలా మంది ఇలాంటి ఫుడ్‌కి అలవాటుపడిపోతున్నారు. బట్... ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. జంక్ ఫుడ్ బదులు... పండ్లు, కేరట్ల వంటి కూరగాయలు, వేరు శనగ లాంటి పప్పులు తింటే ఎంతో మంచిది.


*2.-వ్యాయామం మస్ట్ :*

 టైముకి తినడం, టైముకి పడుకోవడం ఎంత ముఖ్యమో... బాడీని ఫిట్‌గా ఉంచుకోవడమూ అంతే ముఖ్యం. ఎక్సర్‌సైజ్ చేస్తే... శరీరంలో వృథాగా ఉన్న కొవ్వు కరుగుతుంది. బాడీలో వివిధ పార్టులు ఎంత సైజులో ఉండాలో అంత సైజుకి వచ్చేస్తాయి. అదే ఎక్సర్‌సైజ్ చెయ్యకపోతే... కొన్ని శరీర భాగాలు కొవ్వు పేరుకొని అదనంగా పెరిగి... అనారోగ్యాలకు కారణమవుతాయి. నడక, పరుగు, స్విమ్మింగ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ స్ట్రెస్ పోగొట్టి ఫిట్ నెస్ పెంచుతాయి.


*3.-సరిపడా నిద్ర :* మనందరం బాగా కష్టపడతాం. కానీ సరిగా నిద్రపోం. నిజానికి రాత్రి 8 గంటలకే పడుకొని... ఉదయం 4 గంటలకు లేవడం సరైన పద్ధతి. కానీ... ఈ రోజుల్లో చాలా మంది రాత్రి 12కి పడుకొని... తెల్లారి 6 గంటలకల్లా లేచిపోతున్నారు. రోజూ అదే సమయం కాకుండా వేర్వేరు టైమ్స్‌లో పడుకుంటున్నారు. ఇవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రోజుకు కనీసం 7 గంటలు పడుకోవాలి. 8 గంటలు పడుకుంటే ఇంకా బెటర్. నిద్ర సరిగా లేకపోతే బుర్ర హీటెక్కిపోతుంది. మతిమరపు మొదలవుతుంది. ఇర్రిటేషన్ వస్తుంది. బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి, షుగర్ వ్యాధి వస్తుంది. హార్మోన్లు దెబ్బతిని అడ్డమైన రోగాలూ వస్తాయి. అన్నింటికీ చెక్ పెట్టాలంటే చక్కగా నిద్రపోవాలి.


*4.-కాఫీ తాగండి :*

 చాలా మంది కాఫీ తాగడాన్ని ప్రమాదకరంగా భావిస్తారు. ఎందుకంటే అందులో కెఫైన్ ఉంటుంది కాబట్టి. బట్... రోజుకు రెండు కాఫీలు తాగితే ఆరోగ్యానికి చెడు కంటే మేలే ఎక్కువ జరుగుతుందని పరిశోధనలు తేల్చాయి. ప్రధానంగా టైప్ 2 డయాబెటిస్, మతిమరపు, అల్జీమర్స్ వంటి రోగాలకు చెక్ పెట్టాలంటే కాఫీ తాగాలి. బాడీ హైడ్రేటెడ్‌గా ఉండేందుకు కూడా కాఫీ పనిచేస్తుంది.


*.5.-పొగ తాగరాదు :*

ఎంత మంది ఎన్నిసార్లు చెప్పినా... చాలా మంది స్మోకింగ్ మాత్రం వదల్లేరు. కొన్ని రోజులు మానేసినా... మళ్లీ మనసు పీకేస్తోంది అంటూ మొదలుపెట్టేస్తారు. అలాంటి వారు గట్టిగా అనుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో పొగ తాగను అని బలంగా డిసైడవ్వాలి. ఎందుకంటే... స్మోకింగ్ వల్ల అన్నీ నష్టాలే. కాన్సర్ వస్తుంది. ఊపిరి తిత్తులు పాడైపోతాయి. నోట్లో కురుపులు వస్తాయి. ఇలా చెప్పుకుంటే చాలా రోగాలు. దీనిపై డిబేట్ అనవసరం. ఆరోగ్యం కావాలంటే స్మోకింగ్ వదిలేయాల్సిందే.


*.6.-రిఫైన్డ్ ఫుడ్ వద్దు :* కొన్ని ఆహార కంపెనీలు ప్రాసెస్ చేసిన ఫుడ్ అమ్ముతాయి. రిఫైన్డ్ కార్బొహైడ్రేడ్స్ తయారుచేస్తాయి. అలాంటివి తినే బదులు... ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ బాగా ఉండేవి తినాలి. అంటే చేపలు, గుడ్లు తినవచ్చు. శాఖాహారులైతే ఆవకాడో, క్యారెట్లు, పాలకూర వంటివి తినవచ్చు. బెర్రీస్, కమలాలు, దానిమ్మకాయలు అలాంటి పండ్లు తింటే ఆరోగ్యమే ఆరోగ్యం.


*7.-సుగంధ ద్రవ్యాలు వాడాలి :* మన అదృష్టమేంటంటే... మన ఇండియాలో... సుగంధ ద్రవ్యాలు చాలా ఎక్కువ. ఆ స్పైసెస్‌లో మంచి రుచి మాత్రమే కాదు... ఆరోగ్యాన్ని కాపాడే చాలా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. సూక్ష్మక్రిములతో అవి పోరాడతాయి. అందువల్ల మనం వంటల్లో తప్పనిసరిగా పసుపు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆవాలు, ధనియాలు... ఇలాంటివి తప్పనిసరిగా వాడాలి.


*.8.-ఉదయం ఫుల్లుగా తినాలి :*

బాడీకి రాత్రంతా రెస్ట్ ఇస్తాం కాబట్టి... తెల్లారే మన శరీర భాగాలన్నీ ఉత్తేజంతో ఉంటాయి. ఆ టైంలో వాటికి ఆహారం ఇస్తే... అవి బాగా పనిచేస్తాయి. అందువల్ల మార్నింగ్ వేళ లేచిన రెండు, మూడు గంటల్లో బ్రేక్ పాస్ట్ తినాలి. ఫాస్ట్‌గా కాకుండా బాగా నమిలి తినాలి. అలాగే కాస్త ఎక్కువగానే తినాలి. మధ్యా్హ్నం కాస్త తక్కువ తినాలి. రాత్రికి ఇంకా తక్కువ తినాలి. అలాగే... ఆహారంలో ఫ్రూట్స్ ఉండేలా చేసుకోవాలి. ఆహారం తినే ముందు, తర్వాత ఓ గ్లాస్ నీరు తాగడం మర్చిపోవద్దు.


*9.-డ్రై ఫ్రూట్స్ తప్పనిసరి :* డ్రై ఫ్రూట్స్ రేటెక్కువ. వాటిని సంపన్నులే తినగలరు అని చాలా మంది అంటూ ఉంటారు. కావచ్చు గానీ... అందరూ డ్రై ఫ్రూట్స్ తింటూ ఉండాలి. గింజలు, పప్పులు, బద్దల వంటివి తినాలి. బాదం, పిస్తా, జీడిపప్పు వంటివి ఎక్కువ తినకపోయినా... వారానికి మూడుసార్లైనా అలాంటివి కొద్ది మొత్తంలో తినాలి. ఇక వేరుశనగ, బఠాణీలు, శనగలు, బీన్స్, మొక్కజొన్న ఇలాంటివి కాస్త ఎక్కువే తినవచ్చు. ఇవన్నీ మనల్ని ముసలి తనం రాకుండా కాపాడేస్తాయి.


*10.-మంచి కొవ్వు కావాలి :* మన బాడీలో మంచికొవ్వు, చెడ్డ కొవ్వూ రెండూ ఉంటాయి. మంచి ఆహారం తింటే మంచి కొవ్వు తయారవుతుంది. అది మనకు ఎంతో మేలు చేస్తుంది. అదే ఎక్కువగా నూనెలో వేయించిన ఫ్రైల వంటివి తింటే... చెడ్డ కొవ్వు గూడు కడుతుంది. అది చాలా డేంజరస్. దాని వల్ల సర్వ రోగాలూ వస్తాయి. చర్మం పాడవుతుంది. జుట్టు రాలిపోతుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది. షుగర్, బీపీ, హార్ట్ ఎటాక్ ఇలా ఎన్నో రోగాలు వస్తాయి. అందుకే... మనం మంచి ఆహారం తినాలి. ఎక్కువగా ఉడికించినవి తినాలి.


*11.-అతిగా పని చెయ్యవద్దు :*

కొంతమంది పని రాక్షసుల్లా పనిచేస్తారు. పని తప్ప మరో లోకం వాళ్లకు తెలియదు. అలా ఉండకూడదు. పని టైంలో పని చెయ్యాలి. రోజులో మూడు నాలుగు గంటలు రిలాక్స్ అయ్యేందుకు కూడా వీలు కల్పించుకోవాలి. మరీ ఎక్కువ టెన్షన్లు పెట్టుకోకూడదు. మాటిమాటికీ టెన్షన్ వద్దు. కూల్ కూల్ అనుకుంటూ మనసును తేలిక చేసుకోవాలి. టీవీల్లో మొబైళ్లలో కామెడీ సీన్ల వంటివి చూడాలి. తద్వారా టెన్షన్లు కాస్త తగ్గుతాయి.*


*12.-స్వచ్ఛమైన గాలి :* ఇళ్లలో, ఆఫీసుల్లో డోర్లన్నీ మూసేసుకొని ఏసీల్లో జీవిస్తే అంతా నష్టమే. బయటి నుంచీ వచ్చే గాలిలో ఆక్సిజన్ ఎక్కువ. అది మన బ్రెయిన్‌కి చాలా అవసరం. అది అందేలా చెయ్యాలి. మొక్కలు, చెట్ల మధ్య నడవాలి. వీలైనంతవరకూ ప్రకృతిలో జీవించేందుకు ప్రయత్నించాలి. అప్పుడు ఆరోగ్యమే ఆరోగ్యం.

ప్రతి ఓటరు చదవాల్సిన మెసేజ్

 ప్రతి ఓటరు చదవాల్సిన మెసేజ్

➖➖➖➖➖➖➖➖➖➖

అన్నా స్కూలు పోతా... 

*15 వేలు తీసుకో


అన్నా ఆటో తోలుతా... 

*10 వేలు తీసుకో


అన్నా కటింగ్ చేస్తా .. 

*10 వేలు తీసుకో


అన్నా ముసలోడిని... 

*2250 తీసుకో


అన్నా నేను మహిళని... 

*15 వేలు తీసుకో


అన్నా నేను కాపును.. 

*15 వేలు తీసుకో


అన్నా నేను బట్టలు కుట్టే టైలర్ ని... 

*10 వేలు తీసుకో


అన్నా నేను జాలరిని... 

అవునా... 

*అయితే 10 వేలు తీసుకో... 


*ఒక పిట్ట కథ విందామా?


*ఒక దొర ఊర్లో డబ్బులు పంచుతాను రండి అని డప్పు వేయించాడు. 

*దొర గారు డబ్బులు పంచుతున్నారట... అని ఊర్లో అందరూ పరుగెత్తుకుంటూ వెళ్లారు. 


*అందరినీ ఊరి బయటున్న స్టేడియంలోకి తీసుకెళ్లారు వచ్చినోళ్లందరికీ అందరికీ 

*డబ్బులు పంచాడు దొరగారు. 


*డబ్బులు తీసుకుని ఊర్లో కెళుతంటే పోయేటపుడు కనిపించని టోల్ గేట్ ఈసారి ప్రత్యక్షమైంది. 


*అందులో లోపలికి వెళ్లినా 4 రూపాయలు కట్టాలి, 

*బయటకు వచ్చినా నాలుగు రూపాయలు కట్టాలి. 

*దొరగారు ఇచ్చిన డబ్బులు 

*నెలరోజుల్లే ఆ టోల్ కి సరిపోయాయి.

 

*మిగతా 11 నెలలు జనం కష్టపడి సంపాదించి ఆ టోల్ కట్టారు.


*ప్రభుత్వాలకు రాజ్యాంగం పన్నులు వసూలు చేసుకునే హక్కు కల్పించింది ఎందుకు?... 

*మనంతట మనమే రోడ్డేసుకోలేం, 

*బడి కట్టుకోలేం,

*గుడి కట్టుకోలేం 

*ఆస్పత్రి కట్టుకోలేం.


*ఆ పనుల్నీ చేయడానికి ఒక వ్యవస్థను పెట్టిన దానికి గవర్నమెంటు అని పేరు పెట్టారు.


*ఆ గవర్నమెంటు వ్యవస్థకు మన పనులు చేసిపెట్టే బాధ్యత అప్పగించారు. అందుకోసం ట్యాక్సుల రూపంలో 

*మన డబ్బులు తీసుకుని 

*మనకోసం బడి కట్టాలి, 

*రోడ్డు వేయాలి,

*ఆస్పత్రి కట్టాలి,

*కరెంటు తయారుచేయాలి,

*డ్రైనేజీలు వేయాలి. 

*చెరువులు కట్టాలి. 

*ప్రాజెక్టులు కట్టాలి.


*కానీ మనం కట్టిన డబ్బులను నాయకులు తమ పేర్లు పెట్టుకుని 

*తమకు నచ్చిన వాళ్లకు పంచుతున్నారు. 


*కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. 

*ఏపీలో కరిగేపోయాయి.

*మొన్నే 40 వేల కోట్లు డబ్బులు పంచాం అని ఘనంగా చెప్పుకున్నారు.


*ఎవరి సొమ్ము అది? 

*ప్రజలు కట్టిన పన్నులే కదా.

*మరి వాటిని ఇష్టారాజ్యంగా పంచుతుంటే ప్రజలు ప్రశ్నించాలి కదా.


*రేపటి నుంచి...


*ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే 

10రూపాయలు ఎక్కువ పెట్టి

*పెట్రోలు కొనాలి.


*ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే 

10రూపాయలు ఎక్కువ పెట్టి

*డీజిల్ కొనాలి


*ఇప్పటికే ఇతర రాష్ట్రాల కంటే 

*75 రూపాయలు ఎక్కువ పెట్టి 

*క్వార్టర్ కొంటున్నారు.


*ఇదే పన్ను మిగతా రాష్ట్రాల్లో వేశారనుకో... 

*జనం పాలకులను నిలదీస్తారు. కడిగేస్తారు. 

*ఎందుకంటే వారు అడ్డదిడ్డంగా అప్పనంగా గవర్నమెంటు డబ్బులు తినలేదు.


*కాబట్టి మూసుకుని కూర్చోరు. తాటతీస్తారు. 


*కానీ ఏపీ ప్రజలు పుడితే పథకం, చదివితే పథకం,

*పెద్దయితే పథకం,

*స్కూలు కెళితే పథకం,

*సంఘానికెళితే పథకం,

*వ్యవసాయం చేస్తే పథకం, 

*పెళ్లి చేసుకుంటే పథకం...


*పెంచడం కష్టం గాని 

*పంచడం ఎంత సేపు

*5 నిమిషాల పని.  


*ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు. 

*డబ్బులు ఇస్తున్నపుడు సంతోషంగా తీసుకున్నారు. 

*మరి ఎక్కడి నుంచి వస్తాయి 

*తిరిగి కట్టకపోతే. 

*అదే జరుగుతోంది.


చాలా సింపుల్ లాజిక్... 

*మనం డబ్బులు ట్యాక్సుల రూపంలో కడితేనే గవర్నమెంటు వద్ద డబ్బులుంటాయి.


*ఆ డబ్బులను ఎలా వాడితే పెరుగుతాయి అన్నది 'నాయకుడిని' బట్టి ఉంటుంది.


*కులాల వారిగా చేసే వృత్తుల వారిగా కోట్లమంది హక్కుని కొంతమందికి  పంచితే మిగతా వారి తలపై అప్పులు ధరల రూపంలో గుది బండై కూర్చోవా..???


*అందుకే అన్నారు

*దురాశ దు:ఖానికి చేటు అని.


*ఓ ఓటరు మహాశయా మేలుకో


*ఉచితంగా ఏది రాదు... 

*అనేది అందరూ అర్థం చేసుకోవాలి...


 *ప్రభుత్వాలు జనం పై ఎన్ని రకాల పన్నులు వేస్తాయో? ఒక్కసారి గమనించండి.


*ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు మన కష్టార్జితాలే అవి ఎలానో తెలుసుకుందాం.


1 *సంపాదిస్తే 

*income tax


2. *అమ్మితే

*sales tax


3. *ఉత్పత్తి చేస్తే

*peoduction tax


4. *మార్కెట్‌ చేస్తే

*commercial tax


5. *సినిమాకి వెళ్తే

*entertainment tax


6. *వెహికల్‌ కొంటే

*life tax


7.  *దాన్ని రోడ్‌ పైకి తెస్తే

*road tax


8. *లాంగ్‌ జర్నీ చేస్తే

*toll tax


9. *బండిలో పెట్రోల్‌ పోస్తే

*fuel surcharge tax


 10. *భార్య, పిల్లలతో పార్క్‌ కి వెళితే

*entery tax


11. *ఉద్యోగం చేస్తే

*professional tax


12. *వ్యాపారం చేస్తే

*trade tax


13. *బట్టలు కొంటే

*vat tax


14. *కరెంటు, వాటర్‌ బిల్‌ కడితే

*series tax


15. *ఆస్థి పై

*property tax


16. *చివరకి పబ్లిక్‌ urinals కి వెళ్తే

*swachh bharat charge


17. *సబ్బు కొంటే

*customer charge


18. *ఒక వస్తువు కొంటె

*tax,


19. *దాన్ని వినియోగిస్తే

tax,


20. *దాన్ని రిపేరు చేపిస్తే

*tax,


21.*దాన్ని లెక్కల్లో చూపిస్తే

*tax,


22. *సంపాదించింది ఖర్చుపెడితే

*tax


23. *మొత్తం మీద మనిషి జన్మిస్తే

*tax,


24. *మనిషి సంపాదిస్తే

*tax,


25. *మనిషి సంతోషిస్తే

*tax,


26. *మనిషి మరణిస్తే

*tax.


*ఇలా పలు రకాల టాక్స్' లతో మనిషి పుట్టి పెరిగిన నుండి మొదలుకొని అతడు చచ్చే వరకు వారి శక్తికి మించి పన్నులు చెల్లిస్తూ, ఆ వచ్చే రాయితీలు ప్రభుత్వాల, నాయకుల బిక్షగా భావించుకుంటున్నారు అది నిజంకాదు, అవన్నీ ప్రజల యొక్క కష్టార్జితాలే........

ఉచితం.. ఉచితం... ఉచితమంటే ఉన్నదంతా ఊడ్చేయడమే

 ఉచితం.. ఉచితం... ఉచితమంటే ఉన్నదంతా ఊడ్చేయడమే

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈


         ఒక Economics ప్రొఫెసర్ తన స్నేహితులతో ఇలా చెప్పారు


        నేను పనిచేసే కాలేజీ లో ఇప్పటివరకు ఒక స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు, కానీ ఈ మధ్య ఒక క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చెయ్యవలసి వచ్చింది....!!!


          ఎలా? అని అడిగారు మిగతా వాళ్లు..????


         ఒక క్లాస్ వాళ్ళు ఇలా అడిగారు.. క్లాస్ లో టాప్ ర్యాంకర్ లీస్ట్ ర్యాంకర్ అని వొద్దు, అందరికీ ఓకే  ర్యాంక్ కావాలి అని అన్నారు.


     దానికి ప్రొఫెసర్ "సరే" అన్నారు...

మీ అందరి మార్క్స్ ADD చేసి, AVERAGE తీసి రాంక్స్ ఇస్తా అన్నారు.


     మొదటి సెమిస్టర్లో Average ర్యాంక్ "B' వచ్చింది, కాబట్టి అందరికీ B ర్యాంకు  ఇచ్చారు. 2nd సెమిస్టర్లో  అందరి యావరేజ్ మార్క్స్ 'D' వచ్చింది, కాబట్టి అందరికీ D ర్యాంక్  ఇచ్చారు. అలాగే 3rd సెమిస్టర్ లో అందరికి "F' వచ్చింది. ఫైనల్ exams లో అందరూ ఫెయిల్ అయ్యారు. స్టూడెంట్స్ అందరూ అవాక్కు అయ్యారు.


ఎందుకంటే...

           బాగా చేదివేవాళ్ళు ఎవరి కోసమో మేము ఎందుకు కష్టపడి  చదవాలి? అని చదవటం మానేశారు, యావరేజ్ స్టూడెంట్స్ ఎలాగూ తెలివిగాల వాళ్ళు చదువుతారు కాబట్టి ఇంకా మేము ఎందుకు చదవటం? అని వాళ్లు పూర్తిగా చదవటం  మానేశారు, ఫైనల్ గా క్లాస్ మొత్తం Fail అయిపోయారు.


ఈ Experiment లో నాలుగు పాయింట్స్ నేర్చుకోవొచ్చు  : 


1. చట్టం ద్వారా పేదవాడిని సంపన్నుడిని చేయలేము,

కానీ అదే చట్టం ద్వారా సంపన్నుడిని పేదవాడిగా చెయ్యొచ్చు.


2. ఒకరు  ఉచితంగా ఏమన్నా పొందుతున్నారు అంటే 

మరొకళ్ళు ఆ ఉచితం ఇవ్వటం కోసం కష్టపడుతున్నారు.


3. ప్రభుత్వం ఏదన్నా ఉచితంగా ఇస్తుంది అంటే,

ఎవరి దగ్గరనుండో ఆ ఉచితానికి కావలసిన కష్టాన్ని తీసుకుంటుంది.


4. ఉన్నది పంచుకుంటూ పోతే సంపద సృష్టి జరగదు,

కూర్చుని తింటే కొండలైన కరుగుతాయి కదా !


సగం మంది ప్రజలు మేము కష్టపడటం ఎందుకు,

అన్ని మాకు ఉచితంగా వొస్తున్నాయు అనుకుంటే, మిగతా సగం కష్టపడి ఉచితాలుకి కావలసినవి సమకూర్చుతున్నారు. ఈ కష్ట పడేవాళ్ళు ఎందుకు మాకీ కష్టం? ఎవరినో కూర్చోపెట్టి మేపటానికి అని కష్టపడటం మానేస్తే.. అక్కడే దేశ వినాశనానికి బీజం పడుతుంది. పార్టీలకతీతంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి...

నలుగురితో చర్చించండి...

దేశం కోసం...

రేపటి తరాల కోసం...

మితంగా తీసుకోవాలి

 మితంగా తీసుకోవాలి


గర్భిణీ స్త్రీలు తినవలసిన ఆహారం ఏమిటంటే, పోషకాహారం అన్నీ తినవచ్చు, డ్రై ఫ్రూట్స్, పళ్ళు, కూరగాయలు. కొంతమందికి వాంతులు అయినా కూడా తినాలి అనిపించకపోయినా తప్పనిసరిగా తినాలి, ఎందుకంటే ఎదుగుదల ముఖ్యం కాబట్టి. కానీ పచ్చళ్ళు లాంటివి తినకూడదు, ఎందుకంటే బీపీ పెరిగితే రేపు పురిటికి కష్టమవుతుంది, కానీ రోటి పచ్చడి అయితే తినవచ్చు కారం కొంచెం ఉప్పు కొంచెం తక్కువ చేసి తినవచ్చు ఉన్న గర్భిణీ స్త్రీ అయితే ఇందులో కొన్ని పళ్ళు, తినకూడదు. నేను చెప్పేది శాఖాహారులకు మాత్రమే, కాళ్ళకి నీరు పట్టే వాళ్ళు బార్లీ గింజలు ఉడకబెట్టుకుని పొద్దున్నే తాగాలి, మామూలుగా ఉన్నప్పుడు కంటే గర్భిణీగా ఉన్న స్త్రీ ఎక్కువ పాలను తీసుకోవాలి.


పళ్ళు


1. దానిమ్మ. 2. ద్రాక్ష.


3. సపోటా. 4. యాపిల్ రెండు రంగులు తినవచ్చు


5. నల్ల ద్రాక్ష. 5. నారింజ.


6. సీతాఫలం. 7. కివి ఫ్రూట్


8. పనసకాయ. 9. జామ పండు.


10. పుచ్చకాయ. 11. పంపరపనస.


12. మామిడి పండు. 13. అరటిపండు


14. కమలా పండు. 15. కీరా దోసకాయ.


16. బత్తాయి.


కూరగాయలు


1. మామిడికాయ,.2. దోసకాయ


3. బీరకాయ . 4. పొట్లకాయ


5. దొండకాయ. 6. బెండకాయ


7. కాకరకాయ. 8. వంకాయ్ చాలా రకాలు ఉన్నాయి అన్నీ తినొచ్చు


9. మునక్కాయ. 10. క్యాప్సికం చాలా కలర్స్ ఉన్నాయి అన్ని కలర్ క్యాప్సికం తినొచ్చు.


11. ఆనపకాయ. 12. గుమ్మడి కయ అయితే తినకూడదట.


13. ముల్లంగి. 14. టమాటా


15. చిక్కుడు కాయలు రెండు రకాలు చిక్కుడుకాయలు తినవచ్చు


16. ఉల్లిపాయలు తినవచ్చు, ఉల్లికాడలు కూడా తినవచ్చు.


17. క్యారెట్. 18. బీట్ రూటు ఈ రెండు చాలా ఎక్కువగా తినాలి ఎందుకంటే దీనివల్ల రక్తం పెంపొందించి పురిటి టైంలో చాలా అవసరం పడుతుంది.


19. పనసపొట్టు


ఆకుకూరలు


1. తోటకూర 2 . పాలకూర.


3. గోంగూర.4. కరివేపాకు.


5. కొత్తిమీర.6. పొదీనా.


7. బచ్చలి కూర. 8. చుక్కకూర.


9. మునగాకు.


డ్రై ఫ్రూట్స్


1. జీడిపప్పు. 2. బాదంపప్పు నానబెట్టుకుని తర్వాత పొద్దున్నే తొక్క కొలుచుకుని తింటే పుట్టే బిడ్డకు బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది


3. పిస్తా. 4. అక్రూట్ తింటే తల్లికీ బిడ్డకీ కూడా గుండె పదిలంగా ఉంటుంది


5. అంజీర. 5. కిస్ మిస్.


6. ఖర్జూరం.


7. ఎండు ఖర్జూరం రాత్రి నానబెట్టుకుని పొద్దునే ఆ నీళ్లు తాగితే ఎండా ఆ ఈ సమయంలో తల్లికి డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది.

ధన్యవాదములు 🙏

ఏంటండీ ఈ డిమాండ్స్

 ఏంటండీ ఈ డిమాండ్స్

అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం కష్టమై పోతునందుకేగా 


ఇద్దరి మధ్య సంభాషణ చదవండి


x y అనుకుందాం

ఫోన్లో


x : సార్ ఇది y గారి ఇల్లేనా

y: అవును మీరు

x: మీ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడాలి 

y: ముందు మా కండిషన్స్ విన్నాక మాట్లాడండి

x: అది కాదు సార్ మీ అమ్మాయి పెళ్ళి

y: ఏదైనా సరే ముందు మా కండిషన్స్ విన్నాకే పెళ్ళి గురించి మాట్లాడండి

x: ఏం కండిషన్స్ సార్

y: మా అమ్మాయికి 654321 ఉన్నవాడినే పెళ్ళి చేయాలి

x: అంటే ఏంటి సార్

y: 6 అంకెల జీతం అంటే లక్ష జీతం అయినా ఉండాలి

    5 లక్షల కారు అయిన ఉండాలి అది కూడా అబ్బాయి పేరు మీదే ఉండాలి

    4 లక్షలు విలువ చేసే బంగారం అమ్మాయికి వెయ్యాలి

3 బెడ్ రూములు కలిగిన ఇల్లు ఉండాలి అది కూడా అబ్బాయి పేరుమీదే ఉండాలి

2 ట్రిప్ప్లు అయినా నెలకు తిప్పాలి బయట 

1 ఒక్కడే కొడుకు అయ్యుండాలి

x: 🤔🤔🤔🤔🤔

y: ఇంతే కాదు

అబ్బాయి తల్లితండ్రులు పెళ్ళి అవగానే విడిపోవాలి

అమ్మాయికి వంట రాదూ అయినా మీరు అడగకూడదు

అమ్మాయి ఆలస్యంగా నిద్రలేస్తుంది 

ఆదివారాలైతే ఇంకా ఆలస్యంగా లేస్తుంది 

అవి పట్టించుకోకూడదు

ఇక ఇల్లు కారు డాక్యుమెంట్స్ మాకు చూపెట్టాలి

ఆఫీస్ నుండి సాలరీ సర్టిఫికెట్ తీసుకురావాలి


మా అమ్మాయిని మేము చాలా గారాభంగా పెంచాము

తను ఇబ్బంది పడకూడదు కదా అందుకే ఇన్ని జాగ్రత్తలు

ఇవన్నీ మీకు నచ్చాక అప్పుడు మా అమ్మాయి పెళ్ళి గురించి మాట్లాడుదాం 

ఏమంటారు మీరు 

x : నేను ఏమనాలి సార్

y: నువ్వే కదయ్యా మా అమ్మాయి పెళ్ళి గురించి మాట్లాడాలి అన్నావు

x: నేను పోలీసుస్టేషన్ నుండి మాట్లాడుతున్నాను సార్

మీ అమ్మాయి మీ వీధిలో స్కూటర్ గారేజ్ లోని అబ్బాయిని ప్రేమించి 

ఈరోజు ఉదయం ఆ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో పెళ్ళి చేసుకుందట

మీరు ఒప్పుకోరని 

వారిని విడదీస్తారని

ఆమె ఇప్పుడు మేజర్ అని మిమ్మల్ని ఒప్పించమని మా స్టేషన్లో ఉంది 

అందుకె మీ అమ్మాయి పెళ్ళి గురించి మాట్లాడాలి అని అన్నాను 

వచ్చి మాట్లాడండి అని ఫోన్ పెట్టేసాడు 

y:😭😭😭😭😭😭


ఎవరినీ బాధ పెట్టాలని చులకన చేసి కాదండి

అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి విలువలను నేర్పించి 

ప్రేమను పంచి మాత్రం పెంచడంలేదండి

వారు అడగగానే లేదు అనకుండా  కొనిపెట్టి వాటి విలువలను నేర్పించడంలేదు

బంధాలతో కలిసి ప్రేమ విలువ నేర్పించడంలేదు.


❤️❤️❤️❤️❤️❤️❤️

Monday, April 18, 2022

మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి మార్గం

 మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి మార్గం

🦵🦵🦵🦵🦵🦵🦵🦵🦵🦵🦵


*_మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి మహాబీర గింజలు. మోకాళ్ళ నొప్పులు అనేవి వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు అంటే రెండు కీళ్ళు కలిసేచోట కీళ్ళమధ్యలో గుజ్జు తగ్గితే వస్తాయి. కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఆపరేషన్ అవసరం లేదు. నొప్పి తీవ్రంగా ఉండి నడవడానికి కూడా ఇబ్బంది అయినప్పుడు ఆపరేషన్ అవసరం పడుతుంది._*


*_నొప్పి మరీ తీవ్రంగా లేనప్పుడు ఇంటిచిట్కాలు బాగా పనిచేస్తాయి. సమస్య చిన్నగా ఉన్నప్పుడే చిట్కాతో సమస్య ను తగ్గించాలి. మహాబీర గింజలు నొప్పులను తగ్గిస్తాయి. కీళ్ళ నొప్పులు అనేవి ఒకప్పుడు వయసుమీరిన వారిలో మాత్రమే ఉండేవి. ఇప్పుడు ముప్ఫై ఏళ్ళకే వచ్చేస్తున్నాయి. వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం, మారిపోతున్న జీవనశైలి  ,ఆహారపుటలవాట్లు, అధికబరువు కీళ్ళనొప్పులకు కారణమవుతున్నాయి._*


*_కీళ్ళమధ్యలో గుజ్జు పెరిగితే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. దానిని పెంచడానికి మహాబీర గింజలు పనిచేస్తాయి. మహాబీర గింజలను ఒక స్పూన్ తీసుకుని ఒక గిన్నెలో నీళ్ళు వేసి నానబెట్టాలి. గంట తర్వాత తీసుకుంటే సరిపోతుంది. రాత్రిపూట నానబెట్టి మరుసటిరోజు ఉదయం తీసుకోవాలి. ఈ గింజలు నానితే సబ్జా గింజల్లా ఉంటాయి. ఈ గింజలను నమిలి ఈ నీటిని తాగాలి._* 


*_ఈ గింజలను వడకట్టి విడివిడిగా తీసుకోవడం లేదా మిక్సీ పట్టి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. వీలైనంత వరకూ గింజలతో కలిపి తీసుకోవాలి. ఈ గింజలు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. ఇప్పుడు డిపార్ట్మెంట్ స్టోర్లో మరియు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి._* 


*_అందరికీ అందుబాటుధరలో ఉండడంతో అందరూ వాడడం ఎక్కువయింది. వీటివలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సబ్జా గింజల కంటే కాస్త పెద్దగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ కె, ఐరన్, ఫైటో కెమికల్స్, ఫాలీపినాల్స్, ఫ్లెవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బీటా కెరోటిన్, లుటిన్, జియాక్సిన్, పొటాషియం, మాంగనీస్, రాగి,కాల్షియం, ఫొలేట్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి._* 


*_ఈ గింజలను చూస్తుంటే గుజ్జు లా ఉంటుంది. వీటిని తినడంవలన కీళ్ళమధ్యలో గుజ్జు పెరుగుతుంది. మహాబీర గింజలు కీళ్ళనొప్పులు తగ్గించడంతో పాటు శరీరానికి చలవచేస్తుంది. అధికబరువు ఉన్నవారు రోజూ తాగీతే కొవ్వు కరిగి సమస్య తగ్గుముఖం పడుతుంది. మహాబీర గింజలు తులసిజాతికి చెందినవి. మూడునెలల క్రమంతప్పకుండా వాడితే మోకాళ్ళలో గుజ్జు పెరిగి మోకాళ్ళనొప్పి సమస్య తగ్గుతుంది._*


*_మోకాళ్ళ నొప్పులు మొదటిదశలో ఉన్నవారికి మంచి ఉపశమనం లభిస్తుంది. మోకాళ్ళ మధ్య టక్టక్ మని శబ్దం వస్తే ఈ చిట్కా పాటించడం వలన గుజ్జు పెరిగి సమస్య తగ్గిపోతుంది. రోజు వాకింగ్ చేస్తూ మంచి ఆహారం తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచడం, డయాబెటిస్ , అధికబరువు నియంత్రణ కలిగిస్తాయి మహాబీర గింజలు. ఆకలి తగ్గి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న మహాబీర గింజలను తీసుకుంటూ కీళ్ళు మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవచ్చు._*

జీవన గమ్యం

 జీవన గమ్యం


     *⁉️కోరికల్ని నియంత్రించడం ఎలా..???⁉️*


   🌱మనిషిలోని మనసు చాలా చంచలమైంది. దాని యాంత్రికతకు అంతం లేదు. మనిషి బాల్యం నుంచి ఏవేవో వాంఛలకు అలవాటుపడతాడు. ఒకదాని తరవాత మరొకదాన్ని మనసు కోరుతూనే ఉంటుంది.


     🌱జీవితాంతం అలా మనసు మనిషిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. నిజానికి మనిషి తనలోని మనసును గురించి అవగాహన కల్పించుకోవాలి. దాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలా నమ్మడం ఒక పెద్ద వ్యామోహం. ఈ వ్యామోహాన్ని తగ్గించుకోవాలంటే మనసు చెప్పినట్లు వినడం మానేస్తే సరి. మనసు నిండా కోరికలు, ఆలోచనలను నింపకూడదు.


    🌱మనసును స్థిమితపరచడం ఎలా? కోరికల్ని నియంత్రించడం ఎలా? ఇందుకోసం మనిషి సాధన చేయాలి. మొదట మనలోని కృత్రిమత్వాన్ని గుర్తించాలి. అందులోని చెడును తెలుసుకోవాలి. మానవత్వాన్ని, దైవత్వాన్ని అవగాహన చేసుకోవడంవల్ల కోరికల ఉద్ధృతి తగ్గుతుంది.


    🌱సరిగ్గా అప్పుడు మనలోకి మనం నెమ్మదిగా సూటిగా చూసుకోవాలి. మనలో ఏం జరుగుతుందో గమనించడం అవసరం. మనసులోకి ప్రవేశిస్తున్న ప్రతి వాంఛను, ప్రతి ఆలోచనను గమనిస్తూ ఉండి, అలాంటి గమనిక కొనసాగినప్పుడు మనసు తాలూకు చంచల ప్రవృత్తి నెమ్మదిస్తుంది. ఆ తరవాత మన మనసులోకి మనం fప్రవేశించగలం.


    🌱సాధారణంగా మనసు తాను గమనించిన ప్రతిదానికి ఏదో ఒక పేరు పెట్టి దానికో ప్రయోజనం కల్పించి, మరొకదానితో పోల్చడం చేస్తుంది. అయితే ఏ ప్రయోజనం ఆపేక్షించకుండా, నిర్వ్యామోహంగా మనసు లోపలికి చూడటం జరిగితే చంచలమైన ఆలోచనలు ఆగిపోతాయి. నిశ్చలమైన స్థితి కలుగుతుంది. ఆ స్థితిలో మనకు కోరికలు ఉండవు. ప్రయోజన ఆపేక్షా ఉండదు. ఆశలు, భయాలు కలగవు. ఈ స్థితిని నిలుపుకోవడం ఎలా?


    🌱వస్తున్న ఆలోచనలను గమనించాలి. వాటిని గమనిస్తే చాలు- మనసు పరిధిలోకి వ్యక్తిగతమైన శక్తి అపరిమిత మవుతుంది. అప్పుడు మనసును వ్యక్తిగత పరిధినుంచి తప్పించడమే మనం చేయాల్సిన పని. నెమ్మదిగా ముందుకు సాగాలి.


   🌱ఈ ఆలోచన లేని ఏకాగ్రతను ధ్యానం అనవచ్చు. నెమ్మదిగా నిశితంగా మనలోని మనసును గమనించడంవల్ల ఏ ఘర్షణ లేకుండానే మనోభూమిక నుంచి వెలుపలికి రావచ్చు. మనలోని సున్నితత్వం, సూక్ష్మ పరిశీలనా పెరిగే కొద్దీ- ఆలోచనలు, కోరికలు సమసిపోతాయి. ఆలోచనల నుంచి స్వేచ్ఛ పొందడం, స్వస్థితిని చేరడం- మనల్ని మనం తెలుసుకోవడం! ఇవి తెలివితేటలతో సాధించేవి కాదు. మన స్వప్రేరణతో అనుభవించవలసిందే. మనసు ప్రమేయం లేకుండా స్వప్రేరణ సాధ్యమేనా? సాధ్యమే, కాని సాధన చాలా కష్టం.


   🌱ఎందుకంటే నిరాపేక్షతో మనసును గమనించడం మనకు అలవాటు లేని పని. మన నరాల నిర్మాణం అందుకు సహకరించదు. మన మెదడులోని కణాలు తమను తాము గమనించుకోవడానికి అలవాటు పడి లేవు. అందుకే మన దృక్పథం మారడం ముఖ్యం. ఏవో కొన్ని అలవాట్లు, ఆలోచనలు మార్చుకున్నంత మాత్రాన సరిపోదు. మనలో మార్పు సమూలంగా రావాలి. అప్పుడే నూతన చైతన్యం కలుగుతుంది.మనశ్శాంతిని, ప్రశాంతిని, ఆనందాన్ని ప్రసాదించే శుద్ధ చైతన్యాన్ని అన్వేషించాలి. సంపూర్ణ అవగాహనతో మన సమస్త శక్తులను వెచ్చించి కృషి చేయాలి.


    🌱సరే! మరి ఈ యాంత్రిక మానసిక క్రియలను ఎలా వదిలించుకోవాలన్న ప్రశ్న ఇక్కడ తలెత్తక మానదు. మౌలికంగా ప్రస్తుత స్థితినుంచే సాధన ప్రారంభించాలి. మనసు చర్యలను నెమ్మది నెమ్మదిగా గమనిస్తూ ఉండాలి. ఉత్తినే గమనించండి చాలు. ఆలోచనా ప్రవాహం నెమ్మదిస్తుంది. ఉద్ధృతి తగ్గుతుంది. రానురాను మనసు మనల్ని వశపరచుకోవడంలో వైఫల్యం చెందుతూ ఉంటుంది.


    🌱విచక్షణ, ఆలోచన, వాంఛ లేనప్పుడు ఆలోచనలు నిలిచిపోతాయి. ఎంత అధికశక్తిని ఏకాగ్రతపై వెచ్చించగలమో, అంతగా భౌతికమైన ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. అప్పుడు ఆలోచించకుండానే బాహ్యాన్ని మరిచి పరాన్ని గమనించగలుగుతాం. ఆ పైన మనసు చైతన్యమై ప్రస్ఫుటమవుతుంది. మనసనేది కోరికల కర్మాగారం. ఆ విషయం గ్రహించి బయటపడాల్సింది మనమే. మన గురించి మనం అర్థం చేసుకొన్నప్పుడు ఆత్మ విలువ తెలుస్తుంది.


    🌱అప్పుడే మనసు చేసే పెత్తనం నుంచి మనం చైతన్యం, స్వేచ్ఛ పొందగలుగుతాం. ఆ స్వేచ్ఛలోనే శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక అవగాహనతో జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. మనసును హృదయంతో జతచేయాలి. అప్పుడు మన ప్రతిభ బయటకొస్తుంది.

ఎల్లెడెలా ఆధ్యాత్మికానందం మన సొంతమవుతుంది.


   🌱 ఆధ్యాత్మిక ఆనందము కొరకు ఆత్మ జ్ఞానము/అంతర్ ప్రయాణము అవసరము                      


  *♦️ఆత్మ జ్ఞానము వేదాలకు, ఉపనిషత్తులకు, పురాణాలకు,యజ్ఞ యాగాది క్రతువులకు అతీతమైనది*


  *ఆత్మ జ్ఞానమునకు ఏకైక సులభమైన సాధనా మార్గం ధ్యానమొక్కటే.*

  

   

💥🔥⚜️⚜️🏹🦋🐢💚👋

బెల్లం సేవించడం వల్ల కలిగే 18 ప్రయోజనాలు...!!

 బెల్లం సేవించడం వల్ల కలిగే 18 ప్రయోజనాలు...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


1. బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది.


2. భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యం గా ఉండవచ్చు.


3. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.


4. బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటి తో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజూ ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలి.

 

5. బెల్లంలో వుండే ప్రముఖ ధాతువు ఇనుము. కావున బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకమైనది.


6. చర్మం కోసం, బెల్లం రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్లను దూరం చేసి చర్మానికి మంచి మెరుపు నిచ్చి మొటిమలని నివారిస్తుంది.


7. బెల్లం యొక్క గుణం వేడిచేయడం. కావున దీనిని మనం జలుబు, దగ్గు, రొంపలాంటివాటికి ఉపశమనం ఇస్తుంది. జలుబు వలన బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డులో కూడా వాటిని కలిపి సేవించవచ్చు.

 

8. శక్తి కోసం, బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే, బెల్లం సేవించినట్లయితే మీ ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసటగా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తినేయండి.


9. బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది. దీని ఆంటి అలెర్జీక్ తత్వం వలన దమ్ము ఆస్తమా రోగులు తీసుకొంటే మంచి ఫలితాలు వుంటాయి.

 

10. మోకాళ్ళ నొప్పులకి విశ్రాంతి, బెల్లం ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.


11. బెల్లం తో కలిసి చేసిన పరమాన్నం తింటే గొంతు మరియుమాట హయిగా వస్తాయి.


12. బెల్లాన్ని నల్లనువ్వులతో పాటు లడ్డు చేసుకోని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు.


13. శీతకాలంలో నంజు బాగా తయారైతే బెల్లాన్ని పాపిడి రూపంలో చేసుకుని తినేయండి. 


14. బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకొంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.


15. భోజనం తర్వాత బెల్లం తీసుకొంటే అసిడిటీ తగ్గిపోతుంది.

 

16. ఐదు గ్రాముల శొంఠి పది గ్రాముల బెల్లం ఉండలుగా చేసి తీసుకొంటే జాండిస్ (పీలియావ్యాధి)పచ్చ కామెర్లు వారికి లాభసాటిగా ఉంటుంది.


17. బెల్లం హాల్వా తీసుకొంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.


18. అయిదు గ్రాముల బెల్లం అంతే పరిమాణంలోని ఆవాల నూనె(మస్తర్డ్ ఆయిల్)తో కలిపి తీసుకొంటే శ్వాస సంభందిత వ్యాధులు నయమవుతాయి.


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Sunday, April 17, 2022

డైనింగ్ టేబుల్‌


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

              డైనింగ్ టేబుల్‌

                 ➖➖➖✍️


*మగవాడు రాసేప్పుడు తాను ఒక్కడే ఉంటాడు.*


*స్త్రీ రాసేప్పుడు ఆమె వెనుక ఇంకా ఆర్పాల్సిన గ్యాస్‌స్టవ్, పిల్లవాడికి పట్టాల్సిన పాలు, ఆరేయగా లోపలికి తేవాల్సిన బట్టలు, కరెంటు మనిషి మీటర్‌ కట్‌ చేసి వెళ్లకుండా కట్టాల్సిన బిల్లు, పెద్దగా కదలికలు లేని అత్తగారికి ఇవ్వాల్సిన మందులు,    సంతరోజు తప్పిపోకుండా తేవాల్సిన కూరగాయలు... ఇన్ని ఉంటాయి.*


*మగవాడు– రాసుకోవాలి అనంటే ఆ ఇల్లు నిశ్శబ్దం అయిపోతుంది. ఒక గది ఇవ్వబడుతుంది. ముఖ్యం అతనికి ఒక రైటింగ్‌ టేబుల్‌ ఉంటుంది.*


* ‘కాని నాకు తెలిసి మన దేశంలో రాయాలనుకున్న స్త్రీలకు ఒకే ఒక టేబుల్‌ ఉంటుంది. అది డైనింగ్‌ టేబుల్‌. దానిని శుభ్రం చేసుకుని కూచుని రాసుకోవడమే’ అంది ప్రఖ్యాత రచయిత్రి కమలాదాస్‌.*


*వర్జీనియా ఊల్ఫ్‌ కూడా ఇదే మాట అంది– రాయాలనుకున్న స్త్రీలు తాము ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేని ఆదాయం కలిగి ఉండాలి... వారికి సొంత గది ఉండాలి.*


*ఆసియాలోనే అతి పెద్దదైన ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ ఇటీవల జరిగితే అందులో వర్తమాన భారతీయ రచయిత్రులు ఎందరో పాల్గొని ‘తాము రాస్తున్నాము’ అని గొప్ప ప్రకటన చేస్తే మగవారు పాల్గొన్న వేదికలపై రాని చర్చ ఈ రచయిత్రులు పాల్గొనే వేదికపై వచ్చింది.*

*అది– రాయడానికి సమయం, కావలసిన మద్దతు గురించి. *


*‘మీరు ఎన్నయినా చెప్పండి... భారతీయ స్త్రీ రాయాలంటే భర్త సహకారం తప్పదు.*


*మన స్త్రీలు అనేక బాధ్యతల మధ్య సమయం వెతుక్కుని రాయాలి. ఆ సమయానికి భర్త ఆటంకం కలిగిస్తే రాయడం కష్టం’ అంది అనుకృతి ఉపాధ్యాయ్‌ అనే రచయిత్రి.*


* ‘నేను ఒక నవల మొదలెట్టాను. లాక్‌డౌన్‌ వచ్చింది. రెండేళ్ల పాటు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నవల పని మూలపడింది.*


*మళ్లీ స్కూళ్లు తెరిచి వాళ్లు స్కూలుకు, భర్త ఆఫీసుకు వెళితే తప్ప రాయడానికి వీలవలేదు’ అంది సిమ్రన్‌ ధిర్‌ అనే ఢిల్లీ రచయిత్రి.*


* ‘ఈ గొడవంతా ఎందుకని నేను ఉదయం నాలుగ్గంటలకు లేచి ఆరు వరకు రాస్తాను. రోజుకు 200 పదాలు రాస్తే చాలు అనుకుంటూ నా నవల పూర్తి చేశాను’ అంది శివాని సిబాల్‌ అనే మరో రచయిత్రి.*


*స్త్రీల కల్పనాశక్తి వందల ఏళ్ల పాటు మన దేశంలో మౌఖికంగా ఉండిపోయింది. వారు ఆటల్లో, పాటల్లో, పిల్లల్ని నిద్ర పుచ్చడానికి చెప్పిన కథల్లో తమ సృజనను చూపించి సంతృప్తిపడాల్సి వచ్చింది.*


*మరో రకంగా చెప్పాలంటే మన దేశ పురాణ జ్ఞానం. జానపద సంపద వాళ్ల నాలుక చివరల నుంచే ఒక తరం నుంచి మరో తరానికి అందింది.*


*కాని వారు విద్యకు,    కలం పట్టి రాయడానికి శతాబ్దాలు దూరం ఉన్నారు. * 


*రాయడం మొదలెట్టాక, ఇంతకాలం గడిచాక కూడా వారి ఎదుట ఉండాల్సిన సవాళ్లు ఉండనే ఉంటున్నాయి.*


*‘నేను నా మొత్తం కల్పనా సామర్థ్యాన్ని నా కుటుంబ మర్యాదకు లోబడి కుదించుకోవడానికి అవస్థలు పడ్డాను’ అంది కమలా దాస్‌.*


* స్త్రీలు రాయవచ్చుగాని అన్నీ రాయకూడదు. కొన్ని కథాంశాలు ముట్టుకోవడం నిషిద్ధం. కొన్ని వర్ణనలు చేయడం నిషిద్ధం. కొన్ని మాటలు వాడటం నిషిద్ధం. స్త్రీలు పాపులర్‌గా రాసినా, గాఢమైన మానవ ప్రవర్తనలు రాసినా ‘ఇవన్నీ ఈమెకు ఎలా తెలుసు... ఈ కథలోని పాత్ర అనుభవం ఈమె అనుభవమే కాబోలు’ అనే భావనలో మన ఎదగని పాఠకులు, కుటుంబం ఉంటుంది.*


*కనుక ఇప్పటి వరకూ మన దేశంలో రాసిన స్త్రీలు తమ పూర్తి శక్తితో రాశారని అనుకోవడానికి లేదు. ఇక మీదట రాస్తారనీ చెప్పలేము. కనపడని సెన్సార్‌షిప్‌ ప్రభావం అది.*


*పురుషులకు వృత్తి ఉంటుంది. రాయడం వారి ప్రవృత్తి (ఆప్టిట్యూడ్‌).*


*అదే స్త్రీలకు అభిరుచి (హాబీ)గా చెప్పబడుతుంది. రాసే స్త్రీలను భర్తలు పరిచయం చేస్తూ…  ‘ఆ.. ఏవో గిలుకుతుంటుంది లేండి’ అని చిన్నబుచ్చుతారు.* 


*కార్టూనిస్టులు…రచయిత్రుల తిరిగొచ్చిన రచనలు మోయలేక పారిపోయే పోస్ట్‌మేన్‌లను  వేసి నవ్విస్తారు.*


*సినిమాల్లో రచయిత్రులవి హాస్యపాత్రలు. నాణ్యత లేని రచన పురుషుల్లోనూ స్త్రీల్లోనూ ఉంటుంది. కాని స్త్రీలు హేళనకు సాధనాలవుతారు.*


*1965 నుంచి మన దేశంలో జ్ఞానపీఠ్ ఇస్తుంటే ఇప్పటికి 62 మందికి ఆ పురస్కారం దక్కితే వారిలో కేవలం 9 మందే స్త్రీలు ఉన్నారు.* 


*ఎన్నో ప్రతిబంధకాలను దాటి, సవాళ్లను ఎదుర్కొని, మగ రచయితల రాజకీయాలను జయించి రాగలిగారు కాబట్టే ఈ 9 మందైనా.*


*‘నేను చెన్నై కన్నెమెర లైబ్రరీలో పని చేశాను. వందల రచయిత్రుల పుస్తకాలు అక్కడ చూశాను. కాని వారంతా ఒకటీ రెండూ పుస్తకాల వారు.   అంటే 18 నుంచి 24 ఏళ్లలోపు రాసిన వారు. బహుశా పెళ్లయిన తర్వాత వాళ్లందరూ రాయడం మానేసి ఉండాలి.’ అంది పరమేశ్వరి అనే తమిళ కవయిత్రి ఒక వ్యాసంలో.* 


*ఇదే సూత్రాన్ని ప్రతి భాషకూ అప్లై చేస్తే పెళ్లికి ముందు రాసి ఆ తర్వాత ఆగిపోయిన రచయిత్రుల రాయబడని కావ్యాలను హతం చేసినదే మన సమాజం.*


*వెలుతురు అర్థం కాకపోతే చీకటి అర్థం కాదు. స్త్రీ రాయకపోతే పురుషుడు రాసిందీ సంపూర్ణం కాదు. మానవ చిత్తవృత్తులనూ, సంక్షోభ సమయాలలో వారి దిటవును, సందర్భాలకు తగినట్టు మారే కపట విన్యాసాలను స్త్రీ గమనించినంత సూక్ష్మంగా పురుషుడు గమనించలేడు.*


*ఈ ప్రపంచం అర్థం కావాలంటే స్త్రీ రచన విస్తృతం కావాలి. రాసే స్త్రీలున్న ఇళ్లలో వారికంటూ తప్పక ఒక రైటింగ్‌ టేబుల్‌ ఉండాలి. అది లేనంత కాలం మనం పూర్తిగా నాగరికం కానట్టే. స్త్రీలు రాయాలి. స్త్రీ రచనలు వర్థిల్లాలి!*✍️

                       



చిన్న పిల్లల్లో దద్దుర్లు రావటానికి కారణం

 చిన్న పిల్లల్లో దద్దుర్లు రావటానికి కారణం పొట్టలో నులి పురుగులు ఉన్నా దద్దుర్లు వస్తాయి. లేక ఏదైనా శరీరానికి సరి పడని ఆహారం తిన్నా దద్దుర్లు వస్తాయి. 

        దీని నివారణకు వేపాకు చిగుళ్ళు గుప్పెడు తీసుకొని దంచి రసం తీసి 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల పిల్లలకి రెండు టీ స్పూన్లు త్రాగించాలి. అలానే 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలకు వేప చిగుళ్ళు మెత్తగా నూరి ముద్ద చేసి అందులో కొంచం మంచి పసుపు కలిపి ఒక వారం రోజుల పాటు పరగడుపున తినిపించాలి. ఇలా చేస్తే పొట్టలో ఎలాంటి పురుగులు ఉన్నా పడిపోతాయి. ఇది చేదుగా ఉంటుంది కాబట్టి వేప ఆకు ముద్ద మింగిన తరువాత కొంచం బెల్లం కాని, కండ చక్కెర కాని, తేనె కాని తినిపించాలి. పిల్లలకి ఇది రామబాణం లాగా పని చేస్తుంది. మరియు దద్దుర్లు తగ్గటానికి వేప ఆకు దంచి ముద్ద చేసి అందులో మంచి పసుపు కలిపి శరీరం లో ఎక్కడ ఐతే దద్దుర్లు ఉన్నాయో అక్కడ ఆ మిశ్రమాన్ని పట్టించి ఒక గంట తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తే క్రమంగా దద్దుర్లు సమస్య తగ్గుతుంది.

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE