NaReN

NaReN

Saturday, March 5, 2022

ఐదు పైసలు తెలుసా

 #ఐదు_పైసలు_తెలుసా..!

--------------------------


డభ్భై వ దశకంలో...పిల్లలకి ఎక్కువ మొత్తమే..!


ఐదు పైసల బిళ్ళ చేతిలో ఉంటే...ఏమేమి కొనుక్కోవచ్చో..బడ్జెట్ వేసుకునే వారు..!


అర్ధణా ..అంటే మూడు పైసలు పెట్టి ఐస్ ఫ్రూట్ కొనుక్కుంటే..ఇంకా రెండు పైసలు మిగిలేవి.


అసలు ఐదు పైసలకు ఏమేమి వచ్చేవో చూద్దాము..!


ఆడుకోవటానికి గోళీలయితే ఐదు వచ్చేవి..!

బుడగలు రెండు వచ్చి పైసా మిగిలేది..!


బూబమ్మ కొట్డుకాడ ..ఐదు కొబ్బరినౌజు బిళ్ళలు..!

పిండి పిప్పరమెంట్ బొమ్మల బిళ్ళలైతే పది..!


పైసా బిస్కట్లు ఐదు..అర్ధణా కు రెండు బిస్కట్లయితే మూడు..!

తాటితాండ్ర..ఇనుప చువ్వకు గుచ్చి చూరుకు వేలాడదీసేది బూబమ్మ..!

అవైతే..రెండు వచ్చి ఒక పైసా తో రెండు బిస్కట్లు వచ్చేవి.


కోమటి సుబ్బారావు కొట్టుకాడ ..యాలక్కాయ బిళ్ళలు.ఒకటి మూడు పైసలు..మిగతా రెండు పైసలకి నిమ్మతొనలు నాలుగు వచ్చేవి..!


దీపావళి తుపాకి రీళ్ళుపెట్టె  ఒకటి..!

కేపుల పెట్టి అయితే ఒకటి వచ్చేవి.


సిసింద్రీ లు ఐదు ..!

తాటాకు టపాకాయలు కూడా ఐదు వచ్చేవి..!


రేగిపళ్ళు సోలడు వచ్చేవి.

ఉడకపెట్టిన తెల్లదుంపలు పెద్దవి రెండు వచ్చేవి.

మొక్కజొన్న పొత్తు కొంచెం చిన్న సైజు నిప్పుల మీద కాల్చి ఇచ్చేవారు.


నేతిబాలకృష్ణ రోడ్డుమీద బల్ల మిఠాయి కొట్లో బెల్లం కొమ్ముల పొట్లాం ..చిన్న జంతికలు అయితే రెండు..మిరపకాయ బజ్జీ అయితే ఒకటి ఇచ్చేవాడు..ఐదుపైసలకు..!


లచ్చయ్య కొట్లో గోలీ సోడా అర్ధణా ..మిగతా రెండు పైసలకి చిన్న బెల్లం మిఠాయి ఉండ ఇచ్చేవాడు.


హైస్కూలు కాడ ఐసు బండి సముద్రం కలర్ డ్రింక్ ఐదుపైసలకే ఇచ్చేవాడు..అందులో సబ్జా గింజలు కూడా వేసేవాడు.


ఐదు పైసలకి చిల్లర కూడా ఇచ్చేవారు..!

అందులోంచి అడుక్కునే వారికి పైసా ఇచ్చేవారు..వారు కూడా సంతోషంగా తీసుకునేవారు.


రాజానగరం నుంచి వచ్చే  రొట్టెల పెట్టె వీరబ్బాయి..మొబైల్ బేకరీ లో..!

ఒక కప్పు కేక్..లేదా పది వాము బిస్కట్లు..వెన్నా బిస్కట్ అయితే ఒకటి వచ్చేది.


తేగలయితే ఒకటి..పీత ముంజులు మూడు వచ్చేవి.


పాకెట్ మనీ ఐదు పైసలు ఇస్తే బోల్డన్ని కొనుక్కునే వాళ్ళం..!


ఐదు పైసలకు ఎంతో విలువుండేది..!


అలాగే అప్పట్లో ఒక హీరో మొఖం అచ్చం ఐదు పైసలు బిళ్ళలాగే ఉండేది.

1 comment:

  1. ఎవరండీ మాస్టారు ఆ హీరో గారు

    ReplyDelete

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE