NaReN

NaReN

Saturday, March 5, 2022

కూరగాయల మజాకా....

 కూరగాయలా మజాకా..😜


*గోంగూరకి* ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను గుంటూరు వాసినని...


*పొట్లకాయకి* పొగరు ఎక్కువ.. 

ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని....


*చిక్కుడుకు* చికాకు ఎక్కువ.. 

ఎందుకంటే తనని గోరుతో గోకుతారని....


*కందకి* వెటకారం ఎక్కువ..

ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని....


*వంకాయకి* గర్వమెక్కువ ..

కూరగాయలన్నింటికీ తనే రారాజునని....


*బెండకాయకి* ఆనందమెక్కువ..

తనను మగువల చేతివేళ్ళతో పోలుస్తారని....


*దొండకాయకి* ఆందోళనెక్కువ.. 

కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని....


*కాకరకాయకి* శాంతమెక్కువ.. 

ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా....


*బంగాళాదుంపకి* సహనమెక్కువ..

కూరలకైనా, చిరుతిండ్లకైనా, పూరీకైనా, పానీపూరీకైనా అన్నీంటికీ తానే దిక్కు మరి....


*గుమ్మడికాయకి* గాంభీర్యమెక్కువ.. కూరగాయలన్నీంటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా....


*ఉల్లిపాయకి* టెక్కు I ఎక్కువ..

తానులేనిదే ఆ కూరగాయలకి రుచి ఎక్కడిదని....


*మిర్చికి* కోపమెక్కువ..

ముందు నోటినీ, తరువాత కడుపుని మండించేస్తుంది....


*కరివేపాకుకి* మిడిసిపాటు ఎక్కువ..

తాను కొంచెమైనా కూర సువాసనకి తానే దిక్కుఅని....


*బీరకాయకి* దిగులెక్కువ..

తనను ఎడాపెడా వాడేస్తారని, పీచుని కూడా వదలరని....


*కారెట్ కి బీట్ రూట్ కి* హంగామా ఎక్కువ..

తమంతటి రంగు ఎవరికీ లేదని....!!

😊😊😁😁😜😜



No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE