NaReN

NaReN

Monday, March 28, 2022

RRR కాపీ చరిత్ర

 రాజమౌళి RRR కోసం ఎన్ని మూవీస్  కాపీ చేసాడో .. : 


నక్క ,పులి జూనియర్ ఎన్ టి ఆర్ ను తరమటం  "Apocalypto " మూవీ లోది ...దీనికి పొడిగింపు పులి ఎన్ టి ఆర్ మొహం దగ్గరకు వచ్చి గాండ్రించటం అనేది "10,000 BC " మూవీ లోది ....ఆ తరవాత పులిని బందించటానికి బలం గా కొక్కేలు లాగి బిగించే సీన్ కూడా "Avengers ఇన్ఫినిటీ  war   " మూవీ లోది ....


ఎత్తైన కట్టడం మీద తుపాకీ పట్టుకుని కాపలా కాసే గన్ మెన్ మీదకు    రాంచరణ్ ఎన్ టి ఆర్ ను పైకి విసిరే సీన్ "Kung Fu Panda 2 " లోది ..


రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ లో జనం గుమిగూడి ఉంటారు అక్కడ ఫైట్  ఈ సీన్ కూడా "10,000 BC "  లోది ..రామ్ చరణ్ బాక్సింగ్ చేసే సన్నివేశం "The Avengers " మూవీ లోది ..రామ్ చరణ్ గుర్రం మీద ,ఎన్ టి ఆర్ బైక్ మీద వెళ్లే సీన్ "Ghost Rider " లోది ...

వాటర్ .నిప్పు లతో వదిలిన ట్రైలర్ కూడా "Game of Thrones " లోది ...అలాగే అల్లూరి సీతారామరాజు లుక్ తో వాడిలా పోస్టర్ కూడా కాపీ నే ఇది "Ong-Bak: The Thai Warrior (2003) లోది ..రాంచరణ్ ,జూనియర్ ఎన్ టి ఆర్ ఒకరి హాండ్స్ ఒకరు పట్టుకోవటం ఆ సీన్ "Star Wars: The Old Republic " లోది 300 మూవీ లో సీన్స్ కూడా ఉన్నాయి . ..ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో మూవీస్ లో సీన్స్ అన్ని ఒకే సినిమాలో  కాపీ చేసి తీసాడు ...


The Motorcycle Diaries (2004) ఇది చేగువేరా బేస్డ్ మూవీ ఈ మూవీ చూసే రాజమౌళి అల్లూరి సీతారామరాజును ,కొమరం భీమ్ ను కలుపుతూ ఒక ఊహాజనితమైన కథ తో తియ్యాలనుకున్నాడు ..అయితే తీసింది ఏంటి ?  కోయిల మాదిరిగా మధురం గా పాడే గోండు పిల్లతో పాట పాడించుకుని ఎత్తుకుపోవటం ఆ పాప కోసం వెతకటం ..ఇది అపుడెపుడో రాజశేఖర్ హీరో గా వచ్చిన " పాప కోసం" అనే సినిమా కాన్సెప్ట్ ..దీనినే కాస్త మార్చి అదే దర్శకుడు చిరంజీవి తో " చూడాలని ఉంది " మూవీ తీసాడు ...రాజశేఖర్ మూవీ ప్లాప్ అయినా ఈ చిరంజీవి మూవీ పెద్ద హిట్ అయ్యింది ... పృథివిరాజ్ సుకుమారన్ మాస్టర్స్ అనే మళయాళం మూవీ  , "సుభాష్ చంద్రబోస్ " అనే వెంకటేష్ మూవీ ,మోహన్ లాల్ "మన్యం పులి "  జంగిల్ బుక్ అనే సీరియల్ ఇలా ఎన్నో గుర్తుకు వస్తాయి..ఇలా ఎన్నో మూవీస్ ను రెఫరెన్సు గా తీసుకున్నాడు .. జైల్లో రామ్ చరణ్ ని చూస్తే "వేట" లో చిరంజీవి సీన్ స్ఫురణకొస్తుంది. 

* అజయ్ దేవగన్ ఆత్మాహుతి సీన్ చూస్తే "జీరో డార్క్ 30" లోని ఒక్క సన్నివేశం జ్ఞప్తికొస్తుంది. 

* స్కాట్ దొరగారి సతీమణి పతీసమేతంగా కూర్చుని ఎన్.టి.ఆర్ ని కొట్టమని చెప్పే సీన్ చూస్తుంటే మైకేల్ జాక్సన్ "రిమెంబర్ ద టైం" పాటలోని ఈజిప్షియన్ రాజు రాణి ట్రాక్ లాగ అనిపిస్తుంది. 

* కొమరం భీం, చిన్నదొరసాని కలిసి డ్యాన్స్ చేసే సీన్ చూస్తే "టైటానిక్" కూడా జరంత యాదికొస్తుంది.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE