NaReN

NaReN

Saturday, March 26, 2022

ఆలోచన లేని ఆవేశం నష్టం!



           *ఆలోచన లేని ఆవేశం నష్టం!*

                   ➖➖➖✍️


     *ఒక పాము   వడ్రంగి  దుకాణంలో కి దూరి,  అక్కడ వున్న  ఱంపంపై నుండి ప్రాకినప్పుడు     పాముకు      స్వల్పంగా గాయమైంది.*


    *వెంటనే పాము కోపంతో ఱంపమును గట్టిగా కరిచింది. *


    *ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది.*


         *పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, ఱంపం తనపై ఎదురు దాడి చేస్తోందనుకుని  వెంటనే  ఱంపమును గట్టిగా  చుట్టుకుని,     తన  బలమంతా వుపయోగించి,   ఱంపమునకు  ఊపిరి అందకుండా  చేసి      చంపివేయాలని నిర్ణయించుకొని,   చివరికి   తన  ప్రాణం మీదకే  తెచ్చుకొంది.*


     *మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో  మనకు కష్టం కలిగించిన   వారిపై       యిలానే స్పందించి‌,    చివరకు   మనమే    పెద్ద ఆపదలకు గురి అవుతాము.*


  *అవతలి వ్యక్తికి అసలు జరిగినదానికి సంబంధం లేదని  తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరిగిపోతుంది.*


    *జీవితం ప్రశాంతంగా  వుండాలంటే  కొన్నిసార్లు   అనవసరమైన   కొన్ని          పరి స్థితుల్ని,   మనుషులను,  వారి ప్రవర్తనను వారిమాటలను, అసూయలను మరియు ద్వేషాలను  పట్టించుకోకుండా    వుండ వలసి వుంటుంది.*


    *కొన్నిసార్లు అసలు   ప్రతిస్పందించక పోవడమే  మంచిది....*✍️️


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE