NaReN

NaReN

Thursday, March 24, 2022

ఆనందానికి అందమైన నియమాలు

 ఆనందానికి  అందమైన నియమాలు

1) మనల్ని మనమే ఎక్కువగా ప్రేమించుకోవాలి..  

2)   ఎవ్వరితోనూ బేరాలాడవద్దు‌. పదో ఇరవయ్యో ఎక్కువ ఇచ్చినంత మాత్రాన మనం నష్టపోయేదీలేదు..  

3) వాదనలు, ప్రతివాదనలు, వితండవాదనలు చేయకూడదు.  దీనివల్ల ఆరోగ్యపరంగా నష్టపోయేది మనమే..  

4) ఏ విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకో కూడదు.  తేలికగా తీసుకోవాలి.  లేకపోతే మనస్తాపం వలన నష్టాలు తప్పవు‌.. 

 5) సపోర్ట్ లేకుండా మెట్లు ఎక్కడం దిగడం చేయవద్దు‌.. 

 6) చింతన చింతను దూరం చేస్తుంది.  మన అభిరుచులకు తగ్గట్లుగా మన దినచర్యని మలుచుకోవాలి..  

7) ఎవ్వరిపైనా నెగెటివిటి వద్దు. సదభిప్రాయం, సద్భావన, సానుకూలత ముఖ్యం. 

 8) ఇతరుల..  ముఖ్యంగా మన పిల్లల జీవితాలలో మన జోక్యం చేసుకోకూడదు.  అడిగితేనే సలహా ఇవ్వాలి..  

9) కంపేరిజన్ వద్దు.  కమిట్మెంట్ వుండాలి..

  10) ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందర తగదు..   

11)  3 ఆ లే మన ధ్యేయం కావాలి.  అవి   ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం.‌.  

12) నవ్వే టానిక్, మంచితనమే మెడిసిన్, పాత గుర్తులు, బంధాలే మంచి బూస్టర్స్..  ---- 

పండంటి జీవితానికి పన్నెండు విలువైన సూత్రాలు ఇవి..   పాటిస్తే  అంతా మన మంచికే...

1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE