NaReN

NaReN

Monday, March 7, 2022

వయస్సు యాభై (50) దాటుతుందంటే..

 వయస్సు యాభై (50) దాటుతుందంటే..


* మీరు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి. మీ కుటుంబానికి మీరే ఆధారం. మీ వయస్సు 50 ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే . అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి.. ఆరోగ్యం కాపాడుకోండి.. యవ్వనంగా కనిపించండి.. 


అవేమిటంటే.. 

*👉ఒకటో సూత్రం..* ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి.. 

1. బి.పి., 

2. షుగరు..

*👉రెండో సూత్రం..* ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి. 

1. ఉప్పు, 

2. చక్కెర, 

3. డైరీ తయారీలు, 

4. పిండిపదార్థాలు

*👉మూడో సూత్రం..* ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి. 

1. ఆకుకూరలు, 

2. కూరగాయలు, 

3. పండ్లు, 

4. గింజలు

*👉నాలుగో సూత్రం..* ఈ మూడింటిని మరచిపొండి. 

1. మీ వయస్సు, 

2. గడిచిపోయిన రోజులు,

3. కోపతాపాలు

*👉ఐదో సూత్రం ..* ఈ మూడింటినీ పొందుటకు చూడండి. 

1. ప్రాణ స్నేహితులు, 

2. ప్రేమించే కుటుంబం, 

3. ఉన్నతమైన ఆలోచనలు

*👉ఆరో సూత్రం ..* ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి. 

1. నియమిత ఉపవాసం, 

2. నవ్వడం, 

3. వ్యాయామం, 

4. బరువు తగ్గుట 

*👉ఏడో సూత్రం..* ఈ నాలుగు విషయాలకై ఎదురు చూడకండి. 

1. నిద్ర పోవడానికై నిద్ర వచ్చేవరకు కాచుకొని ఉండకండి. 

2. విశ్రాంతి తీసుకోవడానికై అలసిపోయే వరకు ఉండకండి.

3. స్నేహితుడిని కలవడానికై అతను ఎదురుచూడడం మానేసేంత ఆలస్యం చేయకండి.

4. దేవుడిని పూజించుటకై కష్టాలు వచ్చేంతవరకు ఆగకండి.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE