NaReN

NaReN

Sunday, March 27, 2022

మనకు శత్రువులు ఎవరు ?

 *మనకు శత్రువులు ఎవరు ? మనమేం చెయ్యాలి ?*


1.మన అజ్ఞానమే మనకు మొదటి శత్రువు.


2.మన పిరికితనమే మన రెండవ శత్రువు.


3.మన సోమరితనమే మన మూఢవ శత్రువు.


మనకు బయట ఉండే శత్రువులకంటే మనలో ఉండే శత్రువులే చాలా ప్రమాదకరం..


అజ్ఞానం అనే శత్రువు నిన్ను బయటి ప్రపంచానికి పరిచయం చెయ్యదు.


పిరికితనం అనే శత్రువు నిన్ను బయటి ప్రపంచంతో పోటి పడనివ్వదు.


సోమరితనం అనే మూడవ శత్రువు నిన్ను ముందుకు సాగానివ్వదు.

     

        *మనం చేసే పొరపాట్లు ఏంటి ?*


1.ఇతరులతో పోల్చుకోవడం.

2.ఇతరుల విజయాన్ని అస్యహించుకోవడం.

3.ఇతరుల బలహీనతలపై బలం ప్రయోగించడం 


        *మనం దేనిపైన దృష్టిసారించాలి ?*

1.మన లక్ష్యం.

2.మన బాధ్యత.

3.మన గమ్యం.


ఇతరుల విజయాన్ని చూసి చప్పట్లు కొట్టలే తప్ప 

అసంతృప్తి చెందకుడదు.

ఎప్పుడైతే నీవు ఇతరులను పడగొట్టాలని చూస్తావో అప్పుడు నీవె పడిపోతావు అనేదే జగమెరిగిన సత్యం.


మన దేశంలో చాలమంది యువత పక్కవాడి గురించి ఆలోచనాచేయ్యడం లో సమయాన్ని ఎక్కువగా వెచ్చించి విజయాన్ని అవరోధించలేకపోతున్నారు ఇది నగ్న సత్యం.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE