NaReN

NaReN

Monday, March 7, 2022

అరుదైన అద్భుతం ఆడవాళ్లు

  అరుదైన అద్భుతం ఆడవాళ్లు


ప్రేమను పంచిపెట్టడంలో మాటలకందని మాతృత్వం.

గెలుపు అయినా ఓటమి అయినా చేయి వదలక బాసట నిలిచే స్నేహ సాంగత్యం.

చరాచర జగత్తుకు ఆనంద అందాలను అందించే ప్రేమామృతం.

ప్రతి హృదయ స్పందనకు జాలువారే కన్నీటి సున్నితత్వం.

సమస్త సృష్టిలోని అనంత మధురాలలో మృదు మకరందం.

నిరంతర కాల చక్రంతో పోటీ పడుతూ అలుపెరుగని సహనం.

దుష్ట శిక్షణలో దుర్మార్గుల పాలిట మూర్తీభవించిన పరాశక్తి ప్రతిరూపం.

చివరి శ్వాస వరకు తన వాళ్ళ కోసం తనను తాను అర్పించుకొనే ఔన్నత్యం.

 *" మహిళ " !* 


ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి గెలుపు పతాకం ఆవిష్కరించినా...

గడప దాటి విశాల గగనతలంలో విహరించినా...

విశ్వంతరాలలోనికి చొచ్చుకుపోయి అంగారకుడి పై అడుగులు మోపినా...

పురుషాధిక్య సమాజంలో బహు ముఖ ప్రజ్ఞతో దేశాలనేలినా...

సమానత్వ హక్కులపై సమాజ పోరాటమే చేసినా...

అనితర సాధ్యాలన్ని అలవోకగా సుసాధ్యాలు చేసినా....


 తాను కోరుకునేది....

శత కోటి *మహిళా*

*దినోత్సవ శుభాకాంక్షలు*  కాదు...


 *ఓటమి లో ఓ ఓదార్పు !!* 

 *విజయోత్సాహంలో ఓ చిరు ప్రశంస !!* 

 *దుఃఖం లో ఓ ఆత్మీయ స్పర్శ !!* 

 *ఆనందం లో ఓ చిరునవ్వు !!* 

 *నేనున్నా అంటూ ఓ తోడు !!* 

 *తనను తాను గా గుర్తించే ఓ ప్రేమ !!* 


సునిసిత భావజాలాలను తన అస్థిత్వంలో నిలుపుకొని వెన్నెల జాజులు పూయించి అల్లుకుపోయే ప్రేమలత ఈ *" అతివ ".* 


అందరికీ అర్థం కాని 

 *" అరుదైన అద్భుతం "* 

 *" అనిర్వచీయమైన ఆనందం "* 


ఈ *అతివ*


 *ఆడవాళ్ళూ మీకు జోహార్లు!!*

*అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు*


పసుపులేటి నరేంద్రస్వామి

1 comment:

  1. విషయాన్ని వ్యక్తీకరించిన విధానం బావుంది sir 👌

    ReplyDelete

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE