NaReN

NaReN

Tuesday, March 22, 2022

మీ టైమ్‌టేబుల్‌ ఎలా ఉంది?


మీ టైమ్‌టేబుల్‌ ఎలా ఉంది?


పరీక్షల కోసం సిద్ధమవటం అంటే.. వరసగా పుస్తకాలు చదివేస్తూపోవటం కాదు. అందుబాటులో ఉన్న వ్యవధికి అనుగుణంగా టైమ్‌టేబుల్‌ వేసుకుని ప్రణాళికతో చదవాలి.


* కొన్ని సబ్జెక్టుల్లో చదవాల్సినవి చాలా ఉంటాయి. మరికొన్నింటిని చదవడం ఇప్పటికే పూర్తయి ఉంటుంది. దేనికెంత అవసరమో గుర్తించి ఆ ప్రకారం సమయం కేటాయించుకోవాలి. చదవాల్సినవి ఎక్కువగా ఉండి, క్లిష్టంగా ఉండే సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించుకుంటే ఒత్తిడి ఉండదు.

* ప్రతిరోజూ ఒక్కో సబ్జెక్టుకు ఎంత సమయాన్ని కేటాయించగలరు, ఈ సమయంలో చేయాల్సిన ఇతర పనులు ఏమైనా ఉన్నాయా... వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆచరణ సాధ్యమైన టైమ్‌టేబుల్‌ వేసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. ఏ సమయంలో చదవడం అనుకూలమో, ఎక్కువ సౌకర్యమో చూసుకోవాలి. అంతరాయం లేకుండా ఎక్కువసేపు చదవగలిగే సమయమేదో గుర్తించి, ఆ సమయంలో ఎక్కువ చదివేలా చూసుకుంటే చాలు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే సబ్జెక్టులు చదవటానికి సమయం కేటాయించుకోవాలి.



పరిస్థితులు ఏమైనా మారినప్పుడు వాటికి అనుగుణంగా మళ్లీ సమయాలను మార్చుకోవడానికి సందేహించకూడదు!


రివిజన్‌ ఎందుకంత ముఖ్యం?


చాలామంది విద్యార్థులు రివిజన్‌ (పునశ్చరణ) విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ‘బాగానే చదివా కదా, పరీక్షల్లో తేలిగ్గానే రాసేస్తా’ అనే ధీమా కావొచ్చు. లేకపోతే చదివినవే మళ్లీ చదవాలంటే విసుగూ, కొంత బద్ధకమూ.. ఏదైనా కావొచ్చు.  

నేర్చుకున్న పాఠ్యాంశాలను మళ్లీ ఓసారి చదవకపోతే రోజులు గడిచేకొద్దీ అవి జ్ఞాపకాల్లోంచి తొలగిపోతాయి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు దీన్ని రుజువు చేశారు.


ఇప్పుడు 100 శాతం గుర్తున్న సబ్జెక్టు విషయాలు వాటినిక పట్టించుకోకపోతే


1 గంట తర్వాత 56 శాతం  

1 రోజు తర్వాత 66 శాతం  

6 రోజుల తర్వాత 75 శాతం .. మర్చిపోతాం.


అందుకే ఒకసారి చదివి ‘వచ్చాయిలే’ అని ఊరుకోకుండా వాటిని తప్పనిసరిగా శ్రద్ధగా రివిజన్‌ చేయాలి. అప్పుడే పరీక్షల్లో సంపూర్ణంగా గుర్తు చేసుకుని రాయగలుగుతాం.

1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE