NaReN

NaReN

Monday, March 7, 2022

టీచర్ చేతిలో బెత్తం పోలీసు తూటాలను తప్పిస్తుంది

 

టీచర్ చేతిలో బెత్తం పోలీసు తూటాలను తప్పిస్తుంది

విద్యార్థికి బడి మీద భయం లేదు, భక్తి లేదు…

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
బడి… బడి కంచెగా వాయిల్ చెట్లు… వాటి కొమ్మలు సన్నగా ఉంటయ్, వాటితో కొడితే వాతలు తేలతయ్… వాటిని విరిచేకొద్దీ వేగంగా కొత్త కొమ్మలు పుట్టుకొచ్చేవి… విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టే డ్యూటీ తమదే అన్నట్టుగా పెరిగేవి… పిల్లల్లో ఎవరైనా తప్పు చేసినా, చెప్పిన హోంవర్క్ చేసుకురాకపోయినా వాయిల్ కొమ్మకు పనిపడేది… ప్రధానంగా అరచేతులు ఎర్రెర్రగా సుర్రుసుర్రుమనేవి… ఉఫ్ ఉఫ్ అని రెండు రోజులు ఊదుకోవాల్సిందే… కానీ ఆ దెబ్బ జీవితమంతా గుర్తుండేది… ఇప్పుడు వాయిల్ చెట్లు కనిపించడం లేదు… వాటి అవసరం కూడా లేకుండా పోయింది…
ఇదేనా..?
కోదండం ఎక్కించడం,
గోడకుర్చీ వరకు బోలెడు…
దండం దశగుణం భవేత్…
కొందరు మాటలతో మారరు, వాయిల్ బరిగే మాత్రమే ‘లైన్’లో పెడుతుంది…
కొందరికి జస్ట్, తరగతి గదిలో ఓసారి బెంచీ ఎక్కిస్తే చాలు… అయితే ఇక్కడ టీచర్ ద్వేషంతో గానీ, కక్షతో గానీ, దురుద్దేశంతో గానీ చేయడం లేదు…
భయం, భక్తి, క్రమశిక్షణ కోసమే కదా…
ఇప్పటితరానికి ఇవన్నీ తెలియకపోవచ్చుగాక,
40-50-60 ఏళ్ల వయస్సున్నవాళ్లలో సగం మంది వాయిల్ బరిగెలను ముద్దాడినవాళ్లే…
వాటికి దండాలు పెట్టినవాళ్లే…
ఓ మూడో తరగతి పిల్లాడు టీచర్ కొడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడట… మీడియా, సోషల్ మీడియా టాంటాం… (అసలు వ్యవస్థకు పెద్ద శాపాలు ఇవే కదా…)
కొన్ని జాతీయ మీడియా సైట్లలో కూడా ఈ వార్త కనిపించింది… మళ్లీ అదే పిల్లాడు కల్లు మండువాలో కనిపించాడని మళ్లీ ఫోటోలు, మళ్లీ వైరల్… అదే మీడియా, అదే సోషల్ మీడియా… తాగితే తాగాడు, అది కాదు.. నిజంగా టీచర్ తనను కొట్టాడా..? కొడితే ఎందుకు కొట్టాడు..? అసలు ఈరోజుల్లో ఒక పిల్లవాడిని కొట్టేంత సీన్ ఉందా అసలు..? ఇవీ ప్రశ్నలే కదా…
ఓ టీచర్ అన్నాడు ‘‘ఒక పిల్లాడిని ఒక దెబ్బ కొడితే ఏమవుద్ది..? మానవహక్కులు, బాలలహక్కులు, ఉద్యమసంఘాలు బోలెడు రచ్చ… అందుకే భయం లేదు, భక్తి లేదు ఇప్పుడు… బడికి వెళ్లామా, అటెండెన్స్ వేశామా, ఏదో పాఠం చెప్పామా, వచ్చేశామా… ఇంతే… కొత్తతరాలకు నాలుగు అక్షరాలు బోధించి, దారి చూపించాల్సిన బడి ఎప్పుడో దారితప్పింది… కాదు, సొసైటీయే దారితప్పించింది…
రాజకీయాలు, పేరెంట్స్, సొసైటీ, సంఘాలు, మీడియా అందరూ బాధ్యులే…’’ చాలామంది టీచర్లలో ఈ బాధ ఉంది…
కానీ బయటపడరు…
ఒక వాదన నిజమే…
ఈ పనిష్మెంట్లు పాతకాలం, అనాగరికం…
పిల్లాడిలో బడి పట్ల భయాన్ని, ద్వేషాన్ని నింపి, డ్రాపవుట్గా మార్చేస్తయ్…
బడిని, పాఠాన్ని ప్రేమించే వాతావరణమే లేనప్పుడు ఏ పనిష్మెంటూ పనిచేయదు…
ఐనా ఈకాలంలో ఎవరినీ పల్లెత్తు మాట అనే స్థితే లేదు…
ఇక పనిష్మెంట్లు ఎక్కడివి..?
టీచర్ చేతిలో బెత్తం పోలీసు లాఠీ కాదు, అది శిక్షించేది, ఇది శిక్షణనిచ్చేది… (పిల్లాడిని టీచర్ కొడితే తప్పేమిటి అనే సమర్థన కథనం కాదు ఇది… ఒక డిబేట్ ప్రయత్నం…)
అనేకచోట్ల పిల్లలే టీచర్లకు పనిష్మెంట్లు ఇస్తున్నారు…
ఈ చర్చంతా శుద్ధదండుగ అనుకుందాం…
ఈ స్మార్ట్ ఫోన్లు,
ఈ సినిమాలు,
ఈ వెకిలి సీన్లు,
ఈ సోషల్ మీడియా పుణ్యమాని పిల్లలు ఏం చదువుతున్నారు..? ఏం నేర్చుకుంటున్నారు..?
ఎలా పెరుగుతున్నారు..?
ఈ మీడియా, ఈ పాలిటిక్స్, ఈ సొసైటీని వదిలేసి చూసినా కనీసం పేరెంట్స్ అయినా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా..?
ఇదీ పెద్ద ప్రశ్న..!!
ఈ కాలంలో క్రూరమైన పనిష్మెంట్లు అనాగరికమే, కాదనలేం…

కానీ కనీసం గట్టిగా సైలెన్స్ అని గద్దించే సిట్యుయేషన్ అయినా ఈరోజు స్కూల్లో ఉందా..?

*మరి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి*
*ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమాజం విద్యార్థుల పోకడలపై చర్చ చేస్తే దారులు వెతకొచ్చు*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
పసుపులేటి నరేంద్రస్వామి

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE