NaReN

NaReN

Wednesday, March 23, 2022

ఉచితం

 🍁ఉచితం🍁

ఒక రోజున దొంగ ఒకడు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు.

ఇంటి ముందు కాపలాగా ఒక కుక్క ఉన్నది. దొంగను చూసింది కానీ ఏ చప్పుడు చేయకుండా చూస్తూ ఉన్నది. అతన్ని చూసి మొరగని కుక్కను చూసి దొంగ ఆలోచనలో పడ్డాడు. దొంగతనానికి వెళదామా? వద్దా? అని.

తీరా ఇంటి లోపలకు వెళ్ళాక కుక్క అరిచిందంటే ఏం చేయాలి? ఇప్పుడే అరిస్తే వేరే ఇంటికి దొంగతనానికి వెళ్లొచ్చు! అని అనుకున్నాడు.

ఇలా ఆలోచిస్తూ చివరగా తాను తెచ్చిన రొట్టెముక్కను  కుక్కకు విసిరాడు. అంతే వెంటనే ఆ కుక్క గట్టిగా అరుస్తూ అతని వెంటపడి కరవడానికి ప్రయత్నించింది.

అప్పుడు దొంగ కుక్కతో ఇలా అన్నాడు. "నన్ను చూసికూడా అరవని నువ్వు రొట్టె ముక్క ఇవ్వగానే అరుస్తున్నావు ఎందుకు?" అని అడిగాడు.

నువ్వు ఊరికే ఉన్నప్పుడు, ఒకవేళ నువ్వు ఈ ఇంటి బంధువో లేక తెలిసిన వ్యక్తో అయిఉంటావని  అనుకున్నాను.

కానీ ఎప్పుడైతే నువ్వు "ఉచితంగా రొట్టెముక్క  ఇచ్చావో అప్పుడే నాకు అర్థమయింది నువ్వు దొంగవని", అని బదులిచ్చింది ఆ కుక్క.

ఆలోచించవలసిన విషయమే కదండీ ఇది. ఉచితం అనగానే ఆలోచన మరిచి ఎగబడుతున్నారు జనాలు.

"ఉచితంగా రొట్టె" ఇచ్చాడంటే అందులో ఎంతటి అర్థం ఉందో గ్రహించింది కుక్క. కానీ మషులమైన మనమే "ఉచితంగా డబ్బులు" ఎందుకు ఇస్తునారో గ్రహించలేక పోతున్నాం.

 *_ఒక కుక్క గ్రహించిన చిన్న విషయాన్ని కూడా మానవులమైన మనం గ్రహించలేక పోతున్నందుకు  చాల బాధగా ఉంది*._

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE