NaReN

NaReN

Monday, March 7, 2022

అంతర్జాతీయ మహిళా దినోత్సవం...

 🌍 *అంతర్జాతీయ మహిళా దినోత్సవం... అసలు ఎలా పుట్టింది..❓*


*📡మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదర్భంగా✍️*    


 *ప్రత్యేకంగా మహిళలు సెలబ్రేట్ చేసుకునే రోజు... మన నేతలు వేదికలు ఎక్కి... మహిళల గురించి గొప్పలు చెప్పేరోజు...*

*ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు.. పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతోంది. ఆడవారి కష్టానికి గుర్తింపుగా మార్చి 8న ఇంటర్నేషనల్‌‌ ఉమెన్స్‌‌ డే చేసుకుంటున్నారు.*


🌍 *అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. 1908 సంవత్సరంలో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. అంతేకాదు..1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం - శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2  సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా  దినోత్సవం జరుపుకుంటున్నారు. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ  శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి.*


🌍అంతర్జాతీయ మహిళా దినోత్సవం.


*💥సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. వాస్తవంగా.. కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం ఈ దినోత్సవం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. కుటుంబ, ఆర్థిక భారాలను సైతం నేడు స్త్రీ శక్తి లాగుతోంది. ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోంది. మేం ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతా సాధిస్తున్న ఇంకా అణచివేతకు గురవుతూనే ఉన్నారు. దీని నుంచి వారిని రక్షించాలంటే చట్టాలు మరింత కఠినతరం చేయడంతో పాటు ఆలోచిన విధానంలో మార్పులు రావాల్సి ఉంది. ఆర్ట్స్, లిటరెచర్, సినిమాలు మహిళలను ప్రముఖ్యాన్ని పెంచేవిగా ఉండాలి.*


పసుపులేటి నరేంద్రస్వామి


*International Womens Day*

 - 2022



    

Womens Day 2022: ఈ ఏడాది ఉమెన్స్ డే థీమ్.. 

*స్థిరమైన రేపటి కోసం.. రేపటి మహిళలు.. లింగ సమానత్వం*

 

*Gender equality Today for a sustainable Tomorrow*


అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’S Day) ప్రతి సంవత్సరం మార్చి 8(March 8th)న జరుపుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని  మంగళవారం(Tuesday) జరుపుకోనున్నారు. 


మహిళలకు ఆర్థిక, రాజకీయ, సామాజికం సహా అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ఈ వేడుకలను జరుపుకుంటారు. అయితే ఈ వేడుకలు జరుపుకోవడం మొదలు పెట్టి వందేళ్లు దాటాయి. అయినప్పటికీ ఇప్పటికీ మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.  ఈ నేపథ్యంలో ఈ ఏడాది థీమ్, చరిత్ర గురించి తెలుసుకుందాం..


ఈ ఏడాది మహిళాదినోత్సవం థీమ్..  “సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం”.. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది థీమ్ ” రేపటి మహిళలు”.  ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న  మార్పుల సందర్భంలో లింగ సమానత్వాన్ని సాధించడానికి 2022 సంవత్సరం కీలకమైనది. ప్రపంచంలో 21వ శతాబ్దంలో అతి పెద్ద సవాళ్ళలో పర్యావరణ,  విపత్తు ప్రమాదాల తగ్గింపు వంటివి ఉన్నాయి. ఇప్పటికీ లింగ సమానత్వం లేదు. దీంతో మహిళలకు స్థిరమైన భవిష్యత్తు, సమాన భవిష్యత్తు, మన పరిధికి మించినది” అని UN ఉమెన్స్ వెబ్‌సైట్ పేర్కొంది. అంతేకాదు “ఈ సంవత్సరం వాతావరణ మార్పులగురించి.. వాతావరణ పరిరక్షణ కోసం ప్రతిస్పందిస్తూ.. నాయకత్వం వహిస్తున్న మహిళలు, బాలికలను IWD గౌరవించనుంది.



అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర: ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు  1900వ దశకం ప్రారంభం నుండి నిర్వహించబడుతున్నాయి. 1908లో.. 15,000 మంది మహిళలు తమకు పని గంటలు, మెరుగైన వేతనం,  ఓటు హక్కును డిమాండ్ చేస్తూ న్యూయార్క్ నగరంలో భారీ ప్రదర్శన చేశారు. దీంతో మహిళల ఈ డిమాండ్లను గుర్తించి అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. మొదటి జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 28న యునైటెడ్ స్టేట్స్ అంతటా నిర్వహించారు.  అనంతరం 1911లో.. మార్చి 19న ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ , స్విట్జర్లాండ్‌ దేశాలు మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నిజరిపాయి.


ఇక మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా శాంతి కోసం ప్రచారం చేస్తూ.. రష్యా మహిళలు తమ మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 23న ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు. తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మార్చి 8న నిర్వహించడానికి అంగీకరించారు. అప్పటి నుండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8 న జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1975లో ఐక్యరాజ్యసమితి మొదటిసారిగా జరుపుకుంది. UN మొదటి వార్షిక థీమ్‌ను 1996లో “గతాన్ని జరుపుకోవడం, భవిష్యత్తు కోసం ప్రణాళిక”గా ప్రకటించింది.


అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చూచించే రంగులు: ఊదా, ఆకుపచ్చ, తెలుపు అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని సూచించే రంగులు. ఊదా రంగు న్యాయం , గౌరవాన్ని సూచిస్తుంది, ఆకుపచ్చ ఆశను సూచిస్తుంది. తెలుపు స్వచ్ఛతను సూచిస్తుంది.

💐💐💐👏👏👏👏

పసుపులేటి నరేంద్రస్వామి






 



1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE