NaReN

NaReN

Friday, March 18, 2022

పరీక్షలంటే భయమా?

 పరీక్షలంటే భయమా ?

పది నెలలు ఆడుతూ పాడుతూ గడిపేసారుగా!

(రోజు ఏ రోజు పాఠాలు ఆరోజే చదువుకునే వారిగురించి నేను చెప్పబోవటంలేదు) ఇంకా చాలా తక్కువ సమయమే ఉంది బోర్డు పరీక్షలకు. 

ఇప్పటికయినా మించి పోయింది ఏమి లేదు పద్దతిగా చదివితే చాలా మార్కులు తెచ్చుకోవచ్చు


మొబైల్ వాడటం మానైయండి లేదా బాగా తగ్గించండి మొబైల్లో నెట్ కనెక్షన్ కట్ చెయ్యండి అవసరమైతే లాప్టాప్ వాడండి 

టీవీ చూడటం మానేస్తే మంచిది స్నేహితులు ఉసిపోక కబుర్లకు స్వస్తి పలకండి.

 

మీకు కష్టంగ ఉన్న సబ్జెక్టులు ఏమిటో తెలుసుకోండి వాటిలో ఇంపార్టెంట్ వి సెలెక్ట్ చేసుకుని ముందుగా వాటిని అర్ధం చేసుకుంటూ చదవండి. మీకు తొందరగా అర్ధమయ్యి మీరు సొంతంగా వ్రాసే కెపాసిటీ మీకు అలవడుతుంది. కంఠతా వచ్చాయని వదిలేయకుండా కనీసం రోజుకు ఒకసారైనా చదవండి అప్పుడు మీరు మర్చిపోలేరు.

 

*మీరు తెల్లవారు జామున నాలుగు గంటల్నుండే చదవడం ప్రారంభించండి. ఎందుకంటె మీకు డిస్ట్రబెన్స్ ఉండదు ఆ టైంలో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది.

 

ఏమి చదవాలో ఎప్పుడు చదవాలో ఒక టైంటేబిల్ తయారు చేసుకుని దానిని మీ తల్లితండ్రులకు చూపించండి వారు సంతోషించి మిమ్మల్ని ఆ టైంకు చదివేటట్లు శ్రద్ధ తీసుకుంటారు మిమ్మల్ని మీరు నమ్మండి ఆత్మవిశ్వాసం పెంచుకోండి మిమల్ని మీరు ఎప్పుడు తక్కువ గ అంచనా వేసుకోకండి మహాత్మా గాంధీ గారు కూడా మొదట్లో అవేరేజ్ స్టూడెంటే పట్టుదలతో సొంతంగా ఆంగ్లభాషలో పుస్తకాలు వ్రాసే స్థాయికి ఎదిగారు మీరు పాఠాలు చదివి వదిలెయ్యకుండా వాటిని చూసి, చూడక వ్రాయండి జనాబులొ తప్పులుంటే మీరు సరిచేయండి 

మీరు 10వ తరగతి లేదా ఇంటర్ చదివేవారైతే మీరు భవిషత్తులో ఏమిచదువుకోవాలనుకుంటున్నారో ముందుగానే ప్లాన్ చేసుకుని ఒక పద్దతిగా చదివి మంచి మార్కులు తెచ్చుకోండి తద్వారా మీ తల్లితండ్రులకు మీ పైచదువులు చదివేందుకు ఖర్చు తగ్గించిన వాళ్లవుతారు 

తల్లితండ్రులు మీరు పిల్లల్ని అవమానించడం నలుగురిలో చిన్నబుచ్చడం చెయ్యకండి వారితో ప్రేమగా మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాశాన్ని పెంచండి మీరు అనవసరంగ లేనిపోని పనులు పెట్టుకుని అక్కడకు ఇక్కడకు పోకుండా టీవీ చూడటం తగ్గించి పిల్లలమీద, వారి ఆరోగ్యం మీద (పోషక విలువలున్న అందించి) శ్రద్ధ చూపండి 

విద్య ను ఎవ్వరు దొంగిలించలేరు కాబట్టి ఆస్తి పాస్తులకంటే విలువైన విద్యను విద్యార్ధులు అభ్యసించి మీరు ప్రయోజకులై దేశానికీ ఉపయోగపడండి


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE