సరదా కబుర్లు
*************
సోమలత అయాచితుల
ఏమయ్యా, పాపారావ్!!!
వర్క్ ఫ్రంమ్ హోమ్ అని ఇంట్లో
కూర్చుని బాగా ఎన్జాయ్ చేస్తున్నావు.నేను ఫోన్ చేశా.
మీ ఆవిడ ఫోనెత్తి అంటుందీ ,
మా ఆయనవంట చేస్తున్నారు,
నన్నే అంటుందా? తర్వాత ఫోన్ చెయ్యమనీ ??
నువ్వు ఆవిషయం తెలుసుకున్నాక నాకు ఫోన్
చెయ్యాలా? లేదా??
క్లర్క్...అవును సార్!! మా ఆవిడ చెప్పిన వెంటనే మీకు ఫోన్ చేశానండీ.!
కానీ మీ మసెస్ మా వారు అంట్లుతోముతున్నారు, మరల
ఫోన్ చేసి, మీ మాట చెప్పుకోండి అన్నారండీ సార్!
సిస్టర్ ,మీచేతిలో ఆ సీసా ఏమిటీ? అన్నాడు రోగి.
ఏముంటుందయ్యా!! తులసి తీర్ధం . ఇదేమో కార్పోరేట్
హాస్పిటల్!ప్రతిదీ అరేంజ్ చేసి
పెట్టుకోవాలి.అందుకే మీకు ఫైవ్
స్టార్ ట్రీట్మెంట్ ఏమనుకున్నావేమిటి??మీరు చేరిన మోదలు, చివరి దాకా మాదే బాధ్యత.మీ సేవలన్నీ మేమే కదా చూసుకునేదీ?
మీక్కూడా మరో రెండు రోజులలో ఈ తులసి తీర్ధమే
అన్నీరెడీ చేసుకోవద్దూ??
వివరించింది నర్స్.
ఏమండీ!! నేనుమరీ లావుగా కనిపిస్తున్నానా? అంది భార్య.
లేదే! నాకళ్ళకు అలా కనిపించడం లేదే??
అన్నాడు భర్త.
అయితే నన్నెత్తుకెళ్ళి ఆ బీరువా దగ్గరికి తీసికెళ్ళరూ!
గోముగా అడిగింది భార్య.
లేదే ! నేనే ఆ బీరువా నీదగ్గరకు తెస్తా సరేనా ? అన్నాడు భర్త
ఇవేనండీ ! అంతే!!
వామ్మో బీరువా లేపడమే easy నా 😄
ReplyDelete