NaReN

NaReN

Thursday, March 31, 2022

ఒక తండ్రికి కొడుకు నుండి కొన్ని సందేహలు

 🦚🦚🦚🦚♓♓♓🦚🦚🦚   

 ఒక తండ్రికి కొడుకు నుండి కొన్ని సందేహలు


1.మీ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు..

2.విమానాలు లేవు..

3.. ఇంటర్నెట్ లేదు..

4.. Tv లు లేవు..

5.. కంప్యూటర్ లు లేవు..

6.. ఏసీ లు లేవు..

7.. లగ్జరీ కార్ లు లేవు..

8.. మొబైల్ ఫోన్ లు లేవు... 

మీరెలా బతికారు...???            


 దానికి ఆ తరము తండ్రిగారు ఇచ్చిన జవాబు అందరూ చదవ వలసిందే...........  

మీ తరము ఈరోజు కాలంలో ఎలాగైతే 

1.. ప్రార్ధన లేకుండా..

2.. మర్యాద లేకుండా 

3.. ప్లానింగ్ లేకుండా 

4.. క్రమశిక్షణ లేకుండా..

5.. పెద్దల ఎడ గౌరవం లేకుండా..

6.. మన చరిత్ర పై అవగాహన లేకుండా..

7.. కుటుంబ విలువలపై ఏ మాత్రం పట్టింపులు లేకుండా..

8.. Morals లేకుండా... 

ఎలాగైతే హాయిగా రోజులు గడిపేస్తున్నారో... 

మేము వాటిని పాటిస్తూ ఆనందముగా జీవించాము...


మేము మీలాగా... 

1..వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు..

2.. పాఠశాల వేళలు అయినా తదుపరి చీకటి పడేదాకా ఆడుకున్నాము tv లు చూడలేదు...

3.. ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితుల తో గడిపాము..

4..దాహము వేస్తె కుళాయి నీరు తాగాము.. బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు..

5..ఒకేగ్లాస్ లో నలుగురం జ్యూస్ తాగినా మాకెప్పుడూ జబ్బులు రాలేదు..

6..మూడు పూటలా అన్నం తిన్నా మాకు ఊబకాయం రాలేదు...

7.. షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తినా మాకు కీళ్ళ నొప్పులు రాలేదు..

8..సొంత ఆట వస్తువులు తయారు చేసి ఆడుకున్నాము,, బంధువులతో కలసి మెలసి ఆనందముగా ఉన్నాము, పండుగలు కలిసి చేసుకున్నాము..

9.. పిలవకపోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్లి వారి తినుబండారాలు ఆరగించాము..

10.. మావి black and వైట్ ఫొటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు..... 

మాది జీవితాన్ని చదివిన తరము..


బహుశా మాతల్లి దండ్రులు చెప్పినది ఆచరించిన చివరితరం... 

మా వారసులు శాసించినది పాటించే మొదటి తరమూ మాదే కావచ్చు..... 

అయినప్పటికీ.. మీ యాంత్రిక జీవితానికి యధాశక్తి సహాయ పడుతున్న వాళ్ళము... 

మేము ఒక limitted ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళము..... 

అందుకే మా విన్నపము ఏమంటే..


మీ జీవితాలనుండి, ఈరోజు భూమి పైనుండి

మేము వెళ్ళిపోకముందే ఎంతో అంత మా నుండి మీరు నేర్చుకోండి.

CAVEET పిటిషన్ అంటే

 CAVEET పిటిషన్ గురించి  ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా....

1. హై కోర్టు లో జడ్జ్ మెంట్ వచ్చిన కేసు ను, మళ్ళీ సుప్రీం కోర్టు కు అప్పీల్ అప్లికంట్ చేసుకుంటే ఒప్పోసిటే పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తరువాత ఆ కేసు విషయం లో ఇద్దరి వాదనలు విన్న తరువాత తీర్పును ఇవ్వడం జరుగుతుంది.

ఇదే caveet పిటిషన్,,

అంతే తప్ప case వేయవద్దు అనీ, కేసు తీసుకోవద్దు అనీ చెప్పే అధికారం caveet పిటిషన్ కు ఆ అధికారం లేదు.

దయచేసి ఎవరు కూడ అధైర్య పడకండి మిత్రులారా ....

ఒకవేళ ఎదైన విషయం పైన case వేస్తే అపోజిషన్ పార్టీ కి సమాచారం ఇవ్వాలి, ఇరువురి వాదనలు విన్న తరువాత తీర్పును ఇస్తుంది,,, ఇదే CAVEET పిటిషన్...

విశాఖపట్నం జిల్లా చరిత్ర...!!!

 *విశాఖపట్నం జిల్లా చరిత్ర...!!!*


*స్వాతంత్ర్యం రాక ముందు భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క జిల్లా...     విశాఖపట్నం....*


260 బి.సి- అశోక చక్రవర్తీ కళింగ యుద్ధంలో కళింగ దేశాన్ని జయించాడు. *విశాఖపట్టణం అప్పుడు, కళింగ దేశంలో ఒక భాగంగా ఉండేది.*

*13 ఎ.డి - సింహాచలం దేవస్థానం నిర్మాణం జరిగింది.*

208 ఎ.డి - చంద్ర శ్రీ శాతకర్ణి విశాఖప్రాంతాన్ని పాలింఛిన రాజు.

1515ఎ.డి - ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు విశాల సామ్రాజ్యంలో, విశాఖప్రాంతం ఒక భాగం. ఆయన పాలనా కాలంలో, *సింహాచలాన్ని* పలు మార్లు దర్శించి, పచ్చల పతకాన్ని, మరికొన్ని నగలను బహూకరించినట్లు శాసనాలు ఉన్నాయి. ఈ పచ్చల పతకాన్ని గజ్జెల ప్రసాద్ అనే స్టూవర్టుపురం గజదొంగ, దొంగతనం చేసాడు. దొంగ దొరికాడు. కానీ, పచ్చల పతకంలోని పచ్చలు కొంచెం విరిగాయి.


1515లో రాయలు కొండవీడును ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేశాడు. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6న స్వాధీనం చేసుకున్నాడు.

కొండవీడు నుండి కటకం వరకు


కొండవీడు తరువాత *శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయ యాత్ర ఇలా సాగింది.*


అద్దంకి, కేతవరం, అమ్మనబ్రోలు, నాగార్జున కొండ, బెల్లంకొండ దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు.

విజయవాడ సమీపాన ఉన్న కొండపల్లి దుర్గమును రెండునెలలు పోరాడి స్వాధీనం చేసుకున్నాడు.

అనంతగిరి, ఉర్లుగొండ, ఉండ్రుగొండ, అరసవిల్లి, చిట్యాల, నల్లగొండ మొదలైన దుర్గాలను జయించాడు.

కోనసీమ, జమ్మిలోయ, కోరాము, రాజమహేంద్రవరములను జయించాడు.


మాడుగుల, వడ్డాది, సింహాచలములను స్వాధీనం చేసుకొని సింహాచల నరసింహ స్వామిని పూజించి అనేక దాన ధర్మాలు చేసాడు.

కటకం పైకి దండెత్తి ప్రతాపరుద్ర గజపతిని ఓడించి అతని కుమార్తె తుక్కా దేవిని వివాహమాడాడు.

ఈ విజయ పరంపరలకు గుర్తుగా, పొట్నూరు దగ్గర, శ్రీకృష్ణదేవరాయలు విజయస్తంభాన్ని నిర్మించాడు.

ఈ దిగ్విజయ యాత్ర తరువాత రాయలు 1516లో రాజధానికి తిరిగి వచ్చాడు.

17వ శతాబ్దం మధ్య కాలంలో, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడికి దగ్గరలో ఉన్న *విజయనగరంలో ఒక కర్మాగారం నిర్మించారు.*


1689 - ఈ కర్మాగారాన్ని మొఘల్ చక్రవర్తి జౌరంగజీబు సైన్యం ఆక్రమించింది.

1735 - డచ్ దేశీయుల నివాసాలు ఏర్పడ్డాయి. వీరి సమాధులు *భీమునిపట్నంలో ఉన్నాయి.*

1765 - మొఘల్ సామ్రాజ్య పతనం తరువాత, ఉత్తర సర్కారు ప్రాంతాన్ని (విశాఖపట్టణం అందులో ఒక భాగం) ఈస్ట్ ఇండియా కంపెనీ కి దత్తత ఇచ్చారు. అప్పటి నుంచే ఈ ప్రాంతాన్ని *'సర్కారు'* *అని'సర్కారు* *జిల్లాలు' అని పిలవటం* *మొదలైంది.* ఆ సమయంలో, ఇంగ్లీషువారు నివసించటం (కాలనీ) మొదలైంది. ఆ ప్రాంతాన్ని, వన్ టౌన్ ఏరియాలో ఉన్న 'సోల్జియర్ పేట'గా పిలుస్తారు. ఇప్పటికీ, అక్కడ 'ఆంగ్లో ఇండియన్లు ' ఎక్కువగా నివసిస్తున్నారు.

10 జూలై 1831- ఏనుగుల వీరాస్వామయ్య తన పర్యటనలో భాగంగా కాశీ నుంచి తిరుగుప్రయాణంలో విశాఖపట్టణం పరిసర గ్రామాలలో తిరిగాడు. ఆ పరిసర గ్రామాలు విజయనగరం, ఆలమంద, సబ్బవరం, సింహాచలము, కశింకోట, అనకాపల్లి, యలమంచిలి, దివ్యల, నక్కపల్లి, ఉపమాక, తుని, నాగలాపల్లి, యానాం, నీలపల్లి, ఇంజరము, మాదయ పాళెము, ఉప్పాడ.

*1804 సెప్టెంబర్* *విశాఖపట్టణం జిల్లా* *మొట్టమొదటగా* *ఏర్పడింది. (1803 అని కూడా అంటారు).* *1947లో* *స్వాతంత్ర్యం వచ్చేనాటికి,* *భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద జిల్లా* *విశాఖపట్టణం జిల్లా* *అందుకే ఈ పెద్ద జిల్లా* *శ్రీకాకుళం,* *విశాఖపట్టణం,* *విజయనగరం జిల్లాలుగా విడదీసారు.*


1847 సెయింట్ అలోసియస్ అంగ్లో ఇండియన్ ఉన్నత పాఠశాల, *విశాఖపట్టణం* *జిల్లాలోనే, అత్యంత ప్రాచీనమైన పాఠశాల.* *అంతేకాదు, దేశంలోని అత్యంత ప్రాచీనమైన పాఠశాల.* *విశాఖపట్టణంలోని పాత నగరం (ఒన్ టౌన్ ప్రాంతం) లో ఉంది.* ఇండియన్ కౌన్సిల్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐ.సి.ఎస్.ఇ) కి అనుబంధమైన పాఠశాల.

*1902 - ఆంధ్ర వైద్య కళాశాలను స్థాపించారు.*ఈ *వైద్య విద్యార్థులకు కింగ్* *జార్జి ఆసుపత్రిలో శిక్షణ ఇస్తారు*


*1904 - మద్రాసు నుంచి కలకత్తా వరకు విశాఖపట్టణము (నాడు వైజాగ్ పటేంగా ఇంగ్లీషు వాడు పలికే వాడు) మీదుగా రైలు దారిని (రైల్వే) ప్రారంభించారు.*


1907 - బ్రిటిష్ పురాతత్వశాస్త్రవేత్త, అలెగ్జాండర్ రీ, 2000 సంవత్సరాల నాటి బౌద్ధుల కాలంనాటి శిథిలాలను, విశాఖపట్టణానికి 40 కి.మీ దూరంలో ఉన్న శంకరం గురించి వెల్లడించాడు. అక్కడి ప్రజలు, ఆ ప్రాంతాన్ని బొజ్జన్నకొండ అంటారు.


*7 అక్టోబరు 1933 - విశాఖపట్టణం (వైజాగ్ పటేం పోర్టు) పోర్టును స్థాపించారు.*


**6 ఏప్రిల్ 1941 - జపాన్ వారి యుద్ధ విమానాలు విశాఖపట్టణం మీద బాంబులు వేసాయి. ఎవరూ మరణించ లేదు. ఆ భయంతో, విశాఖ వాసులు కొందరు ఇళ్ళు తక్కువ ధరకు అమ్ముకుని విశాఖ వదిలి పోయారు. భయంలేని వారు, ఆ ఇళ్ళను తక్కువ ధరకు కొనుక్కున్న సంగతి, ఆ నాటి తరంవారు కథలుగా చెప్పుతారు.*


*1947 - నేటి తూర్పు నౌకాదళానికి పునాదిగా, 1947లో ఇంగ్లీషు వారు (రాయల్ నేవీ), ఆ నాడు బర్మాలో జరుగుతున్న యుద్ధానికి (రెండవ ప్రపంచ యుద్ధం) సహాయంగా, సరుకులు ఆయుధాలు, రవాణా చేయటానికి ఇక్కడ ఒక 'బేస్' ని స్థాపించారు. దాని పేరే హెచ్.ఎమ్.ఐ.ఎస్. సర్కార్స్ (హెర్ మెజెస్టీ ఇండియన్ షిప్ సర్కార్స్). నేడది ఐ.ఎన్.ఎస్. సర్కార్స్ (ఇండియన్ నేవల్ షిప్) గా పేరు మార్చుకుంది. ఆ నాడు ఇంగ్లీషు వారు వేసిన విత్తనం, నేడు తూర్పు తీరాన్ని అంతా రక్షించే 'తూర్పు నౌకా దళం' అనే వట వృక్షంగా ఎదిగింది.*


*1957 - డాల్ఫిన్స్ నోస్ పైన ఉన్న లైట్ హౌస్ (దీపస్తంభం) ని తిరిగి నిర్మిచారు.*


*1957 - కాల్ట్రెక్స్ (అమెరికాలోని 'కాలిఫోర్నియా'లోని మొదటి కాల్, 'టెక్సాస్' రాష్ట్రంలో 'టెక్స్' కల్లిప్ 'కాల్టెక్స్'గా పేరు పెట్టారు.* 


*ఈ కాల్టెక్స్‌ని నిర్మీంచటానికి, అక్కడ ఉండే మల్కాపురం అనే గ్రామాన్ని ఖాళీ చేయించి, నేటి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఎదురుగా, రోడ్డు దాటిన తరువాత ప్రాంతంలో పునరావాసం కల్పించింది.*


*4 డిశంబరు 1971 - భారత నౌకాదళం కరాచీ నౌకాశ్రయం మీద బాంబుల దాడి జరిపి తుత్తునియలుగా చేసింది. ఈ సంఘటనకు ఆపరేషన్ ట్రైడెంట్ అని పేరు పెట్టారు. అప్పటినుంచి, డిశంబరు 4న నేవీ డే (నౌకాదళ దినోత్సవం) గా జరుపుకుంటున్నారు.*


*1976 - కాల్టెక్స్‌ని భారత ప్రభుత్వం జాతీయ కరణ చేసింది.*


*1976 - ఇంటర్నేషనల్ విజ్ఞాన శాస్త్రం కాంగ్రెస్ (ఐ.ఎస్.సి) కి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆతిధ్యం 1976లో ఒకసారి, 2008లో ఒకసారి ఇచ్చింది.*


*1978 - కాల్టెక్స్‌ని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో కలిపి వేసారు.*


*1979 - విశాఖపట్టణం మునిసిపల్ కార్పొరేషనుగా ఎదిగింది.*


*1981 - విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం తన ఉత్పత్తిని ప్రారంభించింది.*


*1985 - హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మొదటిసారి విస్తరణ.*


*14 సెప్టెంబరు 1997 హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో పేలుడు జరిగి భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఒక విచారకరమైన సంఘటన.*

*1999 - హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రెండవసారి విస్తరణ.*


*2008 - ఇంటర్నేషనల్ విజ్ఞాన శాస్త్రం కాంగ్రెస్ (ఐ.ఎస్.సి) కి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆతిధ్యం 1976లో ఒకసారి, 2008లో ఒకసారి ఇచ్చింది.*


*2010 - హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మూడవసారి విస్తరణ.*


*26 డిశంబర్ 2004 డిసెంబరు నాటి సునామీ దుర్ఘటన సందర్భంగా తీరప్రాంతంలో ఉన్నప్పటికీ, ఎండబెట్టిన చేపలు కొట్టుకొని పోవడం తప్పించి, విశాఖపట్నం ఏమంత దెబ్బ తినలేదు.*


*2014 లో హుద్ హుద్ తుపాన్ వచ్చి విశాఖ నగరం బాగా దెబ్బ తిన్నప్పటికి మరలా త్వరగా కోలుకుంది.* 


*అంతే* *తప్ప...విశాఖపట్నం చాలా ప్రశాంత నగరం, సుందర నగరం...ఈ లాంటి నగరం మనకు జిల్లా కావడం,మన అదృష్టం...మరొక్క సారి మన నగరానికి జై జై లు పలకండి.....!!!*

*ఇలాంటి..రాజులు మహనీయులు పరిపాలించిన ప్రాంతం.

100 నిత్య సత్యాలు - ధర్మ ఆచారములు

 *స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు*


100 నిత్య సత్యాలు - ధర్మ ఆచారములు


1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. 


2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు. 


3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. 


4. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి


5. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు.


6. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు. 


7. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు. 


8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది. 


9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. 


10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.


11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. 


13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.

 

14. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.

 

15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. 


16. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు . 


17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. 


18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. 


19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. 


20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.


21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. 


22. కాళ్ళు కడుక్కొన్నాక తుడుచుకోకుండా, తడి కాళ్ళతో భోజనం చేయరాదు.

 

23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. 


24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. 


25. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు


26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. 


27. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. 


28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. 


29. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు. 


30. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.


31. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. 


32. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా మనం స్వర్గానికి పోతాము. 


33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు. 


34. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. 


35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.


36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.


37. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.


38. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. 


39. తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు. 


40. వికలాంగులను వేళాకోళం చేయరాదు.


41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. 


42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు. 


43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.

 

44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. 


45. ఏడవటం వలన దారిద్ర్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి. 


46. భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట పనికిరాదు. 


47. పెద్దన్న గారు, పిల్లనిచ్చిన మామ గారు, గురువు ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం కనుక వీరు ముగ్గురినీ తండ్రిలాగే పూజించాలి. 


48. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు.

 

49. ఒక చెట్టును నరికేముందు మూడుచెట్లు నాటితే కాని ఆ దోషం పోదు. 


50. అన్నమును తింటున్నపుడు ఆ అన్నమును దూషించుట కాని, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుటకాని చేయరాదు.


51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం

52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

 

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు. 


54. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం. 


55. ఒడిలో కంచం పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక, వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు

56. చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ వేసికొనుట చేయరాదు. 


57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి. 


58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు. 


59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

 

60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.


61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు

.

62. ఎంతకోపం వచ్చినా తల్లిదండ్రులను, గురువును కొట్టరాదు. వారిపైకి చేయి ఎత్తరాదు. ఇంటి నుండి గెంటివేయరాదు. వారికి పెట్టకుండా పదార్థాలేవీ తాను తినరాదు. 


63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. 


64. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటుట, మామిడి పళ్ళు దానం అశ్వమేథ యాగ ఫలితాన్ని ఇస్తాయి.


65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు. 


66. పాడయిపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కాని, చెరువులో కాని, సముద్రంలో కాని కలుపవలెను. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టవలెను. 


67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు. 


68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. 


69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి. 


70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.


71. కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఆ కుమారుడు మరణించినట్లైతే తండ్రితో పాటు అందరూ కట్టు బట్టలతో స్నానం చేయాలి. 


72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాక్ భంగం చాలా దోషం.


73. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు. 


74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.


75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.


76. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు. 


77. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి. 


78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. 


79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.


80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.


81. నిత్యం తామువాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం, కనుక ఆకులలోకాని, క్రొత్త పాత్రలలోకాని వారికి ఆహారం పెట్టాలి. 


82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది. 


83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి. 


84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు. 


85. రేపు చేయవలసిన పనిని ఈ రోజు, ఈ రోజుపని ఈ క్షణమే చేయాలి. వాయిదాలు పనికిరావు. 


86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు. 


87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు. 


88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే. 


89. పుష్కర సమయాలలో స్నానం, శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే. 


90. ప్రదక్షిణలు చేసేటపుడు, మంత్ర పుష్పం ఇచ్చేటపుడు ఆసనాలపై నిలబడరాదు. కింద నిలబడి చేయాలి. పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట, దర్భాసనాలు తుంచటం చేస్తారు. ఇవి మహా పాపాలు.


91. గణపతి గరికపూజ మహాప్రీతి ఏ పరిస్థితులలోనూ తులసితో పూజ చేయరాదు(వినాయక చతుర్థినాడు కుడా తులసిని సమర్పించరాదు.


92. మనుష్యుని పాపం వాడి అన్నం లోనే ఉంటుంది. అందువలన పాపాత్ముల ఇంటి భోజనం చేయరాదు. మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికీ మోక్షంరాదు.


93. జపమాల మెడలో వేసుకొనరాదు. మెడలో వేసుకొన్న మాలతో జపం చేయరాదు. 


94. బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు. దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కాని, లేదా దేవాలయాలకు ఇచ్చివేయుట కాని చేయాలి. 


95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు. 


96. భోజనసమయంలో వేదములు చదువుట, గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు. ఏడుస్తూ అన్నం తినరాదు. 


97. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసే వారి నీడను, గోబ్రాహ్మణుల నీడను దాటరాదు. 


98. శ్రాద్దములో భోక్తగా మిత్రుడు పనికిరాడు. అతిథులుగా భోజనం పెట్టుకొనవచ్చు. 


99. విశిష్ట వ్యక్తులను, మహాత్ములను అగౌరవపరచి, నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు


100. దేవాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు

Wednesday, March 30, 2022

నేను-నా స్నేహితుడు చివరలో స్నేహితుడి కొడుకు

 నేను-నా స్నేహితుడు చివరలో స్నేహితుడి కొడుకు

నేను నా ఫ్రెండ్ ఒక హోటల్ కి వెళ్లాం

"నేను పర్స్ తేవటం మర్చిపోయాను .."బిల్ రాగానే నేను అన్నాను .

మా ఫ్రెండ్ గాడు షాక్ అయ్యాడు "జోకా .."

అడిగాడు .

"దేవుడి తోడు ..."అని మళ్ళీ జేబులు వెతికాను .

"ఇవేళ్టికి నువ్వు ఇచ్చేయ్ బిల్ " .  అన్నాను .

స్ట్రోక్ వచ్చినవాడిలా బిల్ కేసి చూసాడు .

ఆరు వందలపైనేవుందిఅమౌంట్ ..

బావున్నాయి అని వాడు రెండు మసాలా దోశలు తినేసాడు 

"నీ ఫోన్ లో గూగుల్ పే , పెటియం వుండాలిగా .."అడిగాడు 

"వుండేవి ..తీసేసాను ..నువ్వే ఎదో దారి ఆలోచించు "అన్నాను .వెధవ కి రోగం కుదరాలి .

వెర్రిగా బుర్ర గోక్కుని "సర్లే ..మా వాడి కి ఫోన్ చేస్తాను .."లేచి బల్లచుట్టు తిరుగుతూ వాడి కొడుక్కి ఫోన్ చేసాడు 

మనసులో ఆనందిస్తూ వాడు వద్దన్నా నేను మళ్ళీ రెండు కాఫీ లకి ఆర్డర్ ఇచ్చాను ..వాడు సైలెంట్ గా తాగాడు .

"అనవసరం గా స్వీట్ కూడా తిన్నాను .."అన్నాడు వాడు .

"తినాలిఅనిపించింది ..తిన్నావు ..తప్పేముంది "ఓదార్పుగా అన్నాను 

కాఫీ బిల్ కూడా వచ్చి చేరింది .

తడిసి మోపెడు అయ్యింది.

అంతలో వాడి కొడుకు హడావిడిగా వచ్చాడు ...

"అంకుల్ ...డాడీ చెప్పినట్టే మీ ఇంటికెళ్లి మీరు పర్సు మర్చిపోయి , తెమ్మన్నారు అని ఆంటీ ని అడిగాను .. ఆవిడ ఏమందో తెలుసా ..పర్స్ ఇదిగో అని ఇస్తుంటే మీ అంకులే అక్కర్లేదు ..అక్కర్లేదు అని తీసుకు వెళ్ళ లేదు బాబూ ..అని ఇచ్చారు .."

వాడు పర్సు నా ముందు పెట్టాడు .😳

మా ఫ్రెండ్ గాడు నాకేసి చూసాడు 😎.

నేను తలదించి పర్సు కేసి చూసాను .

"కష్టపడి అంకుల్ మర్చి పోయిన పర్స్ తెచ్చావ్  ..నువ్వు కూడా ఎం కావాలో తిను .."

అన్నాడు వాడు.

తండ్రిని మించిన కొడుకు ..

ఆర్డర్ ఇవ్వటం  మొదలెట్టాడు ....🤦



జీవన సూత్రాలు

 🍃🥀 *జీవన సూత్రాలు* 🍃🥀


*🏵ఆనంద జీవితానికి ఐదు సూత్రాలు ఉన్నాయి.*

*అవి.👇*


*🌻అతిగా ఉద్వేగ పడకుండా, విశ్వాసాన్ని కలిగి ఉందాం.*


*🌻ప్రయత్నాన్ని వదలకుండా, పట్టుదలతో కొనసాగిద్దాం.*


*🌻విషయాల్ని క్లిష్టంగా మార్చకుండా, సరళంగా ఉంచుదాం.*


*🌻పరిస్థితుల్ని తీవ్రంగా పరిగణించకుండా, సమస్యల్ని హాస్యస్పూర్తితో ఎదుర్కొందాం.*


*🌻ఉసూరుమనకుండా, ఎప్పుడూ పిల్లల్లా ఉత్సాహంగా ఉందాం.*


             

Tuesday, March 29, 2022

ఆలయానికి వెళ్తున్నపుడు పాటించ వలసిన నియమాలు...

 ఆలయానికి వెళ్తున్నపుడు పాటించ వలసిన నియమాలు...



1. ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.


2. అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు


3. ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.


4. జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.


5. టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.


6. ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.


7. ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.


8. నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.


9. దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.


10. ఒక చేత్తో దర్శనం చేయకూడదు.


11. భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.


12. ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.


13. ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.


14. బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.


15. ఆలయ ఆస్తులను అపహరించకూడదు.


16. అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.


17. ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.


18. మూల విరాట్‌ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.


19. ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.


20. ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.


21. గోపుర దర్శనం తప్పక చేయాలి.


22. ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.


23. ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.


24. మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.



40 years Ago

 *Let's think...*


*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴇᴠᴇʀʏᴏɴᴇ ᴡᴀɴᴛᴇᴅ ᴛᴏ ʜᴀᴠᴇ ᴄʜɪʟᴅʀᴇɴ. ᴛᴏᴅᴀʏ ᴍᴀɴʏ ᴘᴇᴏᴘʟᴇ ᴀʀᴇ ᴀғʀᴀɪᴅ ᴏғ ʜᴀᴠɪɴɢ ᴄʜɪʟᴅʀᴇɴ.

.......................................... 

*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴄʜɪʟᴅʀᴇɴ ʀᴇsᴘᴇᴄᴛᴇᴅ ᴛʜᴇɪʀ ᴘᴀʀᴇɴᴛs. ɴᴏᴡ ᴘᴀʀᴇɴᴛs ʜᴀᴠᴇ ᴛᴏ ʀᴇsᴘᴇᴄᴛ ᴛʜᴇɪʀ ᴄʜɪʟᴅʀᴇɴ.

........................................ 

*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴍᴀʀʀɪᴀɢᴇ ᴡᴀs ᴇᴀsʏ ʙᴜᴛ ᴅɪᴠᴏʀᴄᴇ ᴡᴀs ᴅɪғғɪᴄᴜʟᴛ. ɴᴏᴡᴀᴅᴀʏs ɪᴛ ɪs ᴅɪғғɪᴄᴜʟᴛ ᴛᴏ ɢᴇᴛ ᴍᴀʀʀɪᴇᴅ ʙᴜᴛ ᴅɪᴠᴏʀᴄᴇ ɪs sᴏ ᴇᴀsʏ.

.........................................

*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴡᴇ ɢᴏᴛ ᴛᴏ ᴋɴᴏᴡ ᴀʟʟ ᴛʜᴇ ɴᴇɪɢʜʙᴏʀs. ɴᴏᴡ ᴡᴇ ᴀʀᴇ sᴛʀᴀɴɢᴇʀs ᴛᴏ ᴏᴜʀ ɴᴇɪɢʜʙᴏʀs.

....................................... 

*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴠɪʟʟᴀɢᴇʀs ᴡᴇʀᴇ ғʟᴏᴄᴋɪɴɢ ᴛᴏ ᴛʜᴇ ᴄɪᴛʏ ᴛᴏ ғɪɴᴅ ᴊᴏʙs. ɴᴏᴡ ᴛʜᴇ ᴛᴏᴡɴ ᴘᴇᴏᴘʟᴇ ᴀʀᴇ ғʟᴇᴇɪɴɢ ғʀᴏᴍ ᴛʜᴇ CITY ᴛᴏ ғɪɴᴅ ᴘᴇᴀᴄᴇ.

...................................... 

*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴇᴠᴇʀʏᴏɴᴇ ᴡᴀɴᴛᴇᴅ ᴛᴏ ʙᴇ ғᴀᴛ ᴛᴏ ʟᴏᴏᴋ ʜᴀᴘᴘʏ. ɴᴏᴡᴀᴅᴀʏs ᴇᴠᴇʀʏᴏɴᴇ ᴅɪᴇᴛs ᴛᴏ ʟᴏᴏᴋ ʜᴇᴀʟᴛʜʏ.

........................................ 

*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ʀɪᴄʜ ᴘᴇᴏᴘʟᴇ ᴘʀᴇᴛᴇɴᴅᴇᴅ ᴛᴏ ʙᴇ ᴘᴏᴏʀ. ɴᴏᴡ ᴛʜᴇ ᴘᴏᴏʀ ᴀʀᴇ ᴘʀᴇᴛᴇɴᴅɪɴɢ ᴛᴏ ʙᴇ ʀɪᴄʜ.

.........................................

*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴏɴʟʏ ᴏɴᴇ ᴘᴇʀsᴏɴ ᴡᴏʀᴋᴇᴅ ᴛᴏ sᴜᴘᴘᴏʀᴛ ᴛʜᴇ ᴡʜᴏʟᴇ ғᴀᴍɪʟʏ. ɴᴏᴡ ᴀʟʟ ʜᴀᴠᴇ ᴛᴏ ᴡᴏʀᴋ ᴛᴏ sᴜᴘᴘᴏʀᴛ ᴏɴᴇ ᴄʜɪʟᴅ.                   

..........................................

*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴘᴇᴏᴘʟᴇ ʟᴏᴠᴇᴅ ᴛᴏ sᴛᴜᴅʏ & ʀᴇᴀᴅ ʙᴏᴏᴋs. ɴᴏᴡ ᴘᴇᴏᴘʟᴇ ʟᴏᴠᴇ ᴛᴏ ᴜᴘᴅᴀᴛᴇ ғᴀᴄᴇʙᴏᴏᴋ & ʀᴇᴀᴅ ᴛʜᴇɪʀ ᴡʜᴀᴛsᴀᴘᴘ ᴍᴇssᴀɢᴇs.


*40 YEARS WAS 1982.. WHICH SEEMS LIKE JUST YESTERDAY !!*


*EVERY ONE REFLECT ON ALL THE ABOVE REALISTIC FACTS..*


*"ᴛʜᴇsᴇ ᴀʀᴇ ʜᴀʀᴅ ғᴀᴄᴛs ᴏғ ᴛᴏᴅᴀʏ's ʟɪғᴇ"*

ఇవి ఎప్పటికీ మందుల షాపులలో దొరకవు.

 ఆరోగ్యం :

ఈ క్రింది ఔషధాలు ఎప్పటికీ మందుల షాపులలో దొరకవు.....

1. వ్యాయామమే ఔషధం.

2. ఉపవాసం ఔషధం.

3. సహజ ఆహారమే ఔషధం.

4. నవ్వు ఔషధం.

5. కూరగాయలు ఔషధం.

6. నిద్ర ఔషధం.

7. సూర్యకాంతి ఔషధం.

8. ఎవరినైనా నిస్వర్ధంగా ప్రేమించడం ఔషధం.

9. ప్రేమించబడడం ఔషధం.

10. కృతజ్ఞత అనేది ఔషధం.

11. నేరాన్ని వదలడం ఔషధం.

12. ధ్యానం ఔషధం.

13 *మంచి స్నేహితులే ఔషధం.*

ఈ ఔషధాలను తగినంతగా మీఅంతకు మీరే సంపాదించుకోవాలి, 


పై ఔషధాలు సంపాదించుకుంటే, బజారులో ఉండే మందులషాపులో ఉండే ఔషధాలతో 99% అవసరమే ఉండదు.

Gas booking with whatsaap

 *Gas booking:* గుడ్ న్యూస్.. ఇక సెకన్లలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.. ఫోన్ కూడా చేయక్కర్లేదు!



Now customers can book lpg gas cylinder through *whatsapp* know details. 


*వాట్సాప్ గ్యాస్ బుకింగ్*  ఈజీ క్షణాల్లో పని పూర్తిగ్యా్స్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు కస్టమర్లకు వాట్సాప్ ద్వారానే సిలిండర్ బుకింగ్ ఫెసిలిటీని అందిస్తున్నాయి. 


*భారత్ గ్యాస్ బుకింగ్ చేసే విధానం:*


భారత్ గ్యాస్ సిలిండర్, ఇండేన్ గ్యాస్ సిలిండర్, హెచ్‌పీ గ్యాస్ ఇలా మీరు ఏ సిలిండర్ వాడుతున్నా కూడా వాట్సాప్ ద్వారా సులభంగానే క్షణాల్లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని భావించే వారు ముందుగా మీ గ్యాస్ సిలిండర్ కంపెనీని మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాలి. సెకన్లలోనే గ్యాస్ సిలిండర్ బుక్ అయిపోతుంది. మీకు మళ్లీ రిప్లే కూడా వస్తుంది. 


భారత్ గ్యాస్ బుకింగ్ చేసే విధానం:


*భారత్ గ్యాస్* ఉపయోగించే వారు *1800224344* నెంబర్‌ను వారి మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. 


తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి హాయ్ లేదా హెలో అని మెసేజ్ పెట్టాలి. 


తర్వాత మీకు రిప్లే వస్తుంది. 


తర్వాత మీరు సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.


ఇండెన్ గ్యాస్ బుకింగ్ చేసే విధానం:


 మీరు *ఇండెన్ గ్యాస్* వాడితే.. *7588888824* అనే నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. 


తర్వాత వాట్సాప్ లోకి వెళ్లాలి. 


ఇప్పుడు రీఫిల్ బుకింగ్ అని మెసేజ్ పెట్టాలి. 


క్షణాల్లోనే మీ సిలిండర్ బుక్ అవుతుంది.


*HP గ్యాస్ బుకింగ్ చేసే విధానం:*


 హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ వాడే వారు *9222201122* నెంబర్ ద్వారా వాట్సాప్‌లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. 


ఇకపోతే వాట్సాప్ ప్రొఫైల్‌లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎలా చేయాలనే వివరాలు ఉంటాయి. 


వినియోగదారులు వాటిని ఫాలో అయితే సరిపోతుంది.💐💐

Monday, March 28, 2022

ఉప్పు డబ్బా మజాకా...

 ❤️😀❤️

ఉప్పు డబ్బా మజాకా...

~ ~ ~ ~ ~


      "ఏమండీ! వంటయింట్లో ఉప్పు డబ్బా ఉంది కాస్త తీసుకుని రండి."

భార్య భర్త తో చెప్పింది.


భర్త వంటింట్లో ఉప్పుడబ్బా కోసం వెతికాడు. కానీ కనిపించ లేదు.

"ఉప్పు డబ్బా లేదు ఇక్కడ...వెతికి చూశాను...కనిపించలేదు" అన్నాడు భర్త..

"అనుకున్నా అప్పుడే...మీకు ఎదురుగా ఉన్న వస్తువులే కనిపించవు..ఇక వంటయింట్లో ఉన్న ఉప్పుడబ్బా కనిపిస్తుందా? నా పిచ్చికాని" అంటూ మొదలెట్టింది భార్య.


"మీ అమ్మ ఎలా పెంచిందో ఇన్నిరోజులు...ఒక్క పనికి పనికిరారు.. నా ఖర్మ ఇంతే!" సాగదీసింది..

"మళ్ళీ పేరుకు పెద్ద మేనేజరు ఉద్యోగం వెలగ పెడుతున్నారు.. మీకింద 50 మంది పనిచేస్తారు...ఆ ఉద్యోగం ఎలా చేస్తున్నారో ఏం పాడో, వాళ్ళు మీతో ఎలా వేగుతున్నారో, మీ బాసు మిమ్ములను ఎలా భరిస్తున్నారో ఏమిటో" ఇంకా గొణుగుతూనే ఉంది భార్య.

 " మిమ్మల్ని నాకు కట్టపెట్టిన..మా పుట్టింటివాళ్ళని అనాలి ముందు...జీవితాంతం వేగక తప్పదు" అంటూ విరుచుకు పడింది భార్య.

"నిజంగానే ఉప్పుడబ్బా లేదు ..ప్రామిస్! అంటూ బ్రతిమలాడాడు భర్త...

" ఇలాంటి సమాధానం వస్తుందని ముందే ఉహించాను..ముందుజాగ్రత్త చర్యగా ఉప్పుడబ్బా తెచ్చి పక్కనే పెట్టుకున్నాను...మిమ్మల్ని ఏమి అడిగినా ఇంతే అని నాకు తెలుసుగా!" అంది భార్య.

భర్త:🤔😢😓😥

ప్రతి ఒక్క భర్తకు సమర్పణం...😂😂😂

భర్త ను ఉతికి ఆరేసే కార్యక్రమం పెట్టుకున్నాక...దేవుడు కూడా కాపాడలేడు... 

అయ్యో!పాపం....😟😟😟😟

Just for fun ...చదివి నవ్వుకోండి అంతే!😂😂😂

RRR కాపీ చరిత్ర

 రాజమౌళి RRR కోసం ఎన్ని మూవీస్  కాపీ చేసాడో .. : 


నక్క ,పులి జూనియర్ ఎన్ టి ఆర్ ను తరమటం  "Apocalypto " మూవీ లోది ...దీనికి పొడిగింపు పులి ఎన్ టి ఆర్ మొహం దగ్గరకు వచ్చి గాండ్రించటం అనేది "10,000 BC " మూవీ లోది ....ఆ తరవాత పులిని బందించటానికి బలం గా కొక్కేలు లాగి బిగించే సీన్ కూడా "Avengers ఇన్ఫినిటీ  war   " మూవీ లోది ....


ఎత్తైన కట్టడం మీద తుపాకీ పట్టుకుని కాపలా కాసే గన్ మెన్ మీదకు    రాంచరణ్ ఎన్ టి ఆర్ ను పైకి విసిరే సీన్ "Kung Fu Panda 2 " లోది ..


రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ లో జనం గుమిగూడి ఉంటారు అక్కడ ఫైట్  ఈ సీన్ కూడా "10,000 BC "  లోది ..రామ్ చరణ్ బాక్సింగ్ చేసే సన్నివేశం "The Avengers " మూవీ లోది ..రామ్ చరణ్ గుర్రం మీద ,ఎన్ టి ఆర్ బైక్ మీద వెళ్లే సీన్ "Ghost Rider " లోది ...

వాటర్ .నిప్పు లతో వదిలిన ట్రైలర్ కూడా "Game of Thrones " లోది ...అలాగే అల్లూరి సీతారామరాజు లుక్ తో వాడిలా పోస్టర్ కూడా కాపీ నే ఇది "Ong-Bak: The Thai Warrior (2003) లోది ..రాంచరణ్ ,జూనియర్ ఎన్ టి ఆర్ ఒకరి హాండ్స్ ఒకరు పట్టుకోవటం ఆ సీన్ "Star Wars: The Old Republic " లోది 300 మూవీ లో సీన్స్ కూడా ఉన్నాయి . ..ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో మూవీస్ లో సీన్స్ అన్ని ఒకే సినిమాలో  కాపీ చేసి తీసాడు ...


The Motorcycle Diaries (2004) ఇది చేగువేరా బేస్డ్ మూవీ ఈ మూవీ చూసే రాజమౌళి అల్లూరి సీతారామరాజును ,కొమరం భీమ్ ను కలుపుతూ ఒక ఊహాజనితమైన కథ తో తియ్యాలనుకున్నాడు ..అయితే తీసింది ఏంటి ?  కోయిల మాదిరిగా మధురం గా పాడే గోండు పిల్లతో పాట పాడించుకుని ఎత్తుకుపోవటం ఆ పాప కోసం వెతకటం ..ఇది అపుడెపుడో రాజశేఖర్ హీరో గా వచ్చిన " పాప కోసం" అనే సినిమా కాన్సెప్ట్ ..దీనినే కాస్త మార్చి అదే దర్శకుడు చిరంజీవి తో " చూడాలని ఉంది " మూవీ తీసాడు ...రాజశేఖర్ మూవీ ప్లాప్ అయినా ఈ చిరంజీవి మూవీ పెద్ద హిట్ అయ్యింది ... పృథివిరాజ్ సుకుమారన్ మాస్టర్స్ అనే మళయాళం మూవీ  , "సుభాష్ చంద్రబోస్ " అనే వెంకటేష్ మూవీ ,మోహన్ లాల్ "మన్యం పులి "  జంగిల్ బుక్ అనే సీరియల్ ఇలా ఎన్నో గుర్తుకు వస్తాయి..ఇలా ఎన్నో మూవీస్ ను రెఫరెన్సు గా తీసుకున్నాడు .. జైల్లో రామ్ చరణ్ ని చూస్తే "వేట" లో చిరంజీవి సీన్ స్ఫురణకొస్తుంది. 

* అజయ్ దేవగన్ ఆత్మాహుతి సీన్ చూస్తే "జీరో డార్క్ 30" లోని ఒక్క సన్నివేశం జ్ఞప్తికొస్తుంది. 

* స్కాట్ దొరగారి సతీమణి పతీసమేతంగా కూర్చుని ఎన్.టి.ఆర్ ని కొట్టమని చెప్పే సీన్ చూస్తుంటే మైకేల్ జాక్సన్ "రిమెంబర్ ద టైం" పాటలోని ఈజిప్షియన్ రాజు రాణి ట్రాక్ లాగ అనిపిస్తుంది. 

* కొమరం భీం, చిన్నదొరసాని కలిసి డ్యాన్స్ చేసే సీన్ చూస్తే "టైటానిక్" కూడా జరంత యాదికొస్తుంది.

Think once.🤔

 If the rat is a stone, we worship it and if it is alive, we bury it. 

If it is a snake stone, we will give milk and if it is alive, we will beat it to death.

 If there are parents in the photo, will suffer, if we are alive, we will drop in the old age home.

 Our carry the dead on shoulders and hate the living. We see God in stone, we don't see the humanity in man. 

Why devotion to the inanimate, why hatred towards the living. 


Think once.🤔

Sunday, March 27, 2022

మనకు శత్రువులు ఎవరు ?

 *మనకు శత్రువులు ఎవరు ? మనమేం చెయ్యాలి ?*


1.మన అజ్ఞానమే మనకు మొదటి శత్రువు.


2.మన పిరికితనమే మన రెండవ శత్రువు.


3.మన సోమరితనమే మన మూఢవ శత్రువు.


మనకు బయట ఉండే శత్రువులకంటే మనలో ఉండే శత్రువులే చాలా ప్రమాదకరం..


అజ్ఞానం అనే శత్రువు నిన్ను బయటి ప్రపంచానికి పరిచయం చెయ్యదు.


పిరికితనం అనే శత్రువు నిన్ను బయటి ప్రపంచంతో పోటి పడనివ్వదు.


సోమరితనం అనే మూడవ శత్రువు నిన్ను ముందుకు సాగానివ్వదు.

     

        *మనం చేసే పొరపాట్లు ఏంటి ?*


1.ఇతరులతో పోల్చుకోవడం.

2.ఇతరుల విజయాన్ని అస్యహించుకోవడం.

3.ఇతరుల బలహీనతలపై బలం ప్రయోగించడం 


        *మనం దేనిపైన దృష్టిసారించాలి ?*

1.మన లక్ష్యం.

2.మన బాధ్యత.

3.మన గమ్యం.


ఇతరుల విజయాన్ని చూసి చప్పట్లు కొట్టలే తప్ప 

అసంతృప్తి చెందకుడదు.

ఎప్పుడైతే నీవు ఇతరులను పడగొట్టాలని చూస్తావో అప్పుడు నీవె పడిపోతావు అనేదే జగమెరిగిన సత్యం.


మన దేశంలో చాలమంది యువత పక్కవాడి గురించి ఆలోచనాచేయ్యడం లో సమయాన్ని ఎక్కువగా వెచ్చించి విజయాన్ని అవరోధించలేకపోతున్నారు ఇది నగ్న సత్యం.

ఒకప్పుడు సినిమా అంటే...🎥🎞️ ఎంతో మంది కి మంచి ఇన్సి్పిరేషన్

 ఒకప్పుడు సినిమా అంటే...🎥🎞️ ఎంతో మంది కి మంచి ఇన్సి్పిరేషన్ అందరికి 💐


నేడు సినిమా అంటే...🎞️🎥

ఒక పిచ్చి,  పైసాచికం, తల్లి తండ్రులను ఎదిరించే ఎమోషన్స్.. ప్రతి ఒక్కరిలో

అది ఎలానో ఒకసారి చదవండి ఈ pessege..🎬


RRR గురించి మాట్లాడుకుందాం present


RRR...రౌద్రం..రణం..రుధిరం..🛸ఎన్టీఆర్.. ఎమోషన్స్..🚴

రాంచరణ్..ఎట్రాక్షన్స్..🏇

రాజమౌళి...ర్యాప్ టేకింగ్స్...🏋️


4 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న..🧗

ఈసినిమా..600 కోట్ల (అంటారుకానీ 150 కోట్లు మాత్రమే ) పెట్టుబడితో పూర్తయి..🧘 25/03/2022 న.. ప్రపంచవ్యాప్తంగా 15000 థియేటర్ లలో..🏢 రిలీజ్ అయిన ఈ సినిమా... 🎞️

ఎంత మనీ కలెక్షన్స్ ...🎥

వసూల్ చేసిందో తెలుసా...💴💰


సగటున నాలుగు ఆటలు..🎥🎥🎥🎥

ఎక్కువ తక్కువ ఎలా ఉన్నా...

టికెట్ ధర 150 రూపాయల లెక్కన...💴

లెక్కలేసుకుంటే వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో ..

ఆలోచించండి..🤔


 *ఒక్క రోజులోనే* మనతెలుగు రాష్ట్రాల్లోనే 230 కోట్ల..🤔

ఫ్రీ బిజినెస్ చేసింది..

నైజం 70 కోట్లు..💴

సీడెడ్ 45 కోట్లు...

ఉత్తరాంధ్ర 26 కోట్లు..

గుంటూరు 18 కోట్లు...💵

ఈస్ట్ మరియు వెస్ట్ 31 కోట్లు...

క్రిష్ణా 14 కోట్లు..

నెల్లూరు 9 కోట్లు...💸

కర్ణాటక 50 కోట్లు..

తమిళనాడు 45 కోట్లు...

కేరళ 10 కోట్లు...

ఇలా సౌత్ స్టేట్స్ ని పిండి పిప్పి చేసింది...💷


అలాగే నార్త్ ఇండియా..100 కోట్లు..💶

ఓవర్సీస్ లు 70 కోట్లు...

ఓవరాల్ గా 490 కోట్ల బిజినెస్ ను..💰

ఒక్కరోజులోనే రాబట్టింది...💰💰💴💵


అంతేకాదు... ఆడియో... డిజిటల్...🎥

శాటిలైట్ రైట్స్ ద్వారా వచ్చిన రాబడి..

లెక్కలేసుకుంటే... పెట్టుబడి కంటే...

రాబడి  ఎక్కువ వసూల్ ఆయిందనేది..🤷

మనకు అర్థమౌతుంది...


బాహుబలి 2 కి 450 కోట్లు ఖర్చు చేస్తే...💴 రాబడి...1810 కోట్లు వసూల్ చేసింది...💴💰💷


RRR 600 కోట్లు ఖర్చు చేస్తే...💴💴 (ఖర్చు చేసింది పై వాడికి తెలుసు )

2000 కోట్లు రాబడుతుందని అంచనా..💰💰💰💴💴💴


పెట్టుబడికి మూడింతలు లాభం రావాలంటే, ప్రేక్షకుడిని...సినిమా హాలుకి రప్పించాలి...🚶అలా రప్పించాలంటే, ఆ ప్రేక్షకుడికి RRR పై ఆశలు పెంచాలి..అని ఆలోచించి...🤔


కొంతకాలానికి పోస్టర్ రిలీజ్ చెయ్యడం..🛸

మరికొంతకాలానికి హీరోయిన్ ని చూపించడం..💃

తర్వాత సినిమా కి అయ్యే ఖర్చు చెప్పడం..

గ్రాఫిక్స్ అంటూ... డిజిటల్ అంటూ...🦸


ఇంకా... 

సాంగ్ రిలీజ్ చెయ్యడం లాంటివి..చేసి..🎵🎶

ప్రేక్షకుడికి ఆ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెంచి..

ఇటు ఫాన్స్ ని.. అటు ప్రేక్షకులని...🤷

సినిమాపై ప్రేమను పెంచి...🎼

సినిమా అంటే పిచ్చి అనే బ్రమలో..

బంధించినందుకు...🙄

నేడు  పిచ్చిపట్టిన వాడిలా..

ప్రేక్షకులు, ఫాన్స్ చేస్తున్న రచ్చ...😫

అంతా ఇంతా కాదు...


కటౌట్లు... పాలాభిషేకాలు..

డప్పు వాయిద్యాలు..🥁

హారతులు ఇవ్వడం..

కొబ్బరికాయలు కొట్టడం...

చిచ్చుబుడ్లని వెలిగించి...🕹️

నిప్పుతో చెలగాటంచెయ్యడం,

క్విoటాళ్ల కొద్దీ పేపర్లు చల్లడం..

తెరను చించడం..🥅


థియేటర్లు ధ్వసం చెయ్యడం..🎆 మా హోరో గొప్పంటూ...

మీ హీరో తక్కువ అంటూ...😎

తిట్టుకోవడం కొట్టుకోవడం..🤼

ఎక్కడ చూసినా...ఏ టాకీస్ దగ్గర చూసినా.. ఎగరడం అరవడం... కొట్టుకోవడం ...

గొడవలు సృష్టించడం..🗣️

అంతేకాదు...🤷


హీరో హీరోయిన్ ఫాలోయింగ్..🕺💃 ఫాన్స్ కి..ఎంతగా ఎక్కేసిందంటే... హైదరాబాద్ లో ..రాంచరణ్ ఫాన్స్..😎

అల్లూరి గెటప్ లతో...

రోడ్ల మీద ర్యాలీ చేసేంత...🤷


గుంటూరులో RRR సినిమా హాలు ముందు..🏣

అన్నదాన కార్యక్రమం జరిగించేంత..🍱


అనంతరం జిల్లాలో కళ్యాణదుర్గంలో..🗾

RRR సినిమా హిట్ కావాలని🕺ఎన్టీఆర్ కోసం ఫ్యాన్స్ మేకను బలి ఇచ్చేంత...🐏


కాకినాడ పిఠాపురం లో.. ఒక వ్యక్తి ఫ్యాన్..🤔 తుపాకీ పట్టుకొని  తిరిగేంత...ప్రేమ 🔪🤳


టెక్నికల్ ఇష్యు వల్ల..💫

సినిమా మద్యలో ఆగిపోతే...💢 సినిమా హాలును పాడుచేసేంత...😫


సినిమా హిట్ అవ్వకపోతే..🤷

హీరో కోసం చచ్చిపోయేంత...⚰️ప్రేమ 


తన హీరోని ఎవడన్న ఏమైనా అంటే..🗣️ వాడిని అక్కడే నిర్ధాక్షిణంగా చంపేంత..ప్రేమ ⚔️🗡️


చదువుకోవడం మానేసి సినిమా ఏంటని ..🙅

తన కన్న తండ్రి తిడితే... తండ్రి తిట్టాడని...🙍 కొడుకు చచ్చిపోయేంత...ప్రేమ ⚰️


ఫాన్స్ ఇలా తయారుకావడానికి కారణం..🙋 మనం సినిమా పై...సినిమా హీరోలపై .. సినిమా హీరోయిన్స్ పై .. సినిమా డైరెక్టర్ల పై..🙅 అమితంగా పెంచుకుంటున్న పిచ్చి...ప్రేమ 💔


ఇంట్లో తినేది కంట్రోల్ బియ్యమే అయినా..జేబులో చిల్లిగవ్వ లేకున్నా...😪 అప్పుచేసి 500 పెట్టి టికెట్ కొని.. రిలీజ్ రోజే సినిమా చూసేస్తాడు..👀


తన హీరో సినిమా వచ్చిందంటే...😎 వేలకు వేలు పెట్టి బ్యానర్లు కొని... పాలభిషేకాలు, కొంత మంది తన తల్లిదండ్రులకు...👴👵 అన్నం పెట్టలేనోడు కూడా..అన్నదనాలు చేస్తాడు.ఏంటి.ఈ దౌర్బాగ్యం

ఎక్కడ నేర్చుకున్నారు ఈ సంస్కారం..🤷


ఒకడు తన బిజినెస్ కోసం మనలను...💰💴💵💶మభ్యపెట్టి... ఆశపెట్టి....🤔మన డబ్భులు ఖర్చు పెట్టేలా చేసి..💸 చివరకి మనం సినిమా లేకపోతే... చూడకపోతే... చచ్చిపోయేలా హిప్నాటిజం చేస్తున్నారు 😔


నేటి యువతను...వాళ్ళ ఆశయాలకు... వాళ్ళ విలువైన జీవితాలకు.. దూరం చేస్తున్నారన్న విషయం ఎవరు.. గ్రహించగలరు... ఎవరు అర్థం చేసుకోగలరు...🤷


RRR సినిమా 2000 కోట్లు రాబట్టాలని...


ప్రేక్షకుడిని పిచ్చివాడిని చేస్తున్నారు... ఇది ఒక బిజినెస్ అన్న సంగతి.. ఎవరికి తెలుసు...🙋


తెలిసినా ఎవడు మారతాడు..


🙏🙏ధన్యవాదములు

ఒక అమ్మ కథ!

 🥰 *ఒక అమ్మ కథ!* 💞🙏


కొన్ని నెలల క్రితం...

 కొత్తగా ఒక పనిమనిషి చేరింది.


 నాకు పనిమనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు, మీకందరికి అర్థం కావటానికి ఇలా రాశా.

ఇక ఈ వ్యాసంలో ఈ పదాన్ని ఊయోగించను. 


ఆవిడ పేరు.......


మూడు నాలుగు రోజుల తరువాత అడిగా.. 


*అమ్మా! ఎక్కడ మీ ఇల్లు, ఎంత మంది పిల్లలు?* అని.


ముగ్గురు అమ్మాయిలు అండి, 


*పెళ్లిళ్లు అయ్యాయా*?


 లేదండి ఇంకా చదువుకుంటున్నారు. 


O.K, *ఏం చదువు కుంటున్నారు ?* అని క్యాజువల్ గా అడిగా.


 పెద్ద అమ్మాయి M.Sc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేస్తోంది, 

ఆ అంటూ నోరు తెరిచా, 


రెండో అమ్మాయి M.Sc Computers మొదటి సంవత్సరం, 


మూడో అమ్మాయి ఎంబీబీస్ రెండో సంవత్సరం. 


*ఆ !!!* అని నోరు వెళ్ల బెట్టా. నర్సింగా అన్నా, 

కాదు సార్ M.B.B.S అంది. 


నాకు అర్థం కావటం లేదు, ఈవిడ ఏమంటోంది, 

ఏం మాట్లాడుతోంది. ఈవిడకు ఏం మాట్లాడుతోందో అర్థం అవుతోందా? 


మళ్ళీ అడిగా, అవే సమాధానాలు, 


M.B.B.S ఫ్రీ సీటా అని అడిగా, అవును సార్, 

ఫ్రీ సీట్ యే, 

అదేదో బిల్డింగ్ ఫీజ్ అంటా, దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి.


ఏ స్కూలులో చదువుకున్నారు అమ్మా మీ పిల్లలు అని అడిగా?


ఇక్కడే, మన  ఊరి బడి లొనే  10 వ తరగతి వరకు. 


లాంగ్ టర్మ్ గట్రా వెళ్లిందా ఎంబీబీస్ అమ్మాయి అని అడిగా, ఏం లేదయ్యా, మన ఊరి  కాలేజ్ యే, నాకు ఈ చదువుల గోల ఏం తెలీదయ్యా, ఇప్పుడు ఇప్పుడే కాస్త నోరు తిరుగుతోంది. 


ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు అని అడిగా,

రెండులో మానేశానయ్యా, నాకు కూడికలు, తీసి వేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకు రావటానికి.


మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా,


ఆయనా అందరి లాగే, ఇంటి విషయాలు ఏం పట్టవు. 


ఆయన త్రాగుతాడు, 

100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. ఇప్పుడు ఇప్పుడు కొంచం మారుతున్నడు, పాప డాక్టర్ కోర్స్ లో చేరిన తరువాత.


మా పెద్ద అమ్మాయిని ఏడో తరగతిలో చదువు మానిపించేసా, కానీ వాళ్ల టీచర్ ఇంటికి వచ్చి, నన్ను మందలించి, మంచి తెలివి గల అమ్మాయి, చక్కగా చదువు కొంటోంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది. అప్పటికి అర్థం అయ్యింది నాకు, నా పిల్లలు తెలివి గల వాళ్ళు అని, నా పిల్లల చదువులు ఆగ కూడదు అని ఇంకో రెండు ఇల్లులు ఎక్కువ ఒప్పుకోవటం మొదలు పెట్టా. 


ఇంట్లో సరిగ్గా కరెంట్ కూడా ఉండేది కాదు, మూడు మూడు నెలలు బిల్ కట్టలేక పోయే దాన్ని, పిల్లలు ఆలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు. 


ఇప్పుడు కాస్త పర్వాలేదు, పెద్ద అమ్మాయి కాస్త సంపాదిస్తోంది. ఎలాగో కిందా మీదా పడుతున్నాను అంది. 


నాకు నోట మాట రాలేదు. ఒక చదువుకోని మహిళ,

భర్త త్రాగుబోతు, ఇంతగా కష్టపడి పిల్లలను ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా. 


లక్షలు, లక్షలు ఫీజులు పోస్తుంటే నాపిల్లలు అస్సలు చదవట్లేదు. నా పిల్లలు వీళ్ళలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా. 


అంతే, నాకు అర్జంట్ గా వీళ్ళ ముగ్గురు పిల్లలని కలవాలి అనిపించింది.

నేను మీ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చేయ్యాలి అని అడిగా, అలా మా పిల్లలను చూపించినట్లు ఉంటుంది అన్నా. 


నేను ఆడిగినట్లే, ముగ్గురిని తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది ........ 


ముగ్గురు వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనస్సు చివుక్కుమంది. ఎంతగానో బ్రతిమాలితే  గాని, కుర్చీలపై కూర్చో లేదు. 


ఆమె  నేల పైనే. నాకు అలవాటే సారూ అంది, 


నా పిల్లలు నాలా మిగిలి పోకూడదు అనే ఈ నా శ్రమ అంతా. మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు, అంది కళ్ళ నీళ్లతో..... 


నేను కాదు,  వీళ్లు కాదు, 

నువ్వూ ... గొప్ప దానివి అన్నా. 


మొదటి పది నిమిషాలు ముగ్గరు ముడుచుకు కూర్చున్నారు, తరువాత కొంచం కొంచం మాట్లాడ్డం మొదలు పెట్టారు. 

తాము పడిన కష్టాలు, పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకొంది, ఎంతో కొంత స్కాలర్షిప్ లు రావటం, అవి సహాయ పడ్డం. నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు.


వీళ్లకు ఏదన్నా సహాయం చేద్దాం అని గట్టిగా మనసులో అనుకున్నా. 

ఏం కావాలి అని అడిగా, 

ఎంత అనుకువగా ఉన్నారో, అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమి అడిగినా, ఆహా వద్దు అనే సమాధానం. 


నేను, నా అర్ధాంగి అడగంగా, అడగంగా,  ఒక Two వీలర్ ఇప్పించండి, ముగ్గరము కలిసి ఊయోగించు కుంటాం, మీకు నెల నెలా ఇస్తాం, మేము లోన్లో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. Two వీలర్ ఉంటే, కాస్త సౌలభ్యoగా ఉంటుంది, సగం డబ్బులు ఆటోలకు అయి పోతున్నాయి, మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు, దొరికే స్టాప్ వరకు నడచి అలిసిపోవటం, సమయం కూడా వ్యర్థం అవుతున్నాయి. Two వీలర్ ఉంటే అలిసిపోము, మిగిలిన సమయాన్ని చదువు కునేందుకు ఉపయోగించు కుంటాము అన్నారు. 


Two వీలర్  ఇప్పించా డబ్బులు కట్టి, 


ఒక తొమ్మిది నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు, ఒక పది వేలు ఉంచుకోండి అని అన్నా వినకుండా. 


పెద్ద అమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తరువాత తన కాలేజ్ కు వెళ్లి పోతుంది. మళ్ళీ ఇద్దరని పికప్.

పెద్ద అమ్మాయి J.L పోస్టులకు సన్నద్ధం అవుతోంది. రెండో అమ్మాయి Software ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని.


చెప్పటం మరిచా ...

ఇప్పుడు పెద్ద అమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్. ప్రతి రోజు రెండు గంటలు.

 

ఏదో సినిమాలో అమ్మకంటే పెద్ద యోధురాలు ఎవరు ఉండరు అంటాడు హీరో, మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధురాళ్లు ఎందరో..


ఒకసారి  ఆమె తో  అన్నా, *ఇంకో రెండు సంవత్సరాలు కష్టం మీకు, తరువాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని* అని, 


ఏం సారూ నన్ను పనిలో నుంచి తీసేయ్యాలి అనుకుంటున్నారా, నా ఒంట్లో శక్తి ఉన్నoత వరకు - 

 నేను నా పని మానను.


ఆమెను  అడిగా, *మీ ఆయన మీద కోపం లేదా ?* అని, 


*లేదు* అన్నది.

 పిల్లలకు ఉంది, అయినా వీళ్లు  తమ చదువులు అయిపోయి, పెళ్లిళ్లు చేసుకొని వెళ్లి పోతే *తను - నేనే కదండి, కోపాలు, తాపాలు పెట్టుకుంటే అవుతుందా?!*  అని సమాధానం.


 చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడి పోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం.


*ఒక సారి పెద్ద అమ్మాయి అంది,* 

మా నాన్న తన స్నేహితుల ముందర మా గురుంచి గొప్పగా చెబుతుంటాడు.

 అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం, ఇదంతా మా అమ్మ కష్టం అని......


ఎందరో అమ్మల నిజమైన కథ..!!!


🌼🌺🏵️🌻🌸🥀💐🌹🌷🏵️🌺


అమ్మేగా కనగలదు - అంత గొప్ప అమ్మని.


అమ్మేగా ఆది స్వరం - ప్రాణమనే మాటకు .


🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఆర్టీఐ లో కొన్ని ముఖ్య సమాచారం

 *ఆర్టీఐ లో కొన్ని ముఖ్య సమాచారం.* 



సమచారం అడిగితే లేదు,ఇవ్వము,అందుబాటులోలేదఅంటున్న అధికారులకు,మీరు తెలుసుకోవాలిసిన అంశాలు .


ఒకవేళ పూర్తి అవగాహనా లేకపోతె క్రింది వివరాలు చూడండి.


“సమాచార హక్కు ప్రతి దరఖాస్తుదారుడు వినియోగదారే”


*30రోజుల్లో* సమాచారం *ఇవ్వకుంటే* వినియోగదారుల ఫోరమ్ కు వెళ్ళవచ్చు.


సమాచారాన్ని కోరటనికి దరఖాస్తు ఫారం లేదు, కావలసిన సమాచారం  తెల్లకాగితం పై రాసి ipo (ప్రజా సమాచార అధికారికి) అడగవచ్చు. అధికారికి డైరెక్టు గా గాని రిజిస్టర్ పోస్టు ద్వారా అయిన పంపి అడగవచ్చు.


“దరఖాస్తు దారునికి వయసు స్థానికత అవసరం లేదు”.


*సెక్షన్ 2 (f)* ప్రకారం సమాచారం నిర్వచనం.(కార్యాలయాల్లో రికార్డులు,పత్రాలు, మెమోలు,ఈ మైయిల్స్, అభిప్రాయాలు,పుస్తకాలు, ప్రకటనలు,సీడీలు, డివిడిలు,మొదలైనవి).


*సెక్షన్ 2 (h)* ప్రకారం సమాచార చట్ట పరిధిలోకి వచ్చే కార్యలయలు  (ప్రభుత్వంచే గుర్తింపుబడిన, స్వచ్చంద సంస్థలు).


*సెక్షన్2(i)* ప్రకారం రికార్డు నిర్వచనం.


*సెక్షన్ 2(j)* ప్రకారం ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు పరిశీలించవచ్చు,

ఏ ప్రభుత్వపు కార్యాలయంలో రికార్డులనైనా దరఖాస్తు చేసుకొని తనిఖీ చేయవచ్చు అవసరం అయితే జిరాక్స్ చేసుకోవచ్చు.


*సెక్షన్2(j)(1)* ప్రకారం పనులను, పత్రాలను తనిఖీ చేసే హక్కు (ఒక గంటకు రూ5/-).


*సెక్షన్ 3* ప్రకారం పౌరులందరికి సమాచారం ఇవ్వాలి. (దరఖాస్తు చేసుకోవడానికి మీ పరిధి కాదు అని ప్రశ్నించడానికి వీలు లేదు).


*సెక్షన్4(1)(a)* ప్రకారం ప్రతి శాఖ వారు రికార్డు నిర్వహణ.


*సెక్షన్ 4(b)* ప్రకారం స్వచ్చందముగా వెల్లడించవలసిన సమాచారం ఎవరు ఆడగక ముందే ఆ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి.


*సెక్షన్ 4(1)(c), (d)* ప్రకారం నిర్ణయాలు వాటికీ కారణాలు చెప్పకరలేదు, (సమాచారం ఎందుకు అని చెప్పక్కరలేదు)


*సెక్షన్4(2)* ప్రకారం వీలయినంత ఎక్కువుగా స్వచ్చందంగా ఇవ్వవలసిన సమాచారం.


*సెక్షన్4(4)* ప్రకారం స్థానిక భాషలో ఇవ్వాలి.


*సెక్షన్5(1),(2)* ప్రకారం ప్రజాసమాచార అధికారులు (ipo ) అప్పిలేట్ అధికారుల నియామకం.


*సెక్షన్-6(1)* ప్రకారం

సమాచార హక్కు దాఖలు విధానం.


*సెక్షన్6(2)* ప్రకారం సమాచారం ఎందుకో చెప్పనక్కరలేదు.


*సెక్షన్ -6(3)* ప్రకారం కోరిన సమాచారం సంబంధిత శాఖ అధికారికి దరఖాస్తు బదిలీ (సమాచారం మరో కార్యాలయానికి పంపావలసిన బాద్యత అధికారులదే).


*సెక్షన్-7(1)* ప్రకారం 30రోజుల లోపు సమాచారం ఇవ్వవలసిందే...


*వ్యక్తి జీవితానికీ స్వేచ్ఛ సంభందించినది ఐతే 48 గంటల లోపే ఇవ్వాలి.*


*సెక్షన్7(3)(a)* ప్రకారం సమాచార రుసుము (కోర్టు సంబంచిన మాత్రం రూ25/- మిగతా శాఖ వారికి రూ10/- మాత్రమే చెల్లించాలి.


ఏ రూపంలో చెలించాలంటే

(1) నగదు రూపంలో,

(2) ఇండియన్ పోస్టల్ ఆర్డర్లు,

(3) డిమాండ్ డ్రాఫ్టు,

(4) కోర్టు ఫీ స్టాంపు వేయాలి,

(5)బ్యాంకర్స్ చెక్కురూపంలో మాత్రమే దరఖాస్తు రుసుం. ఎకౌంట్ అధికారి పేరిట పంపించాలి.

విలయినంతగా పోస్టల్ ఆడారు మాత్రమే రుసుముగా చెల్లించాలి.


(ప్రతి పేజీకి, ఏ-4 రూ 2/- చెప్పున, సీడికి రూ100/- చెప్పున, ప్లాపికి రూ50/- చెప్పున, డీవీడీ కి 200 చెలించాలి.

కోర్టు లో ప్రతి పేజీకి రూ 5/- చెప్పున చెల్లించాలి).


*సెక్షన్ 7(1)* ప్రకారం దరఖాస్తు గడువు 30 రోజులు


*సెక్షన్7(6)* ప్రకారం గడువులోపు సమాచారం ఇవ్వకుంటే సమాచారం ఉచితముగా ఇవ్వాలి.


*సెక్షన్8(1)* ప్రకారం సమాచారం మినహహింపులు (డాక్టర్ పెసెంట్ కు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చిన మందులు, మనిషికి ఉన్న వ్యాధులు, దేశరక్షనకు సంబంచించిన ఒప్పందాలు)


*సెక్షన్8(2)* ప్రకారం అడిగిన సమాచారంలో ప్రజాప్రయోజనం ఉంటే   మినహాయింపులు వర్తించవు.


*సెక్షన్18(1)* ప్రకారం కమీషన్లకు పిర్యాదు


*సెక్షన్19(1)* ప్రకారం మొదటి అప్పీలు 


*సెక్షన్19(3)* రెండవ అప్పీలు, 90 రోజుల లోగా రాష్ట్ర కేంద్ర సమాచార కమీషన్ అప్పీల్ చేసుకోవాలి. సరైన కారణాలు ఉంటే 90 రోజుల తరువాత అప్పీల్ చేసుకోవచ్చు.


*సెక్షన్19(1)* ప్రకారం కమీసన్ల  నిర్ణయాలు


*సెక్షన్-19(8)(b)* ప్రకారం ధరాఖస్తుదారు తనకు  కలిగిన ఆర్థికపరమైన కష్టనష్టలపై కమిషన్ ఆధారాలు సమర్పించాలి సక్రమంగా ఉంటే  నష్టపరిహారం మంజూరు చేయాలి.


*సెక్షన్20(1)* ప్రకారం సమాచారం ఇవ్వకపోతే  (తప్పుడు సమాచారం ఇస్తే రోజుకు రూ 250 చొప్పున రూ 25,000 వరకు జరిమానా.


*సెక్షన్20(2)* ప్రకారం క్రమక్షణ చర్యలకు సిపారసు గడువులోగా సమాచారం ఇవ్వకపోతే వినియోగదారుల ఫోరంకి వెళ్ళవచ్చు.


ఐపీవో (ipo) తప్పుడు సమాచారం ఇస్తే రాష్ట్ర కమిసనర్ లేకుంటే  డైరెక్టుగా న్యాయస్థానానికి వెళ్ళవచ్చు.

ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసినవి


ప్రతి ఒక్కరూ  గుర్తుంచుకోవలసినవి

 

*👉మనిషి యవ్వనంలో డబ్బు కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు.*

*👉వృధ్యాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బుని పోగొట్టుకుంటారు.*

*👉ఆరోగ్యం ఆస్తికన్నా మిన్న, ఆరోగ్యం లేని ఆస్తి ఉన్నా అది సున్నా.*

*👉ఆరోగ్యం విషయంలో స్వార్థంగా ఉండండి.*

*👉ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉండండి.*

*👉వ్యాయామం చేసేదానికి సమయం లేదనే వాళ్ళు, భవిష్యత్తులో జబ్బులకు సమయం కేటాయించవలసి వస్తుంది.*

*👉తిండి విషయంలో నాలుకను అదుపులో ఉంచుకునే వాడు యోగి, నాలుకను అనుసరించేవాడు భోగి, నాలుకకు బానిసైనవాడు రోగి.*

*👉డబ్బు సంపాదించవచ్చు కానీ నిద్ర సంపాదించలేము.*

*👉పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేము.*

*👉మందులను కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేము.*

*👉పగను సంపాదించవచ్చు కానీ స్నేహాన్ని కొనలేము.*

*👉ఆయుధాన్ని కొనవచ్చు. కానీ ధైర్యాన్ని కొనలేము.*

*👉భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు.*

*👉మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యం పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో.*

*👉ధనముతో పరుపుని కొనవచ్చు కానీ నిద్రను కాదు.*

*👉ధనముతో విలాసవంతమైన వస్తువులను కొనవచ్చు కానీ సంతోషాన్ని కాదు.*

*👉ధనముతో దేవాలయాలని కొనవచ్చు, కానీ దేవుణ్ణి కాదు.*

*👉దాచిపెట్టి ఏమి చేస్తావు, శవం మీద గుడ్డకు జేబు అయినా ఉండదు.*

*👉ప్రపంచానికి తాను చేసిన మేలే మానవునికి నిజమైన సంపద.*

*👉ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎన్ని మంచి పనులు చేశామన్నది ముఖ్యం.*

 *👉ఇతరులకి కష్టం కలిగించడం ఎంత పాపమో, ఇంకొకరి కష్టం తీర్చడం కూడా అంతే పుణ్యం.*

*👉జీవితంలో ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి:*

 *1)నీకు విలువ ఇవ్వని వారిని*

 *2)నిన్ను చూసి ఈర్ష్య పడేవారిని*

 *3)మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని.*


             

Saturday, March 26, 2022

ఆలోచన లేని ఆవేశం నష్టం!



           *ఆలోచన లేని ఆవేశం నష్టం!*

                   ➖➖➖✍️


     *ఒక పాము   వడ్రంగి  దుకాణంలో కి దూరి,  అక్కడ వున్న  ఱంపంపై నుండి ప్రాకినప్పుడు     పాముకు      స్వల్పంగా గాయమైంది.*


    *వెంటనే పాము కోపంతో ఱంపమును గట్టిగా కరిచింది. *


    *ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది.*


         *పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, ఱంపం తనపై ఎదురు దాడి చేస్తోందనుకుని  వెంటనే  ఱంపమును గట్టిగా  చుట్టుకుని,     తన  బలమంతా వుపయోగించి,   ఱంపమునకు  ఊపిరి అందకుండా  చేసి      చంపివేయాలని నిర్ణయించుకొని,   చివరికి   తన  ప్రాణం మీదకే  తెచ్చుకొంది.*


     *మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో  మనకు కష్టం కలిగించిన   వారిపై       యిలానే స్పందించి‌,    చివరకు   మనమే    పెద్ద ఆపదలకు గురి అవుతాము.*


  *అవతలి వ్యక్తికి అసలు జరిగినదానికి సంబంధం లేదని  తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరిగిపోతుంది.*


    *జీవితం ప్రశాంతంగా  వుండాలంటే  కొన్నిసార్లు   అనవసరమైన   కొన్ని          పరి స్థితుల్ని,   మనుషులను,  వారి ప్రవర్తనను వారిమాటలను, అసూయలను మరియు ద్వేషాలను  పట్టించుకోకుండా    వుండ వలసి వుంటుంది.*


    *కొన్నిసార్లు అసలు   ప్రతిస్పందించక పోవడమే  మంచిది....*✍️️


Friday, March 25, 2022

Steps for happy



*ఈ క్రింది విషయాన్ని క్షుణ్ణంగా చదవండి*

Steps for happy

*ఉద‌యం 8 లోపు చేసే (S.A.V.E.R.S.)….అనే ఈ 6 అల‌వాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్.!*💐

హాల్ ఎలోర్డ్ అనే ప్ర‌ముఖ ర‌చ‌యిత రాసిన “ద మిరాకిల్ మార్నింగ్” అనే బుక్ లో ఉద‌యం 8 లోపు చేసే 6 ప‌నులు మ‌న జీవితాన్నే మారుస్తాయ్ అని చాలా స్ఫ‌ష్టంగా చెప్పాడు. కార్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోంచి బ‌య‌ట‌ప‌డ్డ ఈ ర‌చ‌యిత ఇప్పుడు త‌న ర‌చ‌న‌ల‌తో ప్ర‌పంచాన్ని ఆలోచింప‌జేస్తున్నాడు.

ఆనందానికి 6 అంశాల సూత్రం. S.A.V.E.R.S

🌳

S-Silence( నిశ్శ‌బ్దం)....మ‌న ప్ర‌తి రోజును చాలా నిశ్శ‌బ్దంగా ప్రారంభించాలి…అంటే ప్ర‌శాంత‌త‌తో స్టార్ట్ చేయాలి..లేవ‌డం లేట‌య్యింది…అయ్యే ఎలా…? ఆఫీస్ ప‌ని…ఈ రోజు అత‌డిని క‌లుస్తాన‌ని చెప్పాను…ఎమోయ్…టిఫిన్ అయ్యిందా…..ఇదిగో ఇంత‌లా హైరానా ప‌డొద్దు… ప్ర‌శాంతంగా లేవ‌గానే….కాసింత సేపు మెడిటేష‌న్ చేయండి. లేదా…క‌ళ్ళు మూసుకొని ప్ర‌శాంత‌త‌ను మీ మ‌న‌స్సులోకి ఆహ్వానించండి. ఇక్క‌డే మ‌న రోజు ఎలా గ‌డుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది .

🌳

A-Affirmations ( నీతో నువ్వు మాట్లాడుకోవ‌డం)…. అంద‌రి గురించి, అన్ని విష‌యాల గురించి అన‌ర్గ‌లంగా మాట్లాడే మ‌నం…మ‌న‌తో మ‌నం ఒక్క‌సారి కూడా మాట్లాడుకోలేక‌పోతున్నాం. అస‌లు మ‌న‌లోని మ‌న‌కు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళ‌ల్లో ఖ‌చ్చితంగా ఈ ల‌క్ష‌ణం ఉంటుంది. ఈ మూడు పాయింట్స్ ప్ర‌తి రోజు మీతో మీరు మాట్లాడుకోండి.

1) నేనేమి కావాల‌నుకుంటున్నా.??

2)దాని కోసం నేను ఎటువంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌??

3) అనుకున్న‌ది సాధించ‌డం కోసం నేను వేటిని వ‌దిలివెయ్యాలి? వేటిని కొత్త‌గా ఆహ్వానించాలి? ఇలా ప్ర‌తి రోజూ మ‌న‌లో మ‌నం మాట్లాడుకుంటూ….మ‌న‌లోని మార్పును మ‌న‌మే లెక్కించాల‌న్న మాట‌.!

🌳

V-Visualization ( ఆత్మ సాక్షాత్త్కారం)… మ‌నలోని భావాలకు మ‌న‌స్సులో దృశ్య‌రూపం ఇవ్వ‌డం. కాన్సియ‌స్ తో క‌ల‌లు క‌న‌డం అన్నమాట‌! ఉద‌యాన్నే మ‌న ల‌క్ష్యం అలా క‌ళ్ళ ముందు క‌న‌బ‌డితే…దానిని చేరుకోవడం కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌య‌త్నం చేస్తాం.

🌳

E-Exercise– ఇది ప్ర‌తి ఒక్క‌రికి తెల్సిన విష‌య‌మే… కండ‌రాలు, న‌రాలు ఉత్తేజిత‌మై…కొత్త శ‌క్తిని ప్రేరేపిస్తుంది.

🌳

R-Reading– రోజుకు 10 పేజీలు చ‌ద‌వడాన్ని అల‌వాటు చేసుకోవాలి..ఇది మ‌నలోని అంత‌ర్గ‌త శ‌క్తిని ప్రేరేపిస్తుంది. ఫ‌లానా బుక్ చ‌ద‌వాల‌ని లేదు..మీకు తోచిన బుక్ ను చ‌దువుతూ పోండి.

🌳

S-Scribing( రాయ‌డం)- ఉద‌యం లేవ‌గానే…మీకు తోచిన లైన్స్ రాయండి… వీటిని మార్నింగ్ పేజెస్ అంటారు. ఇలా మీరు రోజూ రాస్తూ పోతే…మీ ఆటిట్యూడ్ లో మీకే తెలియ‌ని పాజిటివ్ వేవ్స్ వ‌స్తాయ్.


సో….ఈ ప‌నుల‌న్నీ ఉద‌యం 8 లోపే చేయాలి. ఆల్ ది బెస్ట్…మీలోని మిమ్మ‌ల్ని నిద్ర‌లేపండి.



ఆర్ఆర్ఆర్ కథ




ఆర్ఆర్ఆర్ కథ :


నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలోని ఓ గిరిజన ప్రాంతంలో ఈ కథ మొదలైంది. నిజాంను కలవడానికి వచ్చిన ఓ బ్రిటిష్ దొర ఓ గోండు పిల్లను బలవంతంగా తీసుకువెళ్తాడు. ఆ గోండు జాతి కాపరి కొమురం భీంకి(ఎన్టీఆర్) ఈ విషయం తెలుస్తోంది. కొమురం భీం తమగూడెం పిల్ల కోసం దొరల ఏలుబడిలో ఉన్న ఢిల్లీలో అడుగుపెట్టి అక్కడ విద్వంసం సృష్టించి ఆ పిల్లను రక్షిస్తాడు. దాంతో కొమురం భీం (ఎన్టీఆర్)ను ఎలాగైనా పట్టుకునే బాధ్యతను సీతారామరాజు (రామ్ చరణ్)కు అప్పగిస్తోంది బ్రిటీష్ ప్రభుత్వం. అయితే, రామరాజు కొమురం భీమ్ లోని నిజాయితీ, మంచితనం నచ్చి అతనికి సాయం చేస్తాడు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు రామరాజుకు బ్రిటీషు ప్రభుత్వం మరణ శిక్ష విధిస్తుంది.


ఈ విషయం ఏమి తెలియని భీం అనుకోకుండా సీతను కలుసుకుంటాడు. ఆమె పెట్టిన సద్ది తిని ఆకలి తీర్చుకున్న భీం ఆమె కష్టానికి కరిగిపోతాడు. మనువాడిన వాడు ఉరికంభం ఎక్కబోతున్నాడని సీత కన్నీరు పెట్టుకుంటుంది. రామరాజు గురించి భీంకు మొత్తం నిజం తెలుస్తోంది. నీ భర్త రాముడు లాంటి వాడు, రాముడికి కష్టం వస్తే వెళ్లాల్సింది సీతమ్మ కాదు. ఈ లక్ష్మణుడు అంటూ కొమురం భీం మళ్లీ బ్రిటీష్ పై అటాక్ చేసి రామరాజును జైలు నుంచి తప్పిస్తాడు. ఇలా మొదలైన వీరి స్నేహం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది ? *బ్రిటిష్ ప్రభుత్వం పై భీమ్, రామరాజు కలిసి ఏ విధంగా పోరాటం చేశారు ?* అనేది మిగిలిన కథ.


విశ్లేషణ :


నటి నటీనటుల విషయానికి వస్తే.. ముందుగా ఎన్టీఆర్ - చరణ్ ల గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఎన్టీఆర్‌, చరణ్‌ల నటన హృదయాలను హత్తుకుంటుంది. ఇద్దరి పాత్రల మధ్య ఎమోషన్స్ గుండె బరువెక్కేలా ఉన్నాయి. కథను బట్టి ఇద్దరి ఐడియాలజీ వేరు అయినా.. ఉత్తర, దక్షిణ ధృవాల్లా ఇద్దరు చెరో దారిలో తమ ప్రయాణం సాగించినా.. రెండు పాత్రల మధ్య బాండింగ్ ను రాజమౌళి చాలా గొప్పగా ఎలివేట్ చేశాడు.


*RRR Movie First US Review*


ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు ఇద్దరి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. ఇద్దరూ సింహాల్లా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నా.. రెండు పాత్రల మధ్య ఎమోషన్ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఫైట్ సీక్వెన్స్ లో ఆడియెన్స్ కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. హీరోలిద్దరూ తమ పాత్రల కోసం పడిన కష్టం అద్భుతం. ఆ విషయంలో ఇద్దరినీ మెచ్చుకోవాలి.


అలియా భట్ కూడా సీత పాత్రలో ఒదిగిపోయింది.. ఈ సినిమాలో మిగిలిన కీలక పాత్రల్లో నటించిన ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ , శ్రీయా అలాగే మిగిలిన లార్జ్ స్టార్ కాస్ట్ కి వాళ్ళ రేంజ్ కి తగ్గ, క్యాలిబర్ నిలబెట్టుకునే పాత్రల్లో అద్భుతంగా నటించారు. అయితే, ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ - చరణ్ ల ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి.


చరణ్ - అలియా మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఓవరాల్ గా ఇది ఒక యూనిక్ సబ్జెక్టు. అలాగే ఎమోషనల్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ కూడా వండర్ గా అనిపిస్తోంది. ఈ క్లైమాక్స్ ను ముందే ఏ ప్రేక్షకుడు ఊహించలేడు. అసలు ఈ ఊహించని రీతిలో క్లైమాక్స్ ను డిజైన్ చేయడం నిజంగా గొప్ప విషయమే.


తీర్పు :


మొత్తమ్మీద ఈ చిత్రం ఒక విజువల్ వండర్.. ఒక ఎమోషనల్ క్లాసిక్.. ఒక యాక్షన్ ఫీస్ట్. చివరగా ఒక్క మాటలో 'ఆర్ఆర్ఆర్' అబ్బుర పరుస్తోంది.





*RRR*

*R - రక్షకుడై*

*R - రక్తమిచ్చి*

*R - రక్షించువాడు*

*ఈ వేసవిలో మిరే RRR అవ్వండి.*

*రక్తదానం చేసి వెలకట్టలేని ప్రాణాలను కాపాడండి.*



  🤝🙏🤝 

*మీ.......* 

  🙏🤝🙏

Thursday, March 24, 2022

ఆనందానికి అందమైన నియమాలు

 ఆనందానికి  అందమైన నియమాలు

1) మనల్ని మనమే ఎక్కువగా ప్రేమించుకోవాలి..  

2)   ఎవ్వరితోనూ బేరాలాడవద్దు‌. పదో ఇరవయ్యో ఎక్కువ ఇచ్చినంత మాత్రాన మనం నష్టపోయేదీలేదు..  

3) వాదనలు, ప్రతివాదనలు, వితండవాదనలు చేయకూడదు.  దీనివల్ల ఆరోగ్యపరంగా నష్టపోయేది మనమే..  

4) ఏ విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకో కూడదు.  తేలికగా తీసుకోవాలి.  లేకపోతే మనస్తాపం వలన నష్టాలు తప్పవు‌.. 

 5) సపోర్ట్ లేకుండా మెట్లు ఎక్కడం దిగడం చేయవద్దు‌.. 

 6) చింతన చింతను దూరం చేస్తుంది.  మన అభిరుచులకు తగ్గట్లుగా మన దినచర్యని మలుచుకోవాలి..  

7) ఎవ్వరిపైనా నెగెటివిటి వద్దు. సదభిప్రాయం, సద్భావన, సానుకూలత ముఖ్యం. 

 8) ఇతరుల..  ముఖ్యంగా మన పిల్లల జీవితాలలో మన జోక్యం చేసుకోకూడదు.  అడిగితేనే సలహా ఇవ్వాలి..  

9) కంపేరిజన్ వద్దు.  కమిట్మెంట్ వుండాలి..

  10) ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందర తగదు..   

11)  3 ఆ లే మన ధ్యేయం కావాలి.  అవి   ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం.‌.  

12) నవ్వే టానిక్, మంచితనమే మెడిసిన్, పాత గుర్తులు, బంధాలే మంచి బూస్టర్స్..  ---- 

పండంటి జీవితానికి పన్నెండు విలువైన సూత్రాలు ఇవి..   పాటిస్తే  అంతా మన మంచికే...

పలాస అమ్మాయి జాక్‌పాట్‌

 🔳 పలాస అమ్మాయి జాక్‌పాట్‌.. రూ.44లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

24 Mar, 2022 13:03 IST|Sakshi



సాక్షి, విశాఖపట్నం: బీటెక్‌ చదువుతుండగానే ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో భారీ ఆఫర్‌ను చేజెక్కించుకుందో విద్యార్థిని. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సింహాచలం, సుభాసితిల కుమార్తె కొంచాడ స్నేహకిరణ్‌ అనే విద్యార్థిని విశాఖపట్నంలోని అనిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది.


ఈ కళాశాలలో అమెజాన్‌ సంస్థ 2021 డిసెంబర్‌లో క్యాంపస్‌ సెలక్షన్‌ నిర్వహించింది. అందులో స్నేహకిరణ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఏడాదికి రూ.44 లక్షల జీతంతో ఉద్యోగం సాధించింది. ఇదిలా ఉండగా, విద్యార్థిని తండ్రి జీడిపప్పు పరిశ్రమలో గుమాస్తాగా పనిచేస్తున్నారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని స్నేహకిరణ్‌ నిరూపించింది. కూతురు సాధించిన విజయంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పట్టుపట్టింది విజయం సాధించింది

 



పట్టుపట్టింది విజయం సాధించింది

పధ్నాలుగేళ్లకే పెళ్ళయింది...

పద్ధెనిమిదేళ్ళు రాకుండానే ఇద్దరు బిడ్డలకు తల్లయ్యారు...*

*నేను ఇంకేం సాధించలేను’ అని ఆమె నిరాశపడలేదు... పట్టుదలతో పోరాడి ఐపిఎస్‌ సాధించారు. నార్త్‌ ముంబయి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 35 ఏళ్ల ‘ముంబయి సివంగి’* *ఎన్‌.అంబిక విజయగాథ ఇది.*

పోలీస్‌ పరేడ్‌కి హాజరు కావాలంటూ ఆ రోజు ఉదయాన్నే నా భర్త ఇంటి నుంచి బయలుదేరారు. ఆ కార్యక్రమం టీవీలో చూశాను. డీజీపీ, ఐజీ హాజరయ్యారు. వారికి పోలీసులు నమస్కరిస్తూ చేసిన గౌరవమర్యాదలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. నా భర్త పోలీస్‌ కానిస్టేబుల్‌. ఆయన ఇంటికి రాగానే అడిగాను- ‘‘డీజీపీ, ఐజీ అంటే ఎవరు’’ అని. ‘‘వాళ్లు మా పోలీస్‌ డిపార్టుమెంట్‌లో మొదటి ర్యాంకు అధికారులు’’ అంటూ నా భర్త చెప్పారు. అప్పటి వరకూ ఇల్లు, పిల్లలే నా ప్రపంచం. ‘అప్పుడే నేను కూడా ఆ స్థాయి అధికారిణి కావాలని నిర్ణయించుకున్నా. అయితే అది అంత సులువు కాదని నాకు తెలుసు’’ అంటూ తనలో స్ఫూర్తి నింపిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు అంబిక.

కళ్ళెదుట ఎన్నో అవరోధాలు: తమిళనాడుకు చెందిన అంబికకు 14 ఏళ్ళ వయసులోనే పెళ్లయింది. మేజర్‌ అయ్యేసరికి ఇద్దరు అమ్మాయిలకు (ఐగాన్‌, నిహారిక) తల్లి అయ్యారు. ఇంటి పనులు, పిల్లల ఆలనా పాలనా.. ఇదే ఆమె జీవితం. అలాంటి పరిస్థితుల్లో పోలీస్‌ అధికారి కావాలని నిర్ణయం తీసుకున్నాక ఆలోచించుకుంటే ఆమెకు కళ్ళెదుట అనేక అవరోధాలు కనిపించాయి. హైస్కూల్‌ దాటకుండానే పెళ్ళితో ఆమె చదువుకు ఫుల్‌స్టాప్‌ పడింది. పుస్తకాలకు దూరమై చాలా రోజులయింది. తన కల నెరవేరుతుందో? లేదో? అనే సందేహంలో ఉన్న ఆమెకు భర్త అండగా నిలిచారు. ఆమెతో ప్రైవేటుగా టెన్త్‌ రాయించారు. ఆ తరువత ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసి, సివిల్స్‌ రాసేందుకు అర్హత సంపాదించారు.

*నాలుగో ప్రయత్నంలో విజయం:*

ఆమె చెన్నైలో పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటూ సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నారు. పుస్తకాలు, నోట్స్‌, వార్తాపత్రికలు, మేగజైన్స్‌... ఇవే ప్రపంచం. అయితే మొదటి మూడు ప్రయత్నాల్లోనూ ఆమె విఫలమయ్యారు. అంబిక భర్త ‘‘ఇక ఇంటికి వచ్చెయ్‌’’ అన్నారు. ‘‘ఈ ఒక్కసారి ప్రయత్నిస్తా’’ అని ఆమె చెప్పారు. మరింత శ్రమించారు. 2008లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. అంబిక ప్రస్తుతం ముంబాయి నార్త్‌ డివిజన్‌ డీసీపీగా నియమితులయ్యారు. కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెగువ, దూకుడు చూసి అందరూ ఆమెను ‘ముంబాయి సివంగి’ అని పిలవడం మొదలెట్టారు. విధి నిర్వహణకు, సేవా తత్పరతకు గుర్తింపుగా ‘లోక్‌మత్‌ మహారాష్ట్రియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌- 2019’ పురస్కారాన్ని అందుకున్న అంబిక నేటి తరానికి ఆదర్శం.

Wednesday, March 23, 2022

ఉచితం

 🍁ఉచితం🍁

ఒక రోజున దొంగ ఒకడు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు.

ఇంటి ముందు కాపలాగా ఒక కుక్క ఉన్నది. దొంగను చూసింది కానీ ఏ చప్పుడు చేయకుండా చూస్తూ ఉన్నది. అతన్ని చూసి మొరగని కుక్కను చూసి దొంగ ఆలోచనలో పడ్డాడు. దొంగతనానికి వెళదామా? వద్దా? అని.

తీరా ఇంటి లోపలకు వెళ్ళాక కుక్క అరిచిందంటే ఏం చేయాలి? ఇప్పుడే అరిస్తే వేరే ఇంటికి దొంగతనానికి వెళ్లొచ్చు! అని అనుకున్నాడు.

ఇలా ఆలోచిస్తూ చివరగా తాను తెచ్చిన రొట్టెముక్కను  కుక్కకు విసిరాడు. అంతే వెంటనే ఆ కుక్క గట్టిగా అరుస్తూ అతని వెంటపడి కరవడానికి ప్రయత్నించింది.

అప్పుడు దొంగ కుక్కతో ఇలా అన్నాడు. "నన్ను చూసికూడా అరవని నువ్వు రొట్టె ముక్క ఇవ్వగానే అరుస్తున్నావు ఎందుకు?" అని అడిగాడు.

నువ్వు ఊరికే ఉన్నప్పుడు, ఒకవేళ నువ్వు ఈ ఇంటి బంధువో లేక తెలిసిన వ్యక్తో అయిఉంటావని  అనుకున్నాను.

కానీ ఎప్పుడైతే నువ్వు "ఉచితంగా రొట్టెముక్క  ఇచ్చావో అప్పుడే నాకు అర్థమయింది నువ్వు దొంగవని", అని బదులిచ్చింది ఆ కుక్క.

ఆలోచించవలసిన విషయమే కదండీ ఇది. ఉచితం అనగానే ఆలోచన మరిచి ఎగబడుతున్నారు జనాలు.

"ఉచితంగా రొట్టె" ఇచ్చాడంటే అందులో ఎంతటి అర్థం ఉందో గ్రహించింది కుక్క. కానీ మషులమైన మనమే "ఉచితంగా డబ్బులు" ఎందుకు ఇస్తునారో గ్రహించలేక పోతున్నాం.

 *_ఒక కుక్క గ్రహించిన చిన్న విషయాన్ని కూడా మానవులమైన మనం గ్రహించలేక పోతున్నందుకు  చాల బాధగా ఉంది*._

Tuesday, March 22, 2022

మీ టైమ్‌టేబుల్‌ ఎలా ఉంది?


మీ టైమ్‌టేబుల్‌ ఎలా ఉంది?


పరీక్షల కోసం సిద్ధమవటం అంటే.. వరసగా పుస్తకాలు చదివేస్తూపోవటం కాదు. అందుబాటులో ఉన్న వ్యవధికి అనుగుణంగా టైమ్‌టేబుల్‌ వేసుకుని ప్రణాళికతో చదవాలి.


* కొన్ని సబ్జెక్టుల్లో చదవాల్సినవి చాలా ఉంటాయి. మరికొన్నింటిని చదవడం ఇప్పటికే పూర్తయి ఉంటుంది. దేనికెంత అవసరమో గుర్తించి ఆ ప్రకారం సమయం కేటాయించుకోవాలి. చదవాల్సినవి ఎక్కువగా ఉండి, క్లిష్టంగా ఉండే సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించుకుంటే ఒత్తిడి ఉండదు.

* ప్రతిరోజూ ఒక్కో సబ్జెక్టుకు ఎంత సమయాన్ని కేటాయించగలరు, ఈ సమయంలో చేయాల్సిన ఇతర పనులు ఏమైనా ఉన్నాయా... వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆచరణ సాధ్యమైన టైమ్‌టేబుల్‌ వేసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. ఏ సమయంలో చదవడం అనుకూలమో, ఎక్కువ సౌకర్యమో చూసుకోవాలి. అంతరాయం లేకుండా ఎక్కువసేపు చదవగలిగే సమయమేదో గుర్తించి, ఆ సమయంలో ఎక్కువ చదివేలా చూసుకుంటే చాలు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే సబ్జెక్టులు చదవటానికి సమయం కేటాయించుకోవాలి.



పరిస్థితులు ఏమైనా మారినప్పుడు వాటికి అనుగుణంగా మళ్లీ సమయాలను మార్చుకోవడానికి సందేహించకూడదు!


రివిజన్‌ ఎందుకంత ముఖ్యం?


చాలామంది విద్యార్థులు రివిజన్‌ (పునశ్చరణ) విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ‘బాగానే చదివా కదా, పరీక్షల్లో తేలిగ్గానే రాసేస్తా’ అనే ధీమా కావొచ్చు. లేకపోతే చదివినవే మళ్లీ చదవాలంటే విసుగూ, కొంత బద్ధకమూ.. ఏదైనా కావొచ్చు.  

నేర్చుకున్న పాఠ్యాంశాలను మళ్లీ ఓసారి చదవకపోతే రోజులు గడిచేకొద్దీ అవి జ్ఞాపకాల్లోంచి తొలగిపోతాయి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు దీన్ని రుజువు చేశారు.


ఇప్పుడు 100 శాతం గుర్తున్న సబ్జెక్టు విషయాలు వాటినిక పట్టించుకోకపోతే


1 గంట తర్వాత 56 శాతం  

1 రోజు తర్వాత 66 శాతం  

6 రోజుల తర్వాత 75 శాతం .. మర్చిపోతాం.


అందుకే ఒకసారి చదివి ‘వచ్చాయిలే’ అని ఊరుకోకుండా వాటిని తప్పనిసరిగా శ్రద్ధగా రివిజన్‌ చేయాలి. అప్పుడే పరీక్షల్లో సంపూర్ణంగా గుర్తు చేసుకుని రాయగలుగుతాం.

మనం చేసే పని

 మనం చేసే పని



కొత్త చెప్పులు కొందామని ఓ ప్రముఖ చెప్పుల దుకాణానికి వెళ్లాను. 

షాపులోని సేల్స్ మేన్ నాకు రక, రకాల 

క్రొత్త చెప్పులు చూపిస్తున్నాడు, 

కానీ సైజు కరెక్ట్ ఉంటే చెప్పులు నచ్చడం లేదు, 

నచ్చిన చెప్పులు సైజు సరిపోవడం లేదు, 

అయినా పాపం సేల్స్ మేన్ ఓపిగ్గా ఇంకా కొత్తరకాలు తీసుకొచ్చి చూపిస్తున్నాడు. 

అంతలో షాపు ముందు ఓ పెద్ద కారు వచ్చి ఆగింది, 

అందులోనుండి ఓ వ్యక్తి హూందాగా షాపులోకి వచ్చాడు, 

ఆయన్ని చూడగానే సేల్స్ మేన్స్ అందరూ మర్యాదగా లేచి నిలబడి నమస్కారం చేసారు.

ఆయన చిరునవ్వుతో యజమాని సీట్లో కూర్చొని దేవునికి నమస్కారం చేసి తన పనిలో నిమగ్నం అయ్యారు. 

మీ యజమానా? 

అని సేల్స్ మేన్ ను అడిగాను, 

అవును సార్, 

ఆయన మా యజమాని ,

ఇలాంటి షాపులు ఆయనకు ఓ పది వరకు ఉంటాయి. 

చాలా మంచి మనిషి అండి అని  

ఓ క్రొత్త రకం 

చెప్పుల జత చూయించాడు.  

ఆ చెప్పుల జత చూసే సరికి నాకు తెలియకుండానే నా పెదాల మీద చిరునవ్వు వచ్చేసింది. 

కానీ సైజే కాస్త అటు, ఇటు గా ఉన్నట్టుంది, 

చెప్పుల జత నాకు నచ్చిన విషయం సేల్స్ మేన్ కనిపెట్టినట్టున్నాడు. 

ఎలాగైనా నాతో ఆ చెప్పులజత కొనిపించేయాలని 

తెగ ఆరాట పడుతున్నాడు, 

కాస్త బిగుతుగా ఉన్నట్టున్నాయి కదా అంటే, 

అబ్బే అదేం లేదు సార్, 

మీకు కరెక్ట్ సైజే అంటూ బలవంతపెట్టడం మొదలుపెట్టసాగాడు, 

ఇదంతా గమనిస్తున్న షాపు యజమాని లేచివచ్చి

నాముందు క్రింద కూర్చుని 

సార్ ఓసారి మీ పాదం ఈ చెప్పులో పెట్టండి 

అని నా పాదం ను తన చేతిలో తీసుకుని చెప్పును తొడిగాడు. 

నాకు అంత పెద్ద మనిషి (వయసు లో పెద్ద, 

హోదాలో కూడా) 

నా పాదం ముట్టుకుని చెప్పు తొడుగుతుంటే 

ఇబ్బంది గా అనిపించింది. 

పరవాలేదులెండి సర్ 

నేను  lతొడుక్కుంటాను లెండి అని వారిస్తున్నా 

అతను వినకుండా రెండు కాళ్ల కు తన చేతులతో 

నాకు చెప్పులు తొడిగి లేచి నిలబడి 

ఓసారి నడిచి చూడండి సర్, 

మీకు కంఫర్ట్ గా ఉన్నాయో లేదో, 

లేకుంటే మరో జత చూద్దాం అన్నారు, 

కానీ 

ఆ జత సరిగ్గా సరిపోయాయి, 

నేను బిల్ పే చేస్తూ షాపు యజమాని తో మనసులో మాట బయటపెట్టాను, 

సర్ మీరు ఈ హోదా లో ఉండికూడా మా పాదాలు పట్టుకుని మరీ చెప్పులు తొడగడం మాకు ఇబ్బంది గా ఉందండీ? అన్నాను,

ఆయన చిల్లర తిరిగి ఇస్తూ చిరునవ్వుతో సర్! 

ఇది నా వృత్తి,దానిని ప్రేమించాను కాబట్టి ఇంత వాడిని అయ్యాను సర్, 

"షాపు బయట 

మీరు కోటి రూపాయలు ఇస్తాను అన్నా 

నేను మీ పాదాలు ముట్టుకోను, 

అదే షాపు లోపల 

మీరు కోటి రూపాయలు ఇచ్చినా మీ పాదాలు వదలను " అన్నారు.. 


నాకు ఆశ్చర్యమేసింది,

ఎంత గొప్ప వ్యక్తిత్వం! 


Dignity of labour 

**********


తను చేసే పని మీద గౌరవం, నిబద్ధత! 

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పాఠం నేర్పడానికి నాకు దేవుడు పంపిన గురువు లా కనిపించారు,

మనం చేసే పని చిన్నదా? పెద్దదా? అన్నది కాదు సమస్య, 

న్యాయబద్ధ మైందా? కాదా అని చూడాలి, న్యాయబద్ధమయినప్పుడు చేసే చిన్న పనికి సిగ్గు పడకూడదు.

ఎప్పుడూ మనం చేసే పనిని కానీ, ఉద్యోగాన్ని కానీ తిట్టరాదు,

అదే మన కుటుంబానికి భవిష్యత్తు🙏

Monday, March 21, 2022

తెలుగా మజాకా

*✍🏻మూడింటినీ నిలువుగానూ, అడ్డంగానూ చదివి చూడండి. ఎట్లా చదివినా అవే పదాలు వస్తున్నాయి చూడండి!*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


స మ త

మ జ్జి గ

త గ ము


కం చ ము

చ క్కె ర

ము ర ళి


క్షీ ర ము

ర వ్వ లు

ము లు కు


కా ను పు

ను వ్వు లు

పు లు లు


కా ర ము

ర గ డ

ము డ త


స మ త

మ ర ల

త ల పు


త మ కం

మ ర్యా ద

కం ద కం


పొ ల ము

ల లి త

ము త క


ధ న ము

న వ్య త

ము త క


వ ర స

ర వి క

స క లం


హి మ జ

మ న ము

జ ము న


క వి త

వి న ల

త ల క


కో వె ల

వె న్నె ల

ల ల న


మ న సు

న య నం

సు నం ద


ది న ము

న గ రి

ము రి కి


టో క రా

క వ్వ ము

రా ము డు


చ దు వు

దు ర ద

వు ద కం


ప్ర వే శం

వే ది క

శం క రం 


*తెలుగు భాష గొప్పదనం చూశారా...!🙏*

Saturday, March 19, 2022

సర్వరోగ నివారిని ప్రాణాయామం

 సర్వరోగ నివారిని ప్రాణాయామం


తరచూ అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం కుదుటపడు తుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ రకాల యోగ మూలంగా శరీరం, మనసు రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయని వారంటున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతో గానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాను చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని వారంటు న్నారు. యోగాలో భాగంగా ప్రాణాయామం గురించి  తెలుసుకుందాం.


1.ప్రాణాయామ విశేషాలు


ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, ప్రశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు.శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు.నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచ రిస్తూ ఉంటుంది. 


ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే ‘‘ ప్రాణాయా మేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్‌’’ అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.


ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమను 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థానం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్‌ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.మెడికల్‌ సైన్స్‌ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు. 


వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందు వల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాదించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబంధించినదే.


2. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు


ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.

శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.

రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా

బయటికి వెళ్లి పోతుంది.

గుండెకు సత్తువ లభిస్తుంది.

మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.

జఠరాగ్ని పెరుగుతుంది.

శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

ఆయుష్షు పెరుగుతుంది. ఇది అన్నిటికంటే మించిన విశేషం.


3. తీసుకోవలసిన జాగ్రత్తలు

మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని,

కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.


గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.

మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.

సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.

పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు.

ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు.

అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.


ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.

పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువెైన ఆసనాలు.

నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.

నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణా యామం చేయాలి.


ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు

రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.


ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది.

ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.


Friday, March 18, 2022

పైల్స్‌తో బాధపడుతున్న వారు వీటిని తినడం తగ్గించండి

 పైల్స్‌తో బాధపడుతున్న వారు వీటిని తినడం తగ్గించండి..

1. పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు మొదలైనవి. ఎర్ర మాంసం లేదా ప్రాసెస్ చేసిన మాంసాలు. ఎందుకంటే వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. మలబద్దకానికి దారితీసే జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది.

2. వేయించిన ఆహారం: ఇది మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది కాబట్టి ఫ్రై చేసిన వాటికి దూరంగా ఉండటం మంచిది. ఉప్పు అధికంగా తినొద్దు.

3. కారంగా ఉండే ఆహారాలు: ఫైబర్ తక్కువగా ఉండకూడదు, కారంగా ఉండే ఆహారం నొప్పిని పెంచుతుంది. కెఫిన్ పానీయాలు, ముఖ్యంగా కాఫీ, మీ బల్లలను గట్టిపరుస్తాయి. మరింత బాధాకరంగా చేస్తాయి.

4. ఆల్కహాల్: కెఫిన్ పానీయాల మాదిరిగా, ఆల్కహాల్ డ్రింక్స్ మీ బల్లలను గట్టిపరుస్తాయి. తద్వారా నొప్పి వస్తుంది. అందుకని పైల్స్ సమస్య మరింత పెరగకుండా ఉండేందుకు కెఫిన్ తీసుకోవడం మానుకోండి.


వీటిని తినండి..

1. బార్లీ, క్వినోవా, బ్రౌన్ రైస్, వోట్స్, చిక్కుళ్ళు వంటి అధిక ఫైబర్ ఉన్న వాటిని మీ ఆహారంలో తీసుకోండి.

2.  క్యారట్  బీట్రూట్ బ్రోకలీ, కాలీఫ్లవర్, కాలే,క్యాబేజీ, గుమ్మడికాయ, బెల్ పెప్పర్స్, దోసకాయ,జామపండు,బొప్పాయి వంటి పండ్లు కూరగాయలు తినండి.

ఇంగువ గురించి తెలుసుకోండి

 ఇంగువ గురించి తెలుసుకోండి


ఇంగువ, హింగు, అసఫోటెడ అని రక రకాలుగా పిలవబడే ఈ వంటింటి దినుసు , తజకిస్తాను, ఆఫ్గనిస్తాన్ మరియు భారతదేశంలో కాశ్మీర్, పంజాబ్ ప్రాంతాలలో పండే ఒక నేల దుంప నుండి వచ్చే సహజ బంక దాన్ని శుభ్రపరచి పొడి,ముద్ద లేదా దాణా రూపంలో మనకి తయారు చేసి మార్కెట్ లో  కోనుగోలు కోసం పెడతారు.ఇది అనేక రుచి తో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు వంటింటి వైద్య మూలిక గా చెప్పుకోవచ్చు అందులో కొన్ని ముఖ్యం ఉపయోగాలు తెలుసుకుని మనం దాని ప్రాముఖ్యత తెలుసుకొని వాడి మన కుటుంబ ఆరోగ్యానికి మేలు చేసుకుందాం.


ఇంగువ యొక్క ఉపయోగాలు


1. జీర్ణక్రియను వృద్ధి చేస్తోంది, మల బద్ధకం,అతిసారం, కడుపులో తిమ్మిరి, గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిస్తుంది.


2. శరీరంలో హానికారక బ్యాక్టీరియా నిరోధించే యాంటీ మైక్రో బయాల్ గా పని చేస్తుంది.


3. పచ్చళ్ళు మరియు ఇతర నిలవ పదార్థాలలో ఉపయోగించడం వల్ల అవి జిడ్డు వాసన రాకుండా పాడవకుండా ఉంటాయి.


4. కాలేయంలో హానికారక విష పదార్థాల యొక్క మోతాదు తగ్గించడం లో తోడ్పడుతుంది.


5.హార్ట్ ఎటాక్ మరియు కరోనరీ వంటి గుండె సమస్యలు రాకుండా ఉపయోగ పడుతుంది.


6.మూత్ర విసర్జన శాతం పెంచి శరీరంలో సోడియం పొటాషియం నిలువలు పెరగ కుండా మూత్ర పిండాలకు సాయం చేస్తుంది


7.మెదడు యొక్క పని తీరు మెరుగు పరచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది.యాంటీ దిమెన్షియ వంటి మానసిక వైకల్యలను తగ్గించే మందుల్లో ఇంగువ వాడకం ఉంటుంది.


8.కండరాల నొప్పిని నివారిస్తుంది.బిపి లేదా రక్తపోటుని నివారించే ఏజెంట్ గా కొన్ని వైద్య విధానాలలో ఇంగువ వాడతారు.


9.ఇంగువ సుగర్ వ్యాధి ఉన్న వారు ఉపయోగించడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.


10.శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను నిరోధించడంలో


11.అధిక శరీర బరువు ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

పై భాగము  సేకరణ.

వెల్లుల్లి  అసలు పూర్తిగా  వాడని వారు , ఏవో ఒకటి  రెండు వంటకాలలో  వెల్లుల్లి  వాడినా  ముఖ్యంగా ఇతర వంటకాలు  చేసుకునే వారు,  కొన్ని ప్రాంతాలలోని  కొన్ని సాంప్రదాయకమైన కుటుంబాలలో  వెల్లుల్లి  పూర్తిగా  నిషేధించిన వారు ప్రతి నిత్యం తయారు చేసుకునే వంటకాలలో  తప్పనిసరిగా  ఉపయోగించే  పదార్ధం  ఇంగువ.


ఇంగువ గడ్డ రూపంలో  మరియు మెత్తని పొడి రూపంలో  దొరుకుతుంది.  ఈ ఇంగువను  వంటకాలలో  తగు మోతాదులోనే  ఉపయోగించాలి. మోతాదు మించితే ఇంగువను వేసి తయారుచేసిన పదార్ధం  ఓ విధమైన ఘాటైన వెగటు వాసన వచ్చి వస్తువు రుచి పాడవుతుంది,- అందువల్లనే ఇంగువను  వంటకాలలో  తగు మోతాదులోనే ఉపయోగించుకోవాలి.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

పరీక్షలంటే భయమా?

 పరీక్షలంటే భయమా ?

పది నెలలు ఆడుతూ పాడుతూ గడిపేసారుగా!

(రోజు ఏ రోజు పాఠాలు ఆరోజే చదువుకునే వారిగురించి నేను చెప్పబోవటంలేదు) ఇంకా చాలా తక్కువ సమయమే ఉంది బోర్డు పరీక్షలకు. 

ఇప్పటికయినా మించి పోయింది ఏమి లేదు పద్దతిగా చదివితే చాలా మార్కులు తెచ్చుకోవచ్చు


మొబైల్ వాడటం మానైయండి లేదా బాగా తగ్గించండి మొబైల్లో నెట్ కనెక్షన్ కట్ చెయ్యండి అవసరమైతే లాప్టాప్ వాడండి 

టీవీ చూడటం మానేస్తే మంచిది స్నేహితులు ఉసిపోక కబుర్లకు స్వస్తి పలకండి.

 

మీకు కష్టంగ ఉన్న సబ్జెక్టులు ఏమిటో తెలుసుకోండి వాటిలో ఇంపార్టెంట్ వి సెలెక్ట్ చేసుకుని ముందుగా వాటిని అర్ధం చేసుకుంటూ చదవండి. మీకు తొందరగా అర్ధమయ్యి మీరు సొంతంగా వ్రాసే కెపాసిటీ మీకు అలవడుతుంది. కంఠతా వచ్చాయని వదిలేయకుండా కనీసం రోజుకు ఒకసారైనా చదవండి అప్పుడు మీరు మర్చిపోలేరు.

 

*మీరు తెల్లవారు జామున నాలుగు గంటల్నుండే చదవడం ప్రారంభించండి. ఎందుకంటె మీకు డిస్ట్రబెన్స్ ఉండదు ఆ టైంలో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది.

 

ఏమి చదవాలో ఎప్పుడు చదవాలో ఒక టైంటేబిల్ తయారు చేసుకుని దానిని మీ తల్లితండ్రులకు చూపించండి వారు సంతోషించి మిమ్మల్ని ఆ టైంకు చదివేటట్లు శ్రద్ధ తీసుకుంటారు మిమ్మల్ని మీరు నమ్మండి ఆత్మవిశ్వాసం పెంచుకోండి మిమల్ని మీరు ఎప్పుడు తక్కువ గ అంచనా వేసుకోకండి మహాత్మా గాంధీ గారు కూడా మొదట్లో అవేరేజ్ స్టూడెంటే పట్టుదలతో సొంతంగా ఆంగ్లభాషలో పుస్తకాలు వ్రాసే స్థాయికి ఎదిగారు మీరు పాఠాలు చదివి వదిలెయ్యకుండా వాటిని చూసి, చూడక వ్రాయండి జనాబులొ తప్పులుంటే మీరు సరిచేయండి 

మీరు 10వ తరగతి లేదా ఇంటర్ చదివేవారైతే మీరు భవిషత్తులో ఏమిచదువుకోవాలనుకుంటున్నారో ముందుగానే ప్లాన్ చేసుకుని ఒక పద్దతిగా చదివి మంచి మార్కులు తెచ్చుకోండి తద్వారా మీ తల్లితండ్రులకు మీ పైచదువులు చదివేందుకు ఖర్చు తగ్గించిన వాళ్లవుతారు 

తల్లితండ్రులు మీరు పిల్లల్ని అవమానించడం నలుగురిలో చిన్నబుచ్చడం చెయ్యకండి వారితో ప్రేమగా మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాశాన్ని పెంచండి మీరు అనవసరంగ లేనిపోని పనులు పెట్టుకుని అక్కడకు ఇక్కడకు పోకుండా టీవీ చూడటం తగ్గించి పిల్లలమీద, వారి ఆరోగ్యం మీద (పోషక విలువలున్న అందించి) శ్రద్ధ చూపండి 

విద్య ను ఎవ్వరు దొంగిలించలేరు కాబట్టి ఆస్తి పాస్తులకంటే విలువైన విద్యను విద్యార్ధులు అభ్యసించి మీరు ప్రయోజకులై దేశానికీ ఉపయోగపడండి


కాలం నేర్పిన పాఠం ??

 

కాలం నేర్పిన పాఠం??

*పొలం గట్లపై నడిపించి, తడబడకుండా నిలదొక్కుకోవటం*
*నేర్పింది.*

*వాగు పక్కన నీటి చెలిమలుతీయించి,*
*శోధించే తత్వంనేర్పింది.*

*సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి అన్వేషణనేర్పింది.*

*తుమ్మ ముల్లు, పల్లేరు గాయాల గుచ్ఛులతో,*
*జీవితం*
*పూలపాన్పు కాదని నేర్పింది.*

*చిన్న చిన్న దెబ్బలు తగిలితే,*
*నల్లాలం ఆకు పసరు పోయించి,*
*చిన్న చిన్న ఇంటి వైద్యం* *చిట్కాలు*
*నేర్పింది.*

*చెట్టుమీద మామిడికాయ*
*గురిచూసి కొట్టడం, లక్ష్యాన్ని*
*ఛేదించడం*
*నేర్పింది.*

*నిండు బిందెను*
*నెత్తి మీద పెట్టి*
*నీళ్లు మోయించి,*
*జీవితమంటే*
*బరువు కాదు..*
*బాధ్యత*
*అని నేర్పింది.*

*బావి నుండి బొక్కెనతో నీళ్లు తోడించి,*
*బ్యాలన్స్ గా*
*బరువు*
*లాగటం నేర్పింది.*

*ఇంటి ముంగిటకు అతిథి దేవతలు*
*హరిదాసులు గంగిరెద్దులను రప్పించి,*
*ఉన్న దాంట్లో కొంత పంచుకునే*
*గుణం నేర్పింది.*

*విస్తరిలో,*
*అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా*
*తినే*
*ఒద్దికను*
*నేర్పింది.*

*ఒక్క పిప్పర్మెంట్ ను, బట్ట వేసి కొరికి ముక్కలు చేసి,*
*కాకి ఎంగిలి పేరుతో*
*స్నేహితులతో*
*పంచుకోవటం*
*నేర్పింది.*

*ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్కటొక్కటిగా రేక్కాయలు తెంపే ఓర్పును*
*నేర్పింది.*

*దారంతో విల్లును చేయించి, వస్తు తయారీ మెళకువలు*
*నేర్పింది.*

*అత్తా, మామా, అన్నా వదినా, అమ్మమ్మా, నాయనమ్మా, తాతయ్యా వరుసలతో,*
*ఊరు ఊరంతా ఒక కుటుంబమనే* *ఆత్మీయత*
*నేర్పింది.*

*ధైర్యంగా*
*బ్రతికే పాఠాలను నేర్పిన*
*మన బాల్యానికి*
*జీవితాంతం*
*రుణపడి ఉందాం.*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

            

Thursday, March 17, 2022

మన పండుగల గొప్పతనం తెలుసు కోండి

 ◆ మన పండుగల గొప్పతనం తెలుసు కోండి.◆


★ *ఉగాది:-* కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.

★ *శ్రీరామ నవమి:-* భార్య - భర్తల  అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.

★ *అక్షయ తృతీయ:-* విలువైన వాటిని  కూడబెట్టుకోమని.

★ *వ్యాస (గురు) పౌర్ణమి :-* జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.

★ *నాగుల చవితి;-* ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.

★ *వరలక్ష్మి వ్రతం :-*  నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.

★ *రాఖీ పౌర్ణమి:-* తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.

★ *వినాయక చవితి ( నవరాత్రులు ) :-* ఊరంతా ఒక్కటిగా కలవడానికి.

★ *పితృ అమావాస్య:-* చనిపోయిన వారిని  ఎప్పటికి మరువకు అని చెపుతూ.

★ *దసరా ( ఆయుధ పూజ)  :-* ఎప్పుడు నీకు అండగా  నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.

★ *దీపావళి :-* పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.

★ *కార్తీక పౌర్ణమి :-* చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.

★ *సంక్రాంతి :-*  మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం,  అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.

★ *మహాశివరాత్రి :-* కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.

★ *హోలీ :-* వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు,  పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

హోలీ పూర్ణిమ


💥⭐🌟

హోలీ పూర్ణిమ

వసంత రుతు ఆగమనా నికి సంకేతం. రాలే ఆకులు రాలుతూ ఉంటే , వచ్చే ఆకులు వస్తూ వుంటాయి. 


అదేవిధంగా , పాత కోరికలు మరుగున పడుతూ ఉంటే కొత్త కోరికలు చిగురులు తొడుగుతూ ఉంటాయన్నమాట. 


రంగులు లేని లోకం లేదు. లోకంలో లేని రంగులూ లేవు. అందుకు ప్రతీకగా జరుపుకునే పండగే హోలీ. మనిషి జీవితం రాగరంజితంగా , సప్తవర్ణ శోభితంగా ఉండాలన్నది సందేశం. 


*పురాణగాథ ఏమిటంటే ,*


లోకకల్యాణం కోసం దేవతల కోరిక మేరకు , తన స్నేహితుడైన వసంతుడిని వెంట బెట్టుకుని వెళ్లి , తపోదీక్షలో మునిగి ఉన్న పరమేశ్వరునిపై విరిబాణాలను సంధించి ఆయన మనస్సును చలింపజేసేందుకు ప్రయత్నిస్తాడు మన్మథుడు.

తపోభంగం కావడంతో శివుడు తన మూడో కన్ను తెరిచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. 


అయితే , మన్మథుడి భార్య రతీ దేవి పార్వతీ దేవికి భక్తురాలు కావడంతో , సుమంగళిగా ఉండాలన్న వరాన్ని అనుగ్రహించింది పార్వతి ఆమెకు. ఆ వరభంగం కాకుండా ఉండేందుకు , మన్మథుణ్ణి తిరిగి బతికిస్తాడు పరమేశ్వరుడు. అయితే , అతను రతీదేవికి తప్ప మరెవరికీ తన రూపంలో కనిపించడు. రూపం కోల్పోయిన మన్మథుడు ఆనాటి నుంచి మనుషుల మనస్సులలో దాగి ఉండి , తన బాణాల ద్వారా వారి అసలు పని నుంచి దృష్టి‌ మళ్లించేం దుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మన్మథుడు అంటే మనస్సును మథించే వాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే ఆరు అంతః శత్రువులు మనస్సును మథిస్తాయి.


వాటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషిని పతనం చేసే ఈ ఆరు గుణాలనూ అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేశాడు. 


ఈ సంఘటన ను దృష్టిలో పెట్టు కునేందుకే , ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన ఫాల్గుణ శుద్ధపూర్ణిమకు ముందురోజు , గ్రామాలలో కామదేవుని ప్రతిమను తయారు చేసి , ఊరేగింపుగా తీసుకెళతారు. యువకులంతా కలిసి కామదహనం చేస్తారు. ఫాల్గుణ పూర్ణిమనాడు పెళ్లికాని యువతీ యువకులు ఒకచోట చేరి , వసంతం కలిపిన నీటిని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. 


దీనిద్వారా వారికి గల పరస్పర ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేసుకుంటారు. పెద్దలు వారి ప్రేమను ఆమోదిస్తారు.


*🌺రాధాకృష్ణుల రంగుల కేళీ:*


రాధాకృష్ణులు ఓరోజున ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వనవిహారం చేస్తుండగా రాధ చేతి పక్కన ఉన్న తన చేయి నల్లగా ఉండటం చూసి దిగులు పడ్డాడట కృష్ణుడు. అప్పుడు యశోదమ్మ *‘నాయనా ! రాధమ్మ అసలు రంగు తెలియకుండా నువ్వు ఆమెపై రంగులు కలిపిన నీళ్లు పోయి’* అని సలహా ఇచ్చిందట. దాంతో నల్లనయ్య రాధమీద రంగునీళ్లు పోశాడట. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీరు చిలకరిస్తూ కృష్ణునికి అందకుండా బయటకు పరుగులు తీసిందట. ఇలా రాధాకృష్ణులిద్దరూ ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన పురజనులు... ఆనందోత్సాహాలతో ఆనాడు రంగులపండుగ చేసుకున్నారట. 


నాటి నుంచి ప్రతి ఫాల్గుణ పున్నమినాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో ముంచెత్తుకోవడం , పెద్ద ఎత్తున పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.


*🌺హోలికా పేరు మీదుగానే:*


హిరణ్యకశిపునికి హోలిక అనే సోదరి ఉండేదట. ఆమెకు అనేక దుష్టశక్తులతో పాటు మంటలలో దూకినా కాలిపోని వరం ఉంది. హోలిక చాలా దుష్టురాలు , దుర్మార్గు రాలు.  పసిపిల్లలను ఎత్తుకుపోయేది. తన కుమారుడయిన ప్రహ్లాదుడు హరినామ స్మరణ మానక పోయేసరికి హోలిక తన మేనల్లుడైన ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలో దూకిందట. అయితే , హోలిక మాడిపోగా , ప్రహ్లాదుడు సురక్షితంగా బయట పడ్డాడు. దుష్టరాక్షసి పీడ వదిలిందన్న సంతోషంతో ప్రజలంతా ఆనందంతో ఒకరిపై ఒకరు రంగునీళ్లు చిమ్ముకుంటూ ఉత్సవం చేసుకున్నారట. హోలిక అనే రాక్షసి పేరు మీదుగా *‘హోలీ’* అనే పేరు వచ్చిందట.


ఇవే కాకుండా హోలీ పండుగను వసంత  ఋతువు వస్తోందన డానికి సంకేతంగా భావిస్తారు. వసంతకాలం అంటే చెట్లు చిగిర్చి పూలు పూసే కాలం కదా ! 


అంటే మనలోని దుర్గుణాలనే ఎండుటాకులను రాల్చేసి , వాటి స్థానంలో ఉల్లాసం , ఉత్సాహం అనే సుగుణాలతో కూడిన లేలేత ఆకులను చిగురింపచేసుకోవాలి. ఈ రోజున ఏం చేస్తే మంచిదంటే... *మహాలక్ష్మి ఫాల్గుణ పూర్ణిమ నాడే పాలకడలి నుంచి ఆవిర్భవించిందని , అందుకే ఈ వేళ లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే సకల సంపదలూ చేకూరతాయని పురాణోక్తి.*

ఈ రోజున బాలకృష్ణుని ఊయలలో వేసి ఊపుతారు. అందుకే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో డోలోత్సవంగా జరుపుకుంటారు. *అయ్యప్ప పందల రాజుకు కనపడింది ఫాల్గుణ శుద్ధ పూర్ణిమనాడేనని ,  కనుక ఈ వేళ అయ్యప్పకు పూజలు చేస్తే మంచిదని విశ్వాసం.* అలాగే ఈ వేళ రతీమన్మథులను పూజించడమూ మంచిదే. అదేవిధంగా పిల్లలకు ప్రాణహాని తలపెట్టే ఢుంఢి అనే రాక్షసి పీడను వదిలించుకునేందుకు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి. హోలీపండుగ రోజున లేలేత మావిచిగుళ్లు తింటే సంవత్సరమంతా సంతోషంగా ఉంటారని శాస్త్రోక్తి.

Monday, March 14, 2022

మొదటిదా రెండవదా

        మొదటిదా  రెండవదా

          ------------

*_మాట మీద నిలబడటం వేరు_*

*_నిలబడే మాట పలకడం వేరు_*

                       *_మొదటిది_*

                    *_నిజాయతీ_*

                       *_రెండవది_*                                                                   *_దార్శనికత_*

-------

*_చెప్పింది చేయడం వేరు_* 

*_చేసేది చెప్పడం వేరు_*

                        *_మొదటిది నిబద్దత_*

                        *_రెండవది_*                                                 *_పారదర్శకత_*

-------

*_ఇతరుల మీద గెలవడం వేరు_*

*_ఇతరుల మదిలో నిలవడం వేరు_*

                       *_మొదటిది తంత్రం_*

                       *_రెండవది తత్వం_*

-------'

*_ఎంత దూరమైనా వెళ్ళడం వేరు ఎంత దూరం వెళ్ళాలో తెలియడం వేరు_*

                       *_మొదటిది సాహసం_*

                       *_రెండవది వివేకం_*

------

*_ఎలాగైనా చేయడం వేరు ఎలా చేయాలో తెలిసుండటం వేరు_*

                       *_మొదటిది చొరవ_*

                       *_రెండవది నేర్పు_*

*_-ఇతరులపై చూపుడు వేలు ఎత్తడం వేరు ఇతరుల కోసం పిడికిలి బిగించడం వేరు_*

                       *_మొదటిది నింద నీడన అస్తిత్వం_* 

                       *_రెండవది నీడ వీడిన చైతన్యం_*

------'

*_గెలవడం వేరు గెలిపించడం వేరు_*

                       *_మొదటిది నేను_* 

                       *_రెండవది మేము_*                                         

-------

*_మొదటిది కావాలో... రెండవది కావాలో... ఆలోచన మనదే ... ఆచరణా మనదే ..._*💐

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE