NaReN

NaReN

Tuesday, November 1, 2022

జీవితం ఆకాంక్ష

జీవితం ఆకాంక్ష


 కొన్ని రోజుల క్రితం ATM దగ్గరకు వచ్చి సార్ నాకు ఒక తోపుడు బండి ఇవ్వండి నేను కూరగాయలు అమ్ముకుంటా అంది .. అసలు నీకు కూరగాయలు ఎక్కడ తేవాలి, ఎలా అమ్మాలి, ఎంతకు అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఏమ్టెన తెలుసా తల్లి అసలే ఆరు పదుల వయసు సాయం చేయడానికి ఎవరు తోడులేరు ముందు కూరగాయల మార్కెట్ కి వెళ్ళు అన్ని తెలుసుకో అయినా నేను కూరగాయల వ్యాపారమే చేస్తా  అంటే అప్పుడు రా తల్లి అని పంపించా ...


నేను మెయిన్ రోడ్డు దగ్గర క్యాబ్ కోసంl వెయిటింగ్ అప్పుడే వడి వడిగా పరిగెడుతూ మా దగ్గరకు వచ్చింది ఒక అమ్మ ... సార్  నేను గుర్తున్నన కమల నేను కలిసి వచ్చినం అంది ... ఆ గుర్తుంది తల్లి చెప్పు అన్న ... నేనిప్పుడు కూరగాయలు అమ్మడం నేర్చుకున్న  రోజుకు 400 సంపాదిస్తున్న  కాని అందులో 150 రూపాయలు బండి కిరాయికి పాతున్నయి మీరు బండి ఇప్పిస్తే 400 మిగులుతయి సార్ అంది :


 ఇంతకి ఎక్కడ అమ్ముతున్నవ్ ఎలా అమ్ముతున్నవ్  అని అడిగా :  రోజు కూరగాయల షాప్ లు బంద్ చేసే టైంకి మార్కెట్స్ కి వెళ్తా వాళ్ళు బంద్ చేసి ముందు ఆ మిగిలిపోయిన కూరగాయలు అన్ని తెచ్చుకొని వాటిలో మంచివి అన్ని వేరుకొని వాటిని శుభ్రం చేసి పది రూపాయలకే ఒక ప్యాకెట్ లాగ బస్తీల్లోకి వెళ్లి అమ్ముతా రోజుకి 50 ప్యాకెట్స్ తీసుకెళ్తే 40  అమ్ముడు పాతయి 10 మిగులతయి అంటే రోజుకు 400 మిగులుతాయి ... కొన్న వాళ్ళు 10 రూపాయలకే  వాళ్ళ గుడిసెల దగ్గరకే వెళ్తా కాబట్టి రోజు అమ్మగలుగుతున్న .... ఇప్పుడు మీరు బండిస్తే  ఆ బండి కిరాయి  మిగులుద్ది అని వచ్చింది...


కొద్ది సేపు అవి మంచి కూరగాయలేనా ... వాళ్లు ఇస్తున్నరా లేదా పడేసినవా అని అనుమానాలు వ్యక్తం  చేసినా...వాళ్ళు తిరిగి తీసుకెళ్ళలేనివి ఇస్తరు సార్... అంది ఆరా తీసా అవును చాలా మంది రైతులు ఇచ్చి వెళ్తరు అని చెప్పారు..


పైసా  పెట్టుబడి లేదు పైగా పట్టెడు అన్నం కొసం ఎంత పట్టుదల అందుకే ఆలస్యం చేయకుండా  వెంటనే కొత్త బండి ఆర్డర్ పెట్టాలి... 

రేపే ఈ తల్లికి  ఇలా ప్రాజెక్ట్ లైఫ్ లో భాగంగా మరో మూడు కుటుంబాలకు అందించాలి ఏమంటారు 🙏

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE