NaReN

NaReN

Friday, November 25, 2022

ఐటీ’ కన్ను పడితే

 *ఐటీ’ కన్ను పడితే*✍️*


*🔅పక్కాగా ఆదాయ పన్ను శాఖ ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థ..*


*🔅ఒక్కో దాడికి రోజులు, నెలల కసరత్తు*


*🔅టార్గెట్‌ ఎవరనేది చివరి వరకు రహస్యమే!*


*🔅లక్షిత వ్యక్తుల సమస్త సమాచారం సేకరణ*


*💥హైదరాబాద్‌, నవంబరు 24 : ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సోదాలు చేయాలంటే ఆషామాషీ కాదు..! లక్షిత వ్యక్తులు, వారి సన్నిహితులు, బంధువులు, ఉద్యోగులు.. ఇలా అందరి ఇళ్లలో ఏకకాలంలో దాడులు జరుపుతుంటారు. ఇంత మంది ఇళ్లలో ఒకేసారి, ఒకే సమయంలో సోదాలు ఎలా సాధ్యం..? ‘‘ఇంటి తలుపులు తట్టి.. వియ్‌ ఆర్‌ ఫ్రం ఐటీ డిపార్ట్‌మెంట్‌.. అంటూ చకచకా ఇంట్లోకి వెళ్లి.. అందరి దగ్గర సెల్‌ఫోన్లు తీసుకోవడంతో పాటు ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ డిస్‌కనెక్ట్‌ చేసేస్తారు. ఇల్లు/కార్యాలయాల్లో ఇలా సోదాలు జరుగుతుండగానే గేటు వద్ద భద్రతా సిబ్బంది లోపలి వారు బయటకు వెళ్లకుండా, బయటి వారు లోనికి రాకుండా పహారా కాస్తారు. ఒకే సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో అంతా ఒకేలా జరిగిపోతుంటుంది’’ ఇదెలా సాధ్యం? ఉదాహరణకు మంత్రి మల్లారెడ్డి నివాసంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆయా సంస్థల్లో పనిచేసే కొంత మంది ఉద్యోగుల ఇళ్లు.. ఇలా ఒకే సమయంలో పదుల సంఖ్యలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు జరిపాయి.*


*ఎవరిపై అయినా ఇలాగే దాడులు జరుగుతాయి. తెల్లవారకముందే ఇంటికి వచ్చి కాలింగ్‌ బెల్‌ ఎలా నొక్కుతున్నారు? వారికి అన్ని అడ్ర్‌సలు ఎలా తెలుసు..? ఐటీ దాడులు ఎదుర్కొంటున్నవారే కాదు సాధారణ ప్రజలు, ప్రముఖుల్లోనూ ఇప్పుడు ఇదే ప్రశ్న. ‘‘మా సంస్థల్లో పనిచేస్తున్న కొంత మంది క్లర్కుల ఇళ్లల్లోనూ ఐటీ బృందాలు సోదాలు జరిపాయి. కొన్ని సంవత్సరాలుగా వారు మా వద్ద పనిచేస్తున్నా వారి చిరునామా మాకు తెలియదు. మరి ఐటీ వారికి ఎవరు చెప్పారో?’’ అని మంత్రి మల్లారెడ్డి మీడియాతో అన్న మాటలివి! మరి ఇంత కచ్చితంగా ఐటీ దాడులు ఎలా జరుగుతాయనేదానిపై ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనాత్మక కథనం.*


*♦️సమాచారమే ప్రధానం..*


*పన్ను ఎగవేతదారులు, పెద్దమొత్తంలో లెక్కల్లో లేని నగదు కలిగి ఉన్న వారి సమాచారం ఐటీ శాఖకు రెండు రకాలుగా అందుతుంది. ఒకటి ఎవరైనా ఫిర్యాదు చేయడం. రెండోది ఐటీ విభాగం తన ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థ ద్వారా నిఘా పెట్టడం. ఐటీ శాఖ ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థ అత్యంత గోప్యంగా ఉంటుంది. వారు ఎవరి సమాచారం సేకరిస్తున్నారనేది ఎవ్వరికీ తెలియదు. ఆరోపణలు వచ్చిన వ్యక్తి, అతని సన్నిహితులకు సంబంధించి భౌతిక ఆధారాలతోపాటు భారతీయ టెలిగ్రాఫ్‌ చట్టం ప్రకారం అవసరమైన వివరాలు సేకరిస్తారు. ప్రధాన టార్గెట్‌, అతని సన్నిహితులు, ఎవరెవరి వద్ద నగదు లేదా ఆధారాలు ఉండే అవకాశం ఉంటుందో వారి ఇళ్లు, కార్యాలయాలు, గెస్ట్‌హౌ్‌సలు, ఫాంహౌ్‌సల వివరాలు తెలుసుకోవడం; ఏయే సమయాల్లో ఎక్కడెక్కడికి వచ్చివెళ్తుంటారు..? ఇలా ప్రతి అంశానికి సంబంధించి పక్కాగా సమాచారం సేకరిస్తారు. ఇందుకోసం ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాల్సిన వ్యక్తి స్థాయిని బట్టి కొన్ని రోజులు, నెలలు అత్యంత గోప్యంగా సమాచారం సేకరిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు నిర్వహించాల్సిన వ్యక్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత అధికారులు దాన్ని ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి అందజేస్తారు. ఐటీ విభాగం ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ అనుమతి మేరకు వారెంట్‌ తీసుకుంటారు.*


*♦️సీల్డ్‌ కవర్‌లో సమాచారం..*


*సోదాలకు అనుమతులు ఇచ్చిన తర్వాత స్థానికంగా ఉండే ఐటీ అధికారులు ఎన్ని ప్రాంతాల్లో సోదాలు జరపాల్సి ఉంటుందనే సమాచారం మేరకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకుంటారు. ఒకటి, రెండు ప్రాంతా ల్లో సోదాలకు 20, 30 మంది సిబ్బంది సరిపోతారనుకుంటే స్థానికంగా ఉండేవారిని వినియోగించుకుంటారు. వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు జరపాల్సి రావడం, వందల సంఖ్యలో సిబ్బంది అవసరం ఏర్పడితే ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తారు. సోదాలకు ఒకరోజు ముందుగానే స్థానిక హెడ్‌క్వార్టర్లలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు హోటళ్లలో బస చేస్తారు. ఎక్కడా తాము ఐటీ విభాగానికి చెందిన వారమనే విషయం బహిర్గతం కాకుండా జాగ్రత్త పడతారు. సాధారణ వ్యక్తుల మాదిరిగానే ఉంటారు. సోదాలు జరి గే రోజు అవసరాన్నిబట్టి అర్ధరాత్రి తర్వాత, తెల్లవారుజామున ప్రధాన కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఒక్కో బృందాన్ని నడిపే బాధ్యతలు ఒక అధికారికి అప్పగిస్తారు. వారికి సీల్డ్‌ కవర్‌లో టార్గెట్‌కు సంబంధించిన వివరాలు అందజేస్తారు. సోదాలు జరిపే వ్యక్తి నివాసం, కార్యాలయం సమీపంలోని ల్యాండ్‌మార్క్‌ చెప్పి పంపుతారు. అక్కడికి వెళ్లిన తర్వాత సీల్డ్‌ కవర్‌ తెరిచి చూస్తే టార్గెట్‌ ఎవరు, అడ్రస్‌ ఎక్కడ అనేది తెలుస్తుంది.*


*♦️స్ట్రైక్‌ టైం అత్యంత కీలకం..*


*వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాల్సిన సందర్భాల్లో స్ట్రైక్‌ టైం నిర్ధారిస్తారు. ఉదాహరణకు మంత్రి మల్లారెడ్డి నివాసంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సిబ్బంది ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో సోదాలకు తెల్లవారుజామున 05.30 గంటలు స్ట్రైక్‌ టైంగా నిర్ధారిస్తే.. సరిగ్గా అదే సమయానికి అన్నిచోట్ల సోదాలు ప్రారంభం కావాల్సిందే. అంత కచ్చితంగా జరగాలంటే స్ట్రైక్‌ టైం కంటే కొంత సమయం ముందే ఐటీ బృందాలు సమీప ప్రాంతానికి చేరుకుని ఉంటాయి. ఇలా చేయకపోతే ఒక సమయంలో ఒకచోట సోదాలు జరుగుతుంటే విషయం తెలుసుకుని మరో చోట ఉన్నవారు పరారవడం, ఆధారాలు మాయం చేసే అవకాశం ఉండడంతో ఐటీ సోదాల్లో స్ట్రైక్‌ టైం అత్యంత కీలకంగా మారుతోంది.*


*♦️గతంలో పోలీసులు.. ఇప్పుడు కేంద్ర బలగాలు*


*ఐటీ సోదాల సమయంలో భద్రత మరో కీలక అంశం. సోదాలకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వచ్చిన తర్వాత భద్రతా సిబ్బంది సహకారం తీసుకుంటారు. గతంలో ఐటీ సోదాలు నిర్వహించే ప్రాంతానికి సంబంధించి స్థానిక పోలీసుల సహకారం తీసుకునేవారు. ముందుగానే వారికి విషయం చెప్పాల్సి రావడం వల్ల కొన్ని సందర్భాల్లో అవతలి వ్యక్తికి సమాచారం వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఐటీ సోదాల సమయంలో స్థానిక పోలీసులు కాకుండా కేంద్ర బలగాలను వెంట తీసుకెళ్తున్నారు. దాడులకు కొన్ని గంటల ముందు సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఐటీ కార్యాలయానికి చేరుకుంటాయి.*


*♦️డాట్‌ టూ డాట్‌ కనెక్షన్‌..*


*ఒక వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఉద్యోగుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు డాట్‌ టూ డాట్‌ కనెక్షన్‌ విధానాన్ని ఐటీ అధికారులు అనుసరిస్తారు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఉన్న లింకులనే ‘డాట్‌ టూ డాట్‌ కనెక్షన్‌’ అంటారు. ఒకసారి ఒక విభాగానికి చెందిన వ్యక్తి, వ్యవస్థపై సోదాలు చేస్తే.. వెంటనే అదే విభాగానికి చెందిన ఇతరులపై ఐటీ సోదాలు చేయదు. కొంత సమయం తీసుకుంటుంది. మరో విభాగానికి చెందిన వ్యక్తి, సంస్థపై దృష్టి సారిస్తుంది. అయితే స్థానిక పోలీసులు, సీఐడీ, ఇతర నిఘా విభాగాల్లో ఎక్కడైనా చిన్నపాటి నిబంధనల అతిక్రమణ జరిగే అవకాశం ఉండొచ్చు కానీ, ఐటీలో కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే.*


*ఐటీ అధికారులు కేవలం సోదాలు నిర్వహించడం, లెక్కలు సరిచూడడం, లెక్కల్లో లేని నగదు, నగ ల్ని స్వాధీనం చేసుకోవడం వరకే పరిమితం అవుతారు. నేరుగా కేసులు నమోదు చేయడం సాధ్యం కాదు. లెక్కల్లో లేని నగదుకు సంబంధించి పన్ను, జరిమానా విధించి వసూలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేస్తారు. ‘‘ఐటీ సోదాలు పైకి కనిపించేంత సులువుగా ఉండవు. ఒక్కో దాడికి సంబంఽధించి వెనకాల కొన్ని నెలలపాటు పనిచేయాల్సి ఉంటుం ది. సోదాలకు సంబంధించిన సమాచారం పరిమిత అధికారులకే తెలుస్తుంది’’ అని ఐటీ విభాగం విశ్రాంత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE