NaReN

NaReN

Friday, November 25, 2022

ఆనంద జీవితం..

 *ఆనంద జీవితం..*


 *అరటిపండ్ల వ్యాపారి పగలంతా పళ్ళు అమ్మి,  

రాత్రికి ఇంటికి వెళ్లే ముందు మిగిలిన సరుకులు లో నుండి పాడైనవి, కుళ్ళిపోయినవి  తీసేస్తాడు.*

*నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు.*

*మరునాడు అందులోంచి కొన్ని కుళ్ళిపోవచ్చు.*

*వాటినీ నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు.*

 *అయ్యో! పడేస్తున్నాననే బాధ ఉండదు.*

*వాటిపై మమకారం ఉండి పాడైనవి తీయకపోతే, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది.*


 *జీవితానుభవాలు అంతే.*

*బాధ కలిగించే ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను, మనసులోంచి తీసేయాలి.*


 *ఏరోజు చిట్టాపద్దులు ఆరోజే పూర్తి చేయాలి.*

*క్షమించాల్సిన వాటిని క్షమించాలి.*

*సానుభూతి చూపాల్సిన వారిపై, సానుభూతి చూపాలి.*

*విస్మరించిన వాళ్లను,  విస్మరించాలి.*

 *ప్రశంసించిన వాళ్లను,  ప్రశంసించాలి.*


*మంచి అనుభూతులను చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేయాలి.*

*చెత్త వెళ్లిపోయాక బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది.*

*దాన్ని మంచి ఆలోచనలతో నింపితే ఆనందం పెరుగుతుంది.*

*చిరునవ్వు,  ఆనందం కవల పిల్లలు.*

*ఒకటి లేకుండా మరొకటి లేదు.*


             

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE