NaReN

NaReN

Thursday, November 10, 2022

ఈనాటి యువత తప్పకుండ ఆలోచించవలసిన విషయం

 *ఈనాటి యువత తప్పకుండ ఆలోచించవలసిన విషయం*

                  🌹🌹🌹

*ప్రేమ వివాహానికి సై అంటున్న యువత....*

*మనోవేదనకు గురవుతున్న తల్లిదండ్రులు...*


*మేజర్లు అయితే చాలు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అంటున్న చట్టం....*


*నిన్న మొన్నటి దాకా మైనర్లుగావుండి, మేజర్లు కాగానే అన్నీ మాకే తెలుసు అంటున్న యువత...*


*మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోతున్న ఆకర్షణతో కూడిన ప్రేమ వివాహాలు....*


*ప్రస్తుత సమాజంలో సగటు మనిషి సాధారణ జీవితం గడపాలంటే అన్ని అందుబాటులో ఉంటేనే నెలకు పదివేలు పైగా ఖర్చులు అవుతున్నాయి. సాధారణ కుటుంబాల వారు, మధ్యతరగతి వారు వారి పిల్లలను సరైన విద్యాబుద్ధులు అందించి, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించేందుకు పడరాని పాట్లు పడుతూ తినో తినకనో జీవనం సాగిస్తుంటారు. ఈ సమయంలో పిల్లలు అదేనండి యువతగా మారిన తరుణంలో వారు అడిగే కొద్దిపాటి సరదాలు తీర్చలేక పోతున్న మధ్యతరగతి కుటుంబాలకు మేజర్లు అయిన యువత చావు దెబ్బ తీస్తున్నారు* 


*ఇటువంటి తరుణంలో కొద్దిపాటి ఆకర్షణకు లోనై,వారి తల్లిదండ్రుల వత్తిడుల వలనో లేక చిన్ని చిన్ని ముచ్చట్లు తీర్చాలన్న సరదా తోనో యువత ప్రేమ వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారు*


*కానీ ఆ ప్రేమ వివాహాలు మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయిన సందర్భాలు కోకొల్లలు. ఎక్కడో ఒకటో రెండో ప్రేమ వివాహాలు కొనసాగుతున్నాయి తప్ప నూటికి 99% ప్రేమ వివాహాలు మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతున్నాయి*


*20 సంవత్సరాల పాటు వారి ఆలనా పాలనా చూస్తూ విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఎలా బతకాలో ఎలా బతకకూడదో నేర్పిన తల్లిదండ్రులకు కొందరు మైనర్లు మేజర్లు కాగానే తల్లిదండ్రుల అతి ప్రేమను అలుసుగా తీసుకొని వారు అక్రమమైన నిర్ణయాలతో తల్లిదండ్రులకు తలనొప్పులు, వేదనలు కలిగి స్తున్నారు*


*కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని ప్రేమ వివాహాలలో కుటుంబాలకు కుటుంబాలు వేరయ్యే సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. తప్పు చేసింది ఒకరైతే శిక్ష అనుభవించేది ఆ కుటుంబ సభ్యులు అవుతున్నారు*


*కొన్ని సందర్భాలలో ఆ తల్లిదండ్రుల మనోవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంటుంది. కానీ చట్టం వారికి చుట్టంలా మారింది అమ్మాయి నోటి నుండి ఏది వస్తే అదే శాసనం పోలీసులైన కోర్టులు అయినా మేజర్ అయిన అమ్మాయి మాటే తుది శాసనంలా అమలు చేయాల్సిన పరిస్థితి చట్టంలో పొందుపరచడమైనది...*


*యువత ఆలోచించండి. నేటి మీరు, రేపటి తల్లిదండ్రులు కావచ్చు! ఇదే సందర్భం మీకు రావచ్చు. ఆరోజు మీ కడుపు కోత ఎలా ఉంటుందో, ఈరోజు మీరు చేసే తప్పు వలన మీ తల్లిదండ్రులు ఎలాంటి కడుపుకోతను భరించాల్సి వస్తుందో అర్థం చేసుకోండి*


*ఎవడో ఏదో నాలుగు మాయ మాటలు చెబితే అదే జీవితం అనుకుని వారి మాయమాటలకు లొంగి, ఇటు తల్లిదండ్రులను అటు అయిన వారిని వదులుకొని సదరు వ్యక్తితో కేవలం మేజర్లు అనే వంకతో వెళ్లి ఎన్నో జీవితాలు అర్ధాంతరంగా చనువు చాలించిన సందర్భాలు కూడా కోకోల్లలుగా ఉన్నాయని చెప్పవచ్చు. మన జీవితాల్లో జరిగేదే టీవీల్లో సినిమాల్లో సోషల్ మీడియాలో చూపిస్తుంటారు. వాటి వలన కొందరు దారి తప్పుతుంటే, ఎక్కువ మంది ఆలోచనపరులుగా మారుతున్నారు, వారు తమ జీవితాలను సక్రమమైన దారిలో మలుచుకుంటున్నారు*


*నీవు పుట్టినప్పటి నుండి నీవు తప్పటడుగు వేస్తుంటే తప్పు అని చెప్పే తల్లిదండ్రులు మీ జీవితం యొక్క అతి విలువైన వివాహ బంధాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నారో, ఈయువత ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఒక్కసారి అలోచించి,మీరు చేసే పనికిమాలిన పనులను, ప్రతిజ్ఞలను పక్కనపెట్టి, ఒక్కసారి ఆలోచిస్తే ఎందరో తల్లిదండ్రుల కడుపు కోతలను తగ్గించిన వారవుతారు. ఇప్పటికైనా ఓ యువత మేలుకో, సరిగా ఆలోచించు. 20 సంవత్సరాల పాటు మీరు చేసే ప్రతి పనిలో తప్పొప్పులను ఎంచుతూ మిమ్మల్ని మంచి మార్గంలో ముందుకు సాగించే మీ తల్లిదండ్రులు మీకు ఎందుకు శత్రువులుగా మారుతున్నారో ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. తొందరపడి, అవివేకముతో, చెడు ఆలోచనులతో, ఒక్కసారి చెడునిర్ణయం తీసుకున్నాక, ఒక్కసారి కోల్పోయిన బంగారు జీవితం ఏదీ తిరిగి రాదు. కానీ తొందరపాటు నిర్ణయం తీసుకోక ముందే, సరిగా అలోచించి, సరైన నిర్ణయం తీసుకుని ఉంటే అంటే మీ తల్లిదండ్రుల సలహా ఇచ్చిన దారిలో ఒకసారి నడిచి ఆలోచిస్తే మీ జీవితం                 ఆనందమయంగా ఉంటుంది అక్కడ కూడా ఏదైనా ముళ్ళ దారి ఎదురైతే నీ ప్రతి అడుగులో మీ తల్లిదండ్రులు వారి చేతనైనంత తోడ్పాటు అందిస్తూ నీకు జీవితకాలం అండగా ఉంటారు*


*ఎప్పుడో రాసిన చట్టాల్లో మార్పు రావలసి అవసరం ఉందనీ, తమ పిల్లలు మైనర్ల నుండి మేజర్లు అయిన యువత తప్పుడు మార్గంలో నడిచేటప్పుడు తల్లిదండ్రులు వారి నిర్ణయాల పట్ల సుముఖత చూపనప్పుడు సదరు యువతను కొన్నాళ్లపాటు, విజ్నుల సహకారంతో, వారికి అవగాహన సదస్సులు కల్పించాలని, ఆ దిశగా జీవితమంటే ఏంటో తెలిసి వచ్చేలా చెప్పి, వారు తీసుకున్న ఆ నిర్ణయం తప్పని, వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించి, వారు తీసుకున్న తప్పుడు నిర్ణయంవలన భవిష్యత్తులో వారు ఎదుర్కునే కష్టనష్టాలను గూర్చి ముందుగానే వారిని హెచ్చరించాలి. ఒకవేళ వారినిర్ణయం వారికి మంచి జీవితాన్ని అందిస్తుంది అని వివేకులు అనుకుంటే వారి నిర్ణయాన్ని సమర్థించాలి.  తల్లిదండ్రులకు మేము అన్యాయం చేయమంటూ ఆయువత నిర్ణయాన్ని వెల్లడించినప్పుడు, తల్లిదండ్రుల వద్దకు ఆ యువతను తల్లిదండ్రులకు నచ్చచెప్పి అప్పగించవలసిన బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకునే దిశగా చట్టాలను రూపొందించాలని, అనేకమంది బాధిత తల్లిదండ్రులు కోరుతున్నారు*

*ఏదియేమైనా, అష్టకష్టాలు పడి కని,పెంచి,విద్యాబుధులు చెప్పించి, సంఘంలో ఒక స్థానాన్ని కలుగజేసిన, దైవస్వరూపులైన, తల్లితండ్రులకు కడుపుకోతను మిగల్చటం ఆయువతకు భా వ్యంకాదు. భవిష్యత్తులో ఆ యువత కూడ ఇటువంటి చేదు  అనుభవాలు అనుభవించక తప్పదు. కనుక ఓ యువత, మీరు విజ్ఞతతో ఆలోచించి, సరైన మంచి మార్గాన్ని ఎంచుకోండి. తల్లి తండ్రులకు దుఃఖాన్ని మిగల్చకండి. తప్పుడు ఆలోచనలను దరికి రానియ్యకండి. విజ్ఞతతో అలోచించి మెలగండి*

*సర్వేజనాః సుఖినోభవంతు*

*శుభం భూయాత్*🙏🙏🙏


*ఈ మెసేజ్ ద్వారా తప్పుడు నిర్ణయాలు తీసుకొనే యువత కొందరైనా ఆలోచిస్తారనే ఒక ఉద్దేశం/నమ్మకం తో  ఈ పోస్ట్ పెట్టడం జరిగింది.ఎవరిని, ఏవిధంగా కించపరచాలనికానీ, ఎవరిని ఉద్దేశించి కానీ పెట్టిన మెసేజ్ కాదు*అందరూ ఆలోచించండి*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE