NaReN

NaReN

Saturday, November 19, 2022

ఏం పురుష జీవితం

 *ఏం పురుష జీవితం.....*



*అంతర్జాతీయ పురుషుల దినోత్సవం...*


*ఒక్క పేపర్లో వ్యాసం లేదు... ఒక్క టీవీ లో ప్యాకేజి లేదు.*


*బంగారం షాపోడు గాని, బట్టల షాపోడుగాని ఆఫర్లు పెట్టలేదు.*


*పురుషులంటే మరీ ఇంత వివక్షా...*


*భగవంతుని అత్యంత ఆకర్షణీయమైన సృష్టి మగవాడు.*


*మగవాడు... చిన్నప్పుడు తన చెల్లెలి కోసం చాక్లెట్లు త్యాగం చేస్తాడు.*


*తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి తన కలలను త్యాగం చేస్తాడు.*


*తను ప్రేమించిన/స్నేహం చేసిన అమ్మాయి ముఖంలో చిరునవ్వు కోసం బహుమతులు కొంటాడు, పాకెట్ మనీ మొత్తం ఖర్చు చేస్తాడు.*

   

*భార్యా పిల్లల కోసం అర్తరాత్రి వరకూ కష్టపడుతూ తన యవ్వనాన్నంతా ధారపోస్తాడు వారి భవిష్యత్తు కోసం లోన్లు తీసుకుని జీవితాంతం వాటిని కట్టుకుంటూ కూర్చుంటాడు.*


*ఇంత కష్టపడినా చిన్నప్పుడు తల్లితో, పెద్దయ్యాక పెళ్ళాంతో, ఆఫీసులో బాసుతో తిట్లు తింటూనే ఉంటాడు.*    


*ఇతరులను సంతోష పెట్టడంలోనే అతని జీవితం ముగుస్తుంది.*


*అలాంటి మగాడి గురించి ఏమనుకుంటారో తెలుసా!*


*బయటికి వెళ్తే ఇంటిని  పట్టించుకోడు అంటారు, ఇంట్లోనే ఉంటే సోమరిపోతు అంటారు.*

*పిల్లల్ని తిడితే వాడొక రాక్షసుడు అంటారు, తిట్టకపోతే బాధ్యతలేని తండ్రి అంటారు*

*పెళ్ళాన్ని ఉద్యోగం మానిపిస్తే వాడికి అభద్రతా భావం అంటారు, సరే ఉద్యోగం చెయ్యి అంటే పెళ్ళాం సంపాదనకు ఆశపడే చవట అంటారు.*  


*అమ్మ మాట వింటే తల్లి చాటు కొడుకు అంటారు, పోనీ అని పెళ్ళాం మాట వింటే పెళ్ళానికి బానిస అంటారు.*


*అమ్మాయిలూ అబ్బాయిలను గౌరవించండి. అతను మీకోసం ఎంత త్యాగం చేస్తున్నాడో గుర్తించండి!*

  

*హాపీ మెన్స్ డే (ఎప్పటికైనా మగాడికి గుర్తింపు వస్తుందన్న ఆశతో..)*


*ఏడ్చే మగాడిని నమ్మొద్దు...’ అని ఈ సమాజం తేల్చేసింది. ‘వెక్కివెక్కీ ఏడవలేనే... వెధవ మగ పుటక...’ అని ఓ సినీ కవి వాపోయాడు!*


*గనిలో, వనిలో, కార్ఖానాలో, కార్యాలయాల్లో, సరిహద్దుల్లో... ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయడమే తప్ప, తన బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేడు!* 


*పేరుకే... పురుషుడు!* *తీరుకేమో... నిస్సహాయుడు!*


*మగవాళ్ళూ..!*

*ఇది అందరికీ పంపించండి..!*

*మన మీద మనమే సానుభూతి చూపక పోతే ఎలా..?ఏం పురుష జీవితం…*


*అంతర్జాతీయ పురుషుల దినోత్సవం...*

💐💐💐💐💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE