NaReN

NaReN

Friday, November 25, 2022

Half Pay Leave ( అర్థజీతపు సెలవు )

 *Half Pay Leave ( అర్థజీతపు సెలవు )*

 Half Pay Leave, LEAVE RULES,


*అర్థజీతపు సెలవు (Half Pay Leave):* 

సర్వీసు రెగ్యులరైజేషన్ పిదప నియామకపు తేదీ నుండి ప్రతి పూర్తి సంవత్సరమునకు 20 రోజులు చొప్పున అర్థజీతపు సెలవు జమచేయబడుతుంది. నిల్వ మొత్తమునకు గరిష్ఠ పరిమితి లేదు. దీనిని వైద్య కారణముల పైనను, వ్యక్తిగత కారణముల పైనను వినియోగించుకొనువచ్చును. (ఎపిఎఆర్ రూల్-13) తాత్కాలిక ఉద్యోగులు కూడ 2సం||ల సర్వీస్ పూర్తి చేసియున్నచో వైద్య కారణములపై ఈ సెలవును వాడుకొనవచ్చును. అర్థ జీతపు సెలవు కాలమునకు మూలవేతనములో సగము, కరువు భత్యంలో సగము మరియు హెర్ఆర్ఎ, సిసిఏ పూర్తిగాను చెల్లించబడతాయి. అర్థజీతపు సెలవు 6 నెలలు మించినచో HRA, సిసిఏ అలవెన్సులు చెల్లించబడవు. (జిఓ 28 ఆర్థిక, తేది. 09.03.2011)

---------------------------------------------------------------------

అర్థ జీతపు సెలవు: (Half Pay Leave) Rule 13 (2): శాశ్వత ఉద్యోగి పూర్తి చేసిన ప్రతి సం. సర్వీసునకు 20 రోజుల

చొప్పున అర్థజీతపు సెలవు జమ చేయబడుతుంది. జీత నష్టము సెలవు కాలానికి కూడా ఈ సెలవు జమచేయబడుతుంది.

అర్ధ జీతపు సెలవు 2 విధాలుగా మంజూరు చేయవచ్చు.


 1. వైద్య ధృవపత్రం పై 

ఎ) అర్ధ సెలవు 

బి) కమ్యూటెడ్ సెలవు


2. వ్యక్తిగత అవసరాలకు అర్థవేతన సెలవు. సంపాదిత సెలవు నిల్వ ఉన్ననూ అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును.

ఇంక్రిమెంట్లకు, సర్వీసుకు ఎటువంటి అంతరాయము కలుగదు. ఈ సెలవు పొందుటకు గరిష్ఠ పరిమితి లేదు. (రూల్

13-ఎ) ఆర్ధవేతన సెలవునకు HRA, CCA ఏ కోత లేకుండా 180 రోజుల వరకు చెల్లించబడును. (G.O.MS.No.28

Fin.&Pig.Dt:9.3.2011) 9వ వేతన సవరణ సిఫార్సు మేరకు అర్ధవేతన సెలవునకు పూర్తి డి.ఎ. చెల్లించే ఉత్తర్వులు

(Memo No.14568 - A/63/PC 1/A2/2010, dt:31.1.2011) పై ట్రెజరీలో అభ్యంతరం తెలుపుతున్నందున వివరణ

ఉత్తర్వుల కొరకు సంఘాలు ప్రాతినిధ్యం చేశాయి. పదవీ విరమణ చెందిన నాటికి వ్యక్తిగత ఖాతాలో మిగిలి ఉన్న

అర్ధవేతన సెలవునకు నిబంధనల మేరకు నగదుగా మార్చుకోవచ్చును

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పసుపులేటి నరేంద్రస్వామి

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE