NaReN

NaReN

Tuesday, November 8, 2022

తమాషా ప్రశ్నలు - వెరైటీ సమాధానాలు

 తమాషా ప్రశ్నలు - వెరైటీ సమాధానాలు


1. పగలు కూడా కనపడే నైట్ ఏమిటి?

జ. * గ్రా నైట్ *

2. ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి?

జ. *న్యూస్  పేపర్.*

3. వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి?

జ. * ఫై రింగ్ *

4. అందరూ భయపడే బడి ఏమిటి?

జ. * చేత బడి.*

5. అందరూ నమస్కరించే కాలు ఏమిటి?

జ. * పుస్త కాలు *

6. వీసా అడగని దేశమేమిటి?

జ. * సం దేశం.*

7. ఆయుధంలేని పోరాటమేమిటి?

జ. * మౌన పోరాటం.*

8. గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి?

జ. * ప కోడి *

9. కనిపించని వనం ఏమిటి?

జ. * ప వనం.*

10. నీరు లేని వెల్ ఏమిటి?

జ. * ట్రా వెల్ *

11. నారి లేని విల్లు ఏమిటి?

జ. * హరి విల్లు *

12. డబ్బులుండని బ్యాంక్ ఏమిటి?

జ. * బ్లడ్ బ్యాంక్ *

13. వేసుకోలేని గొడుగు ఏమిటి?

జ. * పుట్ట గొడుగు.*

14. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి?

జ. * బ్రౌన్ షుగర్ *

15. వేయలేని టెంట్ ఏమిటి?

జ. *మిలి టెంట్ *

16. మొక్కకు పూయని రోజాలు ఏమిటి?

జ. *శి రోజాలు.*

17. రుచి లేని కారం ఏమిటి?

జ. *ఆ కారం *

18. చారలు లేని జీబ్రా ఏమిటి?

జ. * ఆల్జీబ్రా *

19. అందరూ కోరుకునే సతి ఏమిటి?

జ. *వ సతి.*

20. అందరికి నచ్చే బడి ఏమిటి?

జ. * రా బడి.*

21. తాజ్ మహల్ ఎక్కడుంది?

జ. * భూమ్మీద.*

22. ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి?

జ. *ఇంటరా గేట్*

23. అంకెల్లో లేని పది?

జ. *ద్రౌ పది.*

24. చేపల్ని తినే రాయి ఏమిటి?

జ. * కొక్కి రాయి.*

25. వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి?

జ. * సె టైర్లు *

26. భార్య లేని పతి ఎవరు?

జ. * అల్లో పతి *

27. అన్నం తినకపోతే ఏమవుతుంది?

జ. *మిగిలి పోతుంది.*

28. కూర్చోలేని హాలు ఏమిటి?

జ. *వర హాలు.*

29. వాహనాలకు ఉండని టైర్ ఏమిటి?

జ. * రి టైర్ *

30. తినలేని కాయ ఏమిటి?

జ. * లెంప కాయ *

31. అందరికీ ఇష్టమైన కారం ఏమిటి?

జ. * ఉప కారం.*

32. కరవలేని పాము?

జ. *వెన్ను పాము.*

33. కొట్టకుండా తగిలే దెబ్బ ఏమిటి?

జ. *వడ దెబ్బ*

34. తాగలేని పాలు ఏమిటి?

జ. *పా పాలు.*

35. పూజకు పనికిరాని పత్రి ఏమిటి?

జ. * ఆసు పత్రి *

36.గీయలేని కోణం ఏమిటి?

జ. * కుంభ కోణం.*

37. చెట్లు లేని వనం?

జ. *భ వనం.*

38.వెలిగించలేని క్యాండిల్?

జ. *ఫిల్డర్ క్యాండిల్.*

39. కోడి వేడినీళ్లు తాగితే ఏం చేస్తుంది?

జ. *ఉడకబెట్టిన గుడ్డు పెడుతుంది.*

40. స్కూల్ బ్యాగులో ఉండని స్కేలు

జ. *రిక్టర్ స్కేలు*

41. తాగలేని రసం ఏమిటి?

జ. *పాద రసం.*

42. పిల్లలు ఉండని స్కూల్ ఏమిటి?

జ. *డ్రైవింగ్ స్కూల్*

43. నడవలేని కాలు ఏమిటి?

జ. *పంప కాలు*

44. ఆడలేని బ్యాట్ ఏమిటి?

జ. *దోమల బ్యాట్*

45.. కనిపించని గ్రహం ఏమిటి?

జ. *ని గ్రహం *.

46.. భోజనంలో పనికి రాని రసం ఏమిటి?

జ. *పాద రసం.*

47. తాగలేని రమ్ ఏమిటి?

జ. *తగ రం.*

48. దేవుడు లేని మతం ఏమిటి?

జ. * క మతం *

49. దున్నలేని హలం?

జ. *కుతూ హలం.*

50. రాజులు నివశించని కోట ఏమిటి?

జ. *తులసి కోట*

51. వైద్యులు ఆపరేషన్ చేస్తున్నప్పడు ముఖానికి

       గుడ్డ ఎందుకు కట్టుకుంటారు?

జ. *ఎవరు చేశారో తెలియకూడదని*

52. నోరు లేకపోయినా కరిచేవి?

జ. *చెప్పులు*

53. చేయడానికి ఇష్టపడని ధర్మం

జ. *కాల ధర్మం*

54. డబ్బులు ఉండని బ్యాంకు

జ. *బ్లడ్ బ్యాంక్*

55. ఓకే చోదకుడితో నడిచే బస్సు

జ. *డబుల్ డెక్కర్ బస్సు*

56. ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర

జ. *విసన కర్ర*

57. ఉత్తరానికి, దక్షిణానికి తేడా?

జ. *ఉత్తరం పోస్టు డబ్బాలో వేయగలం. దక్షిణాన్ని     

      పోస్ట్ డబ్బాలో వేయలేం......😆😆😆😆😆

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE