NaReN

NaReN

Wednesday, November 23, 2022

మొక్కలకు మిత్రుడు

 మొక్కలకు మిత్రుడు 


(23rd Nov జగదీష్ చంద్రబోస్ వర్ధంతి)

రెండు పరస్పర విరుద్ధమైన శాస్త్రాలలో నైపుణ్యం కలిగి,రెండింటిలోనూ పరిశోధనలు చేసి కొత్త ఆవిష్కరణలకు నాంది పలికిన ఘనత ప్రముఖ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ కు తగ్గుతుంది.


రేడియో, మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించి రేడియో విజ్ఞానంలో పితామహునిగా ఆయన పేరు పొందారు.1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి. 


బెంగాల్ ప్రావిన్సులో1858 నవంబర్30న జన్మించిన జగదీష్ చంద్ర బోస్  కలకత్తా లోని సెయింట్ జేవియర్ కళాశాల నుంచి డిగ్రీ పుచ్చుకున్నారు. తరువాత ఆయన వైద్య విద్య కోసం లండన్వెళ్ళారు. కానీ ఆరోగ్య సమస్యల వలన చదువును కొనసాగించలేపోయారు. తిరిగి భారత దేశానికి వచ్చి కోల్‌కత లోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా చేరారు. అక్కడ జాతి వివక్ష రాజ్యమేలుతున్నా, చాలినన్ని నిధులు, సరైన సౌకర్యాలు లేకపోయినా తన పరిశోధనను కొనసాగించారు.


జగదీష్ చంద్ర బోస్ వైర్‌లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించారు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది బోసే. కానీ తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారి తీయాలనే ఉద్దేశంతో బహిర్గతం చేశారు.


బోసు తాను రూపొందించిన పరికరం క్రెస్కోగ్రాఫ్ను ఉపయోగించి వివిధ రకాలైన పరిస్థితుల్లో మొక్కలు ఎలా స్పందిస్తాయోపరిశోధనాత్మకంగా నిరూపించారు. తద్వారా జంతువుల,వృక్షాలకణజాలాలలో సమాంతర ఆవిష్కరణలు చేశారు. ఆయన 1937 నవంబర్23న తుదిశ్వాస విడిచారు.


 సర్ జగదీశ్చంద్రబోస్ గొప్ప సైంటిష్ట్ , అతను చదివింది ఫిజిక్స్ ,కెమిష్ట్రీ అయినప్పటికీ వృక్షశాస్త్రంలో పరిశోధనలు చేశారు. మొక్కలకూ ప్రాణం వుందని నిరూపించారు.

బోస్ వంటి ప్రతిభావంతులు దేశంలో చాలామంది ఉన్నారు.వారిని ప్రభుత్వాలు గుర్తించి ప్రోత్సహిస్తే,దేశంలో కొత్త ఆవిష్కరణలకు దారిచూపినట్లౌతుంది.


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE