NaReN

NaReN

Saturday, November 19, 2022

ఈ రోజు మొగాళ్ళ దినం


 

*ఈ రోజు మొగాళ్ళ దినం ....!*

సరదాగా రాసింది ఎవ్వరిని కించపరిచే ఉదేశ్యం లేదు.🙏🙏🙏


అందరు ఉదయాన్నే లేచి తలారా స్నానాలు చేసి దగ్గరలో వున్న గుడికి వెళ్లి ఒక కొబ్బరికాయ కొట్టి వచ్చే జన్మలో మొగాడిగా పుట్టించకు అని వేడుకుంటున్న...... మొగవాళ్ళ అందరికీ శుభాకాంక్షలు.. 

ఎందుకో... 

మచ్చుకు కొన్ని ....

చెడ్డి చొక్కాతో బాల్యం అంతా గడిపెయ్యాలి. కొన్ని సార్లు చెడ్డి కూడా వెయ్యరు

చదువు చదివితే సరిపోదు మొగాడివి రాంక్ రావాలి అని అరచి గోల చేస్తారు. 

భయమేసినా భయపడి చావకూడదు.

మగాడు భయపడేది ఏంటి అంటారు.

ఎలకవచ్చినా...

పాము వచ్చినా బల్లి చచ్చినా..

మనమే తియ్యాలి...

వారు తియ్యరు అరవడం మాత్రమె చేస్తారు. 

ఉద్యోగాలు చెయ్యల్సింది మనం....

కోయిలమ్మ.... కుంకుమరేఖ...రచ్చబండలు లాంటి సీరియల్స్  చూసేది వాళ్ళు.

నోములు వ్రతాలు వాళ్ళకి...

సరుకులు,సామాన్లు తేవాల్సింది మనం.

పెళ్లి చేసుకుంటే..

వాళ్ళని బుట్టలో తెస్తారు

మనల్ని బుట్టలో వేసుకుంటారు

పట్టు చీరలు వుంటాయి కాని పట్టు పాంటులు వుండవు, ఉన్నా పెట్టరు.

మనం అమ్మాయిలని చూసినా...

వాళ్ళు మనన్ని చూసినా...

పళ్ళురాల గోట్టేది మనన్నే...

ఫలానా ఆవిడ మొగుడు అని చెప్తారు కాని...

ఫలానా వాడి పెళ్ళాం అని ఎందుకు అన రో...

కాఫీ ఇస్తే తాగాలి.లేకపోతే...

మంచినీళ్లని కాఫీలా భావించాలి...

నోరు ఇచ్చాడు..

కాని వాడకూడదు.

ఇలాంటి బాధల మధ్య కూడా...

ఓ రోజు మనకంటూ ఇచ్చినందుకు తోటి మొగవాళ్ళకి...

నా అభినందనలు..

కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు

మన బాధలు మనమే పడాలి.

మనకు శుభాకాంక్షలు మనమే చెప్పుకుందాం!!

👍👍👍👍👍👍👍

చివరిగా....

అదే ఉమెన్సు డే అయితే

ప్రత్యేక సెలవు .టీవీల్లో ఆడవాళ్ళ కోసం ప్రత్యేక ప్రోగ్రాంలు, పాటలు....

మరి మగవారి కోసం ఒక్క. పాట కూడా లేదు

ఇక వాట్సాపుల్లో అయితే ఉదయం నుండి పడుకునే వరకూ ఒకటే మెసేజులు...

వాటిని డిలీట్ చేయాలంటే ఓ పూట పడుతుంది

మన గ్రూపులో ఉన్న ఆడలేడీసులో ఇప్పటి వరకూ మగవారికి ఎవరూ శుభాకాంక్షలు చెప్పినవారు లేరు!

ఏదైనా మగవారిదే విశాల హృదయం అని నిరూపించారు

*ఈ జన్మకింతే....*

*హ్యాపీ మగవాళ్ళ డే...............................

అంతేగా అంతేగా.............

😭😭😭😭🤣🤣🤣🤣👍👍👍

 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE