NaReN

NaReN

Friday, November 18, 2022

అందరికి 100నం🙏🏻

 *⭕TMF*

తెలంగాణ గణిత ఫోరం


*అందరికి 100నం🙏🏻*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

అతి ముఖ్యమైన విషయం అయిన పబ్లిక్ పరీక్షలలో గణితం లో విద్యార్థుల పెర్ఫార్మెన్స్ పై  అభిప్రాయం చదవగలరు.


మనం బంగారం కొనాలి అనుకుంటే అది కొనడానికి సరిపడా మన స్థోమత ఎలా పెంచుకోవాలి అని ఆలోచిస్తాం తప్ప, దాని ధర తగ్గాలి, డిస్కౌంట్ రావాలి, 35% నాణ్యత లో రావాలి అని అనుకోము, అలా వస్తే ఆ బంగారం కల్తీ ఏమో అనే అనుమానం కూడా రావడం సహజం, అనుమానం మాత్రమే కాదు అది నిజం కూడా.


అలాగే పిల్లలకు గణితం లో ఎలాగైనా మంచి మార్కులు రావాలి అన్న ఈ ప్రాసెస్ లో బంగారం లాంటి మన గణితాన్ని మార్కుల పాయింట్ ఆఫ్ వ్యూ లో బోధిస్తూ విలువ తగ్గించి దాన్ని మనమే కంచు లాగా మార్చేస్తున్నాము. వెరసి

గణితాన్ని ఎంజాయ్ చేసే పిల్లలని  చూడలేక పోతున్నాము. 


పిల్లల స్థాయి కి దిగి చెప్పాలి దిగి చెప్పాలి అని ఫాలో అవుతూ నిజంగానే మనము ఆ స్థాయి కి దిగి పోతున్నాము, ఇంకా పిల్లలని మన లాగా గణితం ఎంజాయ్ చేసే స్థాయి కి పెంచేది ఎప్పుడు. 


ఇక్కడే మనము పొరపాటు చేస్తున్నమేమో అని బలంగా అనిపిస్తుంది. గణితం చాలా ముఖ్యమైనది కష్ట మైనది నేర్చుకోవడానికి అడ్డ దారులు లేవు దాని విలువ తెలుసుకుని నేర్చుకోవాల్సిందే .


మన దేశం లో ఏ పోటీ పరీక్ష లో అయినా మాథ్స్ చాలా ముఖ్యం అని మనకు తెలుసు. పోటీ పరీక్షలలో రాణించాలంటే రావాల్సిన మాథ్స్ మనమే దాని నాణ్యత తగ్గించి (నా ఉద్దేశ్యం మార్కులు మాత్రమే తెచ్చుకునే విధంగా) చెప్పడం మొదలు పెడితే పిల్లలు దాన్ని ఇంకా స్థాయి తగ్గి తీసుకుంటున్నారు. తిరిగి పరీక్షలలో మాథ్స్ చేయవలసి వచ్చినప్పుడు దాని స్థాయి ఇంకా తగ్గి, వెరసి మన గణిత ఉపాధ్యాయుల మీద మరక పడుతుంది.


నా ఉద్దేశ్యం కనీసం 1-9 తరగతులకు అయినా ఒకటి రెండు సంవత్సరాలు ఫలితం గురుంచి కాకుండా పిల్లలకి గణితం నేర్చుకోవాలి అంటే వాళ్ల స్థాయి పెంచుకునేలా వాళ్ళని motivate చేయాలి. అది తప్ప దాన్ని సులభతరం చేసి మార్కులు వచ్చే లాగా బోధించాలని అనుకోవడం దాని నాణ్యతను కల్తీ చేయడమే.


పదవ తరగతి పిల్లలకి మంచి మార్కులు రావాలని, పదుల సంఖ్య లో గణిత ఉపాధ్యాయులు, కొన్ని వందల గంటలు శ్రమించి మరి మెటీరియల్ తయారు చేస్తున్నాం,

నోట్స్ అని, ఇంపార్టెంట్ క్వశ్చన్ అని అరటి పండు వలిచి పెట్టే విధంగా పిల్లవాడి నోటి దగ్గరకు గణితాన్ని తీసుకు వెళ్తున్నాము, ఈ క్రమంలో పిల్లవాడు గణితం నేర్చుకోవడానికి అభ్యసన శ్రమ ఇవ్వగలుగుతున్నాము కాని,  

గణితం విలువను గుర్తించేలా పిల్లవాడిని మోటివ్ చేసి, దాన్ని అందుకోవడానికి తన స్థాయి పెంచుకోవాలి అని పిల్లవాడు అనుకునేలా చేయలేక పోతున్నాం.


ఈ సమస్యకు పరిష్కారం జనరలైజ్ చేసి చెప్పేది కాదు, ప్రతి గణిత ఉపాధ్యాయుడు తను చెప్పే గణితం యొక్క విలువను ఖచ్చితంగా నమ్మి అది పిల్లలకి అర్ధం అయ్యేలా చేసి దాన్ని పొందే స్థాయికి పిల్లను ఎలా పెంచాలి అని తనదైన స్ట్రాటజీ ఫాలో అయ్యినపుడే, మార్కుల కంచెలు దాటి గణితాన్ని ఒక ఆభరణంగా మార్చుకుని తమ జీవితంలో ఒక భాగంగా తీసుకునేలా ప్రతి విద్యార్థి తయారు అవుతాడు.


అప్పుడు మార్కులు ఏమి ఖర్మ మన అంచనాలు దాటి మార్పులు వస్తాయి.


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*ఈ అభిప్రాయం లో ఏమైనా తప్పులు ఉంటే సరిచేయగలరు*


గణిత ఉపాధ్యాయులందరూ పిల్లల్లో గణితం రావాలని తాపత్రయ పడుతూ తరగతి ఖాళీగా ఉంటే అదనంగా చెబుతూ కఠోర శ్రమ విద్యార్థికి భవిష్యత్తును నిర్దేశించగలదని నమ్ముతూ గణిత ఉపాధ్యాయులందరికీ 🙏🏻పాదాభి100నం.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻


పసుపులేటి నరేంద్రస్వామి

రాష్ట్ర అధ్యక్షులు


తాడ్వాయి శ్రీనివాస్

రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు


కె.వి.శ్యామసుందరాచార్యులు 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE