NaReN

NaReN

Friday, November 11, 2022

ఆహా ఏమి రుచి తినరా మైమరచి

 🫖 *ఆహా ఏమి రుచి తినరా మైమరచి!*🏺

(కనబడని శత్రువుతో నిత్యం యుద్ధం చేయడం..... జివ్వకో రుచి కదా)


వంటింటి పని అంటే కేవలం ఉడికించడమే కాదు.


కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, అల్లం లాంటివి చెడిపోకుండా *చూస్తుండాలి.*


ఏ ఏ కూరగాయలు ఎన్ని దినాలు ఫ్రెష్ గా ఉంటవి, ఏవి త్వరగా చెడిపోతాయి   అనేది *తెలిసుండాలి.* 


తెలిసుంటే చాలదు.... రోజూ ఒకే విధమైన వంట కాకుండా రకరకాలైన వంటలు చేస్తూ వంటిల్లు *నిర్వహించాలి.*


తినేవారి అభిరుచులను బట్టి ఇష్టా ఇష్టాలు, తినే సామర్థ్యం *తెలిసుండాలి.*


దానికి తగినట్లు సరుకుల కొలత తెలుసుకొని సరిపడ పాత్రలు కూడా *సమకూర్చుకోవాలి.*


రుబ్బాలి...., 

వేయించాలి....., 

ఉడికించాలి.....,

పొడి చేయాలి. 

 

...........ఫ్రై. 

................డీప్ ఫ్రై చేయాలి. 

మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. ఫ్రై చేయాలి.

అంట్లను కడగాలి. 

.............తుడవాలి. 

సర్దాలి.

శుభ్రతను పాటిస్తూ..... 

ఓ *యుద్దమే చేయాలి*. 


నిన్నటి పాలు. 

ఈ రోజు పాలు

పాత డికాక్షన్ 

కొత్త డికాక్షన్ 

కాఫీ పొడి

టీ పొడి తేడా తెలిసుండాలి.


తెచ్చిన సామానులు 

సర్ది పెట్టే

*స్టోర్స్ మేనేజ్మెంట్* కూడా తెలిసుండాలి. 


రెండు మూడు బర్నర్లపై ఒకేసారి -  వేరు వేరు వంటలు చేయగలిగే *టైం మేనేజ్మెంట్* తెలిసుండాలి. 


వడ్డించడం తెలిసుండాలి. 

మిగిలిన దానిని ఖాళీ చేసి ...

 వేరే పాత్రలోకి సర్దుబాటు చేసే 

*స్పేస్ మేనేజ్మెంట్*

తెలిసుండాలి.


అమ్మా..... అంటూ పిలిచే -

వేరు వేరు వ్యక్తుల పిలుపులకు స్పందిస్తూ సమయానికి అన్నీ పనులు పూర్తి చేయగలిగే 

*మల్టీ టాస్కింగ్* సామర్థ్యము ఉండాలి.


ఒక దోస హాట్ కంటైనర్ లోకి 

దూర్చి , మరొకటి ప్లేట్లోకి  వేసి , వేరొకటి పెనం పైన వేసే 

*చేతి వాటం* కలిగుండాలి. 


నిత్య మేనేజ్మెంట్ 

చిన్నచిన్న గాయాలు, 

చురుకులకు చలించక

*కామన్ సెన్సు ,*

*సమయస్పూర్తి* ఉండాలి.


ఇవ్వన్ని ఏ *కోచింగ్ సెంటర్* కు వెళ్ళకుండా తరతరాలుగా నేర్చుకుంటూ వస్తున్న ఆ శ్రమజీవులందరికీ - గౌరవాన్నిచ్చే 

పెద్ద మనస్సుండాలి.💞


*వంటపనా.....,*

అదేం మహా!

అని వెటకారించే ముందు - 

ఇన్ని సామర్ధ్యాలు, సుగుణాలు మనకున్నాయా 🤔 అని ఆలోచించాలి.


"వంటపని" అందం. 

                  అవసరం

అది అందరి జీవనాధారం.


*వంటపని* ఒక  - ధ్యానం.

                        భక్తి , 

                        దినచర్య , 

                        కళ ,

                        విజ్ఞానం , 

ప్రేమ...,

అనుభూతి..., 

సేవ..., 

గౌరవం...,

విలువ... 


ఈ విషయాల్లో 

వెటకారం తగదు. 


వంటింటి 

కళాకారులు అందరికీ🙂.

🥘🥗🫕🍜

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE