NaReN

NaReN

Monday, May 9, 2022

థాంక్స్ చెప్పావా?

 థాంక్స్ చెప్పావా?


*➡జీవితంలోంచి దువ్వెన అనే వస్తువును తీసేయ్.

అపుడు ఏం జరుగుతుంది?*

*నువ్వు జడలు కట్టిన జుట్టుతో భయంకరంగా ఉంటావు.*


*➡నీ జీవితంలోంచి అద్దం అనే వస్తువును తీసేయ్.*

*తర్వాత నిన్ను నువ్వే చూసుకోలేనంత అసహ్యంగా ఉంటావు.*


*➡ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే నిద్ర రాక మరుసటి దినం ఏపనీ సక్రమంగా చెయ్యలేవు.*


*➡నీ జీవితాన్నే అందంగా, సౌఖ్యంగా చేస్తూన్న ఇలాంటి చిన్న చిన్న వస్తువులకు నువ్వెప్పుడైనా *థాంక్స్* చెప్పావా?*

 

*➡మూడు పూటలూ నీకు సకాలంలో తిండి ఏర్పాటు చేస్తున్న నీ తల్లికో లేక నీ భార్యకో ఒక్క రోజైనా థాంక్స్ చెప్పావా?*


*➡మూడు నిముషాలపాటు చెట్లు  స్ట్రైక్ చేస్తే భూమండలం అంతా శవాల దిబ్బ ఐపోతుంది.*

*చెట్టు యొక్క దయా దాక్షిణ్యాలపై బతుకుతున్న  నీవు ఒక్క రోజైనా ఏ చెట్టునైనా ప్రేమగా స్పర్శిస్తూ థాంక్స్ చెప్పావా?*


*➡ఎండకూ, వానకూ, అమ్మకూ, నాన్నకూ నిన్ను ఆనందంగా ఉంచుతున్న ఈ ప్రకృతి గురువుకు నువ్వు తినే తిండికి*

*ఎప్పుడైనా థాంక్స్ చెప్పావా?*


*➡అంటే నీకు తీసుకోడమే తప్ప ఇవ్వడం రాదన్నమాట!*

*సత్యం ఏమిటంటే ఇస్తేనే తిరిగి లభిస్తుంది.*


*➡నిజానికి పై వస్తువులేవీ నీ దగ్గరనుండీ ఏమీ ఆశించకుండా... నిస్వార్థంగా....ఎన్నో యుగాలుగా సేవ చేస్తున్నాయి.*


*➡నీకు సౌఖ్యాన్ని ఇచ్చిన ప్రతీ ఒక్క వస్తువుకు మనసులో కృతజ్ఞత సమర్పించి చూడు!*

*నీ మనసు పవిత్రతతో కడిగివేయబడి నిష్కల్మషం ఐపోతుంది.*

*ఇదే అంతః శుద్ధి!*

*ఇదే పవిత్రత!*

*ఇదే దైవత్వం!*

*ఇలాగే *స్వచ్ఛతను* సాధించాలి.*


➡ *సృష్టిలో స్వచ్ఛమైన ప్రతిదీ అత్యంత శక్తి కల్గివుంటుంది.*


*➡ప్రతీ రోజూ నీకు సహాయం చేస్తున్న ప్రతీ వస్తువూ, మనిషి, జంతువు, ప్రకృతి.. ఇలా అన్నిటికీ హృదయంలో నిండుగా కృతజ్ఞత ప్రకటించడం సాధన చేయాలి.*

*ఇది నీకు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.*


           

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE