NaReN

NaReN

Thursday, May 12, 2022

క్లాస్' లో.. మాస్ ! సర్కారు వారి పాట!!👌

 .

_*'క్లాస్' లో.. మాస్ 'హిట్టు'.! సర్కారు వారి పాట!!👌👍*_


_రేటింగ్ :_ *3/5.*


_ట్యాగ్ లైన్:-_ *'అలరించే'..  వన్ మెన్ 'షో'!*


_అసలు కథ ఏంటంటే:-_


*ఈ సినిమాలో మహేశ్ బాబు పేరు కూడా మహేశే.. కాకపోతే అందరూ ముద్దుగా మహీ అని పిలుస్తారు. తను ఒక వడ్డీ వ్యాపారీ. తనకు ఒక మహీ ఫైనాన్సియల్ కార్పొరేషన్ అనే ఫైనాన్స్ షాపు ఉంటుంది. దాని ద్వారా అందరికీ డబ్బులు వడ్డీకి ఇస్తుంటాడు. కాకపోతే చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు మహీ. తను ఎవరికి డబ్బులు ఇచ్చినా సమయానికి వాళ్లు ఇవ్వకపోతే వాళ్ల నుంచి ఎలా వసూలు చేయాలో కూడా మహీకి తెలుసు. డబ్బు వసూలు చేయడం కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు? తర్వాత ఓసారి డబ్బులు వసూలు చేయడం కోసం మహీ యూఎస్ కు వెళ్లాల్సి వస్తుంది. అక్కడే మహీకి కీర్తి సురేశ్ పరిచయం అవుతుంది. తన పేరు కళావతి. తన చదువు కోసం మహీ నుంచి కొంత డబ్బును అప్పుగా తీసుకుంటుంది. మహీ.. తనను చూడగానే ప్రేమలో పడతాడు. తను ఎంత డబ్బు అడిగినా ఇచ్చేస్తు ఉంటాడు. కట్ చేస్తే బడా వ్యాపారవేత్త సముద్రఖని(రాజేంద్రనాథ్)తో మహికి గొడవ జరుగుతుంది. ఆ తర్వాత రాజేంద్రనాథ్ స్కామ్ ను మహీ బయటపెడతాడు. రాజేంద్రనాథ్ కు, మహీకి మధ్య తర్వాత ఎలాంటి వార్ జరుగుతుంది? రాజేంద్రనాథ్ కు, మహీ తండ్రికి ఉన్న సంబంధం ఏంటి? మహీ చిన్నప్పుడు ఏం జరిగింది? మహీ తండ్రి అన్నీ వదిలేసుకొని కేవలం ఒక రూపాయి బిళ్లతో ఎందుకు వెళ్తాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే.*


_విశ్లేషణ:-_


*ఈ సినిమాను ఒన్ మ్యాన్ షోగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహేశ్ మాత్రం జీవించేశాడు. మహేశ్ మాస్ డైలాగ్స్ తో పాటు కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో మహేశ్ ఎనర్జీ కూడా సూపర్బ్ అనిపించింది. కీర్తి సురేశ్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. తన అందాలను ఆరబోసింది. కమెడియన్ గా వెన్నెల కిషోర్ అదరగొట్టేశాడు. సముద్రఖని.. తన విలనిజాన్ని పండించాడు.సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. సినిమాకు ముందే విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన పాటలు స్క్రీన్ మీద మరింత బెస్ట్ గా కనిపించాయి. ఓవర్ ఆల్ గా సినిమాను పరుశరామ్.. అద్భుతంగా తెరకెక్కించడంతో పాటు ప్రేక్షకులకు సరికొత్త మహేశ్ బాబును పరిచయం చేశాడు.*


_ప్లస్ పాయింట్స్:-_


*మహేశ్ బాబు. ఆయన లేని సినిమాను ఊహించలేం.* 

*బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే.*

 *కామెడీ, హీరోయిన్ కీర్తి..*

NEWS UPDATES

_మైనస్ పాయింట్స్:-_


 *ఎడిటింగ్.* 

*సెకండ్ హాఫ్ కొద్దిగా సాగదీసినట్టుగా ఉండటం.* 

*కధపై మరింత దృష్టి పెట్టకపోవడం.*


_చివరిగా.._

*మాస్, క్లాస్ అభిమానులకు నచ్చేలా.. మహేశ్ ను తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. అలాగే.. సినిమా ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ గా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే.. సర్కారు వారి పాట తెలుగు ప్రేక్షకులకు ఒక విందు భోజనంలా అనిపిస్తుంది.*

1 comment:

  1. Theme was elevated to capture audience attention in a great way.Mahesh with a fresh look

    ReplyDelete

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE