NaReN

NaReN

Monday, May 16, 2022

తస్మాత్ జాగ్రత్త

 తస్మాత్ జాగ్రత్త

🚫❌️⛔️🚫❌️⛔️🚫❌️⛔️


ఒక బస్సు 🚌  సూర్యాపేట నుండి హైదరాబాద్ కు ప్రయాణికులతో   వెళుతుంది. అందులో చాలామంది ప్రయాణికులు ఎక్కారు!!


ఆ బస్సు బయలు దేరుతుంది, కండక్టర్ టికెట్లు తీసుకుంటుండు. అందర్నీ టికెట్ తీసుకోవాలని  కోరుతూ ముందుకు వస్తున్నాడు!!


అలా సగం మంది టికెట్లు తీసుకోగా ఒక ఆయన దగ్గరికి వచ్చాడు... 

ఓ పెద్దాయన టికెట్ తీసుకో అని చెప్పాడు!!


ఆ పెద్దమనిషి తన జేబులు అన్ని తడుముకొని చూసి అరే అరే నా జేబులో ఐదు వందల రూపాయల నోటు ఉండాలి అది ఎక్కడో పడిపోయింది అని ఆ పెద్దమనిషి చెప్పాడు!!


కండక్టర్ లేదు నువ్వు కచ్చితంగా టికెట్ తీసుకోవాలి లేదంటే నిన్ను ఈ మధ్యలోనే బస్సులో నుంచి దింపి వేయడం జరుగుతుంది అంటూ ఆ పెద్దమనిషిని తిట్టసాగాడు కండక్టర్!!


ఆ పెద్దమనిషి అయ్యా నేను ఒక ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను. నేను ఈ క్షణాన అక్కడికి వెళ్లకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. నేను కచ్చితంగా నేను వెళ్ళాలి అని కండక్టర్ ని వేడుకుంటూ ఉన్నాడు!!


ఇంతలో ఆ బస్సులోనే ఇంకొక రెండవ పెద్ద మనిషి అయ్యా అతని టికెట్ నేను తీసుకుంటాను, అతన్ని తిట్టొద్దు అంటూ రెండవ పెద్ద మనిషి మొదటి పెద్ద మనిషిని టికెట్ తీసుకున్నాడు!!


మొదటి పెద్దమనిషి ఆ టికెట్ తీసుకున్న రెండవ పెద్ద మనిషిని చూసి అయ్యా నువ్వు నిజంగా దేవుడవయ్యా అన్ని మొక్కడం మొదలుపెట్టాడు.

నాకు ఈ ప్రయాణం ఎంతో ముఖ్యం. అందరిలోనూ నువ్వు నాకు టికెట్ తీసుకున్నందుకు నువ్వు దేవుడవయ్యా!!


అని తను బస్సు దిగి ఇంటికి పోయిన తర్వాత కూడా బస్సులో ఒక పెద్ద మనిషి నాకు టికెట్ తీసుకున్నాడు అంటూ ఇంకా మనసులో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇలా సాయం చేసినందుకు జీవితాంతం ఆ పెద్దమనిషిని మరవకుండా కొలవడం ఈ పెద్దమనిషి పని అయింది!!


అయితే తన దగ్గర ఉన్న 500 రూపాయలు ఎక్కడో పడిపొయింది అనుకున్నాడు మొదటి పెద్దమనిషి.

కానీ రెండో పెద్ద మనిషే అతని దగ్గర ఉన్న 500 రూపాయలను దొంగలించింది. !!


*ఐదు వందల రూపాయలు దొంగలించి 50 రూపాయల బస్సు టికెట్ తీసుకుని దేవుడవయ్యా అనిపించుకున్నాడు ఆ రెండవ దొంగ పెద్దమనిషి!!*


*"#రాజకీయాలలో ఉన్న పెద్ద మనుషులు అందరూ తమ సొంత కష్టార్జితం సంపాదించి తన ఇంట్లో నుంచి ఇస్తున్నట్టుగా ప్రజలని నమ్మించి ఈ క్రింది విధంగా దోపిడీ చేస్తున్నారు!!*


పించన్ ఇస్తున్నాం

రేషన్ ఇస్తున్నాం

ఉచిత వైద్య ఇస్తున్నాం

ఉచిత విద్య ఇస్తున్నాం

ఉచిత కరెంటు ఇస్తున్నాం

ఉచిత భూములు ఇస్తున్నాం

ఉచిత త్రాగునీరు ఇస్తున్నాం

ఉచిత ఇండ్లను ఇస్తున్నాం

మరెన్నో ఇంకా... 

ఉచితం... 

ఉచితం...

ఉచితం...


ఇవి మొత్తం ఉచితం అయితే సమాజంలో ప్రజలపై

టాక్సెస్ ఎందుకు పెరిగినాయి?

పెట్రోలు ఎందుకు పెరిగింది?

బస్సు చార్జీలు ఎందుకు పెరిగాయి?

కరెంటు చార్జీలు ఎందుకు  పెరిగాయి?

రాష్ట్రంలో దేశంలో అప్పులు ఎందుకు పెరిగాయి?

జీతాలు టైం కి ఇయ్యాలేని దుస్థితి కి తెచ్చారు..

ఇలా చాలా చాలా దోపిడీ చేస్తోంది ఈ రాజకీయ అవినీతి పాలకులు!!


మేలుకోండి ప్రజలారా...!!!

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE