NaReN

NaReN

Monday, May 16, 2022

ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు చేదు నియమాలు

 *ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు చేదు నియమాలు* 


*1.ప్రకృతి యొక్క మొదటి నియమం* : 


ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది. 


అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరు కుంటాయి. 


*2. ప్రకృతి యొక్క రెండవ నియమం* :  


ఎవరివద్ద ఏమిఉంటుందో వారు దానినే పంచు కోగలరు. 


సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచ గలరు. 


దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచ గలరు. 


జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు. 


భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు.


భయస్తులు భయాన్నే పంచగలరు.


*3. ప్రకృతి యొక్క మూడవనియమం* : 


మీకు మీజీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోండి. 


ఎందుకంటే ....


భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి. 


ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది. 


మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి. 


ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది. 


నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది. 


అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది. 


దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది. 


సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది. 


*విషయం చేదుగా ఉన్నా ఇది నిజం.*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE