NaReN

NaReN

Tuesday, May 17, 2022

అధిక రక్తపోటు

 అధిక రక్తపోటు ప్రపంచవ్యాప్తంగా 30% కంటే ఎక్కువ మంది జనాభాను ప్రభావితం చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు అథిక రక్తపోటుతో భాధపడుతున్నారు.  ఇది హృదయ సంబంధ వ్యాధులకు మూల కరణం , ముఖ్యంగా  హార్ట్ఎటాక్, HEART FAILURE, మరియు పక్షవాతానికి ప్రధాన కారకం, అంతే కాకుండ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి,  వంటి వాటికి  కూడా ప్రధాన కారకం. 


కాబట్టి సాధారణ ప్రజలకు అధిక రక్తపోటు గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 17న తేదీన ప్రపంచ రక్తపోటు దినోత్సవం(WORLD HYPERTENSION DAY)గా జరుపుకుంటాము. దీనిలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్ ను విడుదల చేస్తుంది.,  "MEASURE YOUR BLOOD PRESSURE ACCURATELY, CONTOL IT, LIVE LONGER!" ("మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి, దానిని నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి!")  అనేది ఈ సంవత్సరం థీమ్.


హైపర్‌టెన్షన్ యొక్క సరైన రోగ నిర్ధారణ మరియు నిర్వహణకు ఖచ్చితమైన బ్లడ్ ప్రెషర్(B.P) కొలత అవసరం. బ్లడ్ ప్రెషర్ ను రీక్షించేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు. B.P పరీక్షించుకునే ముందు ఒక అరగంట లోపల smoking చేయటం,టీ, కాఫీ లు తాగటం, ఆహారం తీసుకోవటం, వ్యాయామం చెయ్యడం వంటివి చేయకూడదు.


చాలా వరకు, రక్తపోటు 85% మందిలో జన్యుపరంగా ఉంటుంది, కానీ దాదాపు 15% మందిలో SECONDARY HYPERTENSION ఉంటుంది. యుక్త వయస్కులలో (<40 సంవత్సరాలు) SECONDARY HYPERTENSION యొక్క ప్రాబల్యం సుమారు 30% వరకు ఉంటుంది.


సాదారణంగా Secondary hypertension ను, చిన్న వయసులో అధిక రక్తపోటు వచ్చిన వారిలో, మరియు అనియంత్రిత రక్తపోటు అకస్మాత్తుగా రావడం, గతంలో బాగా నియంత్రించబడిన రక్తపోటు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోవడం వంటి వారిలో చూడవచ్చు.


Secondary hypertension  కు‌ ముఖ్యమైన కారణాలు కిడ్నీ సమస్యలు మరియు హార్మోన్ సమస్యలు. హార్మోన్ సమస్యలు ముఖ్యంగా హైపోథైరాయిడిజం(HYPOTHYROIDISM), క్యూషింగ్'స్ సిండ్రోమ్(Cushing's Syndrome), PHEOCHROMOCYTOMA, PRIMARY ALDOSTERONISM వంటి ఎడ్రినల్ సమస్యలు సెకండరీ హైపర్‌టెన్షన్(SECONDARY HYPERTENSION) కి దారితీస్తాయి.


ఈ హార్మోన్ సమస్యలను కిడ్నీ సమస్యలు నయం చేయడం ద్వారా మనం రక్తపోటును సులభంగా కంట్రోల్  చేయవచ్చు, అలాగే జీవితాంతం B.Pమందులు వాడాల్సిన అవసరం ఉండదు.

ఎవరైతే అధిక రక్తపోటుతో బాధపడుతున్నారో వారందరూ క్రమం తప్పకుండా ECG,2D-ECHO,CREATININE వంటి పరిక్షలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది.


ఈ అధిక రక్తపోటును జీవనశైలిలోని మార్పుల ద్వారా సులభంగా నియంత్రించవచ్చు. రోజూ వ్యాయామం చేయటం, బరువు తగ్గటం, స్మోకింగ్ ని ఆపటం,మద్యం తీసుకోవటం మానివేయటం, రోజు ఉప్పు తక్కువ మోతాదులో తీసుకోవడం (రోజుకి 2.3 గ్రాములు మించకుండా),కొవ్వు తక్కువ ఉన్న ఆహారం తీసుకోవటం,తాజా పండ్లు కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవడం లాంటి జీవనశైలి మార్పుల ద్వారా అధిక రక్తపోటు (B.P) ని చాలామంది మందుల సహాయం లేకుండానే తగ్గించుకోవచ్చు.


జీవనశైలి నిర్వహణ అనేది హైపర్‌టెన్షన్ చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం ఎందుకంటే ఇది రక్తపోటును తగ్గిస్తుంది, కొన్ని యాంటీహైపెర్టెన్సివ్ ఔషధాల (ANTI HYPERTENSIVE DRUGS) ప్రభావాన్ని పెంచుతుంది.


ఇవన్నీ పాటించిన తర్వాత కూడా ఎవరికైతే అధికరక్తపోటు ఉంటుందో అలాంటి వారు క్రమం తప్పకుండా B.P మాత్రలు వాడాల్సి ఉంటుంది, అలా చేయడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలు రాకుండా నివారించవచ్చు ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, పక్షవాతం,మరియు గుండె సమస్యలు రాకుండా కొంతవరకు నియంత్రించవచ్చు.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE